మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు నుంచే వాడీవేడిగా సాగుతోంది. మొదటి రోజు ఆటలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి, ఆసీస్ అరంగేట్ర ఆటగాడు సామ్ కాన్‌స్టాస్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
19 ఏళ్ల సామ్ కాన్‌స్టాస్ తన డెబ్యూ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కాన్‌స్టాస్ జస్ప్రీత్ బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్‌ను సైతం అలోవకగా ఎదుర్కొని అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ ఆసీస్ యువ సంచలనాన్ని అడ్డుకొనేందుకు భారత పేసర్లు చాలా కష్టపడ్డారు. ఈ క్రమంలో కాన్‌స్టాస్ ఏకాగ్రతను దెబ్బ తీసేందుకు విరాట్ కోహ్లి స్లెడ్జింగ్‌కు దిగాడు.
కాన్‌స్టాస్ నడిచి వస్తుండగా విరాట్ తన భుజం తగిలించాడు. దీంతో వారిద్దరి మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంది. వెంటనే ఉస్మాన్ ఖావాజా, అంపైర్ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. అయితే కోహ్లి చర్యలు ఐసీసీ ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉండడంతో జరిమానా పడే అవకాశముంది.
కాగా ఈ సంఘటన తర్వాత కాన్‌స్టాస్ మరింత చెలరేగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 65 బంతులు ఎదుర్కొన్న 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60 పరుగులు చేసి ఔటయ్యాడు.
చదవండి: గెలుపు పంచ్ ఎవరిదో?
Kohli and Konstas come together and make contact 👀#AUSvIND pic.twitter.com/adb09clEqd
— 7Cricket (@7Cricket) December 26, 2024
Comments
Please login to add a commentAdd a comment