బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి(Virat Kohli), ఆస్ట్రేలియా యువ బ్యాటర్ సామ్ కొన్‌స్టాస్ మధ్య వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్టు సందర్భంగా కొన్‌స్టాస్ పిచ్‌పై నడుస్తుండగా కోహ్లి వచ్చి భుజాన్ని ఢీకొట్టడంతో వివాదం మొదలైంది. దీంతో కోహ్లి తీరును చాలా మంది తప్పుబట్టారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా కోహ్లిపై సీరియస్ అయింది. కోహ్లి మ్యాచ్ ఫీజులో ఐసీసీ 20 శాతం కోత విధించింది. అయితే తాజాగా ఈ వివాదంపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ హార్మిసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముమ్మాటికి కోహ్లిదే తప్పు అని, అతడు తృటిలో నిషేధం నుంచి తప్పించుకున్నాడని హార్మిసన్ అభిప్రాయపడ్డాడు.
"ఆడిలైడ్‌లో యువ ఆటగాడు కాన్‌స్టాస్ పట్ల విరాట్ కోహ్లి వ్యవహరించిన తీరు సరికాదు. ఆ సమయంలో విరాట్ మితిమీరి ప్రవర్తించినట్లు అన్పించింది. అతడు చేసిన పనికి నిషేధం విధించి ఉండాల్సింది. విరాట్ కోహ్లి అంటే నాకు కూడా ఎంతో ఇష్టం. అతడు జెంటిల్‌మేన్ గేమ్‌కు ఎంతో వన్నె తెచ్చాడు. కానీ దేనికైనా ఒక హద్దు ఉంటుంది. అది మీరి ప్రవర్తించకూడదు. ఇక కాన్‌స్టాస్ అద్బుతంగా ఆడుతున్నాడు.
నిజంగా అతడి స్కూప్ షాట్లు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే హిట్టింగ్ వరకు సరే కానీ, అతడి వద్దా డిఫెన్సివ్ టెక్నిక్ ఉందా లేదా గుర్తించాలి. టెస్టు క్రికెట్‌లో డిఫెన్స్ స్కిల్స్ కూడా చాలా ముఖ్యం. డేవిడ్ వార్నర్ వారసుడిగా అతడు నిరూపించుకోవాలి. సామ్‌కు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. అతడికి ఇంకా కేవలం 19 సంవత్సరాలు మాత్రమే అని టాక్ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్మిసన్ పేర్కొన్నాడు.
ఆసీస్ గడ్డపై విఫలం..
ఇక కోహ్లి గత కొంతకాలంగా టెస్టు క్రికెట్‌లో పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో తీవ్ర నిరాశపరిచిన విరాట్.. అదే తీరును ఆస్ట్రేలియా పర్యటనలో సైతం కనబరిచాడు.
తొలి టెస్టులో సెంచరీ చేసిన కోహ్లి.. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పూర్తిగా తేలిపోయాడు. సిరీస్ అసాంతం ఆఫ్‌సైడ్ బంతులను వెంటాడి తన వికెట్‌ను కోహ్లి కోల్పోయాడు. కోహ్లి ఐపీఎల్ తర్వాత ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటన దృష్టిలో పెట్టుకుని కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను 3-1 తేడాతో భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే.
చదవండి: SA T20: ఐపీఎల్ వద్దంది.. కట్ చేస్తే! అక్కడ కేన్ మామ విధ్వంసం
Comments
Please login to add a commentAdd a comment