సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో డర్బన్ సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. శుక్రవారం కింగ్స్‌మీడ్ వేదికగా ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రెండు పరుగుల తేడాతో డర్బన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
డర్బన్ బ్యాటర్లలో కేన్ విలియమ్సన్( 40 బంతుల్లో 60 పరుగులు, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ బ్రైస్ పార్సన్స్ (28 బంతుల్లో 47), ఫినిషర్ వియాన్ మల్డర్ (19 బంతుల్లో 45 నాటౌట్) అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు.
విధ్వంసకర ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. క్లాసెన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.ప్రిటోరియా బౌలర్లలో ముత్తుసామి 3 వికెట్లు పడగొట్టగా.. లివింగ్‌స్టోన్ ఒక్క వికెట్ సాధించారు.
గుర్బాజ్ పోరాటం వృథా..
అనంతరం 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా క్యాపిటల్స్‌కు ఓపెనర్లు రెహ్మానుల్లా గుర్బాజ్, విల్ జాక్స్అద్బుతమైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు కేవలం 12 ఓవర్లలోనే 154 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.
గుర్బాజ్(43 బంతుల్లో 89 పరుగులు, 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత సెటిల్ అయిన విల్ జాక్స్(35 బంతుల్లో 64 పరుగులు, 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో మ్యాచ్ డర్బన్ వైపు మలుపు తిరిగింది.
ఆఖరి ఓవర్‌లో ప్రిటోరియా విజయానికి 14 పరుగులు అవసరమవ్వగా.. నవీన్ ఉల్‌హాక్ కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో క్యాపిటల్స్ లక్ష్య చేధనలో 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులకు పరిమితమైంది. డర్బన్ బౌలర్లలో నూర్ ఆహ్మద్, క్రిస్ వోక్స్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. మహారాజ్, నవీన్ ఉల్‌హాక్ చెరో వికెట్ సాధించారు.
ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్..
కాగా ఈ మ్యాచ్‌తోనే న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అరంగేట్రం చేశాడు. కేన్ మామ డర్బన్ సూపర్ జెయింట్స్ తరపున తన అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో మెరిశాడు. అయితే ఈ కివీస్టార్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. రూ. 2 కోట్ల కనీస ధరతో వచ్చిన విలియమ్సన్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపలేదు.
చదవండి: రవీంద్ర జడేజా రిటైర్మెంట్..! హింట్ ఇచ్చిన స్టార్ ఆల్‌రౌండర్
Comments
Please login to add a commentAdd a comment