టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టులకు గుడ్‌బై చెప్పనున్నాడా? అంటే అవును అనే సమాధనమే ఎక్కువ విన్పిస్తోంది. ఆస్ట్రేలియాతో సిడ్నీలో ఆడిన టెస్టే తన చివరి మ్యాచ్, త్వరలోనే జడ్డూ రెడ్ బాల్ క్రికెట్‌కు విడ్కోలు పలకనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా జడేజా పెట్టిన ఓ పోస్ట్ ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో మూడో ధరించిన జెర్సీ ఫొటోను ఈ సౌరాష్ట్ర క్రికెటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో అతడు టెస్టులకు గుడ్‌బై చెప్పనున్నాడనే ప్రచారం మరింత ఊపందుకుంది.
ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో జడేజా పర్వాలేదన్పించాడు. మిగితా క్రికెటర్లతో పోలిస్తే కాస్త మెరుగ్గానే కన్పించాడు. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన జడ్డూ.. 27 సగటుతో 135 పరుగులు చేశాడు.
అదే విధంగా బౌలింగ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా ఇప్పటి వరకు 80 టెస్ట్‌లు ఆడిన జడేజా 3, 370 పరుగులు చేసి 323 వికెట్లు పడగొట్టాడు. కాగా సిరీస్‌ను 3-1 తేడాతో భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ సిరీస్ మధ్యలోనే స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు.
వన్డేల్లో డౌటే..
ఇక ఇప్పటికే టీ20లకు విడ్కోలు పలికిన రవీంద్ర జడేజా.. వన్డేల్లో ఆడేది కూడా అనుమానమే. ప్రస్తుత పరిస్థితుల దృష్టా భారత వన్డే జట్టులో జడేజా చోటు ప్రశ్నర్ధాకంగా మారింది. జడేజా వన్డే కెరీర్ ముగిసినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఇంగ్లండ్‌తో వన్డేలు, ఛాంపియన్స్ ట్రోఫీకి అతడి స్దానంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ పేర్లను సెలక్టర్లు పరిశీలిస్తున్నారు.
వీరిద్దరూ ఇప్పటికే తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకున్నారు. ఇంగ్లీష్ జట్టుతో సిరీస్‌కు, ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును బీసీసీఐ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది. ఒకవేళ ఈ జట్టులో జడ్డూ చోటు దక్కకపోతే పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికే అవకాశముందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు 197 వన్డేలు ఆడిన జడేజా 2756 పరుగులతో పాటు 220 వికెట్లు తీసుకున్నాడు.
చదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్..
Comments
Please login to add a commentAdd a comment