బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తమీమ్ రెండోసారి అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ఇక్బాల్ అందుబాటులో ఉంటాడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భావించింది. కానీ అంతలోనే తమీమ్ రిటైర్మెంట్ ప్రకటించి బంగ్లా క్రికెట్‌కు షాకిచ్చాడు. 34 ఏళ్ల తమీమ్ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
"నేను గత కొంతకాలంగా ఇంటర్ననేషనల్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాను. చాలా గ్యాప్ వచ్చింది. దీంతో నా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయం చాలా రోజుల కిందటే తీసుకున్నాను. నా నిర్ణయం ప్రకటించడానికి ఇదే సరైన సమయం.
ఎందుకంటే మరి కొన్ని రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీ ముందు నాపై చర్చలు ఉండకూడదు అని ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఎప్పుడో బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్నాను. కానీ మీడియా మాత్రం నాపై అనవసర చర్చలు పెట్టింది.
కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో నన్ను జట్టులోకి తిరిగి రావాలని అభ్యర్థించాడు. నేను సెలక్షన్ ప్యానెల్‌తో కూడా మాట్లాడాను. నాలో ఇంకా సత్తువ తగ్గలేదని నమ్ముతున్నందుకు ధన్యవాదాలు. కానీ నేను నా మనసు చెప్పిన మాటే వింటాను. అంతర్జాతీయ క్రికెట్‌లో నా అధ్యాయం ముగిసింది" అని తన రిటైర్మెంట్ నోట్‌లో తమీమ్ పేర్కొన్నాడు.
రెండో సారి..
కాగా తమీమ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం రెండోసారి. గతంలో 2023 జూలైలో తొలిసారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. అయితే అప్పటి బంగ్లా ప్రధాని షేక్ హసీనా సూచన మెరకు తన ఇక్భాల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023 దృష్ట్యా అతడు తన మనసును మార్చుకున్నాడు.
కానీ అనూహ్యంగా ప్రపంచకప్ జట్టులో తమీమ్‌కు జట్టులో చోటు దక్కలేదు. అప్పటి నుంచి అతడు తిరిగి జట్టులోకి రాలేదు. ఇక తమీమ్ ఇక్బాల్ బంగ్లా తరఫున 70 టెస్ట్‌లు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన తమీమ్.. టెస్ట్‌ల్లో 10 సెంచరీలు, 31 అర్ధసెంచరీల సాయంతో 5134 పరుగులు.. వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధసెంచరీల సాయంతో 8313 పరుగులు.. టీ20ల్లో సెంచరీ, 7 అర్ధసెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో తమీమ్ అత్యుత్తమ ఆటగాడిగా పేరుగాంచాడు.
చదవండి: అతడి డిఫెన్స్ అద్భుతం.. 200 బంతులు కూడా ఆడగలడు: అశ్విన్
Comments
Please login to add a commentAdd a comment