టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దూకుడైన బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. ఫార్మాట్ ఏదైనా పంత్ బ్యాటింగ్ స్టైల్ ఒకటే. క్రీజులో వచ్చినప్పటి నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడడం రిషబ్‌కు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఈ ఢిల్లీ చిచ్చరపిడుగులో దూకుడైన బ్యాటింగ్‌తో పాటు అద్భుతమైన డిఫెన్స్ స్కిల్స్‌ను కూడా టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ గుర్తించాడు.
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న అశ్విన్ తన సహచరుడి బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. పంత్ డిఫెన్స్ అభేద్యమని, అతను పట్టుదలగా నిలబడితే ఎన్ని బంతులైనా ఆడగలడని అశ్విన్ కొనియాడాడు.
పంత్ డిఫెన్స్ అద్భుతం..
‘రిషభ్ పంత్‌లో అన్ని రకాల షాట్లు ఆడే సామర్థ్యం ఉంది. అయితే అతడి నుంచి మనం ఏం ఆశిస్తున్నామో అతనికి స్పష్టంగా చెప్పాలి. అతడి డిఫెన్స్ కూడా ఎంత బాగుంటుందంటే 200 బంతులు కూడా ఆడగలడు. ప్రపంచంలోనే అద్బుతంగా డిఫెన్స్ ఆడే బ్యాటర్లలో రిషబ్ ఒకడు.
తన బలమేంటో తనకే పూర్తిగా తెలీదు. మిడిల్ గేమ్‌లో పరిస్థితికి తగినట్లుగా ఆడటం అలవాటు చేసుకుంటే ప్రతీ మ్యాచ్‌లో పంత్ సెంచరీ కొట్టగలడు. డిఫెన్స్ ఆడుతూ అతను అవుట్ కావడం చాలా అరుదు. నెట్స్‌లో నేను ఎన్నోసార్లు అతనికి బౌలింగ్ చేశాను.
అతడు ఎల్బీడబ్ల్యూగా లేదా బంతి ఎడ్జ్ తీసుకుంటూ ఎప్పుడూ అవుట్ కాలేదు. గత కొన్నేళ్లుగా టెస్టుల్లో బ్యాటింగ్ చాలా కష్టంగా మారిపోయింది. అలాంటి సమయంలో పంత్ ఆడుతున్నాడు. సిడ్నీలో అతడి ఆడిన ఇన్నింగ్స్‌లు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.
ఒకే ఒకే గేమ్‌లో రెండు వేర్వేరు నాక్‌లు ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో డిఫెన్స్ ఆడితే, రెండో ఇన్నింగ్స్‌లో తన విశ్వరూపం చూపించాడు’ అని అశ్విన్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. సిడ్నీ టెస్టులో భారత్ ఓటమి పాలైనప్పటికి పంత్ మాత్రం తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగులతో సూపర్ నాక్ ఆడాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మొత్తం 9 ఇన్నింగ్స్‌లో పంత్.. 28.33 సగటుతో 255 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 43 టెస్టులు ఆడిన పంత్.. 42.11 సగటుతో 2948 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఆరు సెంచరీలు చేశాడు.
చదవండి: క్రికెట్ ‘మనసు’ చదివింది!
Comments
Please login to add a commentAdd a comment