ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తొమ్మిదేళ్ల తర్వాత బిగ్‌బాష్ లీగ్‌లో అడుగుపెట్టనున్నాడు. ఈ మెరకు బిగ్‌బాష్ లీగ్ 12వ సీజన్ ముందు సిడ్నీ థండర్‌తో రెండు సంవత్సరాల ఒప్పందాన్ని వార్నర్ కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని సిడ్నీ థండర్ ఆదివారం సోషల్ మీడియాలో వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ముగిసిన అనంతరం వార్నర్ జట్టులో చేరనున్నాడని సిడ్నీ థండర్ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఆట పట్ల పూర్తి అంకితభావంతో ఉంటా
ఇక ఇదే విషయంపై వార్నర్ స్పందిస్తూ.. నా బిగ్‌బాష్ కెరీర్‌ను ప్రారంభించిన జట్టులోకి మళ్లీ తిరిగి రావడం నాకు సంతోషంగా ఉంది. నేను నా ఆట పట్ల పూర్తి అంకితభావంతో ఉంటాను.. ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా నా సీనియర్లు చూపిన మార్గం నుంచి స్ఫూర్తిని పొందుతూ ఎల్లవేళలా ఆటను ఆస్వాదిస్తూ ఉంటా. అదే విధంగా బిగ్‌బాష్ లీగ్ నుంచి భవిష్యత్తు ఆటగాళ్లను తయారు చేయడంతో నా వంతు పాత్ర పోషిస్తాను అని పేర్కొన్నాడు.
కాగా 2011 బిగ్‌బాష్ లీగ్ తొలి సీజన్‌లో వార్నర్ అరేంగట్రం చేసినప్పటికీ.. అంతర్జాతీయ షెడ్యూల్, తదితర కారణాల వల్ల ఇప్పటి వరకు కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. వార్నర్ ఈ లీగ్‌లో చివరసారిగా 2014 సీజన్‌లో కనిపించాడు. ఇక బిగ్‌బాష్ లీగ్(2022-23) సీజన్ డిసెంబర్13 నుంచి ఫిబ్రవరి 4 వరకు జరగనుంది. మరో వైపు డేవిడ్ భాయ్ యూఏఈ సరికొత్త టీ20లీగ్‌లో కూడా భాగం కానున్నట్లు తెలుస్తోంది.
He's BACK. ⚡️@davidwarner31 signs with Sydney Thunder for two seasons ahead of #BBL12! ✍️ pic.twitter.com/pdEDcO6uLl
— KFC Big Bash League (@BBL) August 20, 2022
చదవండి: IND vs ZIM: దీపక్ హుడా అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా!
Comments
Please login to add a commentAdd a comment