IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్‌ షాక్‌.. డేవిడ్‌ వార్నర్‌కు గాయం! | David Warner ruled out of the final T20I with an adductor injury | Sakshi
Sakshi News home page

IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్‌ షాక్‌.. డేవిడ్‌ వార్నర్‌కు గాయం!

Published Sat, Feb 24 2024 1:18 PM | Last Updated on Sat, Feb 24 2024 1:29 PM

David Warner ruled out of the final T20I with adductor injury - Sakshi

న్యూజిలాండ్‌తో మూడో టీ20కు ముందు ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ గాయం కారణంగా మూడో టీ20కు దూరమయ్యాడు. వార్నర్‌ ప్రస్తుతం తుంటి గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే రెండో టీ20కు విశ్రాంతి తీసుకున్న వార్నర్‌.. ఇప్పుడు మూడో టీ20 నుంచి సైతం తప్పుకున్నాడు. ఈ మెరకు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఓ ప్రకటన విడుదల చేసింది.

"వార్నర్‌ ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదు. అతడు కోలుకోవడానికి కాస్త సమయం పడుతోంది. అయితే అతడు కచ్చితంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, టీ20 వరల్డ్‌కప్‌కు కచ్చితంగా అందుబాటులో ఉంటాడని" క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటనలో పేర్కొంది. కాగా కివీస్‌తో జరిగిన తొలి టీ20లో వార్నర్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

కేవలం 20 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు వార్నర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది సీజన్‌లో రిషబ్‌ పంత్‌ గైర్హజరీలో ఢిల్లీ జట్టును డేవిడ్‌ భాయ్‌ ముందుండి నడిపించాడు.
చదవండిIND vs ENG: అయ్యో.. ట్రాప్‌లో చిక్కుకున్న రోహిత్‌ శర్మ! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement