Andre Russell: విండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ బిగ్ బాష్ లీగ్ 2021-22లో సునామీ ఇన్నింగ్స్‌తో ప్రళయంలా విరుచుకుపడ్డాడు. ప్రస్తుత సీజన్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కరీబియన్ యోధుడు.. సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో సిక్సర్ల మోత మోగించాడు. 6 బంతుల్లో 5 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 34 పరుగులు పిండుకుని మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసాడు.
ప్రత్యర్ధి నిర్ధేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మెల్‌బోర్న్ జట్టు 12 ఓవర్లలో 83 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో బరిలోకి దిగిన రసెల్.. 21 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్‌తో 5 సిక్సర్లు, ఫోర్‌తో అజేయమైన 42 పరుగులు సాధించి మరో 17 బంతులు మిగిలుండగానే తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా మెల్‌బోర్న్ స్టార్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోసిన రసెల్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, రసెల్ ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టుకు ఈ లీగ్‌లో(3 మ్యాచ్‌ల్లో) ఇది రెండో విజయం
చదవండి: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒకే ఓవర్లో ఆరు వికెట్లు
Comments
Please login to add a commentAdd a comment