
బిగ్ బాష్ లీగ్ 2023-24లో భాగంగా శనివారం మెల్‌బోర్న్ వేదికగా సిడ్నీ సిక్సర్స్, మెల్‌బోర్న్ స్టార్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసింది. క్లియర్‌గా నాటౌట్ అయినప్పటికీ థర్డ్ అంపైర్ పొరపాటున ఔట్‌గా ప్రకటించేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
అసలేం జరిగిందంటే?
సిడ్నీ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన ఇమాడ్ వసీం బౌలింగ్‌లో జేమ్స్ విన్స్ స్ట్రైయిట్ డ్రైవ్ షాట్ ఆడాడు. బౌలర్ వసీమ్ బంతి ఆపేందుకు ప్రయత్నించగా అతడి తాకుతూ బంతి నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న స్టంప్స్‌ను పడగొట్టింది. దీంతో బౌలర్‌తో పాటు మెల్‌బోర్న్ ఫీల్డర్లు రనౌట్‌కు అప్పీల్ చేశారు. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫీర్ చేశారు.
రిప్లేలో బంతి స్టంప్స్‌ను తాకే సమయానికి బ్యాటర్ క్రీజులోకి వచ్చినట్లు క్లియర్‌గా కన్పించింది. దీంతో థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెల్లడించడానికి సిద్దమయ్యాడు. అయితే అనూహ్యంగా బిగ్‌స్క్రీన్‌లో ఔట్ కన్పించింది. దీంతో ఒక్కసారిగా మైదానంలో గందరగోళం నెలకొంది. అయితే థర్డ్ నాటౌట్ బటన్‌కు బదులుగా తప్పుడు బటన్ నొక్కడంతో ఇలా జరిగింది.
తన తప్పిదాన్ని గ్రహించిన థర్డ్ అంపైర్ వెంటనే నాటౌట్ బటన్ నొక్కడంతో బ్యాటర్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 157 పరుగుల లక్ష్యాన్ని సిడ్నీ సిక్సర్స్ 18.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సిడ్నీ బ్యాటర్లలో జేమ్స్ విన్స్ (79) హాఫ్ సెంచరీతో రాణించాడు. కాగా మొదట బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది.
He's pressed the wrong button! 🙈@KFCAustralia #BucketMoment #BBL13 pic.twitter.com/yxY1qfijuQ
— KFC Big Bash League (@BBL) January 6, 2024