Third Umpire
-
AUS vs SC: షాకింగ్.. థర్డ్ అంపైర్ లేకుండానే టీ20 సిరీస్
అంతర్జాతీయ క్రికెట్లో ఏదైనా మ్యాచ్‌కు సాధరణంగా ఇద్దరూ ఫీల్డ్ అంపైర్లతో పాటు ఓ థర్డ్ అంపైర్ కూడా బాధ్యతలు నిర్వరిస్తారు. ఈ విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలుసు. కానీ ఓ ఇంటర్ననేషనల్ సిరీస్ థర్డ్ అంపైర్ లేకుండానే జరుగుతోంది. అవును మీరు విన్నది నిజమే.ఎడిన్బర్గ్ వేదికగా ఆస్ట్రేలియా-స్కాట్లాండ్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు థర్డ్ అంపైర్ ఎవరూ లేరు. థర్డ్ అంపైర్‌తో పాటు డీఆర్ఎస్ కూడా అందుబాటులో లేదు. థర్డ్ అంపైర్ అందుబాటులో లేకపోవడంతో రనౌట్, స్టంపౌట్‌లపై ఫీల్డ్ అంపైర్లదే తుది నిర్ణయం.మూడో అంపైర్ లేకపోవడంతో రెండో టీ20లో ఆసీస్ బ్యాటర్ ఫ్రెజర్ మెక్‌గర్క్‌కు కలిసొచ్చింది. మెక్‌గర్క్ స్టంపౌట్ ఔటైనప్పటకి ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించిడంతో మెక్‌గర్క్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.అయితే ఆస్ట్రేలియా వంటి వరల్డ్‌క్లాస్ జట్టు ఆడుతున్న సిరీస్‌కు థర్డ్ అంపైర్ లేకపోవడం అందరిని విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఇదే విషయం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక వరుసగా రెండు టీ20ల్లో ఘన విజయం సాధించిన ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది.చదవండి: AUS vs SCO: జోష్ ఇంగ్లిస్ రికార్డు సెంచరీ.. ఆసీస్ సిరీస్ విజయం -
విరాట్ కోహ్లిది ఔటా? నాటౌటా? వీడియో వైరల్
ఆదివారం కొలంబో వేదికగా భారత్‌తో జరిగిన రెండో వన్డేలో 32 పరుగుల తేడాతో శ్రీలంక అద్భుత విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం వివాదస్పదమైంది. భారత ఇన్నింగ్స్ 15ఓవర్ వేసిన స్పిన్నర్ అకిల దనంజయ బౌలింగ్‌లో ఆఖరి బంతిని విరాట్ కోహ్లి డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు.ఈ క్రమంలో బంతి బ్యాట్‌కు దగ్గరగా వెళ్తూ విరాట్‌కు ఫ్రంట్ ప్యాడ్‌కు తాకింది. వెంటనే లంక ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేశారు. అంపైర్ కూడా వెంటనే ఔట్ అని వేలు పైకెత్తాడు. కానీ కోహ్లి మాత్రం నాన్‌స్ట్రైక్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌తో చర్చించి డీఆర్ఎస్ తీసుకున్నాడు. అయితే ఈ రివ్యూ థర్డ్ అంపైర్‌కు బిగ్ ఛాలెంజ్‌గా మారింది. రిప్లేలో బంతి విరాట్ బ్యాట్‌ను దాటి వెళ్లి ప్యాడ్‌ను తాకేముందు అల్ట్రాఎడ్జ్‌లో స్పైక్ చూపించింది. కానీ బిగ్ స్క్రీన్‌లో మాత్రం బ్యాట్‌కు, బంతికి క్లియర్ గ్యాప్ ఉన్నట్లు కన్పించింది. ఆఖరికి థర్డ్ అంపైర్ కోహ్లికి ఫేవర్‌గా నాటౌట్ అంటూ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇది చూసిన శ్రీలంక ఫీల్డర్లు కోపంతో ఊగిపోయారు. లంక తాత్కాలిక ప్రధాన కోచ్ సనత్ జయసూర్య సైతం ఆసహనం వ్యక్తం చేశాడు. శ్రీలంక వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ అయితే తన హెల్మెట్‌ను నెలకేసి కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: IND vs SL: వాషీని కొట్టడానికి వచ్చిన రోహిత్ శర్మ!?.. వీడియో వైరల్ pic.twitter.com/tNx33xlkmR— hiri_azam (@HiriAzam) August 4, 2024 pic.twitter.com/sIQVG7B2TC— hiri_azam (@HiriAzam) August 4, 2024 -
IPL 2024: ఫీల్డ్ అంపైర్ల పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సిద్దూ
క్రికెట్లో టెక్నాలజీ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో ఫీల్డ్ అంపైర్ల పాత్రపై టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెక్నాలజీ ఉపయోగించి 90 శాతం నిర్ణయాలు థర్డ్ అంపైర్లు తీసుకుంటుంటే ఫీల్డ్ అంపైర్లు నామమాత్రంగా మారారని అన్నాడు. ఫీల్డ్ అంపైర్ అంటే ప్రతి నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు వదిలేయడం కాదని తెలిపాడు.ఫీల్డ్ అంపైర్లు విచక్షణ ఉపయోగించి సొంత నిర్ణయాలు తీసుకుంటేనే క్రికెట్‌కు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రతి విషయాన్ని థర్డ్ అంపైరే తీసుకోవాల్సి వస్తే ఫీల్డ్ అంపైర్ అవసరమే లేదన్నాడు. ఇటీవల కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సంఘటనను దృష్టిలో పెట్టుకుని సిద్దూ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. ఆ మ్యాచ్‌లో హర్షిత్ రాణా బౌలింగ్‌లో నడుము కంటే ఎత్తులో వచ్చిన ఫుల్ టాస్ బంతికి కోహ్లి ఔటయ్యాడు. Navjot Singh Sidhu said, "now the on field umpire's job is not to stand in the stadium when 3rd umpire technology is being used for 90% of the decisions shown all on screen". (Star Sports). pic.twitter.com/uLmWRboLMZ— Mufaddal Vohra (@mufaddal_vohra) April 24, 2024 నో బాల్ కోసం కోహ్లి అప్పీల్ చేసినప్పటికీ థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోహ్లి.. ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగి ఆగ్రహంగా మైదానాన్ని వీడాడు. ఈ వివాదాస్పద ఘటన క్రికెట్ వర్గాల్లో పెను దుమారం లేపింది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ ప్రస్తుతం రసపట్టులో సాగుతుంది. ఆర్సీబీ, పంజాబ్ మినహా అన్ని జట్లు ప్లే ఆఫ్స్ రేసులో నిలిచాయి. రాజస్థాన్, కేకేఆర్, సన్‌రైజర్స్ జట్లకు ప్లే ఆఫ్స్ బెర్తులు దాదాపుగా ఖరారు కాగా.. మరో బెర్తు కోసం ఐదు జట్ల మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్, కేకేఆర్, సన్‌రైజర్స్, లక్నో, సీఎస్కే, గుజరాత్, ముంబై, ఢిల్లీ, పంజాబ్, ఆర్సీబీ వరుస స్థానాల్లో ఉన్నాయి. అన్ని జట్లు మరో 5 లేదా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. -
ఇది నాటౌటా?.. అంపైర్ నిర్ణయంపై విస్మయం.. వీడియో వైరల్
సెల్హాట్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి బంగ్లా ఛేదించింది. ఇక ఇది ఇలా ఉండగా.. మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదస్పదమైంది. క్లియర్‌గా ఔటైనప్పటికి థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడం వివాదానికి దారితీసింది. ఏం జరిగిందంటే? బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన బినురా ఫెర్నాండో తొలి బంతిని బౌన్సర్‌గా సంధించాడు. అయితే స్ట్రైక్‌లో ఉన్న సౌమ్య సర్కార్ ఫుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ అప్పీల్ చేయగానే ఫీల్డ్ అంపైర్ వెంటనే ఔట్ అని వేలు పైకెత్తాడు. కానీ సర్కార్ మాత్రం డీఆర్ఎస్కు వెళ్లాడు. ఆల్ట్రాఎడ్జ్‌లో కూడా స్పైక్ రావడం స్క్రీన్‌లో కన్పిచండంతో సర్కార్ సైతం మైదానాన్ని వీడేందుకు సిద్దమయ్యాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. బ్యాట్‌కు బంతికి క్లియర్ గ్యాప్ ఉందని థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో శ్రీలంక ఆటగాళ్లు, ఆన్ ఫీల్డ్ అంపైర్లు సైతం షాకయ్యారు. ఈ క్రమంలో లంక ఆటగాళ్లు అంపైర్లతో వాగ్వదానికి దిగారు. ఆ తర్వాత అంపైర్లు నచ్చచెప్పడంతో ఆట తిరిగి మళ్లీ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అది క్లియర్‌గా ఔట్.. అంపైర్‌కు కళ్లు కన్పిచండం లేదా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. DRAMA! Clear noise > on-field umpire signals out > review taken > 3rd umpire rules not out despite UltraEdge! Bangladesh-Sri Lanka always throws up a controversy 😶 . .#BANvsSL #FanCode pic.twitter.com/8hH9i65SD6 — FanCode (@FanCode) March 6, 2024 -
ఏంటి బ్రో ఇది.. నాటౌట్‌కు ఔట్ ఇచ్చేసిన థర్డ్ అంపైర్! వీడియో వైరల్
బిగ్ బాష్ లీగ్ 2023-24లో భాగంగా శనివారం మెల్బోర్న్ వేదికగా సిడ్నీ సిక్సర్స్, మెల్బోర్న్ స్టార్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసింది. క్లియర్‌గా నాటౌట్ అయినప్పటికీ థర్డ్ అంపైర్ పొరపాటున ఔట్‌గా ప్రకటించేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అసలేం జరిగిందంటే? సిడ్నీ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన ఇమాడ్ వసీం బౌలింగ్‌లో జేమ్స్ విన్స్ స్ట్రైయిట్ డ్రైవ్ షాట్ ఆడాడు. బౌలర్ వసీమ్ బంతి ఆపేందుకు ప్రయత్నించగా అతడి తాకుతూ బంతి నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న స్టంప్స్‌ను పడగొట్టింది. దీంతో బౌలర్‌తో పాటు మెల్బోర్న్ ఫీల్డర్లు రనౌట్‌కు అప్పీల్ చేశారు. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫీర్ చేశారు. రిప్లేలో బంతి స్టంప్స్‌ను తాకే సమయానికి బ్యాటర్ క్రీజులోకి వచ్చినట్లు క్లియర్‌గా కన్పించింది. దీంతో థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెల్లడించడానికి సిద్దమయ్యాడు. అయితే అనూహ్యంగా బిగ్‌స్క్రీన్‌లో ఔట్ కన్పించింది. దీంతో ఒక్కసారిగా మైదానంలో గందరగోళం నెలకొంది. అయితే థర్డ్ నాటౌట్ బటన్‌కు బదులుగా తప్పుడు బటన్ నొక్కడంతో ఇలా జరిగింది. తన తప్పిదాన్ని గ్రహించిన థర్డ్ అంపైర్ వెంటనే నాటౌట్ బటన్ నొక్కడంతో బ్యాటర్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 157 పరుగుల లక్ష్యాన్ని సిడ్నీ సిక్సర్స్ 18.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సిడ్నీ బ్యాటర్లలో జేమ్స్ విన్స్ (79) హాఫ్ సెంచరీతో రాణించాడు. కాగా మొదట బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. He's pressed the wrong button! 🙈@KFCAustralia #BucketMoment #BBL13 pic.twitter.com/yxY1qfijuQ — KFC Big Bash League (@BBL) January 6, 2024 -
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన అంపైర్.. ఆగిపోయిన మ్యాచ్! వీడియో వైరల్
సాధారణంగా క్రికెట్లో వర్షం, వెలుతురులేమి, సాంకేతిక కారణాల వల్ల మ్యాచ్ ఆగిపోవడం చూస్తూ ఉంటాం. కానీ మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఊహించని ఘటనతో ఆటకు అంతరాయం ఏర్పడింది. ఈ మ్యాచ్‌కు థర్డ్ అంపైర్‌గా వ్యహరిస్తున్న థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు దీంతో దాదాపు 5 నిమిషాల పాటు మ్యాచ్ ఆగిపోయింది. మూడో రోజు లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి ఆటను ప్రారంభించేందుకు అన్‌ఫీల్డ్ అంపైర్లు సిద్దమయ్యారు. ఈ క్రమంలో కెమెరామెన్ థర్డ్ అంపైర్ బాక్స్ వైపు కెమెరాను టర్న్ చేయగా సీటులో ఇల్లింగ్‌వర్త్ కన్పించలేదు. దీంతో ఆటను అంపైర్లు ప్రారంభించలేదు. వెంటనే ఈ విషయాన్ని ఫోర్త్ అంపైర్‌కు ఫీల్డ్ అంపైర్లు తెలియజేయగా.. అతడు ఏమైందోనని థర్డ్ అంపైర్ గదికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఇంతలోనే లంచ్ పూర్తి చేసిన తర్వాత ఇల్లింగ్‌వర్త్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడని కామెంటేటర్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఆసీస్ ఆటగాళ్లు ఒక్కసారిగా నవ్వుకున్నారు. అయితే 5 నిమిషాల తర్వాత థర్డ్ అంపైర్ తిరిగి రావడంతో మ్యాచ్ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. చదవండి: IND Vs AFG T20I Series: అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్.. టీమిండియా కొత్త కెప్టెన్ అతడే!? రోహిత్ డౌటే? A wild Richard Illingworth appeared! #AUSvPAK pic.twitter.com/7Rsqci4whn — cricket.com.au (@cricketcomau) December 28, 2023 -
#Jadeja: ఔటయ్యింది ఒక బంతికి.. చూపించింది మరో బంతిని
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగించే యోచనలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు టీమిండియా ఆలౌట్ కాగా.. రెండోరోజు ఆట ముగిసే సమయానికి విండీస్ వికెట్ నష్టానికి 86 పరుగులతో ప్రతిఘటిస్తుంది. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 352 పరుగులు వెనుకబడి ఉంది. ఇక టీమిండియా ఇన్నింగ్స్‌లో కోహ్లి సెంచరీతో మెరిస్తే.. అశ్విన్, జడేజా, యశస్వి జైశ్వాల్‌లు అర్థసెంచరీలతో రాణించారు. ఇక కోహ్లితో కలిసి ఐదో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పిన జడేజా ఔటైన తీరు సక్రమమే అయినప్పటికి డీఆర్ఎస్లో ఎంత లోపం మరోసారి బయటపడింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 104వ ఓవర్లో కీమర్ రోచ్ వేసిన ఆఖరి బంతిని జడేజా డ్రైవ్షాట్ ఆడే క్రమంలో మిస్ అయ్యాడు. దీంతో బంతి కీపర్ జోషువా దసిల్వా చేతిలో పడింది. కీపర్ వెంటనే ఔట్ అంటూ అప్పీల్ చేశాడు. కానీ ఫీల్డ్ అంపైర్ మరాయిస్ ఎరాస్మస్ నాటౌట్ అని ప్రకటించాడు. దీంతో విండీస్ ఆటగాళ్లు రివ్యూకు వెళ్లారు. కాగా రివ్యూను పరిశీలించిన టీవీ అంపైర్ మైకెల్ గాఫ్ తొలుత అన్ని యాంగిల్స్‌లోనూ బంతి బ్యాట్‌కు తాకిందా లేదా అని చూశారు. కాని బంతి బ్యాట్‌కు దగ్గరగా వెళ్లింది కానీ తాకిందా లేదా అన్నది క్లారిటీ రాలేదు. దీంతో థర్డ్ అంపైర్ అల్ట్రాఎడ్జ్కు రిక్వెస్ట్ చేశాడు. బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకుతూ స్పైక్ కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ జడేజాను ఔట్ అని ప్రకటించాడు. అయితే ఇక్కడ ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. తొలుత అల్ట్రాఎడ్జ్‌లో జడ్డూ ఔటైన బంతికి బదులుగా.. జడ్డూ ఆడిన మరో బంతిని డిస్ప్లే చేయడం వైరల్‌గా మారింది. అయితే యాదృశ్చికంగా రెండింటిలోనూ జడ్డూ బ్యాట్‌కు బంతి తగిలివెళ్లినట్లుగా స్పైక్ కనిపించింది. ఇక్కడ విండీస్ ఆటగాళ్లను.. అటు థర్డ్ అంపైర్‌ను తప్పుబట్టలేం. ఎందుకంటే జడేజా ఔట్లో ఎలాంటి పొరపాటు లేదు. కేవలం సాంకేతిక లోపంతో జడ్డూ ఔటైన బంతిని కాకుండా తప్పుడు బంతిని చూపించడండలో తప్పు జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. DRS scam 2023. Jadeja's wicket was robbed. @ICC @BCCI @imjadeja @imVkohli pic.twitter.com/FAbXKihW0S — Human_Insaan🇮🇳 (@Alishan_53) July 21, 2023 చదవండి: 352 పరుగుల వెనుకంజలో విండీస్.. భారత్ పట్టు బిగిస్తుందా? -
స్టీవ్ స్మిత్ వివాదాస్పద క్యాచ్.. థర్డ్ అంపైర్ కళ్లకు గంతలు!
యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 325 పరుగులకే పరిమితం చేసిన ఆసీస్ 91 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్ వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. ప్రస్తుతం 149 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆసీస్ పట్టు బిగించేలా కనిపిస్తోంది. ఈ విషయం పక్కనబెడితే.. ఇటీవలే ఆస్ట్రేలియా ఆటగాళ్లు తీసుకుంటున్న పలు క్యాచ్‌లు వివాదాస్పదంగా మారుతున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్లో గిల్ క్యాచ్‌ను గ్రీన్ అందుకున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం యాషెస్ సిరీస్‌లోనూ బర్మింగ్హమ్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ మళ్లీ గ్రీన్ మరో వివాదాస్పద క్యాచ్‌తో వార్తల్లో నిలిచాడు. బెన్ డక్కెట్ ఇచ్చిన క్యాచ్‌ను థర్డ్ స్లిప్‌లో ఉన్న గ్రీన్ అందుకున్నాడు. అయితే బంతి నేలను తాకినట్లు క్లియర్‌గా ఉన్నా థర్డ్ అంపైర్ మరోసారి గ్రీన్‌కే ఓటు వేశాడు. ఈ రెండు సందర్భాల్లో గ్రీన్ విలన్‌గా మారితే.. తాజాగా స్టీవ్ స్మిత్ వివాదాస్పద క్యాచ్‌ల జాబితాలో చేరాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 416 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో మంచి ఆరంభం లభించింది. అయితే రూట్ (10 పరుగులు) ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. స్టార్క్ వేసిన బంతిని(46.3వ ఓవర్లో) రూట్ ఎదుర్కొనే క్రమంలో బ్యాక్వర్డ్ స్క్వేర్ వద్ద స్మిత్ చేతికి చిక్కాడు. అయితే క్యాచ్ అందుకున్న విధానంపై అనుమానంతో ఫీల్డ్ అంపైర్లు నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు నివేదించారు. రిప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. రిప్లేలో బంతి నేలను తాకుతుందని క్లియర్‌గా తెలుస్తున్నప్పటికి.. ఔట్ ఇవ్వడం ఏంటని ఇంగ్లండ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Nine wickets ☝ Three hundred and thirty-five runs 🏏 Another day of Test match cricket to savour 👇 pic.twitter.com/48K4lXmk2J — England Cricket (@englandcricket) June 30, 2023 -
పారే నదిలో క్రికెట్ మ్యాచ్.. అంతర్జాతీయ మ్యాచ్‌కు ఏమాత్రం తీసిపోలేదు..!
క్రికెట్‌ను మతంగా, క్రికెటర్లను దేవుళ్లుగా భావించే భారత దేశంలో అభిమానులు రకరకాలుగా ఉంటారు. వారు క్రికెట్ పట్ల తమకున్న అభిమానాన్ని, ఆసక్తిని వివిధ రకాలుగా చాటుకుంటుంటారు. ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో కొందరు యువకులు క్రికెట్‌పై అమితాసక్తితో ఓ వినూత్న ప్రయోగం చేశారు. వారు ప్రవహించే నదిలో సరదాగా క్రికెట్ ఆడారు. అంతర్జాతీయ మ్యాచ్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని రూల్స్ పాటించారు. దీనికి సంబంధించిన వీడియో కొద్ది రోజులుగా నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో కొందరు యువకులు నీటిపై క్రికెట్ ఆడుతుంటారు. బౌలర్ వేసిన ఓ బంతిని బ్యాటర్ నీటిని చిమ్ముతూ కవర్స్ దిశగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అది కాస్త మిస్ అయ్యి వికెట్‌కీపర్ చేతుల్లోకి వెళ్తుంది. అప్పుడు ఫీల్డింగ్ జట్టు అంపైర్‌కు అప్పీల్ చేయగా, అతను నాటౌట్ అంటాడు. ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో సంతృప్తి చెందని బౌలింగ్ టీమ్.. రివ్యూ తీసుకుంటుంది. థర్డ్ అంపైర్ రీప్లేను అల్ట్రా ఎడ్జ్ టెక్నాలజీతో పరిశీలించి ఔట్‌గా ప్రకటిస్తాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటాడు. ఈ తంతు మొత్తం అంతర్జాతీయ మ్యాచ్‌లో ఎలా సాగుతుందో అచ్చం అలాగే సాగింది. ఈ వీడియో జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. -
#NotOut: థర్డ్ అంపైర్ చీటింగ్.. గిల్ ఔట్ కాదు
డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టీమిండియాకు షాక్ తగిలింది. 444 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌కు గిల్, రోహిత్‌లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించారు. టీ విరామానికి ఒక్క ఓవర్ ముందు టీమిండియాకు ఊహించని దెబ్బ తగలిగింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో షాట్ ఆడే యత్నంలో శుబ్‌మన్ గిల్ స్లిప్‌లో ఉన్న గిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. అయితే గిల్ ఔట్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. క్యాచ్ తీసుకునే క్రమంలో డైవ్ చేసిన గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి.. ఫోర్స్‌కు బంతిని నేలకు తాకించినట్లు కనిపించింది. దీంతో గిల్ రివ్యూకు వెళ్లాడు. అల్ట్రాఎడ్జ్‌లో కెమెరా యాంగిల్ పరిశీలించగా గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి నేలకు తాకించినట్లు కనిపించింది. అయితే గ్రీన్ చేతి వేలు బంతి కింద ఉన్నట్లు థర్డ్అంపైర్ మైక్‌లో చెప్పి బిగ్ స్ర్కీన్‌పై గిల్ ఔట్ అని ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం గిల్‌తో పాటు కెప్టెన్ రోహిత్‌ను ఆశ్చర్యపరిచింది. అభిమానులు కూడా థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని విమర్శిస్తూ ట్రోల్ చేశారు. ''థర్డ్ అంపైర్ ఆసీస్ పక్షపాతిలా ఉన్నాడు.. అందుకే నాటౌట్ అని క్లియర్‌గా కనిపిస్తున్నా ఔట్ ఇచ్చాడు.. కళ్లకు గంతలు కట్టుకొని తన నిర్ణయాన్ని వెల్లడించాడు.. RIP థర్డ్ అంపైర్'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by ICC (@icc) Cheating is in Blood of Australians and ICC. ICC is a slave of white skinned dominance. #WTCFinal#WTCFinal2023 Ponting Cameroon Green Gill pic.twitter.com/zlWAgob6zN — Ayush Jain (@aestheticayush6) June 10, 2023 చదవండి: WTC Final: గెలవకపోయినా పర్లేదు డ్రా చేసుకుంటే అదే గొప్ప! -
అది నోబాల్.. థర్డ్ అంపైర్ చీటింగ్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా శనివారం ఎస్ఆర్హెచ్, లక్నో సూపర్‌జెయింట్స్(LSG)మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. నో బాల్ విషయంలో థర్డ్ అంపైర్ వ్యవహరించిన తీరుపై స్టేడియానికి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవ్వడం ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే.. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఆవేశ్ ఖాన్ వేశాడు. ఓవర్ మూడో బంతి హైఫుల్ టాస్‌గా వెళ్లింది. నడుము పై భాగంలో వెళ్లడంతో ఫీల్డ్ అంపైర్ నోబాల్‌కు కాల్ ఇచ్చాడు. అయితే లక్నో సూపర్‌జెయింట్స్ అంపైర్ కాల్‌ను చాలెంజ్ చేశారు. దీంతో అల్ట్రాఎడ్జ్‌లో పరిశీలించిన థర్డ్ అంపైర్ బంతి సమద్ బ్యాట్ ఎడ్జ్‌కు తాకి వెళ్లిందని.. నో బాల్ కాదని చెప్పాడు. దీంతో క్లాసెన్ సహా అబ్దుల్ సమద్‌లు షాక్‌కు గురయ్యారు. వాస్తవానికి నడుము పై నుంచి బంతి వెళితే నోబాల్ ఇవ్వడం జరుగుతుంది. అంత క్లియర్‌గా నోబాల్ అని కనిపిస్తున్నా థర్డ్ అంపైర్ కరెక్ట్ బాల్‌గా కౌంట్ చేయడం ఆసక్తి కలిగించింది. ఇదే ఎస్ఆర్హెచ్ అభిమానులకు కోపం తెప్పించింది. థర్డ్ అంపైర్‌ని తిడుతూనే ఎల్ఎస్జీ డగౌట్ వైపు కొంతమంది అభిమానులు నట్స్, బోల్ట్‌లు విసిరికొట్టారు. అవి వచ్చి డగౌట్లో పడడంతో గందరగోళం నెలకొంది. దీంతో లక్నో ఆటగాళ్లంతా డగౌట్వైపుగా రావడం.. క్లాసెన్, క్వింటన్ డికాక్‌లు నోబాల్ వ్యవహారంపై సీరియస్‌గా చర్చించడం కనిపించింది. అయితే ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని కంగారు పడిన వేళ అంపైర్లు కలగజేసుకొని డగౌట్ నుంచి ఆటగాళ్లను పంపించేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన తర్వాత క్లాసెన్ ఏకాగ్రత కోల్పోయాడు. 47 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్న క్లాసెన్ అదే ఓవర్లో చివరి బంతికి భారీ షాట్‌కు యత్నించి ప్రేరక్ మన్కడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పెవిలియన్ వెళ్లే సమయంలో క్లాసెన్ మొహం బాధతో నిండిపోవడం కనిపించింది. 3rd Umpire gives this as a fair delivery. - The Hyderabad crowd starts chanting 'Kohli, Kohli'.#SRHvLSGpic.twitter.com/2vY2YkxKQa — runmachinevi143 (@runmachinevi143) May 13, 2023 After a controversial reversal of no ball decision by the third umpire, the SRH fans in the stadium are showing their frustrations at the LSG dugout. The crowd were also heard chanting, "Kohli, Kohli" with Gambhir in the dugout 👀 📸 JioCinema#SRHvLSG #SRH #SRHvsLSG pic.twitter.com/jPti6MyaFe — 12th Khiladi (@12th_khiladi) May 13, 2023 A blunder from the third umpire? 📸: Jio Cinema#IPL2023 | #SRHvLSG pic.twitter.com/pyQk6IzUoj — CricTracker (@Cricketracker) May 13, 2023 చదవండి: సైబర్‌క్రైమ్‌ను ఆశ్రయించిన సచిన్ టెండూల్కర్ -
ధోని తోపు కాబట్టి తప్పు చేసినా ఓకేనా ?...థర్డ్ అంపైర్ ఏం చేస్తున్నాడు
-
ఒక్కడికి సీరియస్‌నెస్ లేదు; థర్డ్ అంపైర్‌కు మెంటల్ ఎక్కించారు
సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో ఒక వింత సన్నివేశం చోటుచేసుకుంది. ఆడుతుంది ఎంత ఫ్రెండ్లీ మ్యాచ్ అయినా కాస్త అయినా సీరియస్‌నెస్ లేదు. పిచ్చి చేష్టలతో థర్డ్ అంపైర్‌కు మెంటల్ ఎక్కించారు ఇరుజట్ల ఆటగాళ్లు. విషయంలోకి వెళితే.. తెలుగు వారియర్స్, కర్నాటక బుల్డోజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తెలుగు వారియర్స్‌కు అఖిల్ నేతృత్వం వహించగా.. కర్నాటకకు సుదీప్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే కర్నాటక ఇన్నింగ్స్ సమయంలో విచిత్ర సంఘటన జరిగింది. బౌలర్ వేసిన బంతిని కర్నాటక బ్యాటర్ కవర్స్ దిశగా ఆడాడు. సింగిల్ బాగానే పూర్తి చేసిన బ్యాటర్లు రెండో పరుగు కోసం యత్నించారు. అయితే నాన్‌స్ట్రైక్ ఎండ్ నుంచి వెళ్లిన బ్యాటర్.. కీపర్ బంతిని స్టంప్స్‌కు వేసే సమయానికి అతనికి అడ్డుగా వెళ్లాడు. దీంతో రనౌట్ చాన్స్ మిస్ అయింది. బంతి కూడా దూరంగా వెళ్లడంతో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ మూడో పరుగు కోసం స్ట్రైకింగ్ ఎండ్‌కు వచ్చేశాడు. అప్పటికి మరొక బ్యాటర్ అక్కడే ఉన్నాడు. తెలుగు వారియర్స్ ఫీల్డర్ చెత్త త్రో వేయడం.. ఇంతలో ఎవరు ఊహించని హైడ్రామా జరిగింది. మైదానంలోకి మూడో బ్యాటర్ ఎంటరయ్యాడు. అసలు అతను ఎందుకు వచ్చాడో ఎవరికి అర్థం కాలేదు. ఇదంతా ఒక ఎత్తు అంటే.. చివరికి ఇద్దరు బ్యాటర్లు మళ్లీ ఒకే ఎండ్‌లోకి చేరుకోవడం.. అటు ఫీల్డర్ కూడా సరైన త్రో వేయడంతో ఈసారి కీపర్ వికెట్లను గిరాటేశాడు. కానీ స్ట్రైకింగ్ ఎండ్‌లో బ్యాటర్లు ఎవరు లేరన్న విషయాన్ని గుర్తించిలేకపోయారు. ఆ తర్వాత తెలుగు వారియర్స్ ఆటగాళ్లు ఔట్ అంటూ అప్పీల్ చేశారు. మైదానంలో ఉన్న ఫీల్డ్ అంపైర్లకు ఏం అర్థంగాక థర్డ్ అంపైర్‌ను సంప్రదించారు. అప్పటికే ఆటగాళ్ల పిచ్చి చేష్టల కారణంగా థర్డ్ అంపైర్‌కు మెంటల్ ఎక్కే ఉంటుంది. ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థంకాక కాసేపు అలాగే ఉండిపోయాడు. చివరకు ఏం రివ్యూ ఇవ్వాలో తెలియక బంతిని డెడ్‌బాల్‌గా పరిగణించి.. అటు పరుగులు ఇవ్వలేదు.. ఇటు బంతిని కౌంట్ చేయలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విజేతగా తెలుగు వారియర్స్ నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దబాంగ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను పది ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఆదిత్య 26, అస్గర్ 11 పరుగులు చేశారు. వారియర్ నందకిషోర్ రెండు వికెట్లు తీశాడు.ప్రతిగా బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్ 4 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల ఆధిక్యం సాధించింది. ఓపెనర్ అఖిల్ 67 పరుగులతో రాణించాడు. తరువాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన దబాంగ్ ఆరు వికెట్లకు 89 పరుగులు చేసింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన తెలుగు వారియర్స్ 6.1 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టపోయి విజయలక్ష్యాన్ని సాధించింది. చదవండి: తెలివైన క్రికెటర్.. 'క్యాచ్‌లందు ఈ క్యాచ్ వేరయా' -
చెత్త అంపైరింగ్.. కళ్లు కనిపించడం లేదా! కోహ్లిది నాటౌట్.. నో అంటున్నా..
India vs Australia, 2nd Test- Virat Kohli: ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఔటైన తీరు వివాదస్పదమైంది. థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి కోహ్లి మరోసారి బలైపోయాడు. దీంతో టీమిండియా అభిమానులు అంపైర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఏం జరిగిందంటే? భారత్ ఇన్నింగ్స్ 50 ఓవర్ వేసిన మాథ్యూ కుహ్నెమన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్‌కు దగ్గరగా వెళ్తూ కోహ్లి ప్యాడ్‌ను తాకింది. దీంతో బౌలర్‌తో పాటు ఆసీస్ ఫీల్డర్లు ఎల్బీకి అప్పీల్ చేశారు. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ ఔట్ అని వేలు పైకెత్తాడు. అయితే అంపైర్ అవుట్‌గా ప్రకటించిన వెంటనే, విరాట్ డీఆర్ఎస్ తీసుకున్నాడు. టీవీ రిప్లైలో విరాట్ కోహ్లి బ్యాట్‌కి ముందుగా బాల్ తగులుతున్నట్టు స్పష్టంగా కనిపించినా.. థర్డ్ అంపైర్ మాత్రం బెన్ఫిట్ ఆఫ్ డౌట్ కింద ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. అంపైర్ నిర్ణయాన్ని స్క్రీన్‌పై చూసిన కోహ్లి కూడా ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు. ‘నో’ అంటూ తల ఊపుతూ కోహ్లి పెవిలియన్‌కు వెళ్లాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ 44 పరగులు చేశాడు. కాగా విరాట్ కోహ్లి ఔట్ నిర్ణయంపై టీమిండియా మాజీ ఆటగాళ్లు అభినవ్ ముకుంద్, వసీం జాఫర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. గతేడాది స్వదేశంలో శ్రీలంకపై కూడా విరాట్ ఇలానే పెవిలియన్‌కు చేరాడు. ‘‘ఢిల్లీ టెస్టులో కోహ్లిది కూడా నాటౌట్. బంతి ముందు బ్యాట్‌కు తాకింది. కోహ్లి చాలా దురదృష్టవంతుడు. అతడి వికెట్‌తో భారత్ కష్టాల్లో పడింది’’ అని అభినవ్ ముకుంద్ ట్వీట్ చేశాడు. "అది ఔట్ కాదు. స్పష్టంగా బంతి బ్యాట్‌కు ముందు తాకింది. థర్డ్ అంపైర్ నిర్ణయంపై చాలా సందేహాలు ఉన్నాయి’’ అని జాఫర్ ట్వీట్ చేశాడు. ఇక ఫ్యాన్స్ కూడా థర్డ్ అంపైర్ నిర్ణయంపై మండిపడుతున్నారు. "చెత్త అంపైరింగ్.. కళ్లు కనిపించడం లేదా! అది నాటౌట్’’ అంటూ విరాట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియా ఫీల్డర్ అద్భుత విన్యాసం.. షాక్‌లో శ్రేయాస్! వీడియో వైరల్ Umpires never support Virat kohli like Mumbai Indians 💔 pic.twitter.com/SOTDQFhkM5 — Vishal. (@SportyVishaI) February 18, 2023 Why Virat Kohli again??🤦♂️ 📸: Disney + Hotstar pic.twitter.com/09uPTlwz0M — CricTracker (@Cricketracker) February 18, 2023 Another day, another debutant gets wicket of Virat Kohli 🔔! Virat Kohli is out and is back in the pavilion! Virat got out when his team needed him the most! Mere ghante ka king!!#ViratKohli #BGT2023 #kohli #INDvsAUS pic.twitter.com/VgDTKFv4FQ — Waleed Khan Yousafzai (@WaleedKhanYz) February 18, 2023 -
అసలు హార్దిక్ పాండ్యాది ఔటేనా!
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వివాదాస్పద రీతిలో వెనుదిరగాల్సి వచ్చింది. థర్డ్ అంపైర్ చెత్త నిర్ణయం వల్ల వెనుదిరిగిన పాండ్యా అసలు ఔటా లేక నాటౌటా అన్న సందేహం తలెత్తక మానదు. డారిల్ మిచెల్ వేసిన ఇన్నింగ్స్ 40వ ఓవర్లో నాలుగో బంతిని పాండ్యా ఫ్లిక్ చేయబోయి మిస్ అయ్యాడు. ఈ నేపథ్యంలో బంతి కీపర్ టామ్ లాథమ్ చేతుల్లో పడింది. ఆ వెంటనే బెయిల్స్ కూడా కిందపడ్డాయి. పాండ్యా ఔట్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌ను రివ్యూ కోరాడు. రిప్లేలో కూడా బంతి ఎక్కడా నేరుగా వికెట్లను తాకిన దాఖలాలు కనిపించలేదు. అయితే టామ్ లాథమ్ గ్లోవ్స్ మాత్రం వికెట్లను తాకినట్లు కనిపించింది. అదే సమయంలో బంతి కూడా లాథమ్ చేతుల్లో పడింది. లాథమ్ బంతి అందుకోకముందే బెయిల్స్ ఎగురగొట్టినట్లు పరిగణించిన థర్డ్ అంపైర్ పాండ్యాను బౌల్డ్‌గా ప్రకటించి ఔట్ ఇచ్చాడు. అంతే కివీస్ ఆటగాళ్లు సంతోషంలో మునిగిపోగా.. ఆశ్చర్యపోవడం పాండ్యా వంతైంతి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా 46 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ 168, శార్దూల్ ఠాకూర్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా గిల్‌కు ఇది వరుసగా రెండో వన్డే సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో వన్డేల్లో 18 ఇన్నింగ్స్‌ల్లోనే గిల్ వెయ్యి పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. Out or Not Out?#IndvNz#HardikPandya𓃵 #notout pic.twitter.com/Hbzzwan4bs — Rahul Sisodia (@Sisodia19Rahul) January 18, 2023 -
థర్డ్ అంపైర్ నిర్ణయం.. బంగ్లా కెప్టెన్‌కు శాపం
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో ఒకపక్క వరుణుడు ఇబ్బంది పడుతుంటే.. మరోపక్క అంపైర్లు తప్పుడు నిర్ణయాలతో బ్యాటర్లు బలవుతున్నారు. తాజాగా ఆదివారం పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలవ్వాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో నాలుగో బంతికి షకీబ్ ఎల్బీగా వెనుదిరిగాడు. స్పిన్నర్ షాదాబ్ వేసిన ఈ ఓవర్లో మొదట సౌమ్యా సర్కార్ ఔట్ అవగా తర్వాతి బంతికే షకీబ్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో పాక్ ఆటగాళ్లు అప్పీ్ల్‌కు వెళ్లగా ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. ఆలస్యం చేయకుండా షకీబ్ రివ్యూకు వెళ్లాడు. అయితే రివ్యూలో బంతికి ముందుగా బ్యాట్ ను తగిలినట్టు అల్ట్రా ఎడ్జ్‌లో స్పష్టంగా స్పైక్ కనిపించింది. ఆ తర్వాతే బంతి షకీబ్ ప్యాడ్లను తాకింది. కానీ, ఇన్ సైడ్ ఎడ్జ్ క్లియర్ గా ఉన్నప్పటికీ థర్డ్ అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఇచ్చాడు. బ్యాట్ నేలను తాకడం వల్లే అల్ట్రా ఎడ్జ్ లో స్పైక్ వచ్చినట్టు పేర్కొన్నాడు. కానీ, స్పైక్ వచ్చిన సమయంలో బ్యాట్ కు, నేలకు మధ్య ఖాళీ టీవీ రీప్లేల్లో కనిపించింది. అయినప్పటికీ థర్డ్ అంపైర్ ఎల్బీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే బంగ్లా కెప్టెన్ షకీబ్ షాకయ్యాడు. దీనిపై ఫీల్డ్ అంపైర్లతో మాట్లాడాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసి ఏం చేయలేక నిరాశతో మైదానం వీడాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ తడబడింది. దీంతో బంగ్లాదేశ్ పెద్దగా స్కోరు చేయలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ 18.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంతో పాకిస్తా్న్ అనూహ్యంగా సెమీస్‌లో అడుగుపెట్టగా.. బంగ్లాదేశ్ ఓటమితో ఇంటిబాట పట్టింది. Shakib’s bat didn’t touch the ground at all. Just focus on bat’s shadow. There was a spike. It couldn’t have been anything else except the ball hitting the bat. Bangladesh at the receiving end of a poor umpiring decision. #PakvBan #T20WorldCup — Aakash Chopra (@cricketaakash) November 6, 2022 Big moment in the match. Looked like Shakib Al Hasan edged it. The umpiring in this tournament hasn't been great#T20WorldCup #PAKvBAN pic.twitter.com/4zoJcVVPkm — Saj Sadiq (@SajSadiqCricket) November 6, 2022 చదవండి: ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.. కానీ నేనైతే: బంగ్లాదేశ్ కెప్టెన్ -
ఔట్ కాదనుకుంటా.. పాల్ స్టిర్లింగ్ మోసపోయాడు
టి20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక, ఐర్లాండ్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్‌ను థర్డ్ అంపైర్ మోసం చేశాడు. స్టిర్లింగ్ ఔట్ కాదని స్పష్టంగా తెలుస్తున్నప్పటికి థర్డ్ అంపైర్ రిప్లేని మరోసారి చెక్ చేయకపోవడం ఐర్లాండ్ ఓపెనర్‌ను ముంచింది. ఫలితంగా పాల్ స్టిర్లింగ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్ 9వ ఓవర్లో ఇది జరిగింది. ఆ ఓవర్లో ధనుంజయ డిసిల్వా వేసిన నాలుగో బంతిని పాల్ స్టిర్లింగ్ లాంగాఫ్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీలైన వద్ద ఉన్న బానుక రాజపక్స ముందుకు డైవ్ చేస్తూ క్యాచ్ తీసుకున్నాడు. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. ముందుకు వచ్చి పట్టడంతో క్యాచ్‌పై క్లియర్ విజన్ కనిపించలేదు. అయితే తర్వాత రిప్లేలో రాజపక్స క్యాచ్ తీసుకున్న తర్వాత బంతిని గ్రౌండ్‌పై పెట్టినట్లు కనిపించింది. ఇది చూసిన పాల్ స్టిర్లింగ్ కాసేపు అలాగే నిలబడినప్పటికి థర్డ్ అంపైర్ నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో ఏం చేయలేక పెవిలియన్ బాట పట్టాడు. అప్పటికి స్టిర్లింగ్ 34 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Virat Kohli: పాక్‌తో మ్యాచ్.. కోహ్లి ముంగిట అరుదైన రికార్డు దాయాదుల సమరం.. అమ్మ, ఆవకాయలాగే ఎప్పుడు బోర్ కొట్టదు NOT OUT! Paul Stirling should have been not out. Rajapaksa slid the ball on the ground before completing the catch. @FOXSports @ICC_CricInfo @cricketireland pic.twitter.com/0i4Bp9nRpJ — Jazz Vic AU (@JazzVicAU) October 23, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
థర్డ్ అంపైర్ చీటింగ్.. టీమిండియా క్రికెటర్‌కు అన్యాయం
ఆసియాకప్ మహిళల టి20 టోర్నీలో టీమిండియా మహిళలు శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. శనివారం శ్రీలంక వుమెన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా వుమెన్స్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ బ్యాటింగ్‌లో మెరవగా.. బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో భారత మహిళల జట్టు విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్ విజయం పక్కనబెడితే.. థర్డ్ అంపైర్ చీటింగ్‌కు టీమిండియా క్రికెటర్ పూజా వస్త్రాకర్‌కు అన్యాయంగా బలవ్వాల్సి వచ్చింది. రనౌట్ కాదని క్లియర్‌గా తెలుస్తున్నప్పటికి రిప్లేలో ఔటివ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన టీమిండియా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో చోటుచేసుకుంది. అచిని కౌలసూరియా వేసిన ఓవర్ ఐదో బంతిని పూజా వస్త్రాకర్ కవర్స్ దిశగా ఆడింది. సింగిల్ పూర్తి చేసిన పూజా రెండో పరుగు కోసం ప్రయత్నించింది. పూజా క్రీజులో బ్యాట్ పెట్టగానే కీపర్ బెయిల్స్‌ను ఎగురగొట్టింది. రిప్లేలో చూస్తే పూజా క్రీజుకు చేరినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం ఔట్ ఇవ్వడం షాక్‌కు గురిచేసింది. ఇది చూసిన పూజాకు కాసేపు ఏమి అర్థం కాలేదు. థర్డ్ అంపైర్ పొరపాటున ఔట్ ఇచ్చాడేమోనని ఎదురుచూసింది. కానీ బిగ్‌స్క్రీన్‌లో ఎలాంటి మార్పు లేదు. దీంతో నిరాశగా పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలోనూ ఆమె స్క్రీన్‌నే చూడడం గమనార్హం. కామెంటేటర్లు కూడా థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ''ఓ మై గుడ్నెస్ ఇట్స్ ఔట్.. హౌ'' అంటూ కామెంట్ చేయడం స్పష్టంగా వినిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''పూజా వస్త్రాకర్ రనౌట్ కాదని క్లియర్‌గా తెలుస్తోంది. అసలు ఏ కోశానా థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడో అర్థం కావడం లేదు.. '' అంటూ కామెంట్ చేశారు. కాగా పూజా వస్త్రాకర్ ఔటైన తీరుపై టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. ''థర్డ్ అంపైర్‌ది వెరీ పూర్ డెసిషన్. రనౌట్ కాదని క్లియర్‌గా తెలుస్తోంది.. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఔట్ ఇచ్చి ఉంటాడు.'' అని పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఉమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జేమీమా రోడ్రిగ్స్ 53 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 76 పరుగులతో రాణించగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 33 పరుగులు చేసింది. లంక బౌలర్లలో రణసింగే మూడు వికెట్లు తీయగా.. సుగంధిక కుమారి, ఆటపట్టు చెరొక వికెట్ తీశారు 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 18.2 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్స్‌లో హాసిని పెరీరా 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్షితా మాధవి 26 పరుగులు చేసింది. భారత మహిళా బౌలర్లలో హేమలత మూడు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ చెరో రెండు వికెట్లు తీయగా.. రాధా యాదవ్ ఒక వికెట్ తీసింది. pic.twitter.com/lRDMOGYF6U — cricket fan (@cricketfanvideo) October 1, 2022 చదవండి: ప్రేమలో పడ్డ పృథ్వీ షా!.. గర్ల్‌ఫ్రెండ్ ఎవరంటే.. జెమీమా రోడ్రిగ్స్ విధ్వంసం.. ఆసియాకప్‌లో టీమిండియా మహిళలు శుభారంభం -
'ఇదేం చెత్త అంపైరింగ్.. కళ్లు కనిపించడం లేదా'
ఆసియాకప్-2022లో భాగంగా శ్రీలంక- ఆఫ్గానిస్తాన్ తొలి మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. శ్రీలంక ఇన్నింగ్స్ 2 ఓవర్ వేసిన నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో బంతి పాతుమ్ నిస్సంక బ్యాట్‌కు దగ్గరగా వెళ్తూ వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. వెంటనే బౌలర్‌తో పాటు వికెట్ కీపర్ కూడా క్యాచ్‌కు అప్పీల్ చేశాడు. అయితే ఫీల్డ్ అంపైర్ అనిల్ చౌదరి వెంటనే ఔట్ అని వేలు పైకిత్తాడు. ఈ క్రమంలో నిస్సంక నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న గుణతిలకతో చర్చించి రివ్యూకు వెళ్లాడు. అయితే రిప్లేలో బ్యాట్‌ను బంతి దాటే సమయంలో ఎటువంటి స్పైక్ కనిపించలేదు. అయినప్పటికీ థర్డ్ అంపైర్ మాత్రం బంతి బ్యాట్‌కు తాకినట్లు కన్పించింది అంటూ ఔట్‌గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయంతో బ్యాటర్‌తో పాటు డగౌట్లో ఉన్న శ్రీలంక జట్టు మేనేజ్మెంట్ కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. థర్డ్ అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయంపై శ్రీలంక అభిమానులు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. "ఇదేం చెత్త అంపైరింగ్‌రా.. కళ్లు కనిపించడం లేదా" అంటూ కామెంట్ చేశాడు. Can't even ask 'Out or not out' 😵💫 Pathum Nissanka at the receiving end of a shocker in #AsiaCup2022 #SLvAFG #AsiaCup pic.twitter.com/e47XDC6Kwi — CricXtasy (@CricXtasy) August 27, 2022 Sri lanka dedicating this scorecard to their father india (Source: Daniel Alexander)#AFGvSL #AsiaCup2022 pic.twitter.com/dDpyDxIZ8E — YouAreWrong (@huihui_____) August 27, 2022 #AFGvSL #AsiaCup2022 Third Umpire taking decision on Pathum Nissanka's Dismissal: pic.twitter.com/HSZ2AY7ghD — Vichitra.Duniya 🌏 (@vichitra_duniya) August 27, 2022 -
మరోసారి చెత్త అంపైరింగ్.. కోపంతో రగిలిపోయిన మాథ్యూ వేడ్
ఐపీఎల్ 2022 సీజన్లో అంపైర్లు తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. బ్యాట్స్‌మన్ రివ్యూలు తీసుకున్నప్పటికి డీఆర్ఎస్లు సరిగా పనిచేయక ఇబ్బంది కలిగిస్తున్నాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. 16 పరుగులు చేసిన మాథ్యూ వేడ్ థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి బలయ్యాడు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ మ్యాక్స్‌వెల్ వేశాడు. ఓవర్ రెండో బంతిని స్వీప్‌షాట్ ఆడే ప్రయత్నంలో బంతి బ్యాట్‌కు తాకి ప్యాడ్లను తాకింది. దీంతో ఆర్సీబీ అప్పీల్ వెళ్లగా.. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. అయితే వేడ్ వెంటనే రివ్యూకు వెళ్లాడు. రిప్లేలో బంతి బ్యాట్‌కు తగిలినట్లు కనిపించినా అల్ట్రాఎడ్జ్‌లో ఎక్కడా స్పైక్ కనిపించలేదు. ఆ తర్వాత బంతి ఆఫ్‌స్టంప్‌ను ఎగురగొట్టినట్లు చూపించింది. థర్డ్ అంపైర్ మాత్రం ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఔట్ ఇచ్చాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంతో షాక్ తిన్న వేడ్..ఇదేం నిర్ణయం అంటూ భారంగా పెవిలియన్ చేరాడు. డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్న వేడ్.. చీటింగ్ అంటూ థర్డ్ అంపైర్‌పై కోపంతో రగిలిపోయాడు. హెల్మెట్‌ను నేలకేసి కొట్టిన వేడ్.. ఆ తర్వాత బ్యాట్‌ను కూడా కోపంతో విసిరేయడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ ఔట్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయం విమర్శలకు దారి తీసింది. బంతి బ్యాట్‌కు తగలడానికి ముందే స్పైక్ కనిపించడం.. ఆ తర్వాత బ్యాట్‌ను బంతి దాటి వెళ్లిన తర్వాత స్పైక్ కనిపించలేదు. అయితే థర్డ్ అంపైర్ మాత్రం రోహిత్ ఔట్ అంటూ ప్రకటించాడు. అంతకముందు కోహ్లి ఔట్ విషయంలోనూ థర్డ్ అంపైర్ చెత్త నిర్ణయం తీసుకోవడం విమర్శలకు దారి తీసింది. చదవండి: Asif Ali: రెండేళ్ల క్రితం దూరమైంది.. పాక్ క్రికెటర్ ఇంట్లో వెల్లివిరిసిన సంతోషం Matthew Wade reaction in dressing room!#RCBvGT #mathewwade#Wade pic.twitter.com/iKPxIe2vW2 — Kavya Sharma (@Kavy2507) May 19, 2022 -
థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం.. రోహిత్ శర్మ ఔట్‌పై వివాదం
ఐపీఎల్ 2022 సీజన్లో థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం మరోసారి ఒక బ్యాట్స్‌మన్ కొంపముంచింది. ఇప్పటికే ఈ సీజన్లో థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయాలకు ఆటగాళ్లు బలయ్యారు. కోహ్లి ఎల్బీ వివాదం ఎంత పెద్ద రచ్చగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా రోహిత్ శర్మ ఔట్ విషయం మరోసారి వివాదానికి తెరలేపింది. సోమవారం ముంబై ఇండియన్స్, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. టిమ్ సౌతీ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతిని రోహిత్ శర్మ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్ కు చాలా దగ్గరగా వెళ్తూ అతడి తొడ భాగాన్ని తాకి కీపర్ కు సమీపంగా వెళ్లింది. కేకేఆర్ కీపర్ షెల్డన్ జాక్సన్ తన కుడివైపుకు అద్భుతంగా డైవ్ చేస్తూ క్యాచ్ ను పూర్తి చేశాడు. కేకేఆర్ ఆటగాళ్లు అవుటంటూ సంబరాలు చేసుకోగా.. అంపైర్ క్రిస్ గఫానీ అవుట్ ఇవ్వలేదు. దాంతో శ్రేయస్ అయ్యర్ రివ్యూకు వెళ్లాడు. రివ్యూలో బంతి రోహిత్ బ్యాట్ కు చాలా దగ్గరగా వెళ్లింది. అల్ట్రా ఎడ్జ్ లో చూసినప్పుడు బంతి బ్యాట్ కు దూరంగా ఉన్నా కూడా స్పైక్ కనిపించింది. ఇక బ్యాట్ కు సమీపంగా వచ్చినప్పుడు ఆ స్పైక్ మరింతగా ఎక్కువైంది. ఈ క్రమంలో థర్డ్ అంపైర్ అవుటంటూ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. బంతి బ్యాట్ కు చాలా దూరంగా ఉన్న సమయంలో కూడా అల్ట్రా ఎడ్జ్ లో స్పైక్ కనిపించడం ఆసక్తి కలిగించింది. అయితే బంతి బ్యాట్ కు దగ్గరగా వచ్చినప్పుడు అల్ట్రా ఎడ్జ్ లో బిగ్ స్పైక్ కనిపించడంతో థర్డ్ అంపైర్ రోహిత్‌ను అవుట్ గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంతో షాక్ తిన్న రోహిత్ కాసేపు మైదానంలో అలాగే నిల్చుండిపోయాడు. ఇక సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు రెండుగా చీలిపోయారు. కొందరు థర్డ్ అంపైర్‌ను సమర్థిస్తే.. మరికొందరు రోహిత్‌కు మద్దతుగా నిలిచారు.'' ఈ సీజన్లో థర్డ్ అంపైర్ నిర్ణయాలు అర్థం పర్థం లేకుండా ఉంటున్నాయి. అసలు ఆయన చెక్ చేసే టీవీని ఒకసారి పరిశీలించాలి. బ్యాట్ దూరంగా ఉన్నప్పుడు స్పైక్ రావడం చూస్తుంటే ఏదో తేడా ఉన్నట్లు అనిపిస్తుంది.'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: కోల్‌కథ ముగిసిపోలేదు...ఇంకా ఉంది! pic.twitter.com/NoWbosizkm — Diving Slip (@SlipDiving) May 9, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘మూడో అంపైర్ జోక్యం చేసుకోవాలి’
బ్యాటర్ నడుముకంటే ఎక్కువ ఎత్తులో దూసుకొచ్చే ‘నోబాల్స్’ విషయంతో మూడో అంపైర్ జోక్యం చేసుకుంటే బాగుంటుందని ముంబై ఇండియన్స్ కోచ్ మహేలా జయవర్ధనే అన్నాడు. ఢిల్లీ, రాజస్తాన్ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయానికే కట్టుబడటంతో ‘నోబాల్’ అంశం వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ దశను మార్చే కీలక సమయాల్లో అంపైర్లు ఈ విషయాన్ని పరిశీలించమంటూ థర్డ్ అంపైర్ కోరటం సరైందని అతను సూచించాడు. జయవర్ధనే ఐసీసీ క్రికెట్ కమిటీ సభ్యుడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ‘నో బాల్’ వివాదంలో తమ బ్యాటర్లను మైదానం నుంచి వెనక్కి పిలిచే ప్రయత్నం చేసి క్రమశిక్షణను ఉల్లంఘించిన ఢిల్లీ క్యాపిటల్స్ బృందంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చర్య తీసుకుంది. కెప్టెన్ రిషభ్ పంత్ మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా (సుమారు రూ. కోటీ 14 లక్షలు) విధించింది. అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేపై కూడా 100 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా, ఒక మ్యాచ్ నిషేధం విధించిన కౌన్సిల్... శార్దూల్‌ను కూడా 50 శాతం జరిమానాతో శిక్షించింది. చదవండి: హైడ్రామా.. పంత్ తీవ్ర అసహనం.. బ్యాటర్లను వెనక్కి వచ్చేయమంటూ.. -
థర్డ్ అంపైర్‌కు మతి భ్రమించిందా..?
ఐపీఎల్ 2022లో ఆర్సీబీ, సీఎస్కే మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రుతురాజ్ గైక్వాడ్ ఔట్ విషయంలో థర్డ్ అంపైర్ వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే కోహ్లి ఔట్ విషయంలో ఫ్యాన్స్ చేతిలో మొట్టికాయలు తిన్న థర్డ్ అంపైర్.. తాజా చర్యతో మరోసారి అడ్డంగా దొరికిపోయాడు. విషయంలోకి వెళితే.. సీఎస్కే ఇన్నింగ్స్ 4వ ఓవర్ హాజిల్‌వుడ్ వేశాడు. ఓవర్ నాలుగో బంతిని హాజిల్‌వుడ్ కాస్త హై లెంగ్త్‌లో వేశాడు. బంతి రుతురాజ్ బ్యాట్‌ను తాకకుండా ప్యాడ్ల పైనుంచి తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. దీంతో హాజిల్‌వుడ్ అప్పీల్ చేయగా అంపైర్ ఔట్ ఇచ్చాడు. అయితే రుతురాజ్ రివ్యూకు వెళ్లాడు. ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. థర్డ్ అంపైర్‌గా వ్యవహరిస్తున్న యశ్వంత్ బర్డే రుతురాజ్ క్యాచ్ ఔటేమోనని భ్రమ పడ్డాడు. మొదట ఆ యాంగిల్లోనే బంతిని పరిశీలించాడు. బంతి బ్యాట్‌కు ఎక్కడా తగల్లేదని చెప్పాడు. అయితే ఫీల్డ్ అంపైర్ తాను ఎల్బీకి రిఫర్ చేశానని.. క్యాచ్ ఔట్‌కు కాదని మరోసారి గుర్తు చేశాడు. దీంతో నాలుక కరుచుకున్న అంపైర్ క్షమాపణ కోరి ఎల్బీ రిఫరల్‌ను పరిశీలించాడు. అల్ట్రాఎడ్జ్‌లో బంతి బ్యాట్‌కు తగిలినట్లు కనిపించలేదు.. మిడిల్ స్టంప్‌ను గిరాటేసినట్లు చూపించడంతో రుతురాజ్ అవుట్ అని ప్రకటించాడు. మొత్తానికి థర్డ్ అంపైర్ హైడ్రామా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ''థర్ఢ్ అంపైర్‌కు మతి భ్రమించిందా'' అంటూ కామెంట్స్ చేశారు. #RCB pic.twitter.com/b1ZIVanclc — Big Cric Fan (@cric_big_fan) April 12, 2022 -
చెత్త నిర్ణయాలు వద్దు.. మా అంపైర్లను పంపిస్తాం; బీసీసీఐకి చురకలు
ఐపీఎల్ 2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి ఔటైన విధానం వివాదాస్పదంగా మారింది. విషయంలోకి వెళితే.. ఆర్సీబీ ఇన్నింగ్స్ 19 ఓవర్లో డెవాల్డ్ బ్రెవిస్ వేసిన తొలి బంతిని ఢిపెన్స్ ఆడటానికి విరాట్ కోహ్లి ప్రయ్నతించాడు. ఈ క్రమంలో బంతి మిస్స్ అయ్యి కోహ్లి ప్యాడ్‌ను తాకింది. బ్రెవిస్‌తో పాటు ఫీల్డర్లు ఎల్బీ అప్పీల్ చేయడంతో ఫీల్డ్ అంపైర్ దాన్ని ఔట్‌గా ప్రకటించాడు. తాను ఔట్ కాదంటూ కోహ్లి రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బంతి బ్యాట్, ప్యాడ్ రెండింటినీ ఒకే సమయంలో తాకుతున్నట్లు కనిపించింది. కోహ్లితో పాటు అభిమానులు ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకోక తప్పదని భావించారు. అయితే బంతి బ్యాట్‌కు ముందు తాకినట్లు సృష్టమైన ఆధారాలు కనిపించడం లేదంటూ థర్డ్ అంపైర్ కోహ్లి ఔట్ అని ప్రకటించాడు. థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంతో కోహ్లి షాక్‌కు గురయ్యాడు. తాను ఔట్ కాదంటూ గట్టిగా అరుస్తూ కోపంతో బ్యాట్‌ను నేలకేసి కొడుతూ పెవిలియన్ చేరాడు. కాగా కోహ్లి ఔట్ విషయంలో థర్డ్ అంపైర్ వ్యవహరించిన తీరుపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో బీసీసీఐ కలగజేసుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని.. థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయాల వల్ల ఆటగాళ్లు బలవుతున్నారని పేర్కొన్నారు. ఇదే విషయమై ఐస్లాండ్ క్రికెట్ అసొసియేషన్ ట్విటర్ వేదికగా బీసీసీఐకి చురకలు అంటించింది. ''మీ అంపైర్లకు సరైన నిర్ణయాలు తీసుకోవడం రావడం లేదు..మా దగ్గర మంచి ట్రెయిన్ అయిన అంపైర్లు ఉన్నారు.. కావాలంటే చెప్పండి పంపిస్తాం అంటూ పేర్కొంది. ఎల్బీ అప్పీల్లో బంతి మొదట బ్యాట్‌ను లేక ప్యాడ్‌ను తాకిందా అని చెప్పడం ఫీల్డ్ అంపైర్లకు కష్టసాధ్యం. కానీ టీవీ అంపైర్లు ఇది సులువుగా తెలుసుకోవచ్చు. అల్ట్రాఎడ్జ్‌లో స్లో మోషన్ రిప్లే టెక్నాలజీ ఉపయోగించి సరైన నిర్ణయం తీసుకోవచ్చు. కానీ కోహ్లి ఔట్ విషయంలో థర్డ్ అంపైర్ అలా చేయలేకపోయారు. బీసీసీఐ.. మా దగ్గర ఇలాంటి వాటిలో ఆరితేరిన అంపైర్లు ఉన్నారు.. మీ దగ్గరికి రావడానికి రెడీగా ఉన్నారు.. కావాలంటే చెప్పండి'' అంటూ పేర్కొంది. చదవండి: IPL 2022: థర్డ్ అంపైర్ నిర్ణయంపై కోపంతో ఊగిపోయిన కోహ్లి.. ఏం చేశాడంటే..! It's not easy for on field umpires to detect inside edges or whether ball hit bat or pad first. But every TV umpire should be able to make the right call with the benefit of slow motion replays and technology like UltraEdge. @BCCI We have trained umpires ready to fly over. — Iceland Cricket (@icelandcricket) April 9, 2022 -
స్టోక్స్ నోబాల్స్ కథేంటి! అంపైర్లకు కళ్లు కనబడవా?
Ben Stokes No Balls Controversy Ashes Series.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ పునరాగమనం అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ద్వారా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన స్టోక్స్ బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. 5 పరుగులు మాత్రమే చేసి కమిన్స్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక బౌలింగ్‌కు విషయానికి వస్తే.. స్టోక్స్ బౌలింగ్ లయ తప్పింది. అందుకు నిదర్శనమే నోబాల్స్. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 12వ ఓవర్‌ను స్టోక్స్ వేశాడు. వార్నర్ ఆడిన ఆ ఓవర్లో తొలి నాలుగు బంతులను స్టోక్స్ విసరకముందు.. అతని కాలు క్రీజు నుంచి ఓవర్‌స్టెప్ అవ్వడం క్లియర్‌గా కనిపించింది. అటు ఫీల్డ్ అంపైర్ కానీ.. ఇటు థర్డ్ అంపైర్ కానీ నో బాల్స్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: Ashes Series: స్టోక్స్ సూపర్ ఎంట్రీ అనుకున్నాం.. ఊహించని ట్విస్ట్ ఇదే విషయమై సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు ట్రోల్ చేశారు. ''ఫీల్డ్ అంపైర్ గమనించలేదు అంటే ఒప్పుకోవచ్చు.. మరీ థర్డ్ అంపైర్ ఏం చేస్తున్నట్లు.. వారిద్దరికి కళ్లు కనబడలేదా..'' అంటూ కామెంట్స్ చేశారు. స్టోక్స్ వేసిన నాలుగు నోబాల్స్‌కు సంబంధించిన వీడియోనూ ఆస్ట్రేలియన్ మీడియా ట్విటర్లో షేర్ చేసింది. మరో విశేషమేమిటంటే ఓవర్ నాలుగో బంతికి వార్నర్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.. ఇంగ్లండ్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు.. స్టోక్స్ ఎంట్రీ అదుర్స్ అనుకున్నారు. కానీ అప్పుడు అంపైర్ చెక్ చేసి నో బాల్ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది. మరి ముందు మూడు నోబాల్స్ కథేంటి అని అభిమానులు ప్రశ్నించారు. ఏది ఏమైనా పాపం స్టోక్స్‌కు రీఎంట్రీ మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. స్టోక్స్ నోబాల్స్ విషయానికి వస్తే... ఐసీసీ రూల్స్ ప్రకారం.. థర్డ్ అంపైర్ ఒక బౌలర్ వేసే నోబాల్స్ అన్నింటిని ట్రాక్ చేయరు. వికెట్ బంతులైతేనే రిప్లేలో పరీక్షిస్తారు. క్లాజ్ 21.5.2 ప్రకారం.. బౌలర్ బంతి విడవడానికి ముందు తన పాదంలో కొద్ది బాగాన్ని క్రీజుపై ఉంచినా.. గ్రౌండ్‌పై పెట్టినా.. మిడిల్‌స్టంప్‌ను కలిపే లైన్ లోపల వేసినా అది సరైన బాల్ కిందే లెక్కిస్తారు. ఈ మూడు రూల్స్ అతిక్రమించినప్పుడే ఫీల్డ్ అంపైర్ నోబాల్స్‌గా పరిగణిస్తారు. మరోవైపు థర్డ్ అంపైర్ కూడా టెలివిజన్ రిప్లేలో బౌలర్ ఫ్రంట్‌ఫుట్ ఎండ్‌ను కచ్చితంగా చెక్ చేస్తాడు. ఫీల్డ్ అంపైర్ చూడనప్పుడు...పైన చెప్పిన మూడురూల్స్లో ఏ ఒక్కటి బౌలర్ అతిక్రమించినా వెంటనే థర్డ్ అంపైర్ .. ఫీల్డ్ అంపైర్‌కు నోబాల్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది. మరి స్టోక్స్ వేసిన బంతులు నో బాల్స్ అని క్లియర్‌గా కనిపిస్తున్నప్పటికి అంపైర్లు ఏ చర్య తీసుకోకపోవడం ఆసక్తి కలిగించింది ఇక మ్యాచ్‌లో ఆట రెండో రోజు లంచ్ విరామం ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా 35 ఓవర్లలో వికెట్ నష్టానికి 123 పరుగులు చేసింది. వార్నర్ 56, లబుషేన్ 55 పరుగులతో ఆడుతున్నారు. Each of Ben Stokes' first four deliveries to David Warner was a no-ball 👀@copes9 | #Ashes pic.twitter.com/kcyNrYHSYr — 7Cricket (@7Cricket) December 9, 2021