డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టీమిండియాకు షాక్ తగిలింది. 444 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌కు గిల్, రోహిత్‌లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించారు. టీ విరామానికి ఒక్క ఓవర్ ముందు టీమిండియాకు ఊహించని దెబ్బ తగలిగింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో షాట్ ఆడే యత్నంలో శుబ్‌మన్ గిల్ స్లిప్‌లో ఉన్న గిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.
అయితే గిల్ ఔట్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. క్యాచ్ తీసుకునే క్రమంలో డైవ్ చేసిన గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి.. ఫోర్స్‌కు బంతిని నేలకు తాకించినట్లు కనిపించింది. దీంతో గిల్ రివ్యూకు వెళ్లాడు. అల్ట్రాఎడ్జ్‌లో కెమెరా యాంగిల్ పరిశీలించగా గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి నేలకు తాకించినట్లు కనిపించింది.
అయితే గ్రీన్ చేతి వేలు బంతి కింద ఉన్నట్లు థర్డ్‌అంపైర్ మైక్‌లో చెప్పి బిగ్ స్ర్కీన్‌పై గిల్ ఔట్ అని ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం గిల్‌తో పాటు కెప్టెన్ రోహిత్‌ను ఆశ్చర్యపరిచింది. అభిమానులు కూడా థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని విమర్శిస్తూ ట్రోల్ చేశారు. ''థర్డ్ అంపైర్ ఆసీస్ పక్షపాతిలా ఉన్నాడు.. అందుకే నాటౌట్ అని క్లియర్‌గా కనిపిస్తున్నా ఔట్ ఇచ్చాడు.. కళ్లకు గంతలు కట్టుకొని తన నిర్ణయాన్ని వెల్లడించాడు.. RIP థర్డ్ అంపైర్'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Cheating is in Blood of Australians and ICC.
— Ayush Jain (@aestheticayush6) June 10, 2023
ICC is a slave of white skinned dominance. #WTCFinal#WTCFinal2023
Ponting
Cameroon Green
Gill pic.twitter.com/zlWAgob6zN
చదవండి: WTC Final: గెలవకపోయినా పర్లేదు డ్రా చేసుకుంటే అదే గొప్ప!
Comments
Please login to add a commentAdd a comment