లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్ గిల్ ఔటైన విధానం తీవ్రదుమారం రేపుతోంది. థర్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరోపై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిల్‍ది నాటౌట్ అని అభిప్రాయపడుతున్నారు. ఇక 444 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ మంచి ఆరంభం ఇచ్చేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో గిల్ ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలండ్ బౌలింగ్‍లో కామెరూన్ గ్రీన్‍కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే గ్రీన్ పట్టిన క్యాచ్ స్పష్టంగా లేకపోవటంతో ఫీల్డ్ అంపైర్స్.. థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్‌కు క్యాచ్ ఔట్ విషయంలో క్లారిటీ లభించలేదు. ఆఖరికి గ్రీన్ చేతి వేళ్లు బంతి కింద ఉన్నాయని చెబుతూ థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. అయితే ఈ నిర్ణయంపై అభిమానులతో పాటు మాజీ క్రికెటర్‌లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ వివాదంపై నాలుగో రోజు ఆట అనంతరం కామెరూన్ గ్రీన్ స్పందించాడు. తను క్లియర్ క్యాచ్ పట్టానని గ్రీన్ చెప్పుకొచ్చాడు. "గిల్ క్యాచ్‌ను నేను సృష్టంగా పట్టుకున్నానని భావించాను. ఆ సమయంలో నేను అది క్లియర్ క్యాచ్ అనుకుని బంతి పైకి విసిరి సెలబ్రేట్ చేసుకున్నాను. నా వైపు నుంచి ఎటువంటి సందేహాలు లేవు.
కానీ తుది నిర్ణయం థర్డ్ అంపైర్‌కు వదిలేశాను. నా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఎక్కువ సమయం ఫీల్డింగ్ ప్రాక్టీస్‌కే కేటాయించేవాడిని. అదే విధంగా టెస్టుల్లో మొదటి లేదా రెండో స్లిప్‌లో ఫీల్డింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను. ఈ మ్యాచ్‌లో నేను కొన్ని మంచి క్యాచ్‌లను పట్టుకున్నాను.
కానీ రెండో రోజు ఆటలో కొన్ని సులభమైన క్యాచ్‌లను విడిచిపెట్టాను. అది నన్ను చాలా నిరాశపరిచింది. అయితే తర్వాత అంతకమించిన క్యాచ్‌లను పట్టడం చాలా సంతోషంగా ఉంది" అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్ లో గ్రీన్ పేర్కొన్నాడు.
చదవండి: WTC FINAL: ఐదో రోజు ఆట ముందు కోహ్లీ క్రిప్టిక్ పోస్ట్.. ఎందుకు చేశాడో తెలియక!
Comments
Please login to add a commentAdd a comment