
ఆర్సీబీ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో తాను వేసిన తొలి ఓవర్‌లోనే ఆ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను (19 బంతుల్లో 16; ఫోర్) బుట్టలో వేసుకున్నాడు. ఏడో ఓవర్ నాలుగో బంతికి కెమరూన్ గ్రీన్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో గిల్ పెవిలియన్‌కు చేరాడు. ఫలితంగా గుజరాత్ 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
WHAT A CATCH BY CAMERON GREEN. 🤯
- He's just Incredible on the field. 🔥 pic.twitter.com/xPQgYsyBUI— Tanuj Singh (@ImTanujSingh) April 28, 2024
ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే స్వప్నిల్ సింగ్ గుజరాత్‌ను దెబ్బ కొట్టాడు. తొలి ఓవర్ ఆఖరి బంతికి స్వప్నిల్ సాహాను (5) బోల్తా కొట్టించాడు. కర్ణ్ శర్మ క్యాచ్ పట్టడంతో సాహా పెవిలియన్ బాట పట్టాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటింగ్ నత్త నడకను తలపిస్తుంది. 9 ఓవర్ల అనంతరం ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 72 పరగులు చేసింది. సాయి సుదర్శన్ (31), షారుఖ్ ఖాన్ (15) క్రీజ్‌లో ఉన్నారు.
తుది జట్లు..
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(వికెట్‌కీపర్), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్