ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 28 మధ్యాహ్నం) జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో ఆర్సీబీ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రీఎంట్రీ ఇచ్చాడు. మ్యాక్సీ కొన్ని మ్యాచ్‌లకు ముందు ఫామ్ లేమి కారణంగా స్వతహాగా జట్టు నుంచి తప్పుకున్నాడు.
మూడు మ్యాచ్‌ల విరామం అనంతరం మ్యాక్సీ తిరిగి జట్టులోకి వచ్చాడు. మ్యాక్సీ జట్టులోకి రావడంతో ఫెర్గూసన్‌పై వేటు పడింది. ఈ ఒక్క మార్పుతో ఆర్సీబీ నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగుతుంది. మరోవైపు గుజరాత్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. ఈ మ్యాచ్ గుజరాత్ హోం గ్రౌండ్ అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది.
పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా.. గుజరాత్ 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది.
గుజరాత్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలబడాలంటే గుజరాత్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. మరోవైపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ నామమాత్రంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా ఆర్సీబీకి పెద్ద ఫరక్ పడదు.
హెడ్ టు హెడ్ ఫైట్స్ విషయానికొస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సందర్భాల్లో ఎదురెదురుపడగా.. గుజరాత్ 2, ఆర్సీబీ ఒక మ్యాచ్‌లో గెలుపొందాయి.
తుది జట్లు..
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(w), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్
Comments
Please login to add a commentAdd a comment