విల్‌ జాక్స్‌ సుడిగాలి శతకం.. గుజరాత్‌ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ | IPL 2024: Will Jacks Slams Blasting Century, RCB Beat Gujarat By 9 Wickets | Sakshi
Sakshi News home page

IPL 2024: విల్‌ జాక్స్‌ సుడిగాలి శతకం.. గుజరాత్‌ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ

Published Sun, Apr 28 2024 7:04 PM | Last Updated on Sun, Apr 28 2024 7:04 PM

IPL 2024: Will Jacks Slams Blasting Century, RCB Beat Gujarat By 9 Wickets

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ మూడో విజయం సాధించింది. ప్లే ఆఫ్స్‌ అవకాశాలు గల్లంతయ్యాక కోలుకున్న ఆర్సీబీ గుజరాత్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 28) జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

గుజరాత్‌ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. విల్‌ జాక్స్‌ (41 బంతుల్లో 100 నాటౌట్‌; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 16 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. 

జాక్స్‌ సునామీ ఇన్నింగ్స్‌ ముందు విరాట్‌ కోహ్లి (44 బంతుల్లో 79 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీ మరుగున పడింది. ఛేదనలో ఆర్సీబీకి డుప్లెసిస్‌ (12 బంతుల్లో 24; ఫోర్‌, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. 

జాక్స్‌ తానెదుర్కొన్న చివరి 13 బంతుల్లో ఏకంగా 64 పిండుకున్నాడు. మోహిత్‌ వేసిన 15వ ఓవర్‌లో 29 పరుగులు, రషీద్‌ వేసిన ఆ తర్వాతి ఓవర్‌లో 29 పరుగులు రాబట్టాడు. జాక్స్‌ దెబ్బకు గుజరాత్‌ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. డుప్లెసిస్‌ వికెట్‌ సాయికిషోర్‌కు దక్కింది.

అంతకుముందు టాస్‌ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. సాయి సుదర్శన్‌ (49 బంతుల్లో 84 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్‌ ఖాన్‌ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. 

గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో వృద్దిమాన్‌ సాహా (5), శుభ​్‌మన్‌ గిల్‌ (16) నిరాశపర్చగా.. డేవిడ్‌ మిల్లర్‌ (19 బంతుల్లో 26; 2 ఫోర్లు, సిక్స్‌) పర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్‌, మ్యాక్స్‌వెల్‌, స్వప్నిల్‌ సింగ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement