Will Jacks
-
విండీస్ ఓపెనర్ల ఊచకోత.. భారీ స్కోరు చేసినా ఇంగ్లండ్‌కు తప్పని ఓటమి
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో వెస్టిండీస్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇంగ్లిష్ జట్టు విధించిన భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి క్లీన్‌స్వీప్ గండం నుంచి బయటపడింది. కాగా స్వదేశంలో విండీస్.. బట్లర్ బృందంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది.ఇప్పటికే సిరీస్ ఇంగ్లండ్ కైవసంఇందులో భాగంగా తొలి మూడు మ్యాచ్‌లలో గెలిచిన ఇంగ్లండ్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సెయింట్ లూయీస్ వేదికగా ఆదివారం తెల్లవారుజామున నాలుగో టీ20 జరిగింది. డారెన్ సామీ జాతీయ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.బెతెల్ మెరుపు ఇన్నింగ్స్ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విల్ జాక్స్ అదిరిపోయే ఆరంభం అందించారు. సాల్ట్ 35 బంతుల్లోనే 55 (5 ఫోర్లు, 4 సిక్స్‌లు), జాక్స్ 12 బంతుల్లోనే 25 (ఒక ఫోర్ 2 సిక్సర్లు) పరుగులు చేశారు. మిగతా వాళ్లలో కెప్టెన్ జోస్ బట్లర్ (23 బంతుల్లో 38) రాణించగా.. జాకోబ్ బెతెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.ఇంగ్లండ్ భారీ స్కోరుమొత్తంగా 32 బంతులు ఎదుర్కొన్న బెతెల్ నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో సామ్ కర్రాన్ ధనాధన్ ఇన్నింగ్స్(13 బంతుల్లో 24)తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీ రెండు, అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.విండీస్ ఓపెనర్ల ఊచకోత.. విండీస్ ఇక కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆది నుంచే దుమ్ములేపింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్, షాయీ హోప్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో పరుగుల విధ్వంసం సృష్టించారు. ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ లూయీస్ సిక్సర్ల వర్షం కురిపించగా.. హోప్ బౌండరీలతో పరుగులు రాబట్టాడు.Smashed💥...platform set for the #MenInMaroon#TheRivalry | #WIvENG pic.twitter.com/KHgwBGcYbJ— Windies Cricket (@windiescricket) November 16, 2024 మెరుపు అర్ధ శతకాలులూయీస్ మొత్తంగా 31 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేయగా... హోప్ 24 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 రన్స్ స్కోరు చేశాడు. వీరిద్దరి మెరుపు అర్ధ శతకాలకు తోడు కెప్టెన్ రోవ్‌మన్ పావెల్(23 బంతుల్లో 38), షెర్ఫానే రూథర్‌ఫర్డ్(17 బంతుల్లో 29 నాటౌట్)కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడారు.How good was @shaidhope tonight?🏏🌟#TheRivalry | #WIvENG pic.twitter.com/MkfP5wE7U7— Windies Cricket (@windiescricket) November 16, 2024 19 ఓవర్లలోనేఫలితంగా 19 ఓవర్లలోనే వెస్టిండీస్ టార్గెట్‌ను పూర్తి చేసింది. ఐదు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసి ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్ మూడు, జాన్ టర్నర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ధనాధన్ హాఫ్ సెంచరీతో అలరించిన షాయీ హోప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. వన్డే సిరీస్ విండీస్దేకాగా తొలుత ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచిన వెస్టిండీస్.. టీ20 సిరీస్‌ను మాత్రం కోల్పోయింది. అయితే, వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకుని పర్యాటక జట్టు ఆధిక్యాన్ని 3-1కు తగ్గించింది. ఇరుజట్ల మధ్య భారత కాలమానం ప్రకారం సోమవారం వేకువజామున(ఉదయం 1.20 నిమిషాలకు) ఐదో టీ20 జరుగనుంది.చదవండి: నాకు కాదు.. వాళ్లకు థాంక్యూ చెప్పు: తిలక్ వర్మతో సూర్య -
ఐపీఎల్ నుంచి స్వదేశానికి...
న్యూఢిల్లీ: ఐపీఎల్లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగింపు దశకు చేరగా... ఆయా జట్లకు కీలకమైన ఇంగ్లండ్ ఆటగాళ్లు తిరుగుపయనమయ్యారు. జోస్ బట్లర్ (రాజస్తాన్), లివింగ్‌స్టోన్ (పంజాబ్ కింగ్స్), విల్ జాక్స్, రీస్ టాప్లీ (బెంగళూరు)లు ఇంగ్లండ్‌కు బయలుదేరారు. వచ్చే నెల 2 నుంచి అమెరికా, వెస్టిండీస్‌లలో జరిగే టి20 ప్రపంచకప్‌కు తుది సన్నాహంగా సొంతగడ్డపై ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్‌తో టి20 సిరీస్ ఆడనుంది.మే 22 నుంచి ఇరు జట్ల మధ్య నాలుగు టి20ల సిరీస్ జరుగుతుంది. 22, 25, 28, 30 తేదీల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. కాగా... ఈ ఐపీఎల్ సీజన్లో లివింగ్‌స్టోన్ ఆకట్టుకోలేకపోయాడు. బట్లర్ రాజ స్టాన్ స్టార్ ఓపెనర్. ఈ సీజన్లో ఒంటిచేత్తో కొన్ని మ్యాచ్‌ల్ని గెలిపించాడు. బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జాక్స్, టాప్లీలలో జాక్స్ది కీలకపాత్ర. బెంగళూరు వరుస విజయాల్లో భాగమైన అతను లేకపోవడం జట్టుకు లోటే! చివరి లీగ్ మ్యాచ్‌లో బెంగళూరు... చెన్నైతో ఈ నెల 18న తలపడుతుంది.ఇవి చదవండి: మళ్లీ హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి?.. కొట్టిపారేయలేం! -
ఢిల్లీపై ఆర్సీబీ ఘన విజయం.. వరుసగా ఐదో గెలుపు
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి గెలుపు జెండా ఎగురవేసింది. 47 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది.టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించింది. అయితే, మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆర్సీబీ బౌలర్లు ఆరంభంలోనే చుక్కలు చూపించారు.యశ్ దయాల్ మూడు వికెట్లతో చెలరేగగా.. ఫెర్గూసన్ రెండు, స్వప్నిల్, సిరాజ్, గ్రీన్ ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో ఢిల్లీని 140 పరుగులకే ఆలౌట్ చేసిన ఆర్సీబీ విజయం సాధించింది.ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ స్కోర్లు👉వేదిక: చిన్నస్వామి స్టేడియం.. బెంగళూరు👉టాస్: ఢిల్లీ.. బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 187/9 (20)👉ఢిల్లీ స్కోరు: 140 (19.1)👉ఫలితం: 47 పరుగుల తేడాతో ఢిల్లీపై ఆర్సీబీ గెలుపురాణించిన విల్ జాక్స్, పాటిదార్.. ఆర్సీబీ స్కోరు ఎంతంటే! ఐపీఎల్- 2024 ప్లే ఆఫ్స్ రేసులో భాగంగా మరో రసవత్తర సమరం జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతోంది.సొంతమైదానంలో టాస్ ఓడిన ఆర్సీబీ.. ఢిల్లీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లి(13 బంతుల్లో 27) ధాటిగా ఆరంభించగా.. మరో ఓపెనర్, కెప్టెన్ డుప్లెసిస్(6) మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు.ఈ క్రమంలో విల్ జాక్స్(29 బంతుల్లో 41), రజత్ పాటిదార్ (32 బంతుల్లో 52) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నారు. వీరికి తోడు ఐదో నంబర్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్(24 బంతుల్లో 32 పరుగులు నాటౌట్) కూడా రాణించాడు.అయితే, లోయర్ ఆర్డర్ మహిపాల్ లామ్రోర్(13) ఒక్కడు డబుల్ డిజిట్ స్కోరు చేయగా.. దినేశ్ కార్తిక్, స్వప్నిల్ సింగ్ డకౌట్ అయ్యారు. కరణ్ శర్మ ఆరు పరుగులు చేసి రనౌట్ కాగా.. మహ్మద్ సిరాజ్ పరుగుల ఖాతా తెరవకుండానే రనౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 187 పరుగులు స్కోరు చేసింది.ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రసిఖ్ దార్ సలాం రెండేసి వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. -
జాక్స్ ధమాకా...
బెంగళూరు గెలిచేందుకు 6 ఓవర్లలో 53 పరుగులు చేయాలి. కోహ్లి 69 పరుగులతో... విల్ జాక్స్ 44 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక్కడ సెంచరీ అయితే గియితే కోహ్లిదే అవుతుంది లేదంటే లేదు! కానీ ఎవరూ ఊహించని విధంగా జాక్స్ రెండే ఓవర్లలో సెంచరీ పూర్తి చేశాడు. మోహిత్ శర్మ వేసిన 15వ ఓవర్లో జాక్స్ 4, 6, నోబాల్ 6, 2, 6, 4, 0లతో 29 పరుగులు సాధించాడు. రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో తొలి బంతికి కోహ్లి ఒక పరుగు తీసి జాక్స్‌కు స్ట్రయిక్ ఇచ్చాడు. జాక్స్ వరుసగా 6, 6, 4, 6, 6లతో 28 పరుగులు పిండుకొని సంచలన శతకం సాధించి అబ్బురపరిచాడు. జాక్స్ 29 బంతుల్లో 44 పరుగులు చేయగా... ఆ తర్వాత 12 బంతుల్లో ఏకంగా 56 పరుగులు సాధించి సెంచరీ మైలురాయిని అందుకోవడం విశేషం. అహ్మదాబాద్: మళ్లీ బౌలర్ డీలా... బంతేమో విలవిల... బ్యాట్ భళా! అంతే మరో 200 పైచిలుకు స్కోరు... దీన్ని 16 ఓవర్లలోనే ఛేదించిన తీరు చూస్తుంటే ఈ వేసవి వడగాడ్పులతో వేడెక్కించడమే కాదు... ఐపీఎల్ సిక్సర్లతో కిక్ ఎక్కిస్తోంది! ప్లే ఆఫ్స్ రేసుకు దాదాపు దూరమనుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇంటాబయటా పరుగుల హోరెత్తిస్తోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై జయభేరి మోగించింది. 201 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఉఫ్‌మని ఊదేసింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీస్కోరు చేసింది. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), షారుఖ్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగారు. అనంతరం ఆర్సీబీ 16 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 206 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ జాక్స్ (41 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (44 బంతుల్లో 70 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) సిక్సర్లతో హోరెత్తించారు. జాక్స్ 2 ఓవర్ల విధ్వంసంతో... కోహ్లితో ఛేదన ప్రారంభించిన డుప్లెసిస్ (12 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్స్‌లు) నాలుగో ఓవర్లో నిష్క్రమించాడు. సాయికిశోర్ వేసిన ఆ ఓవరే వికెట్ దక్కించుకుంది. ఆ తర్వాత ఎవరూ బౌలింగ్‌కు దిగినా... పరుగులు, ఈ దశ దాటి మెరుపులు... దాన్ని మించి ఉప్పెనే! పవర్‌ప్లేలో బెంగళూరు 63/1 స్కోరు చేసింది. సగం ఓవర్లు ముగిసేసరికి 98/1 అంటే వంద కూడా చేయని జట్టు ఇంకో 6 ఓవర్లు ముగిసేసరికే 108 పరుగుల్ని చేసి మ్యాచ్‌నే ముగించింది. కోహ్లి 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నప్పుడు జాక్స్ 16 బంతుల్లో 16 పరుగులే చేశాడు. 14 ఓవర్లలో బెంగళూరు స్కోరు 148/1. ఈ దశలో మోహిత్ వేసిన 15వ ఓవర్లో, రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో జాక్స్ విశ్వరూపం ప్రదర్శించడంతో ఆర్సీబీ 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించి విజయతీరానికి చేరింది.స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) కరణ్ శర్మ (బి) స్వప్నిల్ 5; గిల్ (సి) గ్రీన్ (బి) మ్యాక్స్‌వెల్ 16; సుదర్శన్ (నాటౌట్) 84; షారుఖ్ (బి) సిరాజ్ 58; మిల్లర్ (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–6, 2–45, 3–131. బౌలింగ్: స్వప్నిల్ 3–0–23–1, సిరాజ్ 4–0–34–1, యశ్ దయాళ్ 4–0–34–0, మ్యాక్స్‌వెల్ 3–0–28–1, కరణ్ శర్మ 3–0–38–0, గ్రీన్ 3–0–42–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (నాటౌట్) 70; డుప్లెసిస్ (సి) సబ్–శంకర్ (బి) సాయికిశోర్ 24; విల్ జాక్స్ (నాటౌట్) 100; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (16 ఓవర్లలో వికెట్ నష్టానికి) 206. వికెట్ల పతనం: 1–40. బౌలింగ్: అజ్మతుల్లా 2–0–18–0, సందీప్ 1–0–15–0, సాయికిశోర్ 3–0–30–1, రషీద్ ఖాన్ 4–0–51–0, నూర్ అహ్మద్ 4–0–43–0, మోహిత్ 2–0–41–0. ఐపీఎల్లో నేడుకోల్‌కతా X ఢిల్లీ వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
విల్ జాక్స్ విధ్వంసకర సెంచరీ.. 10 సిక్స్‌లతో! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు విల్ జాక్స్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 201 పరుగుల భారీ లక్ష్య చేధనలో జాక్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గుజరాత్ బౌలర్లను జాక్స్ ఊచకోత కోశాడు. ఈ క్రమంలో కేవలం 41 బంతుల్లోనే జాక్స్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. జాక్స్‌కు ఇది తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న జాక్స్.. 5 ఫోర్లు, 10 సిక్స్‌లతో 100 పరుగులతో ఆజేయంగా నిలిచింది. జాక్స్ విధ్వంసం ఫలితంగా 201 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 16 ఓవర్లలో ఊదిపడేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో జాక్స్‌తో పాటు కోహ్లి(70 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక మ్యాచ్‌లో సెంచరీ మెరిసిన జాక్స్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా జాక్స్ నిలిచాడు. ఈ జాబితాలో విండీస్ లెజెండ్ క్రిస్ గేల్ తొలి స్ధానంలో ఉన్నాడు. 2013 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరపున గేల్.. పుణే వారియర్స్‌పై కేవలం 30 బంతుల్లోనే గేల్ శతకం సాధించాడు. ఆ తర్వాతి స్ధానాల్లో యూసఫ్ పఠాన్(37 బంతులు ), డేవిడ్ మిల్లర్(38 బంతులు ), ట్రవిస్ హెడ్(39 బంతులు ), విల్‌జాక్స్(41 బంతులు ) ఉన్నారు. అదే విధంగా ఆర్సీబీ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా జాక్స్ రికార్డులకెక్కాడు. -
విల్ జాక్స్ సుడిగాలి శతకం.. గుజరాత్‌ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ మూడో విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతయ్యాక కోలుకున్న ఆర్సీబీ గుజరాత్‌తో ఇవాళ (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. విల్ జాక్స్ (41 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 16 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జాక్స్ సునామీ ఇన్నింగ్స్ ముందు విరాట్ కోహ్లి (44 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ మరుగున పడింది. ఛేదనలో ఆర్సీబీకి డుప్లెసిస్ (12 బంతుల్లో 24; ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. జాక్స్ తానెదుర్కొన్న చివరి 13 బంతుల్లో ఏకంగా 64 పిండుకున్నాడు. మోహిత్ వేసిన 15వ ఓవర్లో 29 పరుగులు, రషీద్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో 29 పరుగులు రాబట్టాడు. జాక్స్ దెబ్బకు గుజరాత్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. డుప్లెసిస్ వికెట్ సాయికిషోర్‌కు దక్కింది.అంతకుముందు టాస్ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో వృద్దిమాన్ సాహా (5), శుభ్‌మన్ గిల్ (16) నిరాశపర్చగా.. డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 26; 2 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్‌వెల్, స్వప్నిల్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. -
ఆల్‌రౌండ్ షోతో ఇరగదీసిన మొయిన్ అలీ.. హ్యాట్రిక్ సహా..!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో (బీపీఎల్) కొమిల్లా విక్టోరియన్స్ ఆటగాడు, ఇంగ్లండ్ ప్లేయర్ మొయిన్ అలీ ఆల్‌రౌండ్ షోతో ఇరగదీశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత మెరుపు అర్ధశతకంతో విరుచుకుపడిన మొయిన్ (24 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు).. ఆతర్వాత హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు (3.3-0-23-4) తీసి విక్టోరియన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొయిన్‌తో పాటు సహచర ఆటగాడు విల్ జాక్స్ (53 బంతుల్లో 108 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) సునామీ శతకంతో వీరంగం సృష్టించడంతో విక్టోరియన్స్ 73 పరుగుల తేడాతో చట్టోగ్రామ్ ఛాలెంజర్స్‌పై విజయం సాధించింది. బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో మొయిన్ సాధించిన హ్యాట్రిక్ ఎనిమిదవది. మొయిన్ హ్యాట్రిక్ వికెట్లతో మ్యాచ్‌కు ముగించాడు. Moeen Ali scored a fifty and took a hat-trick in the BPL match. 🤯pic.twitter.com/yIGVsgU9Lh — Mufaddal Vohra (@mufaddal_vohra) February 13, 2024 శతక్కొట్టిన విల్ జాక్స్.. మెరుపు అర్దశతకంతో విరుచుకుపడిన మొయిన్ అలీ తొలుత బ్యాటింగ్ చేసిన కొమిల్లా విక్టోరియన్స్ జాక్స్, మొయిన్ విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 239 పరుగుల భారీ స్కోర్ చేసింది. విక్టోరియన్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ లిటన్ దాస్ (31 బంతుల్లో 60; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా అర్ధసెంచరీతో మెరిశాడు. తిప్పేసిన మొయిన్, రిషద్ హొసేన్. 240 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఛాలెంజర్స్.. మొయిన్ అలీ, రిషద్ హొసేన్ (4-0-22-4) మాయాజాలం ధాటికి 166 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. ముస్తాఫిజుర్ 2 వికెట్లు తీసి విక్టోరియన్స్ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఛాలెంజర్స్ ఇన్నింగ్స్‌లో తంజిద్ హసన్ (41), సైకత్ అలీ (36), జోష్ బ్రౌన్ (36) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
ఓ పక్క రసెల్ ఊచకోత.. మరో పక్క విల్ జాక్స్ శతక్కొట్టుడు
పొట్టి ఫార్మాట్లో ఇవాళ (ఫిబ్రవరి 13) రెండు ధమాకా ఇన్నింగ్స్‌లు క్రికెట్ అభిమానులకు కనువిందు చేశాయి. వీటితో పాటు మరో రెండు మెరుపు ఇన్నింగ్స్‌లు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో వెస్టిండీస్ విధ్వంసకర యోధుడు ఆండ్రీ రసెల్ సుడిగాలి అర్ధశతకంతో (29 బంతుల్లో 71; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) రచ్చ చేయగా.. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కొమిల్లా విక్టోరియన్స్‌కు ఆడుతున్న ఇంగ్లండ్ మెరుపు వీరుడు విల్ జాక్స్ (53 బంతుల్లో 108 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) సిక్సర్ల సునామీ సృష్టించి శతక్కొట్టాడు. వీరిద్దరికి సహచరులు షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (40 బంతుల్లో 67 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మొయిన్ అలీ (24 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) తోడవ్వడంతో వారివారి జట్లు భారీ స్కోర్లు నమోదు చేశాయి. ఆసీస్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. రసెల్, రూథర్‌పోర్డ్ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేయగా.. చట్టోగ్రామ్ ఛాలెంజర్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కొమిల్లా విక్టోరియన్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 239 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో సెకెండ్ ఇన్నింగ్స్లె కొనసాగుతున్నాయి. -
విల్ జాక్స్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా డర్బన్ సూపర్ జెయింట్స్‌తో నిన్న (జనవరి 18) జరిగిన మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ ఓపెనర్, ఇంగ్లండ్ ఆటగాడు విల్ జాక్స్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో జాక్స్ కేవలం 41 బంతుల్లోనే 8 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో శతక్కొట్టి, లీగ్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. జాక్స్ రెచ్చిపోవడంతో ఈ మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో విజయం సాధించి, సీజన్ తొలి విజయాన్ని నమోదు చేసింది. Will Jacks is the King of Centurion 👑#Betway #SA20 #WelcomeToIncredible #PCvDSG pic.twitter.com/TvhnZcI3DN — Betway SA20 (@SA20_League) January 18, 2024 తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. జాక్స్ శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో జాక్స్‌తో పాటు కొలిన్ ఇంగ్రామ్ (23 బంతుల్లో 43), ఫిలిప్ సాల్ట్ (13 బంతుల్లో 23) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సూపర్ జెయింట్స్ బౌలర్లలో రీస్ టాప్లే (4-1-34-3) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. జూనియర్ డాలా 2, కేశవ్ మహారాజ్, మార్కస్ స్టోయినిస్, కీమో పాల్, ప్రిటోరియస్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో తడబడిన సూపర్ జెయింట్స్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 187 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. బ్యాట్‌తో విజృంభించిన విల్ జాక్స్.. బంతితోనూ (3-0-18-2) రాణించాడు. అతనితో పాటు వేన్ పార్నెల్ (2/54), విల్యోన్ (2/39), నీషమ్ (1/28) వికెట్లు తీశారు. సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ బ్రీట్జ్కీ (33) టాప్ స్కోరర్‌గా నిలువగా.. డికాక్ (25), స్మట్స్ (27), కేశవ్ మహారాజ్ (25 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
హ్యారీ బ్రూక్ ఊచకోత.. ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు
హండ్రెడ్ లీగ్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదైంది. నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ ఆటగాడు, ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ఈ ఫీట్ సాధించాడు. వెల్ష్ ఫైర్‌తో నిన్న (ఆగస్ట్ 22) జరిగిన మ్యాచ్‌లో బ్రూక్ 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. హండ్రెడ్ లీగ్ హిస్టరీలోనే ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. బ్రూక్ తన ఇన్నింగ్స్‌లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేశాడు. కేవలం ముగ్గురు మాత్రమే.. హండ్రెడ్ లీగ్‌లో చరిత్రలో (పురుషుల ఎడిషన్‌లో) ఇప్పటివరకు కేవలం ముగ్గురు మాత్రమే సెంచరీ మార్కును అందుకోగా.. బ్రూక్‌దే ఫాస్టెప్ట్ సెంచరీగా రికార్డైంది. 2022 సీజన్లో విల్ జాక్స్ (47 బంతుల్లో) (48 బంతుల్లో 108 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్సర్లు), విల్ స్మీడ్ (49 బంతుల్లో) (50 బంతుల్లో 101 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీలు చేయగా, బ్రూకే అతి తక్కువ బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. హండ్రెడ్ లీగ్‌లో అత్యధిక స్కోర్.. హండ్రెడ్ లీగ్‌లో బ్రూక్ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసినప్పటికీ, ఈ లీగ్‌లో అత్యధిక స్కోర్ (ఏకైక సెంచరీ) రికార్డు మాత్రం మహిళా క్రికెటర్ పేరిట నమోదై ఉంది. ప్రస్తుత సీజన్లో వెల్ష్ ఫైర్ ప్లేయర్ ట్యామీ బేమౌంట్ ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 బంతుల్లో 20 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేసింది. ఓవరాల్‌గా హండ్రెడ్ లీగ్‌లో ఇదే అత్యుత్తమ స్కోర్‌గా రికార్డైంది. Every. Ball. Counts. Harry Brook has done it 💥#TheHundred pic.twitter.com/iCC6FbKVkG — The Hundred (@thehundred) August 22, 2023 బ్రూక్ సెంచరీ వృధా.. వెల్ష్ ఫైర్‌పై బ్రూక్ ఫాస్టెస్ట్ సెంచరీతో విరుచుకుపడినా ప్రయోజనం లేకుండా పోయింది. అతను ప్రాతినిథ్యం వహించిన నార్త్రన్ సూపర్ ఛార్జర్స్.. వెల్ష్ ఫైర్ చేతిలో ఓటమిపాలై లీగ్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ ఛార్జర్స్.. బ్రూక్ శతక్కొట్టడంతో నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. సూపర్ ఛార్జర్స్ ఇన్నింగ్స్‌లో బ్రూక్ (మూడంకెల స్కోర్), ఆడమ్ హోస్ (15) మినహా మిగతావారు కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. వెల్ష్ ఫైర్ బౌలర్లలో డేవిడ్ విల్లీ 2, మ్యాట్ హెన్రీ, డేవిడ్ పెయిన్, వాన్ డర్ మెర్వ్, వెల్స్ తలో వికెట్ పడగొట్టారు. What a knock! 💥 Stephen Eskinazi scored the third-fastest fifty of the men's competition. 👏#TheHundred pic.twitter.com/pJqc1hXspG — The Hundred (@thehundred) August 23, 2023 విధ్వంసం సృష్టించిన వెల్ష్ ఫైర్ ప్లేయర్లు.. 159 పరుగుల లక్ష్య ఛేదనలో వెల్ష్ ఫైర్ ప్లేయర్లు విధ్వంసం సృష్టించారు. స్టెఫెన్ ఎస్కినాజీ (28 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో (39 బంతుల్లో 44; ఫోర్, 3 సిక్సర్లు), జో క్లార్క్ (22 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి, తమ జట్టును 90 బంతుల్లోనే (2 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా వెల్ష్ ఫైర్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్రూక్ విధ్వంసకర శతకం బూడిదలో పోసిన పన్నీరైంది. -
రసవత్తర పోరు.. ఆఖర్లో హైడ్రామా.. ఎట్టకేలకు గెలిపించిన సామ్ కర్రన్
హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా లండన్ స్పిరిట్‌తో నిన్న (ఆగస్ట్ 15) జరిగిన రసవత్తర పోరులో ఓవల్ ఇన్విన్సిబుల్స్ స్వల్ప తేడాతో గటెక్కింది. ఇన్విన్సిబుల్స్ నిర్ధేశించిన లక్ష్యానికి లండన్ స్పిరిట్ 3 పరుగుల దూరంలో నిలిచిపోయి, ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇన్విన్సిబుల్స్ నిర్ణీత 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (18 బంతుల్లో 23; 2 ఫోర్లు, సిక్స్), విల్ జాక్స్ (42 బంతుల్లో 68; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (24 బంతుల్లో 46 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు), సామ్ కర్రన్ (17 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. లండన్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్, డారిల్ మిచెల్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లండన్ టీమ్.. ఆఖరి బంతి వరకు పోరాడి స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. సామ్ కర్రన్ వేసిన 98వ బంతిని క్రిచ్లీ సిక్సర్ బాది లండన్ గెలుపుపై ఆశలు చిగురింపజేయగా.. ఆఖరి బంతికి డాట్ బాల్ వేసి సామ్ కర్రన్ లండన్ విజయావకాశాలపై నీళ్లు చల్లాడు. ఈ మధ్యలో పెద్ద డ్రామా జరిగింది. లండన్ 2 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన దశలో వైట్లీ అద్భుతమైన ఫీల్డింగ్‌తో బౌండరీకి వెళ్లాల్సిన బంతిని అడ్డుకుని 2 పరుగులు సేవ్ చేయగా, ఆఖరి బంతిని కర్రన్ నో బాల్ వేసి మళ్లీ లండన్ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. ఈ బంతికి క్రిచ్లీ రెండు పరుగు రాబట్టడంతో పాటు నో బాల్ ఫలితంగా లండన్‌కు అదనంగా మరో పరుగు, ఫ్రీ హిట్ లభించాయి. దీంతో ఆఖరి బంతికి 3 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సామ్ కర్రన్ ఆఖరి బంతిని అద్భుతమై యార్కర్‌గా సంధించడంతో లండన్ గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. ఫలింతగా ఇన్విన్సిబుల్స్ రసవత్తర పోరులో విజయం సాధించింది. లండన్ ఇన్నింగ్స్‌లో ఆడమ్ రొస్సింగ్టన్ (61) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఆఖర్లో మాథ్యూ క్రిచ్లీ (13 బంతుల్లో 32 నాటౌట్) ఇన్విన్సిబుల్స్ ఆటగాళ్లకు చమటలు పట్టించాడు. ఇన్విన్సిబుల్స్ బౌలర్లలో విల్ జాక్స్, ఆడమ్ జంపా చెరో 2 వికెట్లు పడగొట్టగా.. జాక్ చాపెల్, సామ్ కర్రన్, నాథన్ సౌటర్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఐదు బంతుల్లో 5 సిక్సర్లు బాదిన ఆర్సీబీ స్టార్
సాధారణంగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొడితే ప్రపంచ రికార్డుగా పరిగణిస్తారు. అదే ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొడితే దానిని సంచలనం అంటారు. అలాంటి సంచలనం విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో నమోదైంది. సర్రీ బ్యాటర్ విల్ జాక్స్ మిడిలెసెక్స్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను నమోదు చేశాడు.45 బంతుల్లో 8 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 96 పరుగులు చేసిన జాక్స్ నాలుగు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. కానీ తన మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న విల్ జాక్స్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన హోల్మన్కు చుక్కలు చూపించాడు. ఓవర్ తొలి బంతిని డీప్ మిడ్‌వికెట్ మీదుగా.. రెండో బంతిని స్ట్రెయిట్ వికెట్ మీదుగా.. మేడో బంతిని లాంగాన్ మీదుగా.. నాలుగో బంతిని డీప్ ఎక్స్ట్రా కవర్స్ మీదుగా.. ఐదో బంతిని మరోసారి లాంగాన్ మీదుగా తరలించాడు. ఆఖరి బంతిని కూడా సిక్సర్ బాదే ప్రయత్నం చేసినప్పటికి కేవలం సింగిల్ మాత్రమే రావడంతో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల ఫీట్ మిస్సయింది. అయితే విల్ జాక్స్ మెరుపు ఇన్నింగ్స్ సర్రీని ఓటమి నుంచి తప్పించలేకపోయింది. 252 పరుగులు చేసిన సర్రీ జట్టు.. టార్గెట్‌ను కాపాడుకోలేకపోయింది. మిడిలెసెక్స్ జట్టు మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 254 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. టి20 చరిత్రలో రెండో అత్యధిక పరుగుల టార్గెట్‌ను చేధించిన జట్టుగా మిడిలెసెక్స్ చరిత్ర సృష్టించింది. ఇక ఐపీఎల్లో విల్ జాక్స్ ఆర్సీబీ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. 6 6 6 6 6 🔥 Absolutely brutal 🫣 from Will Jacks 🏏#Blast23 pic.twitter.com/B0l9QWqS13 — FanCode (@FanCode) June 22, 2023 చదవండి: సస్పెన్షన్ వేటు.. బౌలర్‌కు షాకిచ్చిన ఐసీసీ -
కసితీరా బాదారు.. టి20 చరిత్రలో రెండో అత్యధిక పరుగుల ఛేదన
తుఫాను వచ్చేముందు ప్రశాంతత ఉంటుందంటారు. అయితే ఒక్కసారి వర్షం మొదలయ్యాకా వచ్చే ఉరుములు, మెరుపులు మనల్ని ఉలికిపాటుకు గురి చేస్తాయి. అచ్చం అలాంటి తుఫాను ఇన్నింగ్స్ టి20 బ్లాస్ట్ 2023 టోర్నీలో నమోదైంది. కొడితే సిక్సర్.. లేదంటే బౌండరీ అనేలా స్టేడియం పరుగుల జడివానలో తడిసి ముద్దయింది. టోర్నీలో భాగంగా సౌత్ గ్రూప్‌లో ఉన్న సర్రీ, మిడిలెసెక్స్ మధ్య మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి.. సర్రీ జట్టు విధించిన 253 పరుగుల భారీ టార్గెట్‌ను మిడిలెసెక్స్ ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే చేధించడం విశేషం. ఇరుజట్లలో ఎవరు సెంచరీలు చేయకపోయినప్పటికి సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డారు. మ్యాచ్‌లో మొత్తంగా 52 బౌండరీలు, 24 సిక్సర్లు నమోదయ్యాయి. టి20 బ్లాస్ట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించిన తొలి జట్టుగా మిడిలెసెక్స్ చరిత్ర సృష్టించగా.. ఓవరాల్‌గా టి20 చరిత్రలో ఇది రెండో అత్యధిక లక్ష్య చేధన కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన సర్రీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 252 పరుగుల భారీ స్కోరు చేసింది. విల్ జాక్స్ (45 బంతుల్లో 96 పరుగులు, 8 ఫోర్లు, 7 సిక్సర్లు) నాలుగు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. లారి ఎవన్స్ (37 బంతుల్లో 85 పరుగులు, 9 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు మినహా మిగతావారి నుంచి పెద్దగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు రాలేదు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన మిడిలెసెక్స్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. వచ్చినోళ్లు వచ్చినట్లు కసితీరా బాదారు. తొలుత ఓపెనర్లు స్టీఫెన్ ఎస్కినాజి(39 బంతుల్లో 73 పరుగులు, 13 ఫోర్లు, ఒక సిక్సర్), జో క్రాక్నెల్(16 బంతుల్లో 36 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మాక్స్ హోల్డన్(35 బంతుల్లో 68 నాటౌట్, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రియాన్ హిగ్గిన్స్(24 బంతుల్లో 48 పరుగులు) విధ్వంసం సృష్టించగా.. ఆఖర్లో జాక్ డేవిస్ 3 బంతుల్లో 11 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. Utterly extraordinary 😲@Middlesex_CCC had lost their previous 14 Blast matches and have just chased down 253 🤯#Blast23 pic.twitter.com/NxeweZyKOh — Vitality Blast (@VitalityBlast) June 22, 2023 చదవండి: 'గిల్ క్యాచ్' పునరావృతం.. ఈసారి అన్యాయమే గెలిచింది! -
IPL 2023: కివీస్ ఆల్‌రౌండర్ ఎంట్రీ.. ప్రకటించిన ఆర్సీబీ! ధర ఎంతంటే
IPL 2023- RCB- Michael Bracewell: న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ ఐపీఎల్-2023 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఇంగ్లండ్ బ్యాటర్ విల్ జాక్స్ స్థానంలో బ్రేస్‌వెల్ ఆర్సీబీకి ఆడనున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ మేనేజ్మెంట్ ధ్రువీకరించింది. ఇందుకు సంబంధించి శనివారం ప్రకటన విడుదల చేసింది. ‘‘ఐపీఎల్-2023లో విల్ జాక్స్ స్థానాన్ని న్యూజిలాండ్‌కు చెందిన మైకేల్ బ్రేస్‌వెల్ భర్తీ చేయనున్నాడు. 32 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ కివీస్ భారత పర్యటనలో టీ20 సిరీస్‌లో టాప్ వికెట్ టేకర్. అదే విధంగా వన్డే మ్యాచ్‌లో 140 పరుగులతో అద్భుత పోరాటపటిమ కనబరిచాడు’’ అంటూ బ్రేస్‌వెల్‌కు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో అతడి ఫొటో షేర్ చేసింది. లేట్ ఎంట్రీ.. అయినా.. కాగా ఎడమచేతి వాటం గల బ్యాటర్, రైట్ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ అయిన బ్రేస్‌వెల్ కివీస్ తరఫున 16 టీ20లు ఆడి 113 పరుగులు చేశాడు. అదే విధంగా 21 వికెట్లు తీశాడు. నెదర్లాండ్స్‌తో వన్డేతో 2022లో 31 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ ఆల్‌రౌండర్.. ఈ ఏడాది మార్చి ఆరంభంలో చివరిసారిగా శ్రీలంకతో టెస్టు ఆడాడు. ఇదిలా ఉంటే.. విల్ జాక్స్‌ను ఆర్సీబీ 3.2 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. అయితే, గాయం కారణంగా అతడు దూరం కావడంతో బ్రేస్‌వెల్‌కు అవకాశం ఇచ్చింది. కనీస ధర కోటితో వేలంలో తన పేరు నమోదు చేసుకున్న బ్రేస్‌వెల్‌ను అదే ధరతో ఆర్సీబీ సొంతం చేసుకోనుంది. కాగా బ్రేస్‌వెల్‌కు ఇదే తొలి ఐపీఎల్ సీజన్ కావడం విశేషం. ఇక ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌తో ఆర్సీబీ ఈ ఏడాది తమ ప్రయాణాన్ని ఆరంభించనుంది. చదవండి: IND Vs AUS: ఏంటి హార్దిక్ ఇది.. సీనియర్లకు ఇచ్చే విలువ ఇదేనా? పాపం కోహ్లి! వీడియో వైరల్ Ravindra Jadeja: నా దృష్టిలో నిజమైన హీరో జడేజానే! నువ్వేనా ఈ మాట అన్నది? నిజమా! 🔊 ANNOUNCEMENT 🔊 Michael Bracewell of New Zealand will replace Will Jacks for #IPL2023. The 32-year-old all-rounder was the top wicket taker for Kiwis during the T20I series in India, and scored a fighting 140 in an ODI game. 🙌#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/qO0fhP5LeY — Royal Challengers Bangalore (@RCBTweets) March 18, 2023 -
ఆర్సీబీలోకి విధ్వంసకర ఆల్‌రౌండర్.. ఇక ప్రత్యర్ది బౌలర్లకు చుక్కలే!
ఐపీఎల్-2023 సీజన్‌కు ఆరంభానికి ముందు రాయల్ ఛాలంజర్స్ బెంగళూరుకు మరో బిగ్ షాక్ తగిలింది. వేలంలో రూ.3.2 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన ఇంగ్లీష్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ మోకాలి గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా గాయపడ్డ జాక్స్.. సిరీస్ మధ్యలోనే స్వదేశానికి పయనమయ్యాడు. అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టనున్నట్లు ఈసీబీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే అతడు ఐపీఎల్ 16వ సీజన్‌కు దూరమయ్యాడు. ఆర్సీబీలోకి మైఖేల్ బ్రేస్‌వెల్.. ఇక విల్ జాక్స్ స్థానాన్ని న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్‌తో భర్తీ చేయాలని ఆర్సీబీ మెనెజెమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బ్రేస్‌వెల్‌తో ఆర్సీబీ సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. కాగా బ్రెస్‌వెల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో కివీస్ భారత పర్యటనలో భాగంగా బ్రేస్‌వెల్ అద్భుతంగా రాణించాడు. హైదరాబాద్ వేదికగా టీమిండియా జరిగిన తొలి వన్డేలో బ్రెస్‌వెల్.. కేవలం 78 బంతుల్లోనే 140 పరుగులు సాధించి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అదే విధంగా బంతితో కూడా బ్రెస్‌వెల్ అకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే బ్రేస్‌వెల్‌పై ఆర్సీబీ కన్నేసింది. కాగా మార్చి 31 నుంచి ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుంది. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. ఫీల్డింగ్ కోచ్‌గా మారిన ద్రవిడ్! వీడియో వైరల్ -
ఐపీఎల్‌కు ముందు బెంగళూరుకు బిగ్ షాక్.. రూ.3 కోట్ల ఆటగాడు దూరం!
ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్లో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. గతేడాది డిసెంబర్లో కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో జాక్స్‌ను రూ.3.2 కోట్ల భారీ ధరకు జాక్స్‌ను కొనుగోలు చేసింది. కాగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా జాక్స్ ఎడమకాలికి గాయమైంది. దీంతో అతడు బంగ్లాదేశ్ పర్యటనలో మధ్యలోనే స్వదేశానికి పయనమయ్యాడు. అతడు బంగ్లాతో ఆఖరి వన్డేతో పాటుగా టీ20 సిరీస్ నుంచి కూడా తప్పుకున్నాడు. అతడు ఇంగ్లండ్‌కు చేరుకున్నాక లండన్‌లో పునరావసం పొందనున్నట్లు ఈసీబీ అధికారి ఒకరు పేర్కొన్నారు. అదే విధంగా అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు ఈసీబీ వర్గాలు వెల్లడించాయి.ఈ నేపథ్యంలోనే అతడు మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా విల్ జాక్స్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా టీ20ల్లో అయితే దుమ్ము రేపుతున్నాడు. ఇటీవలే ముగిసిన దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. తన ఆల్‌రౌండ్ స్కిల్స్‌తో అందరిని అకట్టుకున్నాడు. ఒక వేళ విల్‌జాక్స్ ఐపీఎల్‌కు అందుబాటులో లేకపోతే ఆర్సీబీ జట్టుకు గట్టి ఎదురుదెబ్బే అని చేప్పుకోవాలి. మరోవైపు గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ కూడా ఐపీఎల్ అందుబాటుపై సందిగ్ధం నెలకొంది. ఒక వేళ హాజిల్‌వుడ్ కూడా ఐపీఎల్‌కు దూరమైతే ఆర్సీబీ ఈ ఏడాది సీజన్లో రాణించడం కష్టమే. ఎందుకంటే గతేడాది సీజన్లో హాజిల్‌వుడ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. చదవండి: Shubman Gill: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన గిల్.. సారా అలీఖాన్ కాదు! ఆమే నా క్రష్ అంటూ.. -
విల్ జాక్స్ ఊచకోత.. చెలరేగిన బేబీ ఏబీడీ
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్‌తో నిన్న (జనవరి 14) జరిగిన మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. విల్ జాక్స్ (46 బంతుల్లో 92; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. జాక్స్‌కు జతగా డి బ్రూన్ (23 బంతుల్లో 42; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో క్యాపిటల్స్ టీమ్ ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో క్యాపిటల్స్ బౌలర్లు పార్నెల్ (2/20), ఆదిల్ రషీద్ (2/46), నోర్జే (1/37), నీషమ్ (1/13), ఈథన్ బాష్ (1/33) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులకు మాత్రమే పరిమితమై ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (29 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చెలరేగిన బేబీ ఏబీడీ.. రెచ్చిపోయిన ఎంఐ బౌలర్లు లీగ్‌లో భాగంగా నిన్న (జనవరి 14) జరిగిన మరో మ్యాచ్‌లో రబాడ (2/12), రషీద్ ఖాన్ (2/18), జార్జ్ లిండే (2/25), ఓడియన్ స్మిత్ (2/10) రెచ్చిపోవడంతో జోబర్గ్ సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ టీమ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేయగా, ఎంఐ జట్టు 16.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ (34 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి సత్తా చాటగా.. ఆఖర్లో సామ్ కర్రన్ (15 నాటౌట్) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. లీగ్‌లో భాగంగా ఇవాళ (జనవరి 15) డర్బన్ సూపర్ జెయింట్స్-పార్ల్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. -
ఇంగ్లండ్ యువ బ్యాటర్ విధ్వంసం.. ఫాస్టెస్ సెంచరీ రికార్డు బద్దలు
ద హండ్రెడ్ లీగ్ 2022లో స్థానిక ఇంగ్లీష్ యువ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. లీగ్ రెండో ఎడిషన్‌లో శతకాల మోత మోగిస్తూ బౌలర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఆగస్ట్ 10న సథరన్ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్కు చెందిన 20 ఏళ్ల ఓపెనింగ్ బ్యాటర్ విల్ స్మీడ్ 50 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో శతక్కొట్టి, లీగ్‌లో తొట్ట తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోక్కెగా.. తాజాగా అదే ప్రత్యర్ధిపై ఓవల్ ఇన్విన్సిబుల్స్‌కు చెందిన 23 ఏళ్ల యువ ఓపెనర్ విల్ జాక్స్ ఏకంగా 47 బంతుల్లోనే శతక్కొట్టి ఔరా అనిపించాడు. జాక్స్ మొత్తం 48 బంతుల్లో 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్ల సాయంతో అజేయమైన 108 పరుగులు సాధించి తన జట్టును మరో 18 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేర్చాడు. జాక్స్ ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. తమ జట్టుకు మరో విధ్వంసకర బ్యాటర్ దొరికాడని ఇంగ్లీష్ అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు. జాక్స్ 2019లో జరిగిన ఓ టీ10 లీగ్‌లో 25 బంతుల్లోనే సెంచరీ సాధించి రికార్డుల్లోకెక్కాడు. ఆదివారం (ఆగస్ట్ 14) సథరన్ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఓవల్ ఇన్విన్సిబుల్స్ ప్రత్యర్ధిని 137 పరుగులకే (100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. మార్కస్ స్టోయినిస్ (27 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్‌గా నిలువగా.. రీస్ టాప్లే 20 బంతుల్లో 3 వికెట్లు పడగొట్టి సథరన్ బ్రేవ్ పతనాన్ని శాసించాడు. అనంతరం నామమత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇన్విన్సిబుల్స్.. జాక్స్ విధ్వంసం ధాటికి 82 బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జాక్స్ ఒక్కడే అన్నీ తానై తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. జాక్స్ 48 బంతుల్లో 108 పరుగులు సాధిస్తే.. బ్యాటింగ్ అవకాశం వచ్చిన మిగతా నలుగురు 35 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేసి తుస్సుమనిపించారు. ఓపెనర్ జేసన్ రాయ్ లీగ్‌లో మూడోసారి డకౌట్ కాగా, రిలీ రుస్సో (13 బంతుల్లో 10; సిక్స్), కెప్టెన్ సామ్ బిలింగ్స్ (8) దారుణంగా నిరాశపరిచారు. జాక్స్ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది తన జట్టుకు ప్రస్తుత ఎడిషన్‌లో మూడో విజయాన్ని (4 మ్యాచ్‌ల్లో) అందించాడు. తాజా ఓటమితో డిఫెండింగ్ ఛాంనియన్ సథరన్ బ్రేవ్ పరాజయాల సంఖ్య మూడుకు (4 మ్యాచ్‌ల్లో) చేరింది. 4 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో లండన్ స్పిరిట్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. చదవండి: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ బ్యాటర్.. హండ్రెడ్ లీగ్‌లో శతక్కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డు -
25 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు..
దుబాయ్: ఇంగ్లండ్ యువ క్రికెటర్ విల్ జాక్స్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. దుబాయ్ వేదికగా జరిగిన టీ10 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన జాక్స్ కేవలం 25 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఎనిమిది ఫోర్లు, పదకొండు సిక్సర్లతో చెలరేగి ఆడాడు. ఈ క్రమంలోనే ఒక ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి ఔరా అనిపించాడు. టీ10 మ్యాచ్‌లో భాగంగా సర్రే జట్టుకు ఆడుతున్న జాక్స్.. లాంక్షైర్ జట్టు బౌలర్లపై బ్యాట్‌తో విరుచుకుపడ్డాడు. ఆది నుంచి బౌండరీలే లక్ష్యంగా చెలరేగిన జాక్స్ పరుగుల వరద పారించాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ 5వ ఓవర్ ఆరంభానికి ముందు వ్యక్తిగత స్కోరు 62 వద్ద ఉన్న ఈ హిట్టర్.. ఆ ఓవర్ ముగిసే సమయానికి 98 పరుగులతో నిలిచాడు.కేవలం 14 బంతుల్లోనే అర్ధశతకం మైలురాయిని అందుకున్న జాక్స్.. ఆ తర్వాత 25 బంతుల్లో శతకం మార్క్‌ని చేరుకోవడం విశేషం. 30 బంతుల్లో 105 పరుగులు చేసిన అనంతరం జాక్స్ ఔటయ్యాడు. జాన్స్ జోరుతో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నస్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యఛేదనలో తడబడిన లాన్‌షైర్ 9.3 ఓవర్లలోనే 81 పరుగులకి ఆలౌటైంది. ఫలితంగా సర్రే జట్టు 95 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఇటీవల తిరువనంతపురం వేదికగా భారత్-ఎ జట్టుతో తలపడిన ఇంగ్లండ్ లయన్స్ జట్టులో జాక్స్ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.