ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. గతేడాది డిసెంబర్‌లో కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో జాక్స్‌ను రూ.3.2 కోట్ల భారీ ధరకు జాక్స్‌ను కొనుగోలు చేసింది.
కాగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా జాక్స్ ఎడమకాలికి గాయమైంది. దీంతో అతడు బంగ్లాదేశ్ పర్యటనలో మధ్యలోనే స్వదేశానికి పయనమయ్యాడు. అతడు బంగ్లాతో ఆఖరి వన్డేతో పాటుగా టీ20 సిరీస్ నుంచి కూడా తప్పుకున్నాడు.
అతడు ఇంగ్లండ్‌కు చేరుకున్నాక లండన్‌లో పునరావసం పొందనున్నట్లు ఈసీబీ అధికారి ఒకరు పేర్కొన్నారు. అదే విధంగా అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు ఈసీబీ వర్గాలు వెల్లడించాయి.ఈ నేపథ్యంలోనే అతడు మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా విల్ జాక్స్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా టీ20ల్లో అయితే దుమ్ము రేపుతున్నాడు. ఇటీవలే ముగిసిన దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. తన ఆల్‌రౌండ్ స్కిల్స్‌తో అందరిని అకట్టుకున్నాడు. ఒక వేళ విల్‌జాక్స్ ఐపీఎల్‌కు అందుబాటులో లేకపోతే ఆర్సీబీ జట్టుకు గట్టి ఎదురుదెబ్బే అని చేప్పుకోవాలి.
మరోవైపు గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ కూడా ఐపీఎల్ అందుబాటుపై సందిగ్ధం నెలకొంది. ఒక వేళ హాజిల్‌వుడ్ కూడా ఐపీఎల్‌కు దూరమైతే ఆర్సీబీ ఈ ఏడాది సీజన్‌లో రాణించడం కష్టమే. ఎందుకంటే గతేడాది సీజన్‌లో హాజిల్‌వుడ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
చదవండి: Shubman Gill: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన గిల్.. సారా అలీఖాన్ కాదు! ఆమే నా క్రష్ అంటూ..
Comments
Please login to add a commentAdd a comment