
పొట్టి ఫార్మాట్‌లో ఇవాళ (ఫిబ్రవరి 13) రెండు ధమాకా ఇన్నింగ్స్‌లు క్రికెట్ అభిమానులకు కనువిందు చేశాయి. వీటితో పాటు మరో రెండు మెరుపు ఇన్నింగ్స్‌లు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో వెస్టిండీస్ విధ్వంసకర యోధుడు ఆండ్రీ రసెల్ సుడిగాలి అర్ధశతకంతో (29 బంతుల్లో 71; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) రచ్చ చేయగా.. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కొమిల్లా విక్టోరియన్స్‌కు ఆడుతున్న ఇంగ్లండ్ మెరుపు వీరుడు విల్ జాక్స్ (53 బంతుల్లో 108 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) సిక్సర్ల సునామీ సృష్టించి శతక్కొట్టాడు.
వీరిద్దరికి సహచరులు షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (40 బంతుల్లో 67 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మొయిన్ అలీ (24 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) తోడవ్వడంతో వారివారి జట్లు భారీ స్కోర్లు నమోదు చేశాయి. ఆసీస్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. రసెల్, రూథర్‌పోర్డ్ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేయగా.. చట్టోగ్రామ్ ఛాలెంజర్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కొమిల్లా విక్టోరియన్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 239 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో సెకెండ్ ఇన్నింగ్స్‌లె కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment