Bangladesh premier league
-
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025 విజేత ఫార్చూన్ బారిషల్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025 ఎడిషన్ విజేతగా ఫార్చూన్ బారిషల్ నిలిచింది. ఇవాళ (ఫిబ్రవరి 7) జరిగిన ఫైనల్లో బారిషల్.. చిట్టగాంగ్ కింగ్స్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చిట్టగాంగ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్లు ఖ్వాజా నఫే (66), పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ (78 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 121 పరుగులు జోడించారు. ఆతర్వాత వచ్చిన గ్రహం క్లార్క్ (44) కూడా రాణించడంతో కింగ్స్ భారీ స్కోర్ చేసింది. బారిషల్ బౌలర్లలో మొహమ్మద్ అలీ, ఎబాదత్ హొసేన్ తలో వికెట్ పడగొట్టారు.195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బారిషల్‌కు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (54), తౌహిద్ హృదోయ్ (320 శుభారంభాన్ని అందించారు. అనంతరం కైల్ మేయర్స్ (46) మెరుపు ఇన్నింగ్స్ ఆడి బారిషల్ను విజయానికి చేరువ చేశాడు. ఆఖర్లో రిషద్ హొసేన్ (18 నాటౌట్) రెండు సిక్సర్లు బాది బారిషల్‌కు విజయాన్ని ఖరారు చేశాడు. మరో మూడు బంతులు మిగిలుండగానే బారిషల్ విజయతీరాలకు చేరింది. కింగ్స్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లాం 4 వికెట్లు తీసి బారిషల్ను భయపెట్టాడు. నయీమ్ ఇస్లాం 2, బినుర ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. ఫార్చూన్ బారిషల్ టైటిల్ సాధించడం వరుసగా ఇది రెండో సారి కావడం విశేషం. -
'ఐరెన్ లెగ్' ఆండ్రీ రసెల్.. ఎక్కడ అడుగుపెడితే అక్కడ భస్మం..!
విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్ (Andre Russell) ఫ్రాంచైజీ క్రికెట్లో తీరిక లేకుండా గడుపుతున్నాడు. రాత్రి ఓ లీగ్ ఆడితే, ఉదయం మరో లీగ్‌లో పాల్గొంటున్నాడు. మొన్న రసెల్ గంటల వ్యవధిలో (15 గంటలు) దేశాలు దాటి రెండు వేర్వేరు లీగ్‌ల్లో పాల్గొన్న వైనం సోషల్‌మీడియాలో వైరలయ్యింది. ఇదే సమయంలో రసెల్ ఓ అపవాదును కూడా మూటగట్టుకున్నాడు. నిద్ర లేకుండా జర్నీ చేసి రెండు వేర్వేరు లీగ్‌ల్లో పాల్గొంటే రెండు చోట్ల రసెల్ జట్లు లీగ్‌ల నుంచి నిష్క్రమించాయి. దీంతో నెటిజన్లు రసెల్‌ను ఐరెన్ లెగ్ అని అంటున్నారు. రసెల్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఆ జట్టు భస్మం అంటూ కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్లు రసెల్‌పై ఈ స్థాయిలో విరుచుకుపడటానికి అతని పేలవ ఫామ్ కూడా ఓ కారణం. రసెల్ ఇటీవలికాలంలో ఏ లీగ్‌లోనూ చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేదు. ఇంకా చెప్పాలంటే అన్ని చోట్లా దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్‌లో మెరుపులు లేవు, బౌలింగ్‌లో వికెట్లు లేవు. దీంతో అభిమానులు చిరెత్తిపోయి రసెల్‌పై దుష్ప్రచారం మొదలుపెట్టారు. వయసు మీద పడింది, ఇక తప్పుకో అని కొందరంటుంటే.. మరికొందరేమో, పోయి జాతీయ జట్టుకు ఆడుకోమని సలహాలు ఇస్తున్నారు. ఇంకొందరేమో డబ్బు కోసం రెస్ట్ లేకుండా ఇన్ని ఊర్లు తిరగాలా అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రసెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించకుండా ప్రైవేట్ లీగ్‌ల్లో ఆడుతున్న విషయం తెలిసిందే.రసెల్ ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో (ILT20) అబుదాబీ నైట్‌రైడర్స్ తరఫున ఆడి తొలి బంతికే డకౌటయ్యాడు. ఆ మ్యాచ్‌లో ఓటమితో ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో అబుదాబీ నైట్‌రైడర్స్ కథ ముగిసింది (నిష్క్రమించింది). ILT20లో తన జట్టు ఓడిన వెంటనే రసెల్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బంగ్లాదేశ్‌కు పయనమయ్యాడు. ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్నాడు. ఈ లీగ్‌లో ఖుల్నా టైగర్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రంగ్‌పూర్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రసెల్ 9 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఓ ఓవర్ బౌలింగ్ కూడా చేసిన రసెల్ వికెట్ లేకుండా 14 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రంగ్‌పూర్ రైడర్స్ ఓటమికి రసెల్ ప్రధాన కారణం కానప్పటికీ.. అతని జట్టు మాత్రం లీగ్ నుంచి నిష్క్రమించింది.ఇదిలా ఉంటే, ఇంటర్నేషనల్ లీగ్ టీ20, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లు చివరి దశకు చేరాయి. బీపీఎల్‌లో ఫార్చూన్ బారిషల్ ఫైనల్‌కు చేరగా.. రేపు రెండో క్వాలిఫయర్ జరుగనుంది. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 లీగ్ దశ మ్యాచ్‌లన్నీ ముగిశాయి. డెజర్ట్ వైపర్స్, దుబాయ్ క్యాపిటల్స్, ఎంఐ ఎమిరేట్స్, షార్జా వారియర్జ్ తదుపరి దశకు క్వాలిఫై అయ్యాయి. -
డేవిడ్ మలాన్ ఊచకోత.. 39 బంతుల్లోనే ముగిసిన మ్యాచ్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025లో ఇవాళ (జనవరి 29) ఓ వన్ సైడెడ్ మ్యాచ్ జరిగింది. ఢాకా క్యాపిటల్స్‌పై ఫార్చూన్ బారిషల్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం 22 ఓవర్లలో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ 15.3 ఓవర్లలో 73 పరుగులకే ఆలౌటైంది. బారిషల్ బౌలర్లు మొహమ్మద్ నబీ (4-0-9-3), తన్వీర్ ఇస్లామ్ (2-1-2-3), ఫహీమ్ అష్రాఫ్ (2.3-0-15-3) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు పోటీపడి వికెట్లు తీశారు. ముగ్గురూ తలో మూడు వికెట్లు తీశారు. జేమ్స్ ఫుల్లర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. లిటన్ దాస్, రోన్స్ఫర్డ్ బీటన్ తలో 10 పరుగులు చేయగా.. కెప్టెన్ తిసార పెరీరా అత్యధికంగా 15 పరుగులు సాధించాడు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో (11) వచ్చాయి. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో 7 బౌండరీలు, ఓ సిక్సర్ మాత్రమే నమోదయ్యాయి.మలాన్ ఊచకోత74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బారిషల్.. డేవిడ్ మలాన్ విధ్వంసకర ఇన్నింగ్స్ (16 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడటంతో 6.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది (వికెట్ కోల్పోయి). మలాన్‌కు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ కూడా తోడవ్వడంతో మ్యాచ్ తొందరగా ముగిసింది. తమీమ్ 14 బంతుల్లో 4 బౌండరీల సాయంతో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బారిషల్ ఇన్నింగ్స్‌లో తౌహిద్ హృదోయ్ 9 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. తౌహిద్ వికెట్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు దక్కింది. ఈ గెలుపుతో బారిషల్ రంగ్పైర్ రైడర్స్‌ను వెనక్కు నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. క్యాపిటల్స్ 11 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలతో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.కాగా, ఈ మ్యాచ్‌కు ముందు డేవిడ్ మలాన్ బీపీఎల్ ఫ్రాంచైజీలను ఉద్దేశిస్తూ సంచలన కామెంట్స్ చేశాడు. మీ దగ్గర డబ్బుంటేనే ఫ్రాంచైజీలను తీసుకోండి. లేదంటే ఊరకనే ఉండండంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుత బీపీఎల్ సీజన్లో కొన్ని ఫ్రాంచైజీలు విదేశీ ఆటగాళ్లకు రెమ్యూనరేషన్ చెల్లించడంలో జాప్యం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మలాన్ ఈ కామెంట్స్ చేశాడు. కొద్ది రోజుల కిందట దర్బార్ రాజ్‌షాహీ ఫ్రాంచైజీకి చెందిన విదేశీ ఆటగాళ్లు మ్యాచ్ ఫీజులు చెల్లించని కారణంగా ఓ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేశాయి. ఆ మ్యాచ్‌లో రాజ్‌షాహీ ఫ్రాంచైజీ స్వదేశీ ఆటగాళ్లను మాత్రమే బరిలోకి దించింది. -
పాక్ బ్యాటర్ మహోగ్రరూపం.. వరుసగా 4 సిక్సర్లు బాది మ్యాచ్‌ను గెలిపించిన వైనం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025లో (Bangladesh Premier League) పాకిస్తాన్ బ్యాటర్ హైదర్ అలీ (Haider Ali) మహోగ్రరూపం దాల్చాడు. ఈ లీగ్‌లో చట్టోగ్రామ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న హైదర్.. రంగ్‌పూర్ రైడర్స్‌తో ఇవాళ (జనవరి 29) జరిగిన మ్యాచ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది తన జట్టును గెలిపించాడు. గెలుపుపై ఏ మాత్రం ఆశలు లేని మ్యాచ్‌లో హైదర్ నమ్మశక్యంకాని రీతిలో విరుచుకుపడ్డాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రంగ్‌పూర్ రైడర్స్.. ఇఫ్తికార్ అహ్మద్ (47 బంతుల్లో 65 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. రైడర్స్ ఇన్నింగ్స్‌లో ఇఫ్తికార్ మినహా ఎవరూ రాణించలేదు. తొలుత సౌమ్య సర్కార్ (17 బంతుల్లో 23; 2 ఫోర్లు, సిక్స్), ఆఖర్లో మెహిది హసన్ (20 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్టీవెన్ టేలర్ డకౌట్ కాగా.. సైఫ్ హసన్ 8, కెప్టెన్ నురుల్ హసన్ 9, ఇర్ఫాన్ సుకూర్ ఒక్క పరుగు చేశారు. చట్టోగ్రామ్ కింగ్స్ బౌలర్లలో ఖలీద్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టగా.. షొరిఫుల్ అస్లాం, షమీమ్ హొసేన్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం కష్టసాధ్యమైన పిచ్‌పై 144 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చట్టోగ్రామ్ కింగ్స్ తొలి 10 ఓవర్లలోనే 3 కీలక వికెట్లు (63 పరుగులకే) కోల్పోయి గెలుపుపై ఆశలు వదులుకుంది. లహీరు మిలంత 6, గ్రహం క్లార్క్ 15, కెప్టెన్ మొహమ్మద్ మిథున్ 20 పరుగులకే ఔటయ్యారు. ఈ దశలో పర్వేజ్ హొసేన్ ఎమోన్తో జతకట్టిన హైదర్ అలీ తొలుత నిదానంగా ఆడాడు. 106 పరుగుల వద్ద ఎమోన్ (43 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటయ్యాక హైదర్ గేర్ మార్చాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో కింగ్స్ గెలుపుకు 18 బంతుల్లో 20 పరుగులు అవసరం కాగా.. హైదర్ ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. అకీఫ్ జావిద్ వేసిన ఆ ఓవర్లో తొలి బంతికే సిక్సర్ బాదిన హైదర్.. ఆతర్వాతి మూడు బంతులను కూడా భారీ సిక్సర్లుగా మలిచాడు. హైదర్ అకీఫ్‌పై ఒక్కసారిగా రెచ్చిపోవడంతో కళ్లు మూసుకుని తెరిచే లోగా మ్యాచ్ అయిపోయింది. కింగ్స్ మరో 14 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. హైదర్ ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 18 బంతులు ఎదుర్కొన్న హైదర్.. 6 సిక్సర్లు, బౌండరీ సాయంతో 48 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హైదర్‌కు రహాతుల్ ఫిర్దౌస్ (6 నాటౌట్) సహకరించాడు. ఈ గెలుపుతో చట్టోగ్రామ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. కింగ్స్ చేతిలో ఓడినా రంగ్‌పూర్ రైడర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. -
పాకిస్తాన్ ప్లేయర్ల సంచలన నిర్ణయం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొంటున్న పాకిస్తాన్ ప్లేయర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దర్బార్ రాజ్‌షాహీ అనే ఫ్రాంచైజీ మ్యాచ్ ఫీజ్ బకాయిలు చెల్లించని కారణంగా బీపీఎల్‌లో ఆడకూడదని నిర్ణయించుకున్నారు. ఇదే కారణంగా పలువురు విదేశీ ప్లేయర్లు కూడా బీపీఎల్‌కు దూరంగా ఉన్నారు. విదేశీ ఆటగాళ్లు ర్యాన్ బర్ల్, మెక్కాలీ కమిన్స్, లహీరు కుమార, మార్క్ డోయల్‌తో పాటు పాకిస్తాన్ ఆటగాళ్లు మొహమ్మద్ హరీస్, అఫ్తాబ్ ఆలమ్ దర్బార్ రాజ్‌షాహీ ఆడిన గత మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేశారు. విదేశీ ఆటగాళ్లు హ్యాండ్ ఇవ్వడంతో రాజ్‌షాహీ గత మ్యాచ్‌లో లోకల్ ప్లేయర్లను బరిలోకి దించింది. రాజ్షాహీకి చెందిన విదేశీ ఆటగాళ్లు మ్యాచ్ ఫీజ్ బకాయిలను డిమాండ్ చేస్తూ తమ ధిక్కార స్వరాన్ని వినిపించడం ఇది తొలిసారి కాదు. ఈ సీజన్ ఆరంభంలో రాజ్‌షాహీ విదేశీ ఆటగాళ్లు ట్రయినింగ్ సెషన్స్‌ను బాయ్‌కాట్ చేశారు. తమ ఫ్రాంచైజీపై చర్యలు తీసుకుని, తమకు రావాల్సిన బకాయిలను ఇప్పించాలని బీపీఎల్ గవర్నింగ్ బాడీని డిమాండ్ చేశారు. రాజ్‌షాహీ దర్బార్ ఫ్రాంచైజీ అవళంభిస్తున్న విధానాలు అంతర్జాతీయ క్రికెట్ వేదికపై బంగ్లాదేశ్ పరువును మసకబారేలా చేస్తున్నాయి.ఇదిలా ఉంటే, విదేశీ స్టార్లు లేనప్పటికీ గత మ్యాచ్‌లో రాజ్‌షాహీ రంగ్‌పూర్ రైడర్స్‌పై విజయం సాధించింది. లో స్కోరింగ్ థ్రిల్లర్‌గా నడిచిన ఈ మ్యాచ్‌లో రాజ్‌షాహీ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజ్‌షాహీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. రాజ్‌షాహీ ఇన్నింగ్స్‌లో సంజముల్ ఇస్లాం (28 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రంగ్‌పూర్ రైడర్స్ బౌలర్లలో ఖుష్దిల్ 3 వికెట్లు పడగొట్టగా.. రకీబుల్ హసన్, సైఫుద్దీన్ తలో రెండు, అకీఫ్ జావెద్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రంగ్‌పూర్ రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. మొహమ్మద్ సైఫుద్దీన్ (52 నాటౌట్), రకీబుల్ హసన్ (20) రైడర్స్‌ను గెలిపించేందుకు చివరి వరకు ప్రయత్నించారు. రాజ్‌షాహీ బౌలర్లు మృత్యుంజయ్ చౌధురీ (4-1-18-4), మొహర్ షేక్ (4-1-15-2), కెప్టెన్ తస్కిన్ అహ్మద్ (4-0-2-25) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి రైడర్స్‌ను దెబ్బకొట్టారు. ఈ గెలుపు అనంతరం రాజ్‌షాహీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ సీజన్లో రాజ్‌షాహీ 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి, ప్లే ఆఫ్స్‌పై కన్నేసింది. -
టీ20ల్లో అరుదైన ప్రదర్శన.. రికార్డుల వెల్లువ
టీ20ల్లో అరుదైన ప్రదర్శన నమోదైంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025లో భాగంగా దర్బార్ రాజ్షాహీతో జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు ఢాకా క్యాపిటల్స్ ఆటగాళ్లు (తంజిద్ హసన్ తమీమ్, లిటన్ దాస్) సెంచరీలు చేశారు. టీ20ల్లో ఇలా ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇది తొమ్మిదో సారి.టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు సెంచరీలు చేసిన సందర్భాలు..కెవిన్ ఓ'బ్రియన్ & హమీష్ మార్షల్ vs మిడిల్సెక్స్, ఉక్స్బ్రిడ్జ్, 2011విరాట్ కోహ్లీ & ఎబి డివిలియర్స్ vs గుజరాత్ లయన్స్, బెంగళూరు, 2016అలెక్స్ హేల్స్ & రిలీ రోసౌ vs చిట్టగాంగ్ వైకింగ్స్, చట్టోగ్రామ్, 2019డేవిడ్ వార్నర్ & జానీ బెయిర్‌స్టో vs ఆర్సిబి, హైదరాబాద్, 2019సబావూన్ డేవిజి & డిలాన్ స్టెయిన్ vs బల్గేరియా, మార్సా, 2022లాచ్లాన్ యమమోటో-లేక్ & కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ vs చైనా, మోంగ్ కోక్, 2024శుభ్‌మన్ గిల్ & బి సాయి సుదర్శన్ vs CSK, అహ్మదాబాద్, 2024సంజు సామ్సన్ & తిలక్ వర్మ vs దక్షిణాఫ్రికా, జోహన్నెస్‌బర్గ్, 2024తాంజిద్ హసన్ తమీమ్ & లిట్టన్ దాస్ vs దర్బార్ రాజ్షాహి, సిల్హెట్, 2025మ్యాచ్ విషయానికొస్తే.. దర్బార్ రాజ్షాహీతో జరిగిన మ్యాచ్‌లో ఢాకా క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేసి రికార్డు స్కోర్ చేసింది. తంజిద్ హసన్ (64 బంతుల్లో 108; 6 ఫోర్లు, 8 సిక్సర్లు), లిటన్ దాస్ (55 బంతుల్లో 125 నాటౌట్; 10 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కడంతో ఢాకా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 254 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్.ఈ మ్యాచ్‌లో లిటన్ దాస్ 44 బంతుల్లో శతక్కొట్టాడు. బీపీఎల్‌లో ఇది మూడో వేగవంతమైన సెంచరీ. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ జట్టును నిన్ననే ప్రకటించారు. ఈ జట్టులో లిటన్ దాస్‌కు చోటు దక్కలేదు. తనను జట్టు నుంచి తప్పించిన రోజే దాస్ సెంచరీతో కదంతొక్కడం విశేషం.ఈ మ్యాచ్‌లో లిటన్ దాస్, తంజిద్ హసన్ తొలి వికెట్‌కు 241 పరుగులు జోడించారు. బీపీఎల్ చరిత్రలో ఏ వికెట్‌కు అయినా ఇదే అత్యధిక భాగస్వామ్యం. టీ20 క్రికెట్ చరిత్రలో ఏ వికెట్‌కు అయినా ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. టీ20ల్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డు జపాన్ ఆటగాళ్లు యమమోటో, కడోవాకీ పేరిట ఉంది. ఈ జోడీ 2024లో చైనాతో జరిగిన మ్యాచ్‌లో అజేయమైన 258 పరుగులు జోడించింది. ఢాకా క్యాపిటల్స్ నిర్దేశించిన 255 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దర్బార్ రాజ్‌షాహీ చేతులెత్తేసింది. ఆ జట్టు 15.2 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఢాకా క్యాపిటల్స్ 149 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఇదే భారీ విజయం. ఈ సీజన్లో ఢాకా క్యాపిటల్స్‌కు ఇదే తొలి విజయం. ఈ మ్యాచ్‌కు ముందు ఢాకా క్యాపిటల్స్ ఆరు మ్యాచ్‌లు ఆడగా.. ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేకపోయింది. -
తమీమ్ ఇక్బాల్, అలెక్స్ హేల్స్ మధ్య తీవ్ర వాగ్వాదం.. కొట్టుకున్నంత పని చేశారు..!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. రంగ్‌పూర్ రైడర్స్, ఫార్చూన్ బారిషల్ మధ్య నిన్నటి రసవత్తర మ్యాచ్ అనంతరం తమీమ్ ఇక్బాల్ (ఫార్చూన్ బారిషల్ కెప్టెన్), అలెక్స్ హేల్స్ (రంగ్‌పూర్ రైడర్స్) కొట్టుకున్నంత పని చేశారు. మ్యాచ్ అనంతరం జరిగే హ్యాండ్ షేక్ ఈవెంట్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. బంగ్లా మీడియా కథనాల మేరకు.. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునేందుకు ఎదురెదురుపడ్డాడు.ఈ సందర్భంగా తమీమ్ ఇక్బాల్, హేల్స్ మధ్య మాటామాటా పెరిగింది. తొలుత హేల్స్ తమీమ్‌ను రెచ్చగొట్టాడు. తమీమ్‌కు షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు హేల్స్ అగౌరవంగా ప్రవర్తించాడు. హేల్స్ ప్రవర్తనను అవమానంగా భావించిన తమీమ్ తొలుత నిదానంగా సమాధానం చెప్పాడు. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావని తమీమ్ హేల్స్‌ను అడిగాడు. ఏదైనా చెప్పాలనుకుంటే ముఖం మీద చెప్పు. ఇలా ప్రవర్తించడం సరికాదు. మగాడిలా ప్రవర్తించు అని తమీమ్ హేల్స్‌తో అన్నాడు.తమీమ్ తన అసంతృప్తిని వెలిబుచ్చుతుండగానే హేల్స్ ఏదో అన్నాడు. ఇందుకు చిర్రెతిపోయిన తమీమ్ సహనాన్ని కోల్పోయి హేల్స్ మీదకు వచ్చాడు. హేల్స్ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇద్దరికి సర్ది చెప్పేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు ప్రయత్నించారు. గొడవ వద్దని వారు ఎంత వారిస్తున్నా తమీమ్, హేల్స్ ఒకరి మీదికి ఒకరు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.అయితే ఈ గొడవపై హేల్స్ మరోలా స్పందించాడు. ఇందులో తన తప్పేమీ లేదని అన్నాడు. గొడవను తొలుత తమీమే స్టార్ట్ చేశాడని చెప్పాడు. షేక్ హ్యాండ్ ఇస్తున్న సందర్భంగా తమీమ్ తనను ఇంకా డ్రగ్స్ తీసుకుంటున్నావా అని అడిగాడు. డ్రగ్స్ కారణంగా నిషేధించబడినందుకు (ఇంగ్లండ్) సిగ్గుపడుతున్నావా అని అడిగాడు. ఇలా మాట్లాడుతూనే చాలా దరుసుగా ప్రవర్తించాడని హేల్స్ చెప్పుకొచ్చాడు.కాగా, ఫార్చూన్ బారిషల్‌తో నిన్న జరిగిన రసవత్తర సమరంలో రంగ్‌పూర్ రైడర్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో రంగ్‌పూర్ రైడర్స్ గెలుపుకు చివరి ఓవర్లో 26 పరుగులు అవసరమయ్యాయి. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కైల్ మేయర్స్ బంతిని అందుకోగా.. నురుల్ హసన్ స్ట్రయిక్ తీసుకున్నాడు. తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన నురుల్.. ఆతర్వాత వరుసగా రెండు బౌండరీలు, ఓ సిక్సర్ మరో బౌండరీ బాదాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. నురుల్ మరో సిక్సర్ బాది రంగ్‌పూర్ రైడర్స్‌కు సంచలన విజయాన్నందించాడు. మొత్తంగా కైల్ మేయర్స్ వేసిన చివరి ఓవర్లో నురుల్ 30 పరగులు పిండుకున్నాడు. 198 పరుగుల లక్ష్య ఛేదనలో 7 బంతులు ఎదుర్కొన్న నురుల్ 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 32 పరుగులు (నాటౌట్) చేశాడు. -
నరాలు తెగే ఉత్కంఠ.. బంగ్లా ప్లేయర్ ఊచకోత.. చివరి ఓవర్లో 30 పరుగులు
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఇవాళ (జనవరి 9) అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఫార్చూన్ బారిషల్‌తో జరిగిన సమరంలో రంగ్‌పూర్ రైడర్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో రంగ్‌పూర్ రైడర్స్ గెలుపుకు చివరి ఓవర్లో 26 పరుగులు అవసరమయ్యాయి. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కైల్ మేయర్స్ బంతిని అందుకోగా.. నురుల్ హసన్ స్ట్రయిక్ తీసుకున్నాడు. తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన నురుల్.. ఆతర్వాత వరుసగా రెండు బౌండరీలు, ఓ సిక్సర్ మరో బౌండరీ బాదాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. నురుల్ మరో సిక్సర్ బాది రంగ్‌పూర్ రైడర్స్‌కు సంచలన విజయాన్నందించాడు. 𝘼𝙗𝙨𝙤𝙡𝙪𝙩𝙚 𝙘𝙞𝙣𝙚𝙢𝙖! 🍿Rangpur Riders were all but out of the contest until Skipper Nurul Hasan smashed 30 off the final over to pull off an incredible heist! 😵💫#BPLonFanCode pic.twitter.com/9A7R96fmhU— FanCode (@FanCode) January 9, 2025మొత్తంగా కైల్ మేయర్స్ వేసిన చివరి ఓవర్లో నురుల్ 30 పరగులు పిండుకున్నాడు. 198 పరుగుల లక్ష్య ఛేదనలో 7 బంతులు ఎదుర్కొన్న నురుల్ 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 32 పరుగులు (నాటౌట్) చేశాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫార్చూన్ బారిషల్.. కైల్ మేయర్స్ (29 బంతుల్లో 61 నాటౌట్; ఫోర్, 7 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఓపెనర్లు తమీమ్ (40), షాంటో (41) రాణించారు. ఆఖర్లో ఫహీమ్ అష్రాఫ్ (6 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బారిషల్ ఇన్నింగ్స్‌లో తౌహిద్ హృదోయ్ (23) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. మహ్మదుల్లా (2) విఫలమయ్యాడు. రంగ్‌పూర్ బౌలర్లలో కమ్రుల్ ఇస్లాం 2, సైఫుద్దీన్, అకిఫ్ జావెద్ తలో వికెట్ పడగొట్టారు.198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రంగ్‌పూర్ రైడర్స్ చివరి బంతికి విజయం సాధించింది. కెప్టెన్ నురుల్ హసన్ ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. చివరి ఓవర్లో రంగ్‌పూర్ గెలుపుకు 26 పరుగులు అవసరం కాగా.. నురుల్ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి 30 పరుగులు పిండుకున్నాడు. నురుల్ ఊచకోత ధాటికి బౌలర్ కైల్ మేయర్స్‌కు ఫ్యూజులు ఔటయ్యాయి. గెలుపుపై ఏమాత్రం ఆశలు లేని మ్యాచ్‌లో నురుల్ తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. రంగ్‌పూర్ గెలుపుకు తౌఫిక్ ఖాన్ (38), సైఫ్ హస్సన్ (22), ఇఫ్తికార్ అహ్మద్ (48), ఖుష్దిల్ షా (48) పునాది వేశారు. ప్రస్తుత బీపీఎల్ ఎడిషన్‌లో రంగ్‌పూర్ రైడర్స్‌కు ఇది వరుసగా ఆరో విజయం. ఈ ఎడిషన్‌లో ఆ జట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. -
అలెక్స్ హేల్స్ ఊచకోత
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు, రంగ్‌పూర్ రైడర్స్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిల్హెట్ స్ట్రయికర్స్‌తో ఇవాళ (జనవరి 6) జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 56 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హేల్స్ శతక్కొట్టడంతో సిల్హెట్ స్ట్రయికర్స్పై రంగ్‌పూర్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిల్హెట్ స్ట్రయికర్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రోనీ తాలుక్దార్ (32 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), జకీర్ హసన్ (38 బంతుల్లో 50; 4 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. జార్జ్ మున్సే 18, పాల్ స్టిర్లింగ్ 16 పరుగులు చేసి ఔట్ కాగా.. ఆఖర్లో ఆరోన్ జోన్స్ (19 బంతుల్లో 38 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు), జాకెర్ అలీ (5 బంతుల్లో 20 నాటౌట్; 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. రంగ్‌పూర్ రైడర్స్ బౌలర్లలో సైఫుద్దీన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మెహిది హసన్, ఆకిఫ్ జావెద్ తలో వికెట్ దక్కించుకున్నారు.భారీ లక్ష్య ఛేదనకు దిగిన రంగ్‌పూర్ రైడర్స్ 19 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. అలెక్స్ హేల్స్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. సైఫ్ హసన్ 49 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. రంగ్‌పూర్ రైడర్స్ బ్యాటర్లలో హకీమ్ తమీమ్ డకౌట్ కాగా.. ఇఫ్తికార్ అహ్మద్ 8 పరుగులు (నాటౌట్) చేశాడు. సిల్హెట్ స్ట్రయికర్స్ పేసర్ తంజిమ్ హసన్ సకీబ్‌కు రెండు వికెట్లు దక్కాయి.ఈ గెలుపుతో రంగ్‌పూర్ రైడర్స్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచినట్లైంది. పాయింట్ల పట్టికలో రంగ్‌పూర్ రైడర్స్ అగ్రస్థానంలో నిలిచింది. రెండింట రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఖుల్నా టైగర్స్ రెండో స్థానంలో ఉంది. చిట్టగాంగ్ కింగ్స్ (2 మ్యాచ్‌ల్లో ఓ విజయం), ఫార్చూన్ బారిషల్ (2 మ్యాచ్‌ల్లో ఓ విజయం), దర్బార్ రాజ్షాహి (3 మ్యాచ్‌ల్లో ఓ విజయం), సిల్హెట్ స్ట్రయికర్స్ (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలు), ఢాకా క్యాపిటల్స్ (3 మ్యాచ్‌ల్లో 3 పరాజయాలు) వరుసగా మూడు నుంచి ఏడు స్థానాల్లో ఉన్నాయి. -
విండీస్ బౌలర్ చెత్త ప్రదర్శన.. ఒక్క బంతికి ఇన్ని పరుగులా..?
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024-25లో వెస్టిండీస్ బౌలర్ ఒషేన్ థామస్ చెత్త ప్రదర్శన చేశాడు. ఈ లీగ్‌లో ఖుల్నా టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న థామస్.. చిట్టగాంగ్ కింగ్స్‌తో ఇవాళ (డిసెంబర్ 31) జరిగిన మ్యాచ్‌లో ఒక్క బంతికి ఏకంగా 15 పరుగులు సమర్పించుకున్నాడు. 15 runs off 1 ball! 😵💫Talk about an eventful way to start the innings! #BPLonFanCode pic.twitter.com/lTZcyVEBpd— FanCode (@FanCode) December 31, 2024ఛేదనలో ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన థామస్ వరుసగా N 0 N6 Wd Wd N4 0 0 N 2 W 0 పరుగులు సమర్పించుకున్నాడు. టీ20 క్రికెట్లో ఇదో చెత్త ప్రదర్శన. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్ వేసిన థామస్ 18 పరుగులిచ్చి ఓ వికెట్ తీసుకున్నాడు. థామస్ ఓవర్లో 4 నో బాల్స్, 2 వైడ్లు ఉన్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఖుల్నా టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరగుల భారీ స్కోర్ చేసింది. బొసిస్టో (50 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), మహిదుల్ ఇస్లాం అంకోన్ (22 బంతుల్లో 59 నాటౌట్; ఫోర్, 6 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలతో రాణించారు. ఖుల్నా టైగర్స్ ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ నయీమ్ 26, కెప్టెన్ మెహిది హసన్ మిరాజ్ 18, ఇబ్రహీం జద్రాన్ 6, అఫీఫ్ హొసేన్ 8 పరుగులు చేశారు. చిట్టగాంగ్ బౌలర్లలో అలిస్ అల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చిట్టగాంగ్ 18.5 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 37 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అబూ హైదర్ (3.5-0-44-4), మొహమ్మద్ నవాజ్ (3-0-13-2) చిట్టగాంగ్ టైగర్స్‌ను దెబ్బకొట్టారు. ఒషేన్ థామస్, హసన్ మహమూద్, నసుమ్ అహ్మద్, మెహిది హసన్ మిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. చిట్టగాంగ్ ఇన్నింగ్స్‌లో షమీమ్ హొసేన్ (38 బంతుల్లో 78; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షమీమ్ ఒంటరిగా పోరాడి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. షమీమ్ మినహా చిట్టగాంగ్ ఇన్నింగ్స్‌లో నయీమ్ ఇస్లాం (12), పర్వేజ్ హొసేన్ ఎమోన్ (13), ఉస్మాన్ ఖాన్ (18), ఖలీద్ అహ్మద్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
మూడు మ్యాచ్‌లకు రూ.1.25 కోట్లు.. పెళ్లినే వాయిదా వేసుకున్న స్టార్ క్రికెటర్
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఇటీవలే(మార్చి 10) తన గర్ల్ ఫ్రెండ్ కామిల్లా హారిస్‌ను వివాహమడిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి వీరిద్దరి పెళ్లి గత నెలలోనే జరగాల్సింది. కానీ మిల్లర్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు తన పెళ్లిని వాయిదా వేసున్నాడు. బీపీఎల్‌లో ఫార్చూన్ బరిషల్ జట్టుకు మూడు మ్యాచులు ఆడితే ఏకంగా రూ. 1.25 కోట్లను చెల్లించేందుకు ఆ ఫ్రాంచైజీ ఆఫర్ ఇచ్చింది. దీంతో మిల్లర్ తన పెళ్లిని వాయిదా వేసుకుని ఫార్చూన్ బరిషల్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు . ఫిబ్రవరి 26 (ఎలిమినేటర్), ఫిబ్రవరి 28 (క్వాలిఫయర్ 2), మార్చి 1న (ఫైనల్) ఫార్చూన్ బరిషల్‌కు మిల్లర్ ఆడాడు. బీపీఎల్-2024 విజేతగా ఫార్చూన్ బరిషల్ జట్టు నిలిచింది. తాజాగా ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ వెల్లడించాడు. "పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో బీజీగా ఉండటంతో బీపీఎల్‌ను పెద్దగా ఫాలో కాలేదు. అయితే ఈ ఏడాది బీపీఎల్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారన్న విషయం గురించి నా స్నేహితులను ఆడిగాను. అప్పుడే నాకు ఓ సంచలన విషయం తెలిసింది. మూడు మ్యాచ్‌లు ఆడితే డేవిడ్ మిల్లర్‌కు 1.50 లక్షల డాలర్లు ఇచ్చేందుకు ఫార్చూన్ బరిషల్ ఫ్రాంచైజీ ముందుకు వచ్చింది. దీంతో తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు" దిపెవిలియన్ షోలో అక్రమ్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు మిల్లర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. రూ.4 కోట్ల ఆటగాడు దూరం -
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ విజేతగా తమీమ్ జట్టు..
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)– 2024 సీజన్ ఛాంపియన్‌గా ఫార్ట్యూన్ బరిషల్ నిలిచింది. శుక్రవారం ఢాకా వేదికగా జరిగిన ఫైనల్లో కొమిలియా విక్టోరియన్స్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసిన బరిషల్ జట్టు.. తొలిసారి బీపీఎల్ ట్రోఫిని ముద్దాడింది. కొమిలియా నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని బరిషల్.. 19 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. బరిషల్ బ్యాటర్లలో కైల్ మేయర్స్ (30 బంతుల్లో 46, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. తమీమ్ ఇక్బాల్ (26 బంతుల్లో 39, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మెహిది హసన్ మిరాజ్ (26 బంతుల్లో 29, 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కొమిలియా విక్టోరియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కొమిలియా ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ మహిదుల్ ఇస్లామ్ (38) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆండ్రూ రసెల్ (14 బంతుల్లో 27, 4 సిక్సర్లు) ఆఖరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బరిషల్ బౌలర్లలో జేమ్స్ ఫుల్లర్ 2 వికెట్లు పడగొట్టగా.. మైర్స్,సైఫుద్దీన్, మెకాయ్ తలా వికెట్ సాధించారు. 2012 నుంచి జరుగుతున్న బీపీఎల్‌లో కొమిలియా విక్టోరియన్స్ నాలుగు సార్లు (2015, 2019, 2022, 2023)టైటిల్ విజేతగా నిలవగా.. ఢాకా గ్లాడియేటర్స్ మూడు సార్లు( 2012, 2013, 2016) ఛాంపియన్స్‌గా నిలిచింది. అదే విధంగా రంగాపూర్ రైడర్స్ (2017), రాజ్షాహి రాయల్స్ (2020)లు తలా ఒకసారి టైటిల్‌ను ముద్దాడాయి. ఇప్పుడు పదో సీజన్లో తమీమ్ ఇక్భాల్ సారథ్యంలోని ఫార్ట్యున్ బరిషల్ సరి కొత్త ఛాంపియన్స్‌గా అవతరిచింది. -
కైల్ మేయర్స్ ఆల్‌రౌండ్ షో.. మెరుపు అర్దశతకం సహా..!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఫార్చూన్ బారిషల్ ఆటగాడు కైల్ మేయర్స్ (వెస్టిండీస్) ఆల్‌రౌండ్ షోతో ఇరగదీశాడు. చట్టోగ్రామ్ ఛాలెంజర్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో మెరుపు అర్దశతకం (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) సహా రెండు వికెట్లు (4-0-28-2) తీసి తన జట్టును గెలిపించాడు. తొలుత బౌలింగ్‌లో రాణించిన మేయర్స్ ఆతర్వాత బ్యాటింగ్‌లో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛాలెంజర్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. కైల్ మేయర్స్, సైఫుద్దీన్, మెక్కాయ్ తలో 2 వికెట్లు తీసి ఛాలెంజర్స్ పతనాన్ని శాశించారు. తైజుల్ ఇస్లాం, జేమ్స్ ఫుల్లర్ చెరో వికెట్ పడగొట్టారు. ఛాలెంజర్స్ ఇన్నింగ్స్‌లో జోష్ బ్రౌన్ చేసిన 34 పరుగులే అత్యధికం. కెప్టెన్ షువగట (24), ట్రామ్ బ్రూస్ (17), సైకత్ అలీ (11), రొమారియో షెపర్డ్ (11), నిహాదుజ్జమాన్ (10) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా ఆటగాళ్లు కనీసం ఈపాటి పరుగులు కూడా సాధించలేకపోయారు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బారిషల్.. కైల్ మేయర్స్, తమీమ్ ఇక్బాల్ (52 నాటౌట్) చెలరేగడంతో 14.5 ఓవర్లలోనే (3 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. ఫలితంగా బారిషల్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. బారిషల్ ఇన్నింగ్స్‌లో సౌమ్య సర్కార్ (0) విఫలం కాగా.. డేవిడ్ మిల్లర్ (17) వేగంగా పరుగులు సాధించాడు. ముష్ఫికర్ రహాం (6 నాటౌట్) విన్నింగ్ రన్స్ కొట్టాడు. ఛాలెంజర్స్ బౌలర్లలో షువగట, బిలాల్ ఖాన్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు. రంగ్‌పూర్ రైడర్స్, కొమిల్లా విక్టోరియన్స్ మధ్య ఇవాళ రాత్రి క్వాలిఫయర్-1 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. ఫిబ్రవరి 28న జరిగే క్వాలిఫయర్-2లో ఫార్చూన్ బారిషల్‌తో తలపడుతుంది. -
ఆండ్రీ రసెల్ ఊచకోత.. 12 బంతుల్లోనే.. 358.33 స్ట్రయిక్‌రేట్‌తో..!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కొమిల్లా విక్టోరియన్స్ ఆటగాడు, విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్ శివాలెత్తిపోయాడు. రంగ్‌పూర్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రసెల్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 12 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 358.33 స్ట్రయిక్‌రేట్‌తో అజేయమైన 43 పరుగులు చేసి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. అంతకుముందు రసెల్ బౌలింగ్‌లో చెలరేగిపోయాడు. 2.5 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రైడర్స్.. రసెల్, ముస్ఫిక్ హసన్ (3/18), మథ్యూ ఫోర్డ్ (2/32), తన్వీర్ ఇస్లాం (1/12) ధాటికి 19.5 ఓవర్లలో 150 పరుగులకు కుప్పకూలింది. రైడర్స్ ఇన్నింగ్స్‌లో నీషమ్ ఒక్కడే అజేయమైన అర్దసెంచరీతో (69 నాటౌట్) రాణించాడు. నీషమ్‌తో పాటు రోనీ తాలుక్దార్ (14), షకీబ్ అల్ హసన్ (24) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం ఛేదనకు దిగిన విక్టోరియన్స్.. రసెల్ శివాలెత్తడంతో 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది (4 వికెట్లు కోల్పోయి). విక్టోరియన్స్ ఇన్నింగ్స్‌లో రసెల్‌తో పాటు లిటన్ దాస్ (43), మహిదుల్ ఇస్లాం (39) కూడా రాణించారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సునీల్ నరైన్ 15 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా.. మొయిన్ అలీ (6 నాటౌట్) రసెల్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. రైడర్స్ బౌలర్లలో షకీబ్ 3 వికెట్లు పడగొట్టగా.. హైదర్ రోని ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
కళ్లు చెదిరే క్యాచ్.. రొమారియో షెపర్డ్ అద్భుత విన్యాసం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో చట్టోగ్రామ్ ఛాలెంజర్స్ ఆటగాడు, విండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. ఖుల్నా టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అనాముల్ హక్ కొట్టిన షాట్‌ను షెపర్డ్ అద్భుత క్యాచ్‌గా మలిచాడు. షొహిదుల్ ఇస్లాం బౌలింగ్‌లో షెపర్డ్ రివర్స్‌లో పరిగెడుతూ బౌండరీ లైన్ సమీపంలో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. What an unbelievable catch by Romario Shepherd. 🔥pic.twitter.com/YG8MtmP4Qy — Mufaddal Vohra (@mufaddal_vohra) February 20, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చట్టోగ్రామ్ ఛాలెంజర్స్ 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. తంజిద్ హసన్ (116) మెరుపు సెంచరీ చేసి ఛాలెంజర్స్ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. 58 బంతుల్లో శతక్కొట్టిన తంజిద్.. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 65 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు. ఛాలెంజర్స్ ఇన్నింగ్స్‌లో తంజిద్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. ఆఖర్లో టామ్ బ్రూస్ (23 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. ముహమ్మద్ వసీం (1), సైకత్ అలీ (18), రొమారియో షెపర్డ్ (10) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. టైగర్స్ బౌలర్లలో వేన్ పార్నెల్, నసుమ్ అహ్మద్, జేసన్ హోల్డర్, ముకిదుల్ ఇస్లాం తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టైగర్స్...షువగటా హోమ్ (3/25), బిలాల్ ఖాన్ (2/13), సలావుద్దీన్ (1/15), షొహిదుల్ ఇస్లాం (1/18), రొమారియో షెపర్డ్ (1/25), నిహాదుజ్జమాన్ (1/29) ధాటికి 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటై 65 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టైగర్స్ ఇన్నింగ్స్‌లో అనాముల్ హక్ (35), షాయ్ హోప్ (31), జేసన్ హోల్డర్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
బంగ్లాదేశ్ ఓపెనర్ మెరుపు శతకం.. ఫోర్లు, సిక్సర్లతో వీరవిహారం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో చట్టోగ్రామ్ ఛాలెంజర్స్ బ్యాటర్, బంగ్లాదేశ్ జాతీయ జట్టు ఓపెనర్ తంజిద్ హసన్ మెరుపు సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఖుల్నా టైగర్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 20) జరుగుతున్న మ్యాచ్‌లో తంజిద్ 58 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 65 బంతులు ఎదుర్కొన్న తంజిద్ 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు. ప్రస్తుత బీపీఎల్ సీజన్లో తంజిద్ చేసిన సెంచరీ మూడవది. తంజిద్‌కు ముందు తౌహిద్ హ్రిదోయ్, విల్ జాక్స్ సెంచరీలు చేశారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఛాలెంజర్స్ ఇన్నింగ్స్‌లో తంజిద్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. ఆఖర్లో టామ్ బ్రూస్ (23 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. ముహమ్మద్ వసీం (1), సైకత్ అలీ (18), రొమారియో షెపర్డ్ (10) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. టైగర్స్ బౌలర్లలో వేన్ పార్నెల్, నసుమ్ అహ్మద్, జేసన్ హోల్డర్, ముకిదుల్ ఇస్లాం తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టైగర్స్ నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ జట్టు తొలి ఓవర్ ముగిసే సరికి కేవలం రెండు పరుగులు (వికెట్ నష్టపోకుండా) మాత్రమే చేయగలిగింది. -
బెన్నీ హోవెల్ వీర బాదుడు.. లిటన్ దాస్ పోరాటం వృధా
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో సిల్హెట్ స్ట్రయికర్స్ ఆటగాడు బెన్నీ హోవెల్ (ఇంగ్లండ్) వీర బాదడు బాదాడు. కొమిల్లా విక్టోరియన్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 62 పరుగులు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన స్ట్రయికర్స్.. హోవెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. స్ట్రయికర్స్ ఇన్నింగ్స్‌లో హోవెల్ మినహా మిగతా ఆటగాళ్లు పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. కెన్నార్ లెవిస్ 33, జాకిర్ హసన్ 18, షాంటో 12, యాసిర్ అలీ 2, కెప్టెన్ మిథున్ 28 పరుగులు చేశారు. విక్టోరియన్స్ బౌలర్లలో సునీల్ నరైన్ పొదుపుగా (4-1-16-2) బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టగా.. రషీద్ హొసేన్ 2, ముస్ఫిక్ హసన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో విక్టోరియన్స్ చివరివరకు పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. లిటన్ దాస్ (85) విక్టోరియన్స్‌ను గెలిపించేందుకు సకల ప్రయత్నాలు చేశాడు. ఆఖర్లో ఆండ్రీ రసెల్ (23) కూడా తనవంతు ప్రయత్నించినప్పటికీ విక్టోరియన్స్ గెలవలేకపోయింది. లక్ష్యానికి 13 పరుగుల దూరంలో (165/6) నిలిచిపోయి, ఓటమిపాలైంది. విక్టోరియన్స్ కీలక ఆటగాళ్లు జాన్సన్ చార్లెస్ (17), మొయిన్ అలీ (0) విఫలమయ్యారు. స్ట్రయికర్స్ బౌలర్లలో తంజిమ్ హసన్ సకీబ్ 3, సమిత్ పటేల్, షఫీకుల్ ఇస్లాం, బెన్నీ హోవెల్ తలో వికెట్ పడగొట్టారు. -
చెన్నై స్టార్ బౌలర్ తలకు గాయం.. రక్తంతోనే ఆస్పత్రికి! వీడియో వైరల్
బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ తీవ్రంగా గాయపడ్డాడు. నెట్ ప్రాక్టీస్ సెషన్లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలకు గాయమైంది. ముస్తాఫిజుర్ ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కొమిల్లా విక్టోరియన్స్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం(ఫిబ్రవరి 19)న సిల్హెట్ స్ట్రైకర్స్‌తో కొమిల్లా తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం చటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ సెషన్లో కొమిల్లా జట్టు పాల్గోంది. ఈ క్రమంలో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న ముస్తాఫిజుర్ గాయపడ్డాడు. ప్రాక్టీస్‌లో కొమిల్లా కెప్టెన్ లిట్టన్ దాస్ కొట్టిన ఓ బంతి.. బౌలింగ్ ఎండ్‌వైపు వెళ్తున్న ముస్తాఫిజుర్ తల వెనుక భాగంలో బలంగా తాకింది. వెంటనే నుంచి అతడి తల నుంచి రక్తం కారింది. అక్కడే ఉన్న ఫిజియోలు వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్స అందించి ముస్తాఫిజుర్‌ను స్థానికంగా ఉన్న ఇంపీరియల్ హాస్పిటల్‌కి తరలించారు. అయితే ముస్తాఫిజుర్ గాయంపై కొమిల్లా విక్టోరియన్స్ టీమ్ ఫిజియో జహిదుల్ ఇస్లాం అప్డేట్ ఇచ్చాడు. ప్రాక్టీస్ సమయంలో ఓ బంతి నేరుగా ముస్తాఫిజుర్ రెహ్మాన్ తల ఎడమ బాగంలో బలంగా తాకింది. మేము వెంటనే స్పందించి కంప్రెషన్ బ్యాండేజ్‌తో రక్తస్రావం కాకుండా చూశాము. ఆ తర్వాత ఇంపీరియల్ ఆసుపత్రికి తరిలించి ‘సిటీ స్కాన్ చేయంచాము. అయితే అదృష్టవశాత్తూ తల పై భాగంలో మాత్రమే గాయమైంది. ఇంట్రాక్రానియల్ బ్లీడింగ్ లేదు. అతడికి తలపై కొన్ని కుట్లు పడ్డాయి. ముస్తఫిజుర్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు’ అని ప్రకటనలో జహిదుల్ ఇస్లాం పేర్కొన్నాడు. కాగా వచ్చే నెలలో బంగ్లాదేశ్ శ్రీలంక పర్యటనకు వెళ్ల నుంది. ఈ పర్యటనకు ముందే స్టార్ బౌలర్ గాయపడటం బంగ్లా జట్టును కలవరపెడుతోంది. అదే విధంగా ఐపీఎల్-2024 వేలంలో రూ. 2 కోట్లకు ముస్తాఫిజుర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ⚠️ MUSTAFIZUR RAHMAN GOT HIT BALL ON HIS HEAD During practice session of Comillael Victorians a shot from Matthew Ford, the ball hit on Mustafizur's head then start bleeding . Instantly he has taken into the hospital.#BPL2024 pic.twitter.com/sY3HaLtEc8 — bdcrictime.com (@BDCricTime) February 18, 2024 -
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన కైల్ మేయర్స్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా సిల్హెట్ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫార్చూన్ బారిషల్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బారిషల్.. కైల్ మేయర్స్ (31 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ముష్ఫికర్ రహాం (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. బారిషల్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ 19, అహ్మద్ షెహజాద్ 17, సౌమ్య సర్కార్ 8, మహ్మదుల్లా 12 నాటౌట్, మెహిది హసన్ మీరజ్ 15 పరుగులు చేశారు. స్ట్రయికర్స్ బౌలర్లలో తంజిమ్ షకీబ్ 3 వికెట్లు పడగొట్టగా.. షఫీకుల్ ఇస్లాం, హ్యారీ టెక్టార్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్ట్రయికర్స్.. బెన్నీ హోవెల్ (53), ఆరీఫుల్ హక్ (57) అర్దసెంచరీలతో రాణించినప్పటికీ లక్ష్యానికి 19 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్ట్రయికర్స్ ఇన్నింగ్స్‌లో హ్యారీ టెక్టార్ (0), జకీర్ హసన్ (5), నజ్ముల్ షాంటో (0), ర్యాన్ బర్ల్ (3) దారుణంగా విఫలం కాగా.. ఏంజెలో పెరీరా (17), మొహమ్మద్ మిథున్ (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. బారిషల్ బౌలర్లలో కైల్ మేయర్స్ (4-1-12-3) అద్భుత గణాంకాలతో అదరగొట్టగా.. సైఫుద్దీన్, మెక్కాయ్, కేశవ్ మహారాజ్, మెహిది హసన్ తలో వికెట్ పడగొట్టారు. మరో మ్యాచ్‌లో దురంతో ఢాకాపై చట్టోగ్రామ్ ఛాలెంజర్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛాలెంజర్స్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా.. ఢాకా టీమ్ లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. తంజిత్ హసన్ (70), షువగటా హోమ్ (3-0-12-2) ఛాలెంజర్స్ విజయంలో ప్రధానపాత్ర పోషించారు. -
టీ20ల్లో అత్యంత అరుదైన ఘనత సాధించిన సౌతాఫ్రికా బౌలర్
సౌతాఫ్రికా వెటరన్ బౌలర్ ఇమ్రాన్ తాహిర్ టీ20ల్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్లో 500 వికెట్లు పడగొట్టిన నాలుగో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ప్రపంచ క్రికెట్లో తాహిర్‌కు ముందు డ్వేన్ బ్రావో (624 వికెట్లు), రషీద ఖాన్ (556), సునీల్ నరైన్ (532) 500 వికెట్ల మార్కును తాకారు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో రంగ్‌పూర్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న తాహిర్.. ఖుల్నా టైగర్స్‌తో నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో తాహిర్ ఐదు వికెట్ల ఘనత సాధించి, తన జట్టును ఒంటిచేత్తో గెలిచిపించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రంగ్‌పూర్ రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. షకీబ్ అల్ హసన్ (69), మెహిది హసన్ (60) అర్దసెంచరీలతో రాణించగా.. నురుల్ హసన్ (32 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. షకీబ్ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఖుల్నా టైగర్స్ బౌలర్లలో లూక్ వుడ్ 3, నహిద్ రాణా, నసుమ్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన టైగర్స్.. ఇమ్రాన్ తాహిర్ (4-0-26-5), షకీబ్ అల్ హసన్ (3.2-0-30-2), మెహిది హసన్ (1/13), హసన్ మహమూద్ (1/29), జేమ్స్ నీషమ్ (1/5) ధాటికి 18.2 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. టైగర్స్ బౌలర్లలో అలెక్స్ హేల్స్ (60) ఒక్కడే రాణించాడు. మిగతా బ్యాటర్లు కనీసం 20 పరుగులకు మించి చేయలేకపోయారు. -
ఆల్‌రౌండ్ షోతో ఇరగదీసిన మొయిన్ అలీ.. హ్యాట్రిక్ సహా..!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో (బీపీఎల్) కొమిల్లా విక్టోరియన్స్ ఆటగాడు, ఇంగ్లండ్ ప్లేయర్ మొయిన్ అలీ ఆల్‌రౌండ్ షోతో ఇరగదీశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత మెరుపు అర్ధశతకంతో విరుచుకుపడిన మొయిన్ (24 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు).. ఆతర్వాత హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు (3.3-0-23-4) తీసి విక్టోరియన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొయిన్‌తో పాటు సహచర ఆటగాడు విల్ జాక్స్ (53 బంతుల్లో 108 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) సునామీ శతకంతో వీరంగం సృష్టించడంతో విక్టోరియన్స్ 73 పరుగుల తేడాతో చట్టోగ్రామ్ ఛాలెంజర్స్‌పై విజయం సాధించింది. బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో మొయిన్ సాధించిన హ్యాట్రిక్ ఎనిమిదవది. మొయిన్ హ్యాట్రిక్ వికెట్లతో మ్యాచ్‌కు ముగించాడు. Moeen Ali scored a fifty and took a hat-trick in the BPL match. 🤯pic.twitter.com/yIGVsgU9Lh — Mufaddal Vohra (@mufaddal_vohra) February 13, 2024 శతక్కొట్టిన విల్ జాక్స్.. మెరుపు అర్దశతకంతో విరుచుకుపడిన మొయిన్ అలీ తొలుత బ్యాటింగ్ చేసిన కొమిల్లా విక్టోరియన్స్ జాక్స్, మొయిన్ విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 239 పరుగుల భారీ స్కోర్ చేసింది. విక్టోరియన్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ లిటన్ దాస్ (31 బంతుల్లో 60; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా అర్ధసెంచరీతో మెరిశాడు. తిప్పేసిన మొయిన్, రిషద్ హొసేన్. 240 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఛాలెంజర్స్.. మొయిన్ అలీ, రిషద్ హొసేన్ (4-0-22-4) మాయాజాలం ధాటికి 166 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. ముస్తాఫిజుర్ 2 వికెట్లు తీసి విక్టోరియన్స్ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఛాలెంజర్స్ ఇన్నింగ్స్‌లో తంజిద్ హసన్ (41), సైకత్ అలీ (36), జోష్ బ్రౌన్ (36) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
ఓ పక్క రసెల్ ఊచకోత.. మరో పక్క విల్ జాక్స్ శతక్కొట్టుడు
పొట్టి ఫార్మాట్లో ఇవాళ (ఫిబ్రవరి 13) రెండు ధమాకా ఇన్నింగ్స్‌లు క్రికెట్ అభిమానులకు కనువిందు చేశాయి. వీటితో పాటు మరో రెండు మెరుపు ఇన్నింగ్స్‌లు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో వెస్టిండీస్ విధ్వంసకర యోధుడు ఆండ్రీ రసెల్ సుడిగాలి అర్ధశతకంతో (29 బంతుల్లో 71; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) రచ్చ చేయగా.. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కొమిల్లా విక్టోరియన్స్‌కు ఆడుతున్న ఇంగ్లండ్ మెరుపు వీరుడు విల్ జాక్స్ (53 బంతుల్లో 108 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) సిక్సర్ల సునామీ సృష్టించి శతక్కొట్టాడు. వీరిద్దరికి సహచరులు షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (40 బంతుల్లో 67 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మొయిన్ అలీ (24 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) తోడవ్వడంతో వారివారి జట్లు భారీ స్కోర్లు నమోదు చేశాయి. ఆసీస్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. రసెల్, రూథర్‌పోర్డ్ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేయగా.. చట్టోగ్రామ్ ఛాలెంజర్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కొమిల్లా విక్టోరియన్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 239 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో సెకెండ్ ఇన్నింగ్స్లె కొనసాగుతున్నాయి. -
సంచలన ఆరోపణలు: షోయబ్ స్పందన.. ముందుగా అనుకున్నట్లే చేశాం
తనపై వస్తున్న ఆరోపణలపై పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్, మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ స్పందించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ ఫార్చ్యూన్ బరిషల్‌తో తన బంధం ముగిసిపోలేదని స్పష్టం చేశాడు. వ్యక్తిగత కారణాల వల్లే తాను బంగ్లాదేశ్ వీడి దుబాయ్‌కు వెళ్లినట్లు తెలిపాడు. ఏకంగా మూడు నోబాల్స్ కాగా బీపీఎల్-2024 సీజన్లో బరిషల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న షోయబ్ మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. ఖుల్నా టైగర్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఒకే ఓవర్లో ఈ స్పిన్ ఆల్‌రౌండర్ ఏకంగా మూడు నోబాల్స్ వేయడం ఇందుకు కారణం. షోయబ్ మాలిక్ ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశాడంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బరిషల్ యాజమాన్యం షోయబ్ మాలిక్ కాంట్రాక్టును రద్దు చేసిందని వార్తలు వినిపించాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన షోయబ్ మాలిక్.. ‘‘ఫార్చ్యూన్ బరిషల్‌తో నా బంధం గురించి ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలను నేను ఖండిస్తున్నా. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నేను దుబాయ్‌లో ఓ మీడియా సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. అందుకే మా కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌తో చర్చించిన తర్వాతే బంగ్లాదేశ్‌ను వీడాను. ఫార్చ్యూన్ బరిషల్ రానున్న మ్యాచ్‌లలో మరింత గొప్పగా రాణించాలని కోరుకుంటున్నా. ఒకవేళ నా సేవలు అవసరమైతే తప్పకుండా మళ్లీ వాళ్లకు మద్దతుగా బరిలోకి దిగుతాను. క్రికెట్ ఆడటం అంటే నాకు ఇష్టం. ఆటను కొనసాగిస్తూనే ఉంటా’’ అని షోయబ్ మాలిక్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. అతడు మాకోసం ఎంతో చేశాడు అదే విధంగా.. ఫార్చ్యూన్ బరిషల్ యజమాని మిజానుర్ రహ్మాన్ సైతం ఈ విషయంపై స్పందించాడు. షోయబ్ మాలిక్‌పై వస్తున్న ఫిక్సింగ్ ఆరోపణలను అతడు కొట్టిపడేశాడు. ‘‘షోయబ్ మాలిక్ గొప్ప క్రికెటర్. అతడి గురించి వస్తున్న వదంతుల పట్ల నేను చింతిస్తున్నాను. మాకోసం తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. అలాంటిది అతడి గురించి మేము ఇలాంటి చెత్త ప్రచారాలు ఎలా చేస్తామనుకున్నారు’’ అని మిజానుర్ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. చదవండి: Shoaib Malik: ‘ఆమెతో మూడేళ్లుగా రిలేషన్లో షోయబ్.. భర్తకు తెలియకుండా..’ Official statement ; I would like to address and dismiss the recent rumors circulating about my playing position with Fortune Barishal. I had a thorough discussion with our captain, Tamim Iqbal, and we mutually planned the way forward. I had to leave Bangladesh for a… pic.twitter.com/kmPqPt1nxv — Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) January 26, 2024 -
షోయబ్ మాలిక్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. జట్టు నుంచి ఔట్!?
పాకిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్‌కు ఊహించని షాక్ తగిలింది. బంగ్లాదేశ్ ప్రీమీయర్ లీగ్ ఫ్రాంచైజీ ఫార్చూన్ బరిషల్ "ఫిక్సింగ్" అనుమానంతో షోయబ్ మాలిక్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. కాగా ఇప్పటికే మాలిక్ వ్యక్తిగత కారణాలతో బీపీఎల్-2024 నుంచి స్వదేశానికి వచ్చేశాడు. అంతలోనే మాలిక్‌కు ఫార్చూన్ బరిషల్ ఈ షాకిచ్చింది. ఈ లీగ్‌లో కేవలం 3 మ్యాచ్‌ల మాత్రమే ఆడాడు. అసలేం జరిగిందంటే? జనవరి 22న షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో ఫార్చ్యూన్ బరిషల్,ఖుల్నా రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన మాలిక్ ఓకే ఓవర్లో ఏకంగా మూడు నో బాల్స్ వేశాడు. ఆ ఓవర్లో మొత్తం 18 పరుగులు వచ్చాయి. సాధరణంగా స్నిన్నర్లు నో బాల్స్ చాలా అరుదుగా వేస్తుంటారు. అటువంటిది మాలిక్ ఏకంగా మూడు నో బాల్స్ వేయడం తీవ్ర అనుమానాలకు దారితీసింది. ఈ క్రమంలోనే ఫార్చూన్ బరిషల్ ఫ్రాంచైజీ మాలిక్‌పై వేటు వేసింది. కాగా ఇటీవలే మాలిక్ మూడో పెళ్లి చేసుకుని వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు విడాకులిచ్చి పాక్ నటి సనా జావేద్ ను మాలిక్ వివాహమాడాడు. చదవండి: IND vs ENG: ఆట మర్చిపోయావా గిల్.. జట్టు నుంచి తీసిపడేయండి! అతడిని తీసుకోండి? -
39/6.. ఓటమి కొరల్లో చిక్కుకున్న జట్టును గెలిపించిన బాబర్ ఆజమ్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (49 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓటమి కొరల్లో చిక్కుకున్న తన జట్టును టెయిలెండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (35 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సాయంతో విజయతీరాలకు చేర్చాడు. 39 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతున్న రంగ్‌పూర్ రైడర్స్‌ను బాబర్-ఒమర్జాయ్ జోడీ అజేయమైన 86 పరుగులు జోడించి 4 వికెట్ల తేడాతో గెలిపించింది. Flies into the BPL ✈️ Scores an unbeaten 50 🏏 Wins it for his team 💪 Boss it like Babar 👑 . .#BPL2024 #BPLonFanCode #BabarAzam pic.twitter.com/5kChUkZhHY — FanCode (@FanCode) January 23, 2024 బీపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (జనవరి 23) జరిగిన మ్యాచ్‌లో సిల్హెట్ స్ట్రయికర్స్, రంగ్‌పూర్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన స్ట్రయికర్స్.. రిపన్ మొండల్ (2/19), మెహిది హసన్ (2/18), మొహమ్మద్ నబీ (1/17), హసన్ మురద్ (1/29) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్ట్రయికర్స్ ఇన్నింగ్స్‌లో హోవెల్ (43), కట్టింగ్ (31), షాంటో (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఛేదనలో బాబర్ ఆజమ్ జట్టు రంగ్పైర్ రైడర్స్ కూడా తడబడింది. దుషన్ హేమంత ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయడంతో ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో (39/6) పడింది. అయితే బాబర్.. ఒమర్జాయ్ సహకారంతో రైడర్స్‌కు అపురూప విజయాన్ని అందించాడు. మరో వికెట్ పడకుండా ఈ ఇద్దరూ జాగ్రత్తగా ఆడి 18.2 ఓవర్లలో తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. రైడర్స్ జట్టులో ముగ్గురు డకౌట్లు కాగా.. రోనీ తాలుక్దార్ 6, నురుల్ హసన్ 8, షమీమ్ హొసేన్ 2 పరుగులు చేశారు. స్ట్రయికర్స్ బౌలర్లలో హేమంత 3, నగరవ, తంజిమ్ సకీబ్, నజ్ముల్ ఇస్లాం తలో వికెట పడగొట్టారు. చదవండి: ఫలితాలు పట్టించుకోం.. బాబర్ గెలిపించలేకపోయాడు: షాహిన్ ఆఫ్రిది