బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)ను ఈసారి ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్‌లకు ఆస్కారం లేకుండా జరిపేందుకు
ఢాకా: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)ను ఈసారి ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్‌లకు ఆస్కారం లేకుండా జరిపేందుకు నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీంట్లో భాగంగా నలుగురు బుకీలను స్టేడియం నుంచి బయటకు పంపేశారు. ‘అనుమానాస్పదంగా కనిపిస్తున్న నలుగురు బుకీలను అవినీతి వ్యతిరేక యూనిట్ అధికారులు గుర్తించారు. చట్ట ప్రకారం వారిని జైలుకు తరలించే అధికారం మాకు లేదు. కాబట్టి బయటకు పంపాం’ అని బీపీఎల్ కార్యదర్శి ఇస్మాయిల్ హైదర్ మాలిక్ తెలిపారు.