బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025 ఎడిషన్ విజేతగా ఫార్చూన్ బారిషల్ నిలిచింది. ఇవాళ (ఫిబ్రవరి 7) జరిగిన ఫైనల్లో బారిషల్.. చిట్టగాంగ్ కింగ్స్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చిట్టగాంగ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్లు ఖ్వాజా నఫే (66), పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ (78 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 121 పరుగులు జోడించారు. ఆతర్వాత వచ్చిన గ్రహం క్లార్క్ (44) కూడా రాణించడంతో కింగ్స్ భారీ స్కోర్ చేసింది. బారిషల్ బౌలర్లలో మొహమ్మద్ అలీ, ఎబాదత్ హొసేన్ తలో వికెట్ పడగొట్టారు.
195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బారిషల్‌కు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (54), తౌహిద్ హృదోయ్ (320 శుభారంభాన్ని అందించారు. అనంతరం కైల్ మేయర్స్ (46) మెరుపు ఇన్నింగ్స్ ఆడి బారిషల్‌ను విజయానికి చేరువ చేశాడు. ఆఖర్లో రిషద్ హొసేన్ (18 నాటౌట్) రెండు సిక్సర్లు బాది బారిషల్‌కు విజయాన్ని ఖరారు చేశాడు. మరో మూడు బంతులు మిగిలుండగానే బారిషల్ విజయతీరాలకు చేరింది. కింగ్స్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లాం 4 వికెట్లు తీసి బారిషల్‌ను భయపెట్టాడు. నయీమ్ ఇస్లాం 2, బినుర ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. ఫార్చూన్ బారిషల్ టైటిల్ సాధించడం వరుసగా ఇది రెండో సారి కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment