![Sairaj Bahutule Set To Join RR Under Head Coach Dravid](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/sai_0.jpg.webp?itok=FJy-gsb9)
ఐపీఎల్ 2025 (IPL) సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) కీలక ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్‌సీఏలో (National Cricket Academy) ఉన్న టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులేను (Sairaj Bahutule) స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమించుకున్నట్లు సమాచారం. బహుతులే ఎన్‌సీఏలో జాయిన్ కాకముందు 2018-21 మధ్యలో రాజస్థాన్ రాయల్స్‌కు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు.
బహుతులేతో ఆర్‌ఆర్ యాజమాన్యం తుది సంప్రదింపులు జరుపుతుందని తెలుస్తుంది. అన్నీ కుదిరితే బహుతులే ఆర్‌ఆర్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్, ఆ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి పని చేయాల్సి ఉంటుంది. 52 ఏళ్ల బహుతులే.. గతంలో రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్‌గా ఉండగా అతని అండర్‌లో పని చేశాడు. రాయల్స్‌తో చర్చలు జరుగుతున్న విషయాన్ని బహుతులే స్వయంగా క్రిక్‌బజ్‌కు తెలిపాడు.
రాయల్స్‌తో మళ్లీ కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రకటించాడు. 2023 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో స్పిన్-బౌలింగ్ కోచ్‌గా పనిచేసినప్పుడు ద్రవిడే తనను భారత జట్టుకు పరిచయం చేడని గుర్తు చేసుకున్నాడు. గతంలో శ్రీలంకలో జరిగిన సిరీస్‌లో ద్రవిడ్ కోచింగ్ స్టాఫ్‌లో తాను పని చేసిన విషయాన్ని ప్రస్తావించాడు. పాత పరిచయాల నేపథ్యంలో ద్రవిడ్‌తో పునఃకలయిక కోసం ఎదురు చూస్తున్నానని అన్నాడు. బహుతులే 1997-2003 మధ్యలో టీమిండియా తరఫున 2 టెస్ట్‌లు, 8 వన్డేలు ఆడాడు.
ట్రెంట్ రాకెట్స్‌పై ఆసక్తి చూపుతున్న రాయల్స్ యాజమాని
రాజస్థాన్ రాయల్స్ యజమాని మనోజ్ బదాలే హండ్రెడ్ లీగ్‌లో (ఇంగ్లండ్‌లో జరిగే హండ్రెడ్ బాల్ టోర్నీ) ట్రెంట్ రాకెట్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. నాటింగ్హమ్ కౌంటీకి చెందిన రాకెట్స్ ఈ సోమవారం వేలానికి రానుంది. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యానికి ఐపీఎల్‌తో పాటు కరీబియన్ ప్రీమియర్ లీగ్ (బార్బడోస్ రాయల్స్), సౌతాఫ్రికా టీ20 లీగ్‌ల్లో (పార్ల్ రాయల్స్) ఫ్రాంచైజీలు ఉన్నాయి.
హండ్రెడ్ లీగ్ విషయానికొస్తే.. ఈ లీగ్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీలైన ఎస్‌ఆర్‌హెచ్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇదివరకే పెట్టుబడులు పెట్టాయి. సదరు ఫ్రాంచైజీల యాజమాన్యాలు హండ్రెడ్ లీగ్‌లోని నార్త్రన్ సూపర్ ఛార్జర్స్, ఓవల్ ఇన్విన్సిబుల్స్, మాంచెస్టర్ ఒరిజినల్స్ ఫ్రాంచైజీలను కొనుగోలు చేశాయి.
ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టు..
సంజూ శాంసన్ (కెప్టెన్), ద్రువ్ జురెల్, కునాల్ సింగ్ రాథోడ్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్‌మైర్, శుభమ్ దూబే, యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, వనిందు హసరంగ, ఆకాశ్ మధ్వాల్, ఆశోక్ శర్మ, ఫజల్ హక్ ఫారూకీ, జోఫ్రా ఆర్చర్, కుమార్ కార్తికేయ, క్వేనా మపాకా, మహీశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, యుద్ద్‌వీర్‌సింగ్
Comments
Please login to add a commentAdd a comment