ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ నూతన హెడ్ కోచ్‌ను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ శనివారం ఆర్‌ఆర్ మేనేజ్‌మెంట్ తమ నూతన హెడ్ కోచ్‌గా టీమిండియా తాజా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరును ప్రకటించే అవకాశం ఉంది.
రాయల్స్ 2024 ఎడిషన్‌లో డెడికేటెడ్ హెడ్ కోచ్ లేకుండానే బరిలో నిలిచింది. కుమార సంగక్కర డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా.. ట్రెవర్ పెన్నీ, షేన్ బాండ్‌లు అసిస్టెంట్ కోచ్‌లుగా వ్యవహరించారు. రాయల్స్ గత సీజన్ ప్లే ఆఫ్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో ఓడింది.
కాగా, ద్రవిడ్ 2011-2013 మధ్యలో రాయల్స్ హెడ్ కోచ్‌గా పని చేశాడు. 2014 ఎడిషన్‌లో మెంటార్‌గా వ్యవహరించాడు. అనంతరం అతను భారత అండర్-19, ఇండియా-ఏ, ఎన్‌సీఏలో హెడ్ ఆఫ్ క్రికెట్, టీమిండియా హెడ్ కోచ్ వంటి హోదాల్లో పని చేశాడు. ద్రవిడ్ ఆథ్వర్యంలోనే టీమిండియా ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌ను చేజిక్కించుకుంది.
అలాగే ద్రవిడ్ హయాంలో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు.. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు కూడా చేరింది. తాజా సమాచారం మేరకు ద్రవిడ్ రాయల్స్ హెడ్ కోచ్‌గా నియమితుడైతే అసిస్టెంట్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్ ఎంపికవుతాడని తెలుస్తుంది. కుమార సంగక్కర డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా కొనసాగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment