భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్‌లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. హెడ్‌కోచ్‌గా భారత్‌కు టీ20 వరల్డ్‌కప్ అందించిన రాహుల్ ద్రవిడ్‌పై రాజస్తాన్ రాయల్స్ కన్నేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు అతడిని తమ జట్టు హెడ్‌కోచ్‌గా నియమించాలని రాయల్స్ ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే రాజస్తాన్ యాజమాన్యం ద్రవిడ్‌తో చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ద్రవిడ్ కూడా రాజస్తాన్ ఆఫర్‌పై సముఖంగా ఉన్నట్లు వినికిడి. కాగా ఈ మిస్టర్ డిఫెండ్‌బుల్‌కు రాజస్తాన్‌తో మంచి అనుబంధం ఉంది. గతంలో రాజస్తాన్‌కు కెప్టెన్‌గా, మెంటార్‌గా ద్రవిడ్ పనిచేశాడు. 2012, 2013 సీజన్లలో రాజస్తాన్ సారథిగా ద్రవిడ్ వ్యవహరించాడు.
అనంతరం 2014. 2015 సీజన్లలో రాజస్తాన్ మెంటార్‌గా తన సేవలు అందించాడు. ఇప్పుడు మరోసారి మరోసారి రాయల్స్‌తో జత కట్టేందుకు మిస్టర్ వాల్ సిద్దమైనట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. .కాగా ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్‌కు కుమార సంగక్కర డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌తో పాటు కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
సంగ్కర నుంచి కోచింగ్ బాధ్యతలు ద్రవిడ్ తీసుకునే అవకాశముంది. కాగా కోచ్‌గా కూడా ద్రవిడ్‌కు అపారమైన అనుభవం ఉంది. 2016, 2017 సీజన్లలో ఢిల్లీ డేర్‌డెవిల్స్( ఢిల్లీ క్యాపిటల్స్)కు హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ పనిచేశాడు. ఆ తర్వాత 2019 వరకు భారత అండర్-19 జట్టు హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ కొనసాగాడు. ఆ తర్వాత 2021-2024 వరకు టీమిండియా హెడ్ కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలు నిర్వర్తించాడు.
Comments
Please login to add a commentAdd a comment