IPL 2025: సన్‌రైజర్స్‌పై ముంబై ఇండియన్స్‌ విజయం | IPL 2025: Mumbai Indians Vs Sunrisers Hyderabad Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

IPL 2025: సన్‌రైజర్స్‌పై ముంబై ఇండియన్స్‌ విజయం

Apr 17 2025 7:09 PM | Updated on Apr 17 2025 11:20 PM

IPL 2025: Mumbai Indians Vs Sunrisers Hyderabad Live Updates And Highlights

Photo Courtesy: BCCI

సన్‌రైజర్స్‌పై ముంబై ఇండియన్స్‌ విజయం
ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 17) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

హార్దిక్‌ పాండ్యా వేసిన చివరి ఓవర్‌లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్‌, కమిన్స్‌ ఒకటి) సహా 22 పరుగులు, అంతకుముందు దీపక్‌ చాహర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రావడంతో సన్‌రైజర్స్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ 40, ట్రవిస్‌ హెడ్‌ 28, ఇషాన్‌ కిషన్‌ 2, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 19, క్లాసెన్‌ 37, అనికేత్‌ 18 (నాటౌట్‌), కమిన్స్‌ 8 (నాటౌట్‌) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్‌ జాక్స్‌ 2, బౌల్ట్‌, బుమ్రా, హార్దిక్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై మరో 11 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది (6 వికెట్ల నష్టానికి). ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్‌ 31, రోహిత్‌ శర్మ 26, విల్‌ జాక్స్‌ 36, సూర్యకుమార్ యాదవ్‌ 26, హార్దిక్‌‌ 21, తిలక్‌ 17 (నాటౌట్‌) పరుగులు చేశారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో కమిన్స్‌ 3, ఎషాన్‌ మలింగ 2, హర్షల్‌ పటేల్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన ముంబై
14.3వ ఓవర్‌- 128 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్‌ కోల్పోయింది. కమిన్స్‌ బౌలింగ్‌లో అన్సారీకి క్యాచ్‌ ఇచ్చి విల్‌ జాక్స్‌ (36) ఔటయ్యాడు. 

మూడో వికెట్‌ కోల్పోయిన ముంబై
12.4వ ఓవర్‌- 121 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. కమిన్స్‌ బౌలింగ్‌లో జీషన్‌ అన్సారీకి క్యాచ్‌ ఇచ్చి సూర్యకుమార్‌ యాదవ్‌ (26) ఔటయ్యాడు. 

9 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 82/2
9 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 82/2గా ఉంది. రోహిత్‌ ఔటయ్యాక మరో ఓపెనర్‌ రికెల్టన్‌ (31) కూడా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం విల్‌ జాక్స్‌ (14), సూర్యకుమార్‌ యాదవ్‌ (8) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ముంబై గెలవాలంటే 66 బంతుల్లో మరో 81 పరుగులు చేయాలి.

హ్యాట్రిక్‌ ఫోర్లతో రఫ్ఫాడించిన రికెల్టన్‌
ఎషాన్‌ మలింగ బౌలింగ్‌లో (6వ ఓవర్‌) రికెల్టన్‌ హ్యాట్రిక్‌ ఫోర్లతో రఫ్ఫాడించాడు. 5.5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 54/1. రికెల్టన్‌ 21, విల్‌ జాక్స్‌ 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన ముంబై.. రోహిత్‌ ఔట్‌
163 పరుగుల లక్ష్య ఛేదనలో ధాటిగా ఇన్నింగ్స్‌ ప్రారంభించిన రోహిత్‌ శర్మ మూడు సిక్సర్లు బాదిన అనంతరం ఔటయ్యాడు. రోహిత్‌ 16 బంతుల్లో 26 పరుగులు చేసి కమిన్స్‌ బౌలింగ్‌లో హెడ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 3.5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 32/1గా ఉంది. రికెల్టన్‌ (5), జాక్స్‌ క్రీజ్‌లో ఉన్నారు.

సత్తా చాటిన ముంబై బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన సన్‌రైజర్స్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్‌ పాండ్యా వేసిన చివరి ఓవర్‌లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్‌, కమిన్స్‌ ఒకటి) రావడంతో సన్‌రైజర్స్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ 40, ట్రవిస్‌ హెడ్‌ 28, ఇషాన్‌ కిషన్‌ 2, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 19, క్లాసెన్‌ 37, అనికేత్‌ 18 (నాటౌట్‌), కమిన్స్‌ 8 (నాటౌట్‌) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్‌ జాక్స్‌ 2, బౌల్ట్‌, బుమ్రా, హార్దిక్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

18.1 ఓవర్ల తర్వాత 136/5
అనికేత్‌ వర్మ (1), కమిన్స్‌

నత్తనడకన సాగుతున్న ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ నిదానంగా బ్యాటింగ్‌ చేస్తుంది. ఆ జట్టు ఇన్నింగ్స్‌ నత్తనడకను తలపిస్తుంది. అభిషేక్‌ (40), హెడ్‌ (28), ఇషాన్‌ (2) ఔట్‌ కాగా.. నితీశ్‌ (14), క్లాసెన్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు. 14 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్‌ స్కోర్‌ 95/3గా ఉంది. 

మూడో వికెట్‌ డౌన్‌.. హెడ్‌ ఔట్‌
11.1వ ఓవర్‌- 82 పరుగుల వద్ద సన్‌రైజర్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. అప్పటికే రెండు లైఫ్‌లు లభించిన హెడ్‌ (28) విల్‌ జాక్స్‌ బౌలింగ్‌లో సాంట్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 

రెండో వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌.. ఇషాన్‌ కిషన్‌ ఔట్‌
8.4వ ఓవర్‌- 68 పరుగుల వద్ద సన్‌రైజర్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. విల్‌ జాక్స్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌ (2) స్టంపౌటయ్యాడు. హెడ్‌ (22), నితీశ్‌ క్రీజ్‌లో ఉన్నారు.  

తొలి వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌.. అభిషేక్‌ ఔట్‌
7.3వ ఓవర్‌-సన్‌రైజర్స్‌ 59 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో రాజ్‌ బవాకు క్యాచ్‌ ఇచ్చి అభిషేక్‌ శర్మ (40) ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్‌ స్కోర్‌ 65/1గా ఉంది. హెడ్‌ (20), ఇషాన్‌ కిషన్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. 

7 ఓవర్ల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌ 53/0
అభిషేక్‌ 36, ట్రవిస్‌ హెడ్‌ 14

కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్న ముంబై బౌలర్లు
టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ముంబై.. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్లు అభిషేక్‌, హెడ్‌ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తొలి నాలుగు ఓవర్లు చాహర్‌, బౌల్ట్‌, బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. 

ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్లు కేవలం బాదడమే లక్ష్యంగా పెట్టుకుని సఫలం కాలేకపోతున్నారు. 4 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 29/0గా ఉంది. అభిషేక్‌ 20, హెడ్‌ 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 17) ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై ఏడులో, ఎస్‌ఆర్‌హెచ్‌ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.

తుది జట్లు..
ముంబై ఇండియన్స్‌: ర్యాన్ రికెల్టన్ (వికెట్‌కీపర్‌), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, కర్ణ్ శర్మ

ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ సబ్స్: రోహిత్ శర్మ, కార్బిన్ బాష్, అశ్వని కుమార్, రాజ్ బావా, రాబిన్ మింజ్

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌కీపర్‌), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, ఎషాన్ మలింగ

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ సబ్‌లు: అభినవ్ మనోహర్, జయదేవ్ ఉనద్కత్, సచిన్ బేబీ, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement