
ద్రవిడ్ (PC: RR X)
తమ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) గాయంపై రాజస్తాన్ రాయల్స్ అప్‌డేట్ అందించింది. ‘ది వాల్’ కోలుకుంటున్నాడని.. త్వరలోనే పూర్తిస్థాయిలో టీమ్‌తో చేరతాడని తెలిపింది. కాగా ఇటీవల ద్రవిడ్ క్లబ్ క్రికెట్ ఆడిన విషయం తెలిసిందే.
తన చిన్న కుమారుడు అన్వయ్‌తో కలిసి నసుర్ మెమొరియల్ షీల్డ్ టోర్నీలో ద్రవిడ్ పాల్గొన్నాడు. యంగ్ లయన్స్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన ద్రవిడ్ 10 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగానే రాహుల్ ద్రవిడ్ గాయపడినట్లు సమాచారం. దీంతో రాజస్తాన్ రాయల్స్ ముందస్తు శిక్షణా శిబిరంలో పాల్గొనలేకపోయాడు.
కాలికి కట్టు అలాగే ఉండటంతో
అయితే, తాజాగా అతడు జట్టుతో చేరాడు. ఈ విషయాన్ని రాజస్తాన్ రాయల్స్ బుధవారం వెల్లడించింది. ‘‘బెంగళూరులో క్రికెట్ ఆడుతున్న సమయంలో గాయపడిన మా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కోలుకుంటున్నారు.
ఈరోజే జైపూర్‌లో ఆయన మాతో చేరతారు’’ అని ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా రాయల్స్ జెర్సీలో థమ్సస్ సింబల్ చూపిస్తున్న ద్రవిడ్ ఫొటోను పంచుకుంది. అయితే, అతడి ఎడమకాలికి ఇంకా కట్టు ఉండటం గమనార్హం.
ఇక ఈ ఫొటో వైరల్‌గా మారగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఆటగాళ్లు గాయపడ్డారనే వార్తలు చదివాం గానీ.. ఇలా హెడ్ కోచ్‌కు ఇంజూరీ కావడం ఇదే తొలిసారి కావొచ్చు అంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘వాల్’ కాస్త పెద్దవాడైపోయాడని.. క్రికెట్ ఆడే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ హితవుపలుకుతున్నారు.
కాగా టీమిండియా టీ20 ప్రపంచకప్-2024లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత జట్టు హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ప్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్‌తో జట్టుకట్టాడు. ఈ ఏడాది నుంచి రాజస్తాన్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు. గతంలోనూ ద్రవిడ్ ఈ ఫ్రాంఛైజీతో పనిచేశాడు.
ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ జట్టు
సంజూ శాంసన్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, శుభం దూబే, వైభవ్ సూర్యవంశీ, కునాల్ రాథోడ్, షిమ్రన్ హెట్‌మెయిర్, నితీశ్ రాణా, యుధ్‌వీర్ సింగ్, జోఫ్రా ఆర్చర్, మహీశ్ తీక్షణ, వనిందు హసరంగ, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తికేయ సింగ్, తుషార్ దేశ్‌పాండే, ఫజల్‌హక్ ఫారూకీ, క్వెనా మఫాకా, అశోక్ శర్మ, సందీప్ శర్మ.
రాజస్తాన్ రాయల్స్ కోచింగ్ సిబ్బంది
హెడ్‌కోచ్- రాహుల్ ద్రవిడ్
డైరెక్టర్ ఆఫ్ క్రికెట్- కుమార్ సంగక్కర
ఫాస్ట్ బౌలింగ్ కోచ్- షేన్ బాండ్
బ్యాటింగ్ కోచ్- విక్రమ్ రాథోడ్
ఫీల్డింగ్ కోచ్- దిశాంత్ యాగ్నిక్.
చదవండి: IND vs ENG: గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఇంత వరకు ఏ కోచ్ చేయని విధంగా..
Head Coach Rahul Dravid, who picked up an injury while playing Cricket in Bangalore, is recovering well and will join us today in Jaipur 💗 pic.twitter.com/TW37tV5Isj
— Rajasthan Royals (@rajasthanroyals) March 12, 2025
Comments
Please login to add a commentAdd a comment