Sairaj
-
ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ
కౌలాలంపూర్: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టి 21–10, 16–21, 21–5తో మింగ్ చె లు–టాంగ్ కాయ్ వె (చైనీస్ తైపీ)లపై గెలుపొందారు. 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ తొలి గేమ్‌ను నెగ్గినా... రెండో గేమ్‌లో తడబడింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో సాతి్వక్–చిరాగ్ చెలరేగి ప్రత్యర్థి జోడీ ఆట కట్టించారు. సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోగా... ప్రియాన్షు రజావత్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రణయ్ 21–12, 17–21, 21–15తో బ్రియాన్ యాంగ్ (కెనడా)పై నెగ్గగా... ప్రియాన్షు 11–21, 16–21తో ఏడో సీడ్ షి ఫెంగ్ లీ (చైనా) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... అనుపమా , ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. మాళవిక 21–15, 21–16తో గో జిన్ వె (మలేసియా)పై విజయం సాధించగా... ఆకర్షి 14–21, 12–21తో జూలీ జేకబ్సన్ (డెన్మార్క్) చేతిలో, అనుపమ 17–21, 21–18, 8–21తో పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలయ్యారు. -
అంతర్జాతీయ ఖోఖోలో.. 'సైరా' అనిపించిన తెలంగాణ సాయిరాజ్..
ఆదిలాబాద్: లోకేశ్వరం మండలంలోని మన్మద్ గ్రామానికి చెందిన సాయిరాజ్ అంతర్జాతీయ ఖోఖో పోటీల్లో ఇండియా తరఫున పాల్గొని బంగారు పతకాన్ని సాధించాడు. ఇటీవల నేపాల్దేశంలో జరిగిన అంతర్జాతీయ ఖోఖో పోటీల్లో రాణించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో కోచ్ అన్నపూర్ణ, గ్రామస్తులు అతడిని అభినందించారు. -
శభాష్ సాత్విక్
సాక్షి, అమలాపురం: కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ప్రతిష్టాత్మక థామస్ కప్‌ను గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడు కావడం పట్ల ఈ ప్రాంతంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. డబుల్స్‌లో సాత్విక్.. చిరాగ్ శెట్టితో కలిసి ఆడాడు. గతంలో కామన్వెల్త్ క్రీడల్లో భారత జట్టు తరఫున బంగారు, రజత పతకాలు సాధించాడు. ఒలింపిక్స్‌లో పతకం త్రుటిలో చేజారింది. అయినా వెరవకుండా పలు అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతున్నాడు. సాత్విక్ విజయం పట్ల అమలాపురంలో పలువురు కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చారు. సాత్విక్ ఎదుగుదల వెనుక అతడి తండ్రి రంకిరెడ్డి కాశీ విశ్వనాథ్ పాత్ర కీలకం. కాశీ విశ్వనాథ్ పాఠశాలలో పీడీగా పని చేస్తూ హెచ్ఎంగా పదోన్నతి పొందాక రిటైరయ్యారు. పైగా షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఇదే క్రీడలో స్టేట్ రిఫరీగా పని చేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు. ఇద్దరూ అమలాపురం ఆఫీసర్స్ క్లబ్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్‌లో శిక్షణ పొందారు. చిన్నవాడైన సాత్విక్ క్రీడను సీరియస్‌గా తీసుకుని రాణించాడు. 2015 నుంచి హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. మ్యాచ్ గెలుస్తానని అనుకోలేదు తొలి సెట్లో ఓడిపోయాం. రెండో సెట్లో 20–17 తేడాతో వెనుకబడ్డాం. ఆ సమయంలో ప్రత్యర్థులు చేసిన చిన్న తప్పిదం మాకు అనుకూలంగా మారింది. ఆ సెట్ గెలిచాం. అదే ఊపులో మూడో సెట్ కూడా గెలిచాం. నాన్న, అమ్మ ఆ సమయంలో తిరుపతిలో ఉన్నారు. స్వామి కరుణించారు. అందుకే కలలో కూడా ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. నేను గెలిచాననే ఆనందం కన్నా భారత జట్టు విజయం సాధించడం రెట్టింపు సంతోషాన్నిస్తోంది. – సాత్విక్ చిన్నప్పటి నుంచీ ఆటపై మక్కువ సాత్విక్ నాలుగో సంవత్సరం నుంచే నాతో పాటు స్టేడియానికి వచ్చేవాడు. స్థానిక క్లబ్లో శిక్షణ శిబిరాలు నిర్వహించడం, నాతో పాటు అక్కడకు రావడం వల్ల సాత్విక్‌కు ఆటపై మక్కువ పెరిగింది. జిల్లా స్థాయిలో తొలిసారి అండర్–9కు ఎంపికయ్యాడు. అక్కడి నుంచి ఆరంభమైన కెరీర్ అంతర్జాతీయ స్థాయి వరకూ వెళ్లడం మాకు చాలా సంతోషాన్నిస్తోంది. మంచి క్రీడాకారుడవుతాడని ఆశించాను కానీ ఈ స్థాయిని ఊహించలేదు. థామస్ కప్ గెలవడం సాత్విక్ కెరీర్లో గొప్ప విజయంగా నిలిచిపోతుంది. మొదట్లో సాత్విక్‌తో కలిసి ఆడిన కృష్ణప్రసాద్ కూడా ఇప్పుడు గెలిచిన జట్టులో ఉండడం చాలా సంతోషాన్నిస్తోంది. – రంకిరెడ్డి కాశీవిశ్వనాథ్, సాత్విక్ తండ్రి ఆ మ్యాచ్ చూడలేదు సాత్విక్ ఆడిన ఫైనల్ మ్యాచ్ మేము చూడలేదు. ఆ సమయంలో మేమిద్దరం (సాత్విక్ తల్లిదండ్రులు) తిరుమలలో స్వామి వారి కల్యాణంలో ఉన్నాము. బయటకు రాగానే విషయం తెలిసింది. ఈ విజయం ఊహించలేదు. సాత్విక్ ఇంతటి ఘన విజయం సాధించడం పట్ల తల్లిదండ్రులుగా చాలా ఆనందంగా ఉంది. దీనిని మాటల్లో వర్ణించలేం. భారత జట్టుకు అభినందనలు. కోచ్‌లకు, క్రీడాభిమానులకు కృతజ్ఞతలు. – రంకిరెడ్డి రంగమణి, సాత్విక్ తల్లి దటీజ్ కృష్ణప్రసాద్ థామస్ కప్ గెలిచిన షటిల్ బాడ్మింటన్ బృందంలో మరో ఆటగాడు కాకినాడకు చెందిన గరగ కృష్ణప్రసాద్ తండ్రి గంగాధర్ ప్రోద్బలంతో షటిల్ బ్యాడ్మింటన్‌లో ప్రవేశించాడు. గంగాధర్ గత డిసెంబర్లో అనారోగ్యంతో మృతి చెందారు. తన కొడుకును అంతర్జాతీయ క్రీడాకారునిగా తీర్చిదిద్దేందుకు ఆయన అహర్నిశలూ కృషి చేశారు. గంగాధర్ సైతం షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. గతంలో ఆంధ్రా యూనివర్సిటీ బ్యాడ్మింటన్ జట్టు కెప్టెన్‌గా ఉన్నారు. క్రికెట్లో సైతం రాణించారు. తండ్రి గంగాధర్‌తో కృష్ణప్రసాద్ తండ్రి బాటలోనే కొడుకు కృష్ణప్రసాద్ కూడా షటిల్ బ్యాడ్మింటన్‌లో రాణించడం విశేషం. కృష్ణప్రసాద్‌కు మొదటి నుంచీ పట్టుదల ఎక్కువ. సాత్విక్‌తో కలిసి పలు టోర్నీలు ఆడిన కృష్ణప్రసాద్ 2011లో గోపీచంద్ అకాడమీలో చేరాడు. తొలుత సింగిల్స్ ఆడిన కృష్ణప్రసాద్ 2015 నుంచి డబుల్స్‌పై దృష్టి పెట్టాడు. మూడేళ్లలోనే జూనియర్ డబుల్స్ విభాగం ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎదిగాడు. 2019లో దక్షిణాసియా బ్యాడ్మింటన్ పోటీల్లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. తాజా విజయం పట్ల దటీజ్ కృష్ణప్రసాద్.. అంటూ ఈ ప్రాంత షటిల్ క్రీడాకారులు కొనియాడుతున్నారు. అందరికీ గర్వకారణం థామస్ కప్ సాధించిన భారత బ్యాడ్మింటన్ బృందంలో తెలంగాణకు చెందిన విష్ణువర్ధన్ గౌడ్ కూడా ఉన్నాడు. ఈ చరిత్రాత్మక గెలుపుపై ‘సాక్షి’ విష్ణువర్ధన్ గౌడ్ తల్లిదండ్రుల స్పందన కోరగా వారు తమ బిడ్డ గెలుపు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సుదీర్ఘ విరామం తర్వాత భారత బ్యాడ్మింటన్ టీమ్ సాధించిన గెలుపు భారతీయులందరికీ గర్వకారణమన్నారు. గర్వంగా ఉంది చాలా ఆనందంగా ఉంది. మాది క్రీడా కుంటుంబం. ఓ క్రీడాకారుడిగా నా కుమారుడు ప్రపంచ కప్ గెలిచిన టీంలో ఉండడం గర్వంగా ఉంది. 73 ఏళ్ల తర్వాత ఈ క్రీడలో భారత్‌కు కప్ రావడం అందులో నా కుమారుడు ఉండడం అదృష్టం. – విష్ణువర్ధన్‌గౌడ్ తండ్రి వెంకటేశ్‌గౌడ్ సంతోషంగా ఉంది నా కుమారుడు అంతర్జాతీయ స్థాయిలో ఆడి భారత దేశానికి కప్ తీసుకురావడం సంతోషంగా ఉంది. ఎంతో పట్టుదలతో శిక్షణ పొందాడు. కుటుంబమంతా అన్ని విధాలా అండగా అన్ని వేళలా ప్రోత్సహించాం. దానికి తగ్గ ఫలితం వచ్చింది. – విష్ణువర్ధన్‌గౌడ్ తల్లి సుహాసిని -
Konaseema: ఆటే శ్వాస... సాధనే జీవితం.. ఫైనల్స్‌కు చేరిన భారత జట్టులో
సాక్షి, అమలాపురం: ‘మెరుపై సాగరా... ఆ గెలుపే నీదిరా... నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా... నిప్పులు చిందినా.. ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా’ అంటూ ఓ సినీ కవి రాసిన పాట ఈ యువకుని జీవితానికి అతికినట్టు సరిపోతోంది. పన్నెండేళ్ల ప్రాయంలోనే లక్ష్యాన్ని నిర్ణయించుకుని బంధాలకు.. అనుబంధాలకు దూరంగా ఉంటూ ఇష్టాలను వదులుకుని.. కష్టాల సాధనకు ఉపక్రమించాడు అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాయిరాజ్ సాత్విక్. అప్పటి వరకూ ఆట విడుపుగా ఆడుతున్న షటిల్ బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలనే దృఢ నిశ్చయానికి వచ్చే నాటికి ఇతని వయస్సు పన్నెండేళ్లు. అప్పటి నుంచీ ఆటే శ్వాసగా.. సాధనే జీవితంగా బతుకుతున్నాడు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తున్నాడు. తక్కువ సమయంలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. కఠోర సాధన గోపీచంద్ అకాడమీలో పన్నెండో ఏట నుంచే సాత్విక్ శిక్షణ పొందుతున్నాడు. 15వ ఏట తొలి అంతర్జాతీయ టోర్నీలో పాల్గొన్నాడు. అంతకుముందు అమలాపురం ఆఫీసర్స్ క్లబ్లో శిక్షణ పొందేవాడు. ఉదయం సాయంత్రం కలిపి మూడు విడతలుగా తొమ్మిది గంటల పాటు సాధన చేయాలి. వ్యాయామం, ఆటలో మెళకులు నేర్చుకోవడం.. ఈ రెండూ ప్రధానమే. టోర్నీలు లేకున్నా రోజువారీ సాధనలో మార్పులుండవు. టోర్నీలు లేవని విశ్రాంతి తీసుకోవడం కుదరదు. యంత్రంలా సాధన చేయడమే. ఇంటికి వచ్చేది కూడా మూడు నాలుగు నెలలకు ఒకసారి మాత్రమే. ఉండేది రెండు మూడు రోజులే. ఇష్టానుసారం తినే అవకాశం లేదు. ప్రొటీన్ల కోసం చికెన్, ఎగ్ వంటివి తప్పవు. బిర్యానీలు.. పీజాలు.. బర్గర్లకు దూరం. స్వీట్లు.. కూల్‌డ్రింక్‌లు దరిదాపులకు రానివ్వకూడదు. చదవండి: (సైమండ్స్‌కు ఐసీసీ నివాళి.. పాకిస్తాన్‌పై 143 నాటౌట్ వీడియో ట్వీట్) ఒలింపిక్స్ పతకం జేజారినా? గెలుపోటములను సమానంగా స్వీకరించడం గొప్ప విజయమే. క్రికెట్ మినహా మిగిలిన క్రీడాకారుల లక్ష్యం ఒలింపిక్స్‌లో పతక సాధన. గత ఏడాది జపాన్‌లో జరిగిన ఒలింపిక్స్ డబుల్స్ విభాగంలో సహచరుడు చిరాగ్ శెట్టితో కలిసి సాత్విక్ మూడు మ్యాచ్‌లకు గాను, రెండు మ్యాచ్‌లు గెలిచినా పాయింట్లు తక్కువ కావడంతో క్వార్టర్స్‌కు వెళ్లే అవకాశం కోల్పోయారు. లేకుంటే ఒలింపిక్స్‌లో సాయిరాజ్ సాత్విక్ జంట ఏదో పతకాన్ని సాధించేది. జీవితాశయమైన ఒలింపిక్ పతకం త్రుటిలో చేజారినా సాత్విక్ కుంగిపోలేదు. ఆ ఓటమి నుంచి వెంటనే కోలుకున్నాడు. ఆటపై దృష్టి పెట్టి ముమ్మర సాధన చేస్తున్నాడు. చదవండి: (Andrew Symonds: ఆండ్రూ సైమండ్స్ మృతి.. దిగ్గజ క్రికెటర్ల సంతాపం) ►ఒలింపిక్స్ తరువాత ఫ్రాన్స్‌లో జరిగిన సూపర్ –750లో ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఇండియన్ ఓపెన్–500 విజేతగా నిలవడం, అది కూడా గతంలో మూడుసార్లు విజేతగా నిలిచిన జట్టుపై గెలవడం ద్వారా అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో సాత్విక్ మరోసారి మెరిశాడు. ►ఒలింపిక్స్‌కు ముందు సాత్విక్ కామన్వెల్త్ క్రీడా పోటీల్లో స్వర్ణ, రజత పతకాలు సాధించాడు. 2021లో అర్జున్ అవార్డు అందుకున్నాడు. ►బ్యాడ్మింటన్ క్రీడలో థామస్ కప్ కీలకమైంది. అటువంటి మెగా టోర్నీలో భారత జట్టు తొలిసారి ఫైనల్స్‌కు చేరింది. ఈ జట్టులో సాత్విక్, చిరాగ్‌శెట్టి జోడీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో 1979లో మాత్రమే భారత్ జట్టు సెమీస్ చేరింది. ఈసారి జట్టు ఫైనల్స్‌కు చేరడం, అందులో సాత్విక్ కీలక పాత్ర పోషించడం విశేషం. టీవీలో చూడటమే ఎక్కువ షటిల్ బ్యాడ్మింటన్‌కు వెళ్లిన తరువాత సాత్విక్‌ను చాలా మిస్సవుతున్నాను. వాడిని దగ్గర నుంచి చూసిన దానికన్నా వాడి ఆటను టీవీలో చూడటమే ఎక్కువ. దూరంగా ఉంటున్నా వాడు సాధిస్తున్న విజయాలు అన్నింటినీ మరిచిపోయేలా చేస్తోంది. థామస్ కప్‌ను భారత్ జట్టు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. – రంకిరెడ్డి రంగమణి, సాత్విక్ తల్లి, అమలాపురం కొన్ని కావాలంటేకొన్ని వదులుకోవాలి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలంటారు. నేను అంతర్జాతీయ క్రీడాకారుడిని కావడానికి చాలా వదులుకోవాల్సి వచ్చింది. సాధిస్తున్న విజయాల వల్ల చాలా సంతోషాలకు దూరమయ్యానని బాధ లేదు. కుటుంబంతో గడిపేది తక్కువే అయినా నాన్న, అమ్మ, అన్న, స్నేహితులతో గడిపే క్షణాలు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటూనే ఉంటాను. – సాత్విక్ సాయిరాజ్ -
వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం
-
కిట్స్ విద్యార్థి అనుమానాస్పద మృతి
వరంగల్ : కిట్స్ కళాశాల విద్యార్థి సాయిరాజ్ అనుమానాస్పద మృతిపై కలకలం రేగింది. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయిరాజ్‌ను గురువారం సాయంత్రం సీనియర్ విద్యార్థులు ములుగులో పెళ్లి ఉందంటూ బలవంతంగా తీసుకువెళ్లారు. అయితే పెళ్లి ఊరేగింపు సందర్భంగా గొడవ జరిగిందని, గాయపడిన అతడిని ఎంజీఎంలో చేర్చినట్లు సీనియర్ విద్యార్థులు చెబుతున్నారు. అయితే అప్పటికే సాయిరాజ్ చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా, తమ కుమారుడిని సీనియర్ విద్యార్ధులు పొట్టనబెట్టుకున్నారని సాయిరాజ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చెలరేగిన సాయిరాజ్, నరేశ్
► ఎ డివిజన్ రెండు రోజుల లీగ్ ► నేషనల్ సీసీ 362/4 డిక్లేర్డ్ హైదరాబాద్: నేషనల్ సీసీ బ్యాట్స్‌మెన్ సాయిరాజ్ ప్రశాంత్‌రెడ్డి (139 బంతుల్లో 166; 23 ఫోర్లు), నమని నరేశ్ (128 బంతుల్లో 112; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగారు. ఇద్దరు సెంచరీలతో కదంతొక్కారు. దీంతో గురువారం మొదలైన ఈ రెండు రోజుల మ్యాచ్‌లో తొలిరోజు నేషనల్ సీసీ 63 ఓవర్లలో 4 వికెట్లకు 362 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పీకేసీసీ ఆట నిలిచేసమయానికి 27 ఓవర్లలో 6 వికెట్లకు 73 పరుగులు చేసింది. ప్రణవ్ సూర్య 32 పరుగులు చేయగా, హరి శివప్రసాద్ 4 వికెట్లు తీశాడు. మిగతా మ్యాచ్‌ల స్కోర్లు ఉస్మానియా: 226 (కృపాకర్ 51, తరుణ్ 48; సాధన్ 3/66, అహ్మద్ 3/49), న్యూబ్లూస్: 103/2 (భగత్ ప్రతాప్ 46). గ్రీన్‌టర్ఫ్: 376 (కుస్రో కిస్టి 96, అక్షయ్ 76, గోపీనాథ్ 45; సందీప్ 4/38), నిజామ్ కాలేజ్‌తో మ్యాచ్. విజయ్ హనుమాన్: 231 (శశధర్ 64, శివ కుమార్ 62; సచిన్ హరిశ్చంద్ర 5/32), మహమూద్ సీసీ: 52/0. స్పోర్టీవ్ సీసీ: 79/9 (వివేక్ 30, జగదీశ్ 4/27, పొన్నయ్య 3/14), మాంచెస్టర్: 311/9 (నరేశ్ 62, సాయికుమార్ 48, శ్రవణ్ 40; అనుదీప్ 3/56, ఆసిఫ్ 3/64). అగర్వాల్ సీనియర్స్: 178 (ఫరాజ్ 32, అలీఖాన్ 36, విశాల్ 36; హరిబాబు 4/37), ఎస్బీఐ: 38/2. ఫ్యూచర్ స్టార్స్: 244/3 (రోహన్ 91, అంకిత్ 63 బ్యాటింగ్, వికాస్ రావు 45 బ్యాటింగ్), ఆక్స్ఫర్డ్బ్లూస్తో మ్యాచ్. -
ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
శ్రీకాకుళం సిటీ: శ్రీకాకుళం రూరల్ మండలంలోని గాయత్రి కాలేజీకి చెందిన సీనియర్ ఇంటర్ విద్యార్థి ముప్పల సాయిరాజ్(17) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం ఉదయం కాలేజీ హాస్టల్ గదిలో చోటు చేసుకుంది. కడుపునొప్పి భరించలేకే బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చునని యాజమాన్యం చెబుతోంది. ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిప్పులు చెరిగిన వినోద్
సాక్షి, హైదరాబాద్: గోల్కొండ జట్టు బౌలర్ వినోద్ (6/40) నిప్పులు చెరగడంతో రంగారెడ్డి జిల్లా జట్టు పరాజయం చవిచూసింది. ఎ12-డివిజన్ వన్డే లీగ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గోల్కొండ జట్టు 5 వికెట్ల తేడాతో రంగారెడ్డిపై గెలుపొందింది. మొదట రంగారెడ్డి జట్టు 135 పరుగులకే ఆలౌటైంది. కిరిటీ 33, అఖిలేశ్ 26 పరుగులు చేశారు. గోల్కొండ బౌలర్ హరికుమార్ 4 వికెట్లు తీశాడు. తర్వాత గోల్కొండ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సాయిరాజ్ (67) అర్ధసెంచరీ సాధించగా, రంగారెడ్డి బౌలర్ నిర్భయ్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు అక్షిత్ సీసీ: 134 (శ్రీకల్ 30; సలీమ్ ఆరిఫ్ 5/20), సీకే ఆక్రిలిక్: 135/3 (ఆరిఫ్ 54). నోబుల్ సీసీ: 194/9 (అనదీప్ 37, ప్రణమ్ 31; కపిల్ వ్యాస్ 5/46, నైరుత్ 2/27), డబ్ల్యూఎంసీసీ: 195/4 (నినాంత్ రెడ్డి 100). ఎంపీ బ్లూస్: 305/5 (రాజు 111, వరుణ్ 100, సతీశ్ 45), నవజీవన్ ఫ్రెండ్స్: 89 (సతీశ్ 5/23, హరినారాయణ 3/5) ఎలెవన్ మాస్టర్స్: 175 ( అమిత్ 3/51, ప్రవీణ్ 4/41), సూపర్ స్టార్: 176/7.