కిట్స్‌ విద్యార్థి అనుమానాస్పద మృతి | KITS engineering student sairaj mysterious death in warangal | Sakshi
Sakshi News home page

కిట్స్‌ విద్యార్థి అనుమానాస్పద మృతి

Published Fri, Mar 17 2017 10:20 AM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM

KITS engineering student sairaj mysterious death in warangal

వరంగల్‌ : కిట్స్‌ కళాశాల  విద్యార్థి సాయిరాజ్‌ అనుమానాస్పద మృతిపై కలకలం రేగింది. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయిరాజ్ను గురువారం సాయంత్రం సీనియర్‌ విద్యార్థులు ములుగులో పెళ్లి ఉందంటూ బలవంతంగా తీసుకువెళ్లారు.

అయితే పెళ్లి ఊరేగింపు సందర్భంగా గొడవ జరిగిందని, గాయపడిన అతడిని ఎంజీఎంలో చేర్చినట్లు సీనియర్‌ విద్యార్థులు చెబుతున్నారు. అయితే అప్పటికే సాయిరాజ్‌ చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా, తమ కుమారుడిని సీనియర్ విద్యార్ధులు పొట్టనబెట్టుకున్నారని సాయిరాజ్‌ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement