ఒటావా: కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లో భారత సంతతికి చెందిన దంపతులు, వారి కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ నెల 7వ తేదీ రాత్రి బ్రాంప్టన్‌లోని వారి నివాసంలో మంటలు చెలరేగి సజీవ దహనమయ్యారు. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలకు పోలీసులు పరీక్షలు జరిపారు.
ఈ పరీక్షల ద్వారా మృతులను ఆ ఇంట్లో నివాసం ఉండే రాజీవ్ వరికూ(51), భార్య శిల్ప కొత్త(47) వారి కుమార్తె మహెక్ వరికూ(16)గా నిర్ధారించారు. మంటలు చెలరేగటానికి ముందు ఆ ఇంట్లో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్లు చుట్టుపక్కల వారు తెలిపారు. ఘటనపై ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదంగా భావించడం లేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment