mysterious death
-
Canada: భారత సంతతి ఫ్యామిలీ అనుమానాస్పద మృతి
ఒటావా: కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లో భారత సంతతికి చెందిన దంపతులు, వారి కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ నెల 7వ తేదీ రాత్రి బ్రాంప్టన్‌లోని వారి నివాసంలో మంటలు చెలరేగి సజీవ దహనమయ్యారు. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలకు పోలీసులు పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల ద్వారా మృతులను ఆ ఇంట్లో నివాసం ఉండే రాజీవ్ వరికూ(51), భార్య శిల్ప కొత్త(47) వారి కుమార్తె మహెక్ వరికూ(16)గా నిర్ధారించారు. మంటలు చెలరేగటానికి ముందు ఆ ఇంట్లో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్లు చుట్టుపక్కల వారు తెలిపారు. ఘటనపై ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదంగా భావించడం లేదని తెలిపారు. ఇదీ చదవండి.. నేరగాళ్ల గుప్పిట్లో హైతీ -
అప్పటికే సూపర్ స్టార్,రెండో పెళ్లి.. ఇప్పటికీ మిస్టరీగా చమ్కీలా మరణం
మనసులో పుట్టిన మాటలకు బాణీ కట్టి రాగం అందుకుంటే, అది మహామహా జనసందోహాలను కూడా ఏకం చేసి ఉరకలేయిస్తుంది. సై.. సై.. అంటూ ఉర్రూతలూగిస్తుంది. విప్లవాలను, ఉద్యమాలను, సంస్కరణలను జతచేర్చి.. తరతరాలకు పాఠమవుతుంది. అయితే అదే రాగం కొందరికి చేదును, మరికొందరికి చికాకును ఇంకొందరిలో అసూయనూ రగిలించి నిప్పు రాజేస్తుంది. ఆ నిప్పే కాల్చేసిందో, లేక అంతటి ఔదార్యమున్న కలానికి కులం రంగు అద్దిన ఉన్మాదమే కడతేర్చిందో.. తెలియదు కానీ అమర్ సింగ్ చమ్కీలా జీవితంలో పెద్ద ఉపద్రవమే ముంచుకొచ్చింది. అసలు ఎవరీ చమ్కీలా? ఏం జరిగింది? భారతీయ సంగీత చరిత్రలో చమ్కీలా కథకు ప్రత్యేకమైన అధ్యాయముంది. చమ్కీలా అంటే పంజాబీలో ప్రకాశవంతమైనదని అర్థం. పంజాబ్, లూథియానా సమీపంలోని దుగ్రీ గ్రామంలో చమార్ (దళిత్) కులానికి చెందిన కర్తార్ కౌర్, హరిరామ్ సింగ్ దంపతులకు 1960 జూలై 21న చమ్కీలా జన్మించాడు. అతని అసలు పేరు ధనీరామ్. చిన్నవయసులోనే గుర్మైల్ కౌర్ అనే బంధువుల అమ్మాయితో పెళ్లి జరిగింది. వీరికి అమన్‌దీప్ కౌర్, కమన్ చమ్కీలా (ప్రస్తుతం ఫోక్ సింగర్) అనే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. మరో కొడుకు పుట్టి.. అనారోగ్యంతో చనిపోయాడు. మొదటి నుంచి ఎలక్ట్రీషియన్ కావాలని ఆశపడిన ధనీరామ్.. ఆ ఆలోచనను పక్కనపెట్టి.. ఆర్థిక కష్టాలను ఎదుర్కోవడానికి దుస్తుల మిల్లులో చేరాడు. అక్కడ ఓ స్నేహితుడు ఇతని రాతకు ముగ్ధుడై.. సురీందర్ షిండా అనే ఓ సంగీతవిద్వాంసుడి దగ్గరకు తీసుకెళ్లాడు. ధనీరామ్ కథలో, పేరులో మార్పులు అక్కడి నుంచే మొదలయ్యాయి. చమ్కీలా (ధనీరామ్) టీమ్‌లో చేరినప్పటి నుంచి షిండా పేరు దేశవిదేశాలకు పాకింది. చమ్కీలాకు మాత్రం గుర్తింపు దక్కలేదు. పైగా ఇతర దేశాల్లో ప్రదర్శనలకు చమ్కీలాను తీసుకెళ్లడానికి షిండా ఇష్టపడేవాడు కాదు. 1980లో ఒకసారి షిండా.. కెనడా పర్యటనకు వెళ్లినప్పుడు ఆ గ్రూప్‌లోని సోనియా అనే మరో గాయని చమ్కీలాను కలిసింది. ‘షిండాను దాటి నీకు గుర్తింపు రావాలంటే.. నేను కొత్తగా ప్రారంభిస్తున్న బృందంలో చేరు’ అని చెప్పడంతో చమ్కీలా సరే అన్నాడు. సోనియా పెట్టుబడి పెడితే.. చమ్కీలా తన ఆలోచనలకు మరింత పదునుపెట్టి.. ఆమె దగ్గరే జీతానికి కుదిరాడు. అనుకున్నట్లే షిండా కెనడా నుంచి పంజాబ్ వచ్చేలోపు.. సోనియా ఆధ్వర్యంలో ఎనిమిది యుగళగీతాలను విడుదల చేసి పంజాబ్‌ని ఓ ఊపు ఊపాడు చమ్కీలా. అయితే ఆ ఏడాది చివరికి.. సోనియా, ఆమె భర్త కలసి.. తన కారణంగా లక్షలు సంపాదిస్తూ, తనకు నెల జీతం మాత్రమే ఇస్తున్నారని గ్రహించాడు. దాంతో చమ్కీలా.. తానే ఒక రంగస్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లే హార్మోనియం, ఢోలక్ వాయించగలిగే బృందంతో పాటు.. అమర్‌జోత్ కౌర్ అనే ఒక మహిళా గాయనినీ తన టీమ్‌లోకి తీసుకుని.. ఆల్బమ్స్ రిలీజ్ చేయడం మొదలు పెట్టాడు. రిలీజ్ చేసిన ప్రతి ఆల్బమ్ హిట్ కొట్టడంతో చమ్కీలా పంజాబ్ సూపర్ స్టార్ అయ్యాడు. చమ్కీలా పాటల్లో కొన్ని.. ‘పెహెలే లల్కార్ నాల్ (తొలుత బాకా మోగింది)’ ఇది పెళ్ళైన జంట గురించి పాడిన పాట. ‘బాబా తేరా నన్కానా (బాబా నీ మందిరం, నీ గురువు గురునానక్)’ ఇది సిక్కులకు ధైర్యం చెప్పే పాట. ‘భూల్ గయీ మై ఘుండ్ కడ్నా (ముసుగు వేసుకోవడం మరచాను)’.. లాంటి పాటలూ ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆ సమయం లోనే అతనికి అమర్ జోత్‌తో స్నేహం కుదిరింది. ఆ స్నేహం ప్రేమగా మారి.. పెళ్లిదాకా వెళ్లింది. మొదటి భార్య గుర్మైల్ని ఒప్పించి (విడాకులు తీసుకున్నాడని కొందరంటారు).. 1983లో అమర్జోత్ని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి జైమన్ (ప్రస్తుత ఫోక్ సింగర్) అనే కొడుకు పుట్టాడు. వివాహేతర సంబంధాలు, మత సంఘర్షణలు, మద్యపానం, వరకట్నాలు, మాదకద్రవ్యాలు.. ఇలా ప్రతి సమస్యపైనా పాట కట్టి.. ప్రజలను ఆలోచింపచేసేవాడు చమ్కీలా. వేడుక ఏదైనా.. ప్రతి ఊళ్లో అతని దరువు వినిపించాల్సిందే. ఏడాదికి ఊరూరా 366 ప్రత్యక్ష ప్రదర్శనలు చేసేవారంటే చమ్కీలా దంపతులు ఎంత బిజీగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. 1988 మార్చి 8న మధ్యాహ్నం 2 గంటలకు మెహసంపూర్ సమీపంలోని ప్రదర్శనకు వెళ్తుంటే.. ముసుగులేసుకున్న కొందరు దుండగులు బైక్స్ మీదొచ్చి చమ్కీలా కారుకు అడ్డుపడ్డారు. మరుక్షణమే తుపాకులతో తూటాల వర్షం కురిపించారు. ఆ దాడిలో చమ్కీలా(27), అమర్‌జోత్ అక్కడికక్కడే కన్నుమూశారు. ఆ సమయంలో అమర్‌జోత్ గర్భవతి. సంఘటనా స్థలంలో ఉన్న కొందరు గ్రామస్థులు.. ఆ దుండగులను వెంబడించినా దొరకలేదు. దాంతో ఎవరు చంపారు? అనేది నేటికీ మిస్టరీగా మిగిలిపోయింది. నిజానికి ఈ హత్యకేసుపై చాలా ఊహాగానాలున్నాయి. అప్పటి ఖలిస్తాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా పాటలు రాసినందుకే సిక్కు ఉగ్రవాదులు చమ్కీలాను చంపేశారని కొందరి అభిప్రాయం. కొన్ని సంగీత బృందాలు కేవలం చమ్కీలా వల్లే మరుగున పడ్డాయని.. ఆ అక్కసుతోనే వారంతా కలసి అతనిని చంపించారని మరి కొందరి ఊహ. మరోవైపు చమ్కీలా రెండో భార్య అమర్‌జోత్ ఉన్నత వర్గానికి చెందిన స్త్రీ కావడంతో.. ఇది పరువు హత్య అని.. అమర్‌జోత్ కుటంబీకులే ఈ నేరానికి పాల్పడి ఉంటారని ఇంకొందరి వాదన. ఇతడి జీవితకథపై చాలా సినిమాలు, పుస్తకాలూ విడుదలయ్యాయి. వాటిలో కొన్ని వివాదాల పాలయ్యాయి. ఏది ఏమైనా చమ్కీలా గొంతు మూగబోయి 35 ఏళ్లు దాటింది. అయినా నేటికీ జానపద సంగీత ప్రియులకు అతడి పాట వినిపిస్తూనే ఉంది. ∙సంహిత నిమ్మన -
డెత్ మిస్టరీ: టీవీ చూస్తూ అస్థిపంజరంలా మారిన మహిళ..
ప్రపంచంలో ఎంతోమంది మరణిస్తుంటారు. కొన్ని సహాజ మరణాలు కాగా, మరికొందరు అసహజ రీతిలో మరణిస్తుంటారు. అయితే కొన్ని సంఘటనలు వింటే అస్సలు నమ్మబుద్ది కాదు. కానీ కళ్లముందు సాక్ష్యాలు కనబడితే మాత్రం నమ్మకుండా ఉండలేరు. ఇలాంటి కోవలోకే వస్తుంది ఓ డెత్ మిస్టరీ. లండన్‌కు చెందిన జాయిస్ విన్సెంట్ అనే మహిళ చనిపోయిన తీరు ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే ఉండిపోయింది. అసలు ఏంటా కథ? అన్నది ఈ మిస్టరీ స్టోరీలో తెలుసుకుందాం.. లండన్‌కు చెందిన జాయిస్ విన్సెంట్ అనే మహిళ విచిత్రమైన రీతిలో మరణించింది. 1965, అక్టోబర్19న యూకేలో జన్మించిన ఈమె పదాహారేళ్ల వయసులో మ్యూజిక్ వైపు దృష్టిపెట్టింది. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తన నలుగురు తోబుట్టువులే ఆమె ఆలనాపాలనా చూసేవారు. అయితే ఎందుకో తెలియదు కానీ కొన్నాళ్లకు తన కుటుంబం నుంచి విన్సెంట్ బయటకు వచ్చేసింది. ఓ సంస్థలో చిన్న ఉద్యోగిగి చేరి తన కాళ్లపై తను నిలబడింది. అయితే కుటుంబంతో మాత్రం శాశ్వతంగా బంధాన్ని తెంపేసుకుంది. అప్పటినుంచి విన్సెంట్ ఒంటిరి జీవితానికి అలవాటుపడింది.లండన్‌లోని బెడ్సిట్ అపార్ట్‌మెంట్స్‌లో ఆమె నివసించేది. ఇవి గృహహింసల నుంచి విముక్తి పొందిన మహిళలకు తక్కువ అద్దెతో వసతి కల్పించే ఆవాసకేంద్రాలన్నమాట. ఓసారి ట్రస్ట్ అధికారులు ఆమె ఫ్లాట్ కాలింగ్ బెల్ ఎంతసేపు కొట్టినా తలుపుతీయలేదు. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లిన పోలీసులకు గుండె జలదరించే దృశ్యం కనిపించింది. ఎదురుగా టీవీ ముందు కుర్చీలో అస్థిపంజరం వాళ్లకు దర్శనం ఇచ్చింది. అది విన్సెంట్దే అని తెలుసుకునేందుకు ఎక్కువ సమయం ఏమీ పట్టలేదు. ఆశ్చర్యకరమైన మరో విశేషం ఏమిటంటే.. టీవీ చూస్తేన్నట్లుగానే సోఫాలో కూర్చొని చేతిలో టీవీ రిమోట్ పట్టుకొని ఉండటం అధికారులకే ఒళ్లు గగుర్పొడిచింది. ఈ సంఘటన అప్పట్లో పెను సంచలనంగా మారింది. 2006 జనవరి 25న ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె ఫ్రిజ్‌లోని ప్రోడక్ట్స్ ఎక్స్పైరీ డేట్ ఆధారంగా ఆమె చనిపోయి అప్పటికే మూడేళ్లు అయ్యిందని విచారణలో బయటపడింది. చనిపోవడానికి కొన్నాళ్ల ముందు ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయడం, స్నేహితులతోనూ సంబంధాలు తెంచేసుకొని ఒంటరిగా ఉండటం, టీవీ చూస్తూ చనిపోవడం, అది మూడేళ్లకు బయటపడటం.. ఇవన్నీ ఇప్పటికీ అలా మిస్టరీగానే ఉండిపోయాయి. -
ఆ డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) సూపర్ స్టార్‌ది ఆత్మహత్యే
2022, అక్టోబర్ 5న టెక్సాస్‌లోని (అమెరికా) తన స్వగృహంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) సూపర్ స్టార్ సారా లీ (30)కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని స్థానిక మెడికల్ అధికారులు తాజాగా వెల్లడించారు. సారా డెడ్ బాడీపై గాయాలు ఉండటంతో తొలుత పలు అనమానాలు వ్యక్తం చేసిన అధికారులు, తాజాగా విడుదల చేసిన అటాప్సీ రిపోర్ట్‌లో సారాది ముమ్మాటికీ ఆత్మహత్యేనని నిర్ధారించారు. చదవండి: ధోని క్రేజ్.. ఐపీఎల్ ఫాలో అవుతున్నాడా? బెక్సార్ కౌంటీ మెడికల్ ఆఫీసర్ నివేదిక ప్రకారం.. యాంఫటమైన్స్, డాక్సిలామైన్, ఆల్కహాల్ కలిపి సేవించడం వల్ల సారా మరణించిందని, ఇందులో అనుమానించాల్సిందేమీ లేదని, సారా శరీరంపై ఉన్న గాయాలు ఆమె మరణానికి ముందు కింద పడటం వల్ల ఏర్పడ్డవేనని నిర్ధారించబడింది. దీంతో సారా మృతిపై గత కొద్ది రోజులుగా ఉన్న అనుమానాలకు తెరపడినట్లైంది. WWE is saddened to learn of the passing of Sara Lee. As a former "Tough Enough" winner, Lee served as an inspiration to many in the sports-entertainment world. WWE offers its heartfelt condolences to her family, friends and fans. pic.twitter.com/jtjjnG52n7 — WWE (@WWE) October 7, 2022 అయితే ఇక్కడ మరో ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సారాను ఎవరు ఏమీ చేయలేదు.. మరి అంత చిన్న వయసులో (30) ఆమెకు ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చిందోనని డబ్ల్యూడబ్ల్యూఈ ఫాలోవర్స్ చర్చించుకుంటున్నారు. కాగా, సారా 2015 మహిళల డబ్ల్యూడబ్ల్యూఈ (World Wrestling Entertainment) ఛాంపియన్‌షిప్‌ను గెలిచిన విషయం తెలిసిందే. ఆమె రెజ్లింగ్ ఛాంపియన్‌గానే కాకుండా అమెరికన్ టీవీ పర్సనాలిటీగా కూడా అందరికీ సుపరిచితం. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001, మెయిల్: roshnihelp@gmail.com -
రష్యా పౌరుడి అనుమానాస్పద మృతి.. వాళ్లిదరూ ఒకే గదిలో..
రాయగడ(భువనేశ్వర్): పట్టణంలోని సాయి ఇంటర్నేషనల్ హోటల్లో ఓ విదేశీయుడి మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. మృతుడు రష్యాకు చెందిన వ్లాదిమర్ బిదానోబ్(61)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న ఎస్డీపీఓ దేవజ్యోతి దాస్ ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే... ఈనెల 21న రష్యాకు చెందిన నలుగురు పర్యాటకులు ఒడిశాలోని దారింగిబడి నుంచి రాయగడలో పర్యటించేందుకు వచ్చారు. ఈ క్రమంలో వారి వెంట వచ్చిన గైడ్ స్థానిక సాయి ఇంటర్నేషనల్ హోటల్లో వసతి సౌకర్యం కల్పించారు. గురువారం రాత్రి వ్లాదిమర్‌తో పాటు అతనితో వచ్చిన మరో విదేశీయుడు కలిసి ఒకే గదిలో మద్యం సేవించారు. అయితే తెల్లవారు లేచి చూసేసరికి వ్లాదిమర్ మృతి చెందడంతో హోటల్ మేనేజర్‌కు విషయాన్ని తెలియజేశారు. ఆయన పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అతిగా మద్యం సేవించడమే మృతికి కారణమా? లేదా ఇంకేమైనా జరిగి ఉంటుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఎస్డీపీఓ దాస్ మీడియాతో మాట్లాడుతూ విదేశీయుడి మృతికి సంబంధించి నియమాల ప్రకారం సమాచారాన్ని రష్యా రాయబార కార్యాలయానికి విషయం చేరవేశామని తెలిపారు. మృతునికి ఒక కుమారుడు ఉన్నట్ల తెలిసిందని, మిగతా సమాచారం అందాల్సి ఉందని వివరించారు. చదవండి: షాకింగ్ ఘటన.. పారిపోయిన అల్లుడు.. అసలేం జరిగింది? -
ప్రియునితో సహజీవనం.. వారిమధ్య ఏం జరిగిందో గానీ..
మైసూరు(బెంగళూరు): ప్రియునితో కలసి సహజీవనం చేస్తున్న శోభ (40) అనే మహిళ అనుమానాస్పద రీతిలో మరణించింది. ఈ ఘటన హెచ్డీ కోటలో జరిగింది. కొన్నేళ్లుగా భర్త నుంచి విడిపోయిన శోభ ఒంటరిగా ఉంటోంది. ఈ సమయంలోనే మంజునాథ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ఇద్దరూ సహజీవనం చేయసాగారు. మంజునాథ్ మద్యానికి బానిసై తరచూ శోభతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం చూడగా శోభ ఉరివేసుకుని ఉన్న స్థితిలో శవమైంది. ఇది తెలిసి ప్రియుడు పరారయ్యాడు. శోభ కుమార్తె పూజా మంజునాథ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో ఘటనలో.. టెన్త్ బాలిక ఆత్మహత్య హోసూరు: హోసూరు పారిశ్రామికవాడ జూజువాడికి చెందిన సైందవి (15) అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఆదివారం ఇంటి నుంచి బయటకెళ్లి తిరిగి వచ్చింది. బయటకెళ్లరాదని తల్లిదండ్రులు మందలించడంతో సైందవి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. సిఫ్‌కాట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
నాకు ధమ్కీ ఇచ్చారు.. నా ప్రాణాలకు ఏమైనా అయితే ? మస్క్ ట్వీట్‌కి కారణం ఇదే!
ఉక్రెయిన్‌పై రష్యా దాడి కీలక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 1945లో రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ విజయానికి గుర్తుగా ప్రతిఏటా రష్యాలో మే 9న విక్టరీ డే జరుపుకుంటారు. ప్రతి ఏడు నిర్వహించినట్లుగా..ఈ ఏడాది రష్యాలో విక్టరీ డే వేడుకల్ని రష్యా నిర్వహించింది. అయితే అదే సమయంలో ఉక్రెయిన్ సానుభూతి పరులపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తూ..పరోక్షంగా రష్యాను దెబ్బకొడుతున్న ఎలన్ మస్క్‌కు..రష్యన్ ఆర్మీ కమాండర్ ఏకంగా ధమ్కీ ఇచ్చాడు. ఈ విషయాన్ని నేరుగా ఎలాన్ మస్క్ తెలిపాడు. The word “Nazi” doesn’t mean what he seems to think it does pic.twitter.com/pk9SQhBOsG — Elon Musk (@elonmusk) May 9, 2022 రష్యన్ భాషలో ఉన్న కమాండర్ టెస్టిమోనీ ట్వీట్‌ను ఇంగ్లీష్‌లోకి ట్రాన్సలేట్ చేసి మరీ ఎలాన్ మస్క్ స్పందించాడు. అంతు చిక్కని తీరిలో తాను చనిపోతే.. అందుకు సంబంధించిన కారణం ముందే తెలుసుకోవడం భలేగా ఉందంటూ కొంటెగా రష్యన్ కమాండర్‌ను రెచ్చగొట్టాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వైరల్ అవుతున్న ఆ ట్విట్లపై నెటిజన్లు స్పందిస్తున్నారు. If I die under mysterious circumstances, it’s been nice knowin ya — Elon Musk (@elonmusk) May 9, 2022 ఎలాన్ మస్క్ ట్వీట్‌పై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. నీకు మద్దతుగా మేమున్నామంటూ కొందరు స్పందిస్తుండగా.. నీకేమైనా అయితే ట్విటర్ ఉంటుందా అంటూ మరికొందరు మస్క్‌కు ఆయన తరహాలోనే జవాబు ఇస్తున్నారు. -
మిస్టరీగా మారిన గజ ఈతగాని మృతి.. సీసీకెమెరాలో షాకింగ్ విషయాలు
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా, బైంసా గడ్డేన్న ప్రాజెక్టులో గజ ఈతగాని మృతి మిస్టరీగా మారింది. రెండు రోజుల క్రితం ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లిన సాయినాథ్ శవమై తెలాడు. అయితే సాయినాథ్ డ్యామ్‌లోకి దూకిన సమయంలో ఆ సంఘటన సీసీ కెమెరాలలో రికారయ్యింది. ఈ సీసీ పుటేజీలో డ్యామ్‌లో దూకిన సాయినాథ్ కొద్ది దూరం ఈతకోట్టినట్లు రికార్డైంది. (చదవండి: వంకర మనుషులున్నారు.. నా వల్ల కాదు) ఆ తర్వాత నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. గజ ఈతగాడు ఎలా మ్రుతిచెందాడనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. చదవండి: హాస్టల్లో ఏదో ఉందని! ఒంటిపై రక్కుతున్నట్లు, తమను లాగుతున్నట్లు అనిపిస్తోందని.. -
ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసిన బిస్కెట్లు, చిప్స్..?
లక్నో: పారి, పిహు, విధి ముగ్గురు అక్కాచెల్లెళ్లు. కలిసిమెలసి ఉండేవారు. ఆడుతూపాడుతూ.. అమ్మానాన్నతో కలిసి సంతోషంగా జీవించేవారు. జింకపిల్లలా చెంగుచెంగున పరుగులు తీసే చిన్నారులు.. ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యారు. 24 గంటల వ్యవధిలో ముగ్గురు మృతి చెందారు. చిన్నారుల మృతి వారి తల్లిదండ్రులతో పాటు.. గ్రామస్తులను కూడా కలచి వేసింది. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఎలా మరణించారో ఎవరికి అర్థం కావడం లేదు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్, బరేలీకి చెందిన నవీన్ కుమార్ సింగ్‌కు పారి, పిహు, విధి అని ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నాలుగు రోజులు క్రితం వరకు కూడా ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. గత శుక్రవారం మధ్యాహ్నం ఈ అమ్మాయిలు బిస్కెట్లు, చిప్స్ కొనుక్కుని తిన్నారు. ఆ తర్వాత ఉన్నట్లుండి ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డారు. (చదవండి: వైరల్: ఇదేం వింత.. ఆ బాలిక ఏడిస్తే కంట్లోంచి రాళ్లు వస్తాయట!) ఇది గమనించిన చిన్నారుల తండ్రి నవీన్ కుమార్ వారిని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అయితే హాస్పిటల్‌కు వెళ్లేలోపే పారి, పిహు మరణించారు. చికిత్స పొందుతూ విధి మృతి చెందింది. చిన్నారులకు ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నారుల మృతి గురించి పోలీసులకు తెలియడంతో వారు.. సంఘటన స్థలానికి చేరుకుని.. అంత్యక్రియలు ఆపేశారు. చిన్నారుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (చదవండి: టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయం ఇదే!) ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వారి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని అటాప్సీ పరిక్షలో వెల్లడయ్యింది. ప్రస్తుతం పోలీసులు చిన్నారుల కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. ఫోరెన్సిక్ అధికారులు బాలికలు తిన్న బిస్కెట్లు, చిప్స్ శాంపిల్స్‌ని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. చదవండి: వింత నమ్మకం.. పెరిగిన పార్లేజీ బిస్కెట్ల అమ్మకాలు -
400 ఏళ్ల క్రితం హత్య.. మిస్టరీని చేధించిన భారత శాస్త్రవేత్తలు
సాక్షి, వెబ్‌డెస్క్: ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఈ క్రమంలో ఏ నేరం జరిగినా.. చిన్న క్లూతో మొత్తం క్రైమ్ సీన్‌ను కళ్లకు కడుతున్నారు పోలీసులు. అయితే టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందని కాలంలో జరిగిన ఎన్నో నేరాలకు సంబంధించిన వాస్తవాలు, రహస్యాలు అలానే నిశ్శబ్దంగా భూమిలో సమాధి అయ్యాయి. వీటిలో కొన్ని నేరాలు ఇప్పటికి కూడా పరిశోధకులను, శాస్త్రవేత్తలను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికత సాయంతో కాలగర్భంలో కలిసిపోయిన పలు రహస్యాలను చేధిస్తున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా భారతీయ పురాతత్వ శాస్త్రవేత్తలు, పరమాణు జీవశాస్త్రవేత్తలు 400 ఏళ్ల నాటి మర్డర్ మిస్టరీని చేధించారు. ఇన్నాళ్లు రహస్యంగా మిగిలిపోయిన జార్జియా రాణి కేతేవాన్ మర్డర్ మిస్టరీని చేధించారు. ఆమెను గొంతు కోసి చంపారని మన పరిశోధకులు ధ్రువీకరించారు. పర్షియా చక్రవర్తి, షా అబ్బాస్ I జార్జియా రాణి సెయింట్ క్వీన్ కేతేవన్‌ను 1624 లో హత్య చేశాడా.. అంటే అవుననే అంటున్నాయి అందుబాటులో ఉన్న సాహిత్య ఆధారులు. అయితే, ఇరానియన్ కథనం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే వారు తమ దేశ చరిత్రలో అత్యంత ముఖ్య పాలకుల్లో షా అబ్బాస్ I ను ఒకడిగా భావిస్తారు. ఇలా భిన్న వైరుధ్యాలు ఉన్న ఈ మిస్టరీని మన శాస్త్రవేత్తలు పరిష్కరించారు. అసలు ఎక్కడో జార్జియాలో జరిగిన ఈ సంఘటనకు భారతదేశంతో సంబంధం ఏంటి.. దాన్ని మన శాస్త్రవేత్తలు పరిష్కరించడం ఏంటి వంటి తదితర వివరాలు తెలియాలంటే ఇది చదవాలి... రాణి కేతేవాన్ కథ ఏంటంటే.. సాహిత్య ఆధారాల ప్రకారం 1613 లో పర్షియా చక్రవర్తి జార్జియన్ రాజ్యాన్ని జయించి, ఇరాన్ నైరుతిలో ఉన్న షిరాజ్ అనే నగరంలో రాణిని పదేళ్లపాటు బందీగా ఉంచాడని చెబుతున్నాయి. 1624 లో, కేతేవాన్‌ను మతం మారి, పర్షియా రాజు అంతపురంలో చేరవలసిందిగా చక్రవర్తి ఇచ్చిన ప్రతిపాదనను రాణి తిరస్కరించింది. ఈ క్రమంలో కేతేవాన్, పర్షియా రాజు చేతిలో తీవ్ర హింసకు గురైంది. ఆమె మరణానికి ఒక సంవత్సరం ముందు, ఇద్దరు అగస్టీనియన్ పూజారులు ఒక మిషన్ ప్రారంభించడానికి షిరాజ్‌కు వచ్చారు. వారు రాణిని కలవడానికి అనుమతి పొందడమే కాక ఆమెకు సహాయకులుగా మారారు. ఈ క్రమంలో కేతేవాన్ మరణం తర్వాత పూజారులు ఆమె సమాధిని వెలికితీసి, రాణి అవశేషాలను 1624 నుంచి 1627 వరకు దాచారు. అనంతరం రాణి అవశేషాలను సురక్షితంగా ఉంచడానికి, వారు ఆమె శరీరంలోని వివిధ భాగాలను వేర్వేరు ప్రదేశాలలో దాచారు. గోవాలో రాణి కేతేవాన్ అవశేషాలు ఈ క్రమంలో రాణి కేతేవాన్ కుడి చేయిని ఓల్డ్ గోవాలోని సెయింట్ అగస్టీనియన్ కాన్వెంట్కు తీసుకువెళ్లి అక్కడ సురక్షితంగా పూడ్చి పెట్టినట్లు సాహిత్య ఆధారాలున్నాయి. అంతేకాక వారు రాణి అవశేషాలను ఎక్కడెక్కడ పూడ్చిన విషయాలను కొన్ని పత్రాలలో స్పష్టంగా పేర్కొనన్నారు. దీనిలో ఓల్డ్ గోవా సెయింట్ అగస్టీనియస్ చర్చి ప్రస్తావన కూడా ఉంది. అయితే ఎప్పటికప్పుడు చర్చిని పునర్నిర్మించడంతో ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించడం పెద్ద సవాలుగా ఉంది. మరోవైపు జార్జియా ప్రజలకు రాణి అవశేషాలు ముఖ్యమైనవి కాబట్టి, అప్పటి సోవియట్ యూనియన్ ప్రభుత్వం, ఆ తరువాత యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయిన తర్వాత జార్జియన్ ప్రభుత్వం, రాణి శేషాలను గుర్తించడంలో సహాయపడాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ శోధన 1980 ల చివరలో ప్రారంభమై.. అనేక విరమాలతో కొనసాగింది. చాలా ప్రయత్నాల తరువాత, స్థానిక చరిత్రకారులు, గోవా సర్కిల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) పురావస్తు శాస్త్రవేత్తలు 2004 లో సాహిత్య వనరుల ఆధారంగా చర్చి గ్రౌండ్ మ్యాప్‌ను పునర్నిర్మించారు. ఈ క్రమంలో మొదట అక్కడ పూడ్చి పెట్టిన ఓ పొడవైన చేయి ఎముకను.. ఆ తరువాత మరో రెండు అవశేషాలను గుర్తించగలిగారు. 22 వేల డీఎన్ఏలతో పోల్చారు తాము గుర్తించిన అవశేషాల్లో క్వీన్ కేతేవన్‌కి సంబంధించిన వాటిని గుర్తించడం కోసం మూడు అవశేషాల మైటోకాన్డ్రియల్ డీఎన్ఏను వేరుచేశారు. దాన్ని సీసీఎంబీ డేటా బ్యాంక్‌లో 22,000 కంటే ఎక్కువ డీఎన్ఏ సీక్వెన్స్‌లతో సరిపోల్చారు. మొదట గుర్తించిన అవశేషం దేనితో సరిపోలేదు. మరోవైపు, తరువాత గుర్తించిన రెండు అవశేషాలు దక్షిణ ఆసియాలోని వివిధ జాతులతో ముఖ్యంగా భారతదేశంతో సరిపోలాయి. దాంతో మొదట తాము గుర్తించిన చేయిని రాణి కేతేవాన్‌ది ప్రకటించారు శాస్త్రవేత్తలు. ఈ విషయాలకు సంబంధించి ఎల్సెవియర్ జర్నల్‌లో 2014 లో తమ పరిశోధనా పత్రాన్ని కూడా ప్రచురించారు, అయితే రాణి అవశేషాలను జార్జియా ప్రభుత్వానికి అప్పగించే దౌత్య ప్రక్రియకు దాదాపు ఏడు సంవత్సరాలు పట్టింది. ఈ క్రమంలో 2021, జూలై 9 న, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జార్జియా విదేశాంగ మంత్రికి రాణి అవశేషాలను సమర్పించారు. దాంతో ఈ సంఘటనల చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. భారతీయ పరమాణు జీవశాస్త్రజ్ఞులు రాణి హత్యకు సంబంధించిన సాక్ష్యాల చారిత్రక ఆధారాలను కూడా ధృవీకరించారు. గొంతు కోసి రాణి కేతేవాన్‌ను హత్య చేసినట్లు తెలిపారు. -
కారు చీకట్లో.. కనుమరుగైన కనుపాప
పెందుర్తి: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డకు గుక్కెడు పాలు ఇవ్వలేని దుస్థితి ఆ తల్లిది. ఇంట్లో పెద్దోళ్లతో పంతానికి వెళ్లి పొత్తిళ్లలోని చిన్నారిని చంపుకున్న శాపం ఆమెది. ఎత్తుకుని లాలించి.. పాలిచ్చి పెంచిన చేతులతోనే గొయ్యి తీసి పూడ్చిపెట్టిన కన్నీటి గాథ ఆ కన్నతల్లిది. అత్తమామలతో గొడవ పడి అర్ధరాత్రి ముక్కుపచ్చలారని చిన్నారితో గడప దాటి తిరిగి ఒట్టి చేతులతో తిరిగి వచ్చిన దురవస్థ ఆమెది. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పులగాలిపాలెంలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి కరక అప్పారావు, కుసుమలత దంపతులకు సోనిక, జ్ఞానస(ఏడాదిన్నర) ఇద్దరు కుమార్తెలు. ఈ నెల 6న అప్పారావు విధులకు వెళ్లిపోయాడు. అయితే ఆ రోజు రాత్రి కుసుమలతకు అత్తమామలు అప్పలకొండ, నూకాలుకు ఇంట్లో గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కుసుమలత అదే రోజు అర్ధరాత్రి దాటాక ఇంట్లో నుంచి చిన్న కుమార్తె జ్ఞానసను తీసుకుని బయటకు వెళ్లిపోయింది. అర్ధరాత్రి వేళ ఎక్కడికి వెళ్లాలో తెలియని కుసుమలత చినముషిడివాడ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడే ఉన్న కొండ ఎక్కింది. అక్కడే నాలుగు రోజుల పాటు రేయింబవళ్లు ఉండి ఈ నెల 10న కిందకి ఒంటరిగా వచ్చింది (అప్పటికే కుసుమలత పుట్టింటివారు ఆమె కనిపించలేదంటూ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు). కొండ సమీపంలో నివాసం ఉంటున్న వారి వద్దకు వెళ్లి ఆకలేస్తోందని చెప్పడంతో వారు భోజనం పెట్టారు. కుసుమలత పరిస్థితి చూసినవారు ఏం జరిగిందని ఆరా తీయగా జరిగిన విషయం చెప్పింది. ‘పాప ఆకలికి చనిపోయింది. నేనే కొండ మీద పూడ్చిపెట్టాను’ అని చెప్పడంతో కంగారు పడ్డ స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలంలో విలపిస్తున్న జ్ఞానస తండ్రి అప్పారావు అంతా అయోమయం.. అనుమానాస్పదం.. అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన కుసుమలత నేరుగా కొండ ప్రాంతానికి వెళ్లడం మిస్టరీగా మారింది. అంతేకాకుండా ఆమె ఫోన్లో ‘ఆహారం లేకుండా ఎన్ని రోజులు ఉండగలం’ అని గూగూల్ సెర్చ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఆమె కొండ ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే ఎంత పంతం ఉన్నా.. చంటిపాప విషయంలో కన్నతల్లి అంత కఠినంగా ఉందా అన్నది మరో ప్రశ్న. అదే సమయంలో ఇంట్లో అత్తమామలతో గొడవ పడిన సందర్భం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని వారు ఏదైనా అన్నారా? ఆ కోపంలో చిన్నారిని ఆమె ఏదైనా చేసిందా అన్నది సందేహంగా మారింది. అయితే ఇంత జరిగినా కుసుమలత నోరు విప్పడం లేదు. ఏం జరిగిందో స్పష్టంగా చెప్పకపోవడంతో పోలీసులకు ఎటూ పాలుపోవడం లేదు. జ్ఞానస పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే ఇందులో పురోగతి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు అత్తమామలతో పెద్ద స్థాయిలో గొడవలు లేవని తెలుస్తోంది. అసలు ఆమె అలా ఎందుకు చేసిందో ఏమాత్రం అర్థం కావడం లేదని భర్త వాపోతున్నారు. రైల్వే ఉద్యోగం కావడంతో రెండు మూడు రోజులు బయటకు వెళ్తుంటానని, ఎప్పుడూ ఇలా జరగలేదని అతను చెబుతున్నారు. క్విక్ రియాక్షన్ బృందాల సహకారంతో.. జ్ఞానస చనిపోయిందని కుసుమలత చెప్పడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆమెను వెంటబెట్టుకుని కొండ ప్రాంతం అంతా గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో బుధవారం ఉదయం క్విక్ రియాక్షన్ టీమ్ బృందాలు డాగ్ స్క్వాడ్ సహా రంగంలోకి దిగాయి. ఎట్టకేలకు చిన్నారిని పూడ్చిన ప్రదేశాన్ని కనుగొన్నారు. జ్ఞానస మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఏసీపీ స్వరూపారాణి ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణ అనుమానాస్పద ఘటనగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మామ, చెల్లెలు, భార్య కుమ్మక్కై..
సాక్షి, నాగార్జునసాగర్ : ఈ నెల 25న సాగర్ కాల్వలో వెలుగుచూసిన వ్యక్తి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. చెల్లెలు, భార్య, మామ సహకారంతోనే ఈ హత్య జరిగిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వేణుగోపాల్ కేసు వివరాలు వెల్లడించారు. త్రిపురారం మండలం గంటారావు క్యాంపుకు చెందిన పానుగోతు చిట్టికి గత 18 సంవత్సరాల క్రితం కాపువారిగూడేనికి చెందిన పానుగోతు బిచ్ఛ్యా పెద్దభార్య కుమారుడైన పానుగోతు శ్రీను(49)తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం. సంసార జీవితంలో శ్రీనుకు తనభార్య చిట్టిపై అనుమానం ఏర్పడింది. దీంతో ఆమెను నిత్యం హింసిస్తూండేవాడు. దీంతో చిట్టి భరించలేక ఆరునెలల క్రితమే పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లి పోయింది. చిట్టి అన్నకు ఆమె ఆడపడచు అయిన విజయమ్మను ఇచ్చి వివాహం చేశారు. అతను చనిపోయాడు.విజయమ్మ పండ్ల వ్యాపారి అయిన తన ప్రియుడు రసూల్‌తో కలిసి హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఉంటోంది. శ్రీను తన భార్య చిట్టికి చెడు అలవాట్లను నేర్పించేది తన చెల్లెలు విజయమ్మనే అని ప్రియుడితో కలిసి ఉండే ఆమె ఇంటికి వెళ్లి తరచు గొడవ పడుతుండేవాడు. వేధిస్తున్నాడని.. భార్య చిట్టి, చెల్లెలు విజయమ్మను ఇబ్బంది పెడుతుండటంతో ఏ విధంగానైనా అతనిని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. చిట్టి,విజయమ్మ,చిట్టి తండ్రి పంతుల్యాలు శ్రీనును హత్య చేసేందుకు విజయమ్మ ప్రియుడు రసూల్‌తో రూ.3లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రసూల్ పండ్ల వ్యాపారంలో కూలీలుగా పనిచేసే ఇమ్రాన్, రాహూల్‌తో కలిసి శ్రీనును హత్య చేసేందుకు ఒప్పుకుని రూ.40వేలు అడ్వాన్సుగా తీసుకున్నారు. జూన్ 24వతేదీన శ్రీను తన భార్య ఆచూకీ కోసం విజయమ్మ ఇంటికి వచ్చాడు. అదే సమయంలో ఇంట్లోనే ఉన్న విజయమ్మ, ఆమే ప్రియుడు రసూల్, ఆమె కుమారుడు సంతోష్, ఆమె అల్లుడు ఆంగోతు శ్రీను, పండ్ల వ్యాపారంలో కూలీలుగా పనిచేసే ఇమ్రాన్,రాహూల్‌లు శ్రీనును మభ్యపెట్టి మద్యం తాపించారు. అనంతరం నిద్రలో ఉన్న శ్రీనును భార్య చిట్టి,చెల్లెలు విజయమ్మ,మామ పంతుల్యాల అనుమతితో అదే రోజు సాయంత్రం 4గంటలకు చున్నీతో గొంతుకు ఉరి బిగించి హత్య చేశారు. అనంతరం అదే రోజు రాత్రి హైదరాబాద్ నుంచి డ్రైవర్ పాపయ్య కారులో శ్రీను మృతదేహాన్ని తీసుకోని అల్వాల గ్రామ శివారులోని నాగార్జునసాగర్ ఎడమకాల్వలో పడవేశారు. పోలీసుల విచారణలో భాగంగా నేరస్తులు 29వ తేదీన త్రిపురారం మండలం కాపువారిగూడెంలో మృతుడి పెద్దఖర్మకు హాజరయ్యారనే సమాచారంతో అదే రోజు సీఐ తన సిబ్బందితో సహా వెళ్లి 9మందిని అదుపులోకి తీసుకుని విచారించడంలో నేరం అంగీకరించారు. ఈ కేసును ఛేదించేందుకు సహకరించిన హాలియా సీఐ ధనుంజయ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ,తిరుమలగిరి ఎస్ఐ సత్యనారాయణ,విజయపురిటౌన్ ఎస్ఐ సీనయ్య,హాలియా ఎస్ఐ రాఘవులు సిబ్బందిని అభినందించారు. సమావేశంలో ఎస్ఐలతో పాటు పోలీసులు, సిబ్బంది ఉన్నారు. -
అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ అనుమానాస్పద మృతి
హైదరాబాద్: అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ ఇమ్మిడి సదాశివ వరప్రసాద్ సోమవారం హైదరాబాద్‌లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. విజయవాడ దుర్గాపురం ప్రాంతానికి చెందిన సదాశివ వరప్రసాద్(69) అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. హైదరాబాద్ మెహిదీపట్నంలో ఉంటున్న మేనల్లుడు లావణ్యకుమార్ వద్దకు సోమవారం ఉదయం ఆయన విజయవాడ నుంచి రైళ్లో బయలుదేరారు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రైలు దిగిన ఆయన పార్సిల్ కార్యాలయం వైపు నడుచుకుంటూ వెళుతూ రోడ్డు మీద పడిపోయారు. వెంటనే స్థానికులు గమనించి ‘108’కు సమాచారం అందించారు. ‘108’సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించగా అప్పటికే ఆయన మరణించినట్లు చెప్పారు. మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. సాయంత్రం విషయం తెలుసుకున్న బంధువులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. నెలన్నర క్రితం ఆయనకు ఒకసారి గుండెపోటు వచ్చిందని, ఇప్పుడు గుండెపోటుతోనే మరణించారని, పోస్టుమార్టం లేకుండా మృతదేహాన్ని అప్పగించాలన్నారు. అయితే, పోలీసులు దీనికి ఒప్పుకోలేదు. మృతుడు అగ్రి గోల్డ్ సంస్థ కేసులో నిందితుడిగా ఉండటంతో పోస్టుమార్టం తర్వాతనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఇన్స్పెక్టర్ నిరంజన్‌రెడ్డి వారికి స్పష్టం చేశారు. -
కారుడ్రైవర్ అనుమానాస్పద మృతి
నెల్లూరు(క్రైమ్): కారుడ్రైవర్ నెల్లూరులోని నగరంలోని ఓ లాడ్జీలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగనాయకులపేట రైలువీధికి చెందిన బాషా, రజియాలు దంపతులు. వారికి అబీద్, నౌషాద్ (33) పిల్లలు. అబీద్ బంగారు పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుండగా నౌషాద్ కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అబీద్‌కు ఆరు సంవత్సరాల క్రితం వివాహమైంది. పెళ్లికి ముందు వరకు అన్నదమ్ములిద్దరూ చాలా ఆప్యాయంగా, స్నేహంగా ఉండేవారు. వివాహం తర్వాత అబీద్ వేరే కాపురం పెట్టాడు. అప్పటినుంచి నౌషాద్ మానసికంగా కృంగిపోయాడు. పలుమార్లు తనకు వివాహం చేయమని తల్లిదండ్రులను కోరాడు. అయితే పెళ్లి కాలేదు. ఈ నేపథ్యంలో పూర్తిగా మద్యానికి బానిసయ్యాడు. ఇంటికి సక్రమంగా వచ్చేవాడు కాదు. పనిచేసుకుని నగరంలోని లాడ్జిలో ఉండేవాడు. రెండు, మూడునెలలకోసారి ఇంటికి వెళ్లేవాడు. నెలరోజులుగా అతను నగరంలోని ఆర్ఆర్ లాడ్జీలో రూం నంబర్ 302లో ఉంటున్నాడు. మూడో అంతస్తుపై నుంచి పడి.. నౌషాద్ సోమవారం రాత్రి ఫూటుగా మద్యం సేవించాడు. 11.30 గంటల సమయంలో రూమ్‌బాయ్‌ని పిలిచి పెరుగన్నం తెప్పించుకుని తిన్నాడు. అనంతరం ఏమైందో కానీ మంగళవారం తెల్లవారుజామున లాడ్జీ మూడో అంతస్తు పైనుంచి బ్రాందీషాప్నకు చెందిన స్థలంలో పడ్డాడు. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. లాడ్జి సిబ్బంది గుర్తించి వెంటనే సంతపేట పోలీసులకు సమాచారం అందించారు. సంతపేట ఎస్సై షేక్ సుభాన్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. లాడ్జీ సిబ్బందితో మాట్లాడారు. మూడో అంతస్తు పైభాగంలో మృతుడి సెల్‌ఫోన్, కాలి చెప్పు ఒకటిపడి ఉంది. మృతదేహానికి సమీపంలో మరో చెప్పు పడి ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్‌లోని నంబర్ల ఆధారంగా బాధిత కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద కుప్పకూలిపోయి గుండెలవిసేలా విలపించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. వైద్యులు శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. నౌషాద్ ప్రమాదవశాత్తు పడిపోలేదని ఎవరో తోసివేశారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మద్యం మత్తులో ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడా? లేదా ఎవరైనా కిందకు తోసివేశారా? ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే కోణాల్లో విచారణను వేగవంతం చేశారు. -
వృద్ధుల అనుమాస్పద మృతి.. వీడని మిస్టరీ
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల వలిమెల ఔటర్ రింగ్ రోడ్‌పై వృద్ధ దంపతుల మృతి కేసు పోలీసులకు సవాలుగా మారింది. గత ఐదు రోజులగా కేసుపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నా మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించలేకపోతున్నారు. మృతుల సంబంధీకుల కోసం విచారించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గత ఐదు రోజులుగా వృద్ధుల మృతదేహాలు పటన్‌చెరు ఆస్పత్రిలోనే ఉన్నాయి. అయితే మృతులది హత్యా లేదా ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేపట్టామని.. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని పోలీసులు తెలిపారు. -
మిస్టరీ వీడని వృద్ధ దంపతుల మృతి
-
యువకుడి అనుమానాస్పద మృతి
రాజమహేంద్రవరం క్రైం: ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని మృతి చెందాడు. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు గ్రామానికి చెందిన బిక్కవోలు శ్రీనివాస్(20) శుక్రవారం తెల్లవారు జామున ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి మూడు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన దమయంతి అనే యువతితో వివాహమయ్యింది. ఆమె గర్భిణి కావడంతో పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ చాగల్లు గ్రామానికి చెందిన మరో యువతి బొల్లెపు స్వప్న గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 3న ఇద్దరూ కలసి చాగల్లు నుంచి విజయవాడ వెళ్లిపోయి, కనక దుర్గమ్మ గుడిలో వివాహం చేసుకున్నారు. అక్కడ నుంచి శ్రీనివాస్, స్వప్న రాజమహేంద్రవరం చేరుకున్నారు. కొన్ని రోజులు లాడ్జిలో గడిపారు. రాజమహేంద్రవరానికి చెందిన ముప్పిడి రాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడటంతో అతని ద్వారా శుక్రవారం జాంపేట గాంధీబొమ్మ ప్రాంతంలోని ఓ బిల్డింగ్‌లోని నాల్గో అంతస్తులో ఇద్దరూ కలసి రూమ్ అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో రూమ్ శుభ్రం చేసుకొని 9 గంటలకు ఆ గదిలోకి దిగారు. రాత్రి చాలా సేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. అతడు నిద్రలో దమయంతి అని కలవరించడంతో ముందు భార్య గుర్తుకు వచ్చిందా? అంటూ స్వప్న అతడితో గొడవకు దిగడంతో ఇరువురూ ఘర్షణ పడ్డారు. దీంతో బయటకు వచ్చేసిన శ్రీనివాస్ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇంట్లోని ఫ్యాన్ కొక్కానికి చీరతో ఉరి వేసుకొని మృతి చెందాడు. తనతో గొడవపడి వెళ్లిన శ్రీనివాస్ ఎంతకీ రాకపోవంతో బయటకు వచ్చి చూసే సరికి ఫ్యాన్ కొక్కేనికి వేలాడుతూ కనిపించాడని స్వప్న పోలీసులకు తెలిపింది. కింద పోర్షన్లోని వారి సాయంతో చాకుతో చీరను కోసి కిందకు దింపామని అప్పటికే మృతి చెందాడని ఆమె చెప్పింది. మొదటి భార్యకు అన్యాయం చేశాననే ఆత్మహత్య చేసుకున్నాడా? మొదటి భార్య దమయంతికి అన్యాయం చేసి, మరో వివాహం చేసుకున్నానన్నే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరే ఇతర కారణమైనా ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. సంఘటనా స్థలాన్ని త్రీటౌన్ సీఐ మారుతిరావు, ఎస్సై రాములు సందర్శించారు. ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
కర్నూలు మెడికల్ కాలేజీలో విషాదం
సాక్షి, కర్నూలు : కర్నూల్ మెడికల్ కాలేజీ హాస్టల్లో విషాదం చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ మొదటి సంత్సరం చదువుతున్న విద్యార్థి అనుమానాస్పదంగా మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. వైఎస్ఆర్ జిల్లా కడప అరవింద్ నగర్‌కు చెందిన హర్ష ప్రణీత్ రెడ్డి కర్నూలు మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్నాడు. గురువారం రాత్రి 11.30 నిమిషాలకు తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకొన్నాడు. అయితే కొద్ది సేపటికి సహచర విద్యార్ధులు వచ్చి డోర్ కొట్టగా హర్ష స్పందించక పోవడంతో అనుమానం వచ్చి బద్దలు కొట్టారు. చలనం లేకుండా పడివున్న మిత్రుడిని హాస్పిటల్‌కు తరలించి కళాశాల యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే హర్ష మరణించినట్లు వైద్యులు తెలిపారు. హర్ష ప్రణీత్ మృతిపై తండ్రి రామాంజుల రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తన కొడుకు శరీరంపై రక్తపు మరకలు ఉన్నాయని, ఎవరో కొట్టి చంపారని ఆరోపించారు. గతంలో చాలాసార్లు కాలేజీలో ర్యాగింగ్ చేస్తున్నట్లు తనతో చెప్పాడని, కానీ ఇవన్నీ మామూలే అని నచ్చచెప్పి బాగా చదువుకోమని చెప్పానని ఆయన అన్నారు. పరీక్షలకు భయపడి ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని, ర్యాగింగ్ చేసి తన కుమారుడిని పొట్టన పెట్టుకున్నారని కన్నీరు మున్నీరు అయ్యారు. గారాబంగా పెంచుకున్న కుమారుడు చనిపోతే కాలేజీ యాజమాన్యం, సిబ్బంది కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని అన్నారు. అయితే హర్ష మరణంపై కాలేజీ యాజమాన్యం స్పందించింది. త్వరలో జరగనున్న మొదటి సంవత్సర పరీక్షల ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తెలిపారు. కాలేజీలో ర్యాగింగ్ లేదని, దానిని అడ్డుకోవడానికి కఠిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇది ర్యాగింగ్ చేసే సమయం కూడా కాదన్నారు. హర్ష మరణంపై సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్ చేరుకొని విచారిస్తున్నారు. మృతుడి తండ్రి నుంచి ఇంకా ఫిర్యాదు అందలేదని, అందిన వెంటనే విచారణ చేపడతామని చెప్పారు. అయితే కాలేజీలో ర్యాగింలేదని యాజమాన్యం చెబుతున్నా.. ఇతర విద్యార్థులు మాత్రం కాలేజీలో ర్యాగింగ్ ఉందని వెల్లడించడం విశేషం. -
పాలిటెక్నిక్ విద్యార్థి అనుమానాస్పద మృతి
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి అజ్మీరా గణేశ్(17) బుధవారం అనుమానాస్పదంగా తాను ఉంటున్న ప్రైవేటు హాస్టల్లో మృతి చెందాడు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం కమ్మర్పల్లి శివారు చక్రతండాకు చెందిన వాల్యానాయక్ – పద్మల కుమారుడైన అజ్మీరా గణేశ్ మెకానికల్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలో హాస్టల్ వసతి లేకపోవడంతో ప్రైవేటు హాస్టల్లో ఉంటున్నాడు. మంగళవారం ఇంటికి వెళ్తానని తోటి విద్యార్థులకు చెప్పి వెళ్లిన గణేశ్ రాత్రి 9 గంటలకు తిరిగి వచ్చాడు. తెల్లవారుజాము తోటి విద్యార్థులు తమతో పాటు గణేశ్ లేకపోవడాన్ని చూసి సెల్‌కు ఫోన్‌చేశారు. ఫోన్ ఎత్తకపోవడంతో ఎక్కడిౖకైనా వెళ్లి ఉంటా డని భావించారు. హాస్టల్ రెండో అంతస్తుపైకి వెళ్లగా గణేశ్ పడిపోయి ఉండటాన్ని గమనించారు. గణే‹శ్ పక్కనే పురుగుల మందు డబ్బా ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. M తమ కుమారుడిని ఎవరో చంపి.. పురుగుల మందు తాగించి ఆత్మహత్యగా చిత్రీకరించారని తల్లిదండ్రులు వాల్యానాయక్, పద్మ ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా, అడ్డుకున్నారు. కేసు విచారణ జరిపిస్తామని డీఎస్పీ మల్లారెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
మహిళా టెక్కీ అనుమానాస్పద మృతి !
సాక్షి, బెంగళూరు: విధి నిర్వహణలోవున్న ఒక మహిళా టెక్కీ అనుమానాస్పద రీతిలో భవనంపై నుంచి పడి మృతి చెందిన ఘటన బుధవారం మారతహళ్లి సమీపంలోని జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గీతాంజలి అనే వివాహిత నగరంలోని క్రిష్ణా బిజినెస్ టెక్ పార్కులోని నాలుగో అంతస్తులో ఉన్న అధ్వా ఆప్టిక్స్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు గోవాలో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఆమె పుట్టినరోజు కూడా జరుపుకున్నట్లు తెలిసింది. బుధవారం విధులకు హాజరైన గీతాంజలి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కార్యాలయ భవనం నుంచి కిందకు పడిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను కంపెనీ సిబ్బంది ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కంపెనీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆమె ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందిందా? ఎవరైనా తోసివేశారా ? అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
రైతు అనుమానస్పద మృతి
-
యువనటి బిదిశ అనుమానాస్పద మృతి
గురుగ్రామ్: తన నటన, సంగీతంతో అశేష ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న నటి, గాయని బిదిశా బెజ్బరువా అనుమానాస్పదరీతిలో ప్రాణాలు కోల్పోయారు. అసామీ నటిగా పాపులర్అయిన బిదిశా.. ఇటీవలే బాలీవుడ్లో అడుగుపెట్టారు. సోమవారం ఢిల్లీ శివారు గురుగ్రామ్‌లోని తన ఫ్లాట్‌లో ఆమె ఉరివేసుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నటి మరణంపై ఆమె కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు భిన్నకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బిదిశా స్వస్థలం గువాహటి. చిన్నతనం నుంచే సంగీతం, నటనల పట్ల శ్రద్ధకనబర్చిన ఆమె.. టీనేజ్‌లో ఉండగానే రంగప్రవేశం చేసింది. అసామీ నాటకాలు, సంగీత కార్యక్రమాల ద్వారా పేరు సంపాదించుకుంది. ఇటీవలే విడుదలైన ‘జగ్గా జాసూస్’ ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. కెరీర్ కీలక దశలో ఉన్న తరుణంలో బిదిశా మరణవార్త ఆమె అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏడాది కిందటే.. గుజరాత్‌కు చెందిన నిశీత్ ఝా అనే వ్యక్తితో బిదిశ వివాహం జరిగింది. అయితే, నిశీత్ కుటుంబీకులు బిదిశను వేధింపులకు గురిచేయడంతో ఆ కుటుంబానికి దూరంగా ఉంటున్నారామె. కాగా, భర్తతో మాత్రం సత్సంబంధాలే కొనసాగుతున్నట్లు తెలిసింది. బిదిశ చనిపోవడానికి కొద్దిరోజుల ముందు భర్తతో కలిసి టూర్‌కు వెళ్లినట్లు సమాచారం. బిదిశది ఆత్మహత్యేనా? లేక మరొకటా? అనేది ఇప్పుడే చెప్పలేమన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కిట్స్ విద్యార్థి అనుమానాస్పద మృతి
వరంగల్ : కిట్స్ కళాశాల విద్యార్థి సాయిరాజ్ అనుమానాస్పద మృతిపై కలకలం రేగింది. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయిరాజ్‌ను గురువారం సాయంత్రం సీనియర్ విద్యార్థులు ములుగులో పెళ్లి ఉందంటూ బలవంతంగా తీసుకువెళ్లారు. అయితే పెళ్లి ఊరేగింపు సందర్భంగా గొడవ జరిగిందని, గాయపడిన అతడిని ఎంజీఎంలో చేర్చినట్లు సీనియర్ విద్యార్థులు చెబుతున్నారు. అయితే అప్పటికే సాయిరాజ్ చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా, తమ కుమారుడిని సీనియర్ విద్యార్ధులు పొట్టనబెట్టుకున్నారని సాయిరాజ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
యువతి అనుమానాస్పద మృతి
చర్లపల్లి: రైల్వే స్టేషన్లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన నగరంలోని చర్లపల్లి రైల్వేస్టేషన్లో సోమవారం ఉదయం వెలుగుచూసింది. స్థానిక భరత్ నగర్లో నివాసముండే రోజా(18) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకుందా.. లేక ఎవరైన హత్య చేశారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బీటెక్ విద్యార్ధి అనుమానాస్పద మృతి
-
యువకుడి అనుమానాస్పద మృతి
అనంతపురం సెంట్రల్ : అనంతపురం రామ్‌నగర్‌లోని ఓ చికెన్ సెంటర్లో పని చేసే ప్రతాప్(27) అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు నాలుగో పట్టణ ఎస్ఐ సాగర్ తెలిపారు. తాడిపత్రి మండలం చిల్లకొండయ్యవారిపల్లికి చెందిన లక్ష్మి, నరసింహులు దంపతుల కుమారుడైన ప్రతాప్ అనంతపురంలో ఓ గది అద్దెకు తీసుకుంటూ ఉండేవాడు. చికెన్ సెంటర్లో పని చేస్తూ అక్కడ వచ్చే జీతాన్ని ఇంటికి పంపేవాడు. ఈ క్రమంలో ఆదివారం యథావిధిగా పనికి వెళ్లిన అతను బలమైన గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మరణించాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. -
ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ మృతి
-
ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ మృతి
హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ, ఆమె కుమారుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. హైదరాబాద్‌కు చెందిన సుప్రజకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన వ్యక్తితో 2006లో వివాహమైంది. ఏడాది క్రితం సుప్రజ ఆస్ట్రేలియా వెళ్లింది. దంపతులు ఇద్దరూ అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు (ఆరు నెలలు) ఉన్నాడు. రెండు రోజుల క్రితం సుప్రజ, ఆమె కుమారుడు మృతి చెందారు. ఆమె మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
దర్శి: ప్రకాశం జిల్లా దర్శి మండలంలో సోమవారం వేకువజామున విషాదం చోటుచేసుకుంది. బండి వెలిగండ్ల గ్రామానికి చెందిన స్వప్న(19) అనే వివాహిత కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించింది. స్వప్నను అత్తింటి వారే చంపి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారని యువతి తరుపు బంధువులు ఆరోపిస్తున్నారు. స్వప్న భర్త ఏసుదాసును పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వప్న, ఏసుదాసులకు రెండున్నర సంవత్సరాల క్రితం వివాహమైంది. -
వ్యవసాయ పొలాల్లో వ్యక్తి మృతి
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం రేఖవారిపల్లె సమీపంలో వ్యవసాయ పొలాల్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడ్ని గూటంవారిపల్లె గ్రామానికి చెందిన గోపాలకృష్ణ (35)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి..
- ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన కొల్చారం(మెదక్) ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామ శివారులో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. మెదక్ రూరల్ సీఐ రామక్రిష్ణ, కొల్చారం ఎస్సై రమేష్‌నాయక్ గ్రామస్థుల కథనం ప్రకారం... ఎనగండ్ల గ్రామానికి చెందిన మంగలి గణేష్(35) ఐదేళ్లుగా భార్య లలిత, ఇద్దరు కుమారులతో కలిసి పటాన్ చెరువుకు సమీపంలోని బీరంగూడలో కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. స్వగ్రామంలోని సొంతిల్లు కూలిపోవటంతో కొత్త ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు పెట్టి వస్తానంటూ నాలుగు రోజుల క్రితం బీరంగూడ నుంచి ఎనగండ్లకు వెళ్లాడు. మూడు రోజులవుతున్నా భర్త జాడ కానరాకపోవడం, ఫోన్‌చేసినా సమాచారం లేకపోవడంతో లలిత పిల్లలతో కలిసి ఆదివారం ఎనగండ్ల గ్రామానికి చేరుకుంది. ఈ క్రమంలోనే గ్రామ శివారులోని దామర చెరువు వద్ద పొదల్లో గణేష్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకొని గణేష్ మృతదేహాన్ని పరిశీలించారు. గణేష్ మెడ, పొట్ట భాగంలో కత్తిపోట్ల ఆనవాళ్లున్నాయి. డ్వాగ్‌స్వ్కాడ్‌ను రప్పించగా అది మృతదేహం వద్ద నుంచి లలిత వద్దకు వచ్చి ఆగిపోయింది. ఈ మేరకు ఎస్సై రమేష్‌నాయక్ కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థి అనుమానాస్పద మృతి
బీసీ హాస్టల్ విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి-సిరిపురం బీపీ వసతిగృహంలో బుధవారం వెలుగుచూసింది. హాస్టల్లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్న హరికృష్ణ(14) మంగళవారం రాత్రి స్నేహితులతో కలిసి పాఠశాల తరగతి గదిలో పడుకున్నాడు. బుధవారం నిద్రలేచిన తొటి విద్యార్థులు హరికృష్ణను లేపడానికి ప్రయత్నించగా.. ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉన్నాడు. దీంతో విద్యార్థులు హాస్టల్ వార్డెన్‌తో పాటు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. వసతిగృహం శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు ప్రహరిగోడ లేకపోవడంతో.. విష సర్పాలు సంచరిస్తుంటాయని స్థానికులు అంటున్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామానికి చెందిన మేకల లక్ష్మి (36) శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనుమానాస్పద మృతి కోణంలో పొలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
వృద్ధుని అనుమానాస్పద మృతి
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పాత శ్రీరంగరాజపురంలో శనివారం ఉదయం ఒక వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. సత్యం(70) అనే వృద్ధుడు దెబ్బలు తగిలి మృతిచెంది ఉండడాన్ని శనివారం ఉదయం స్థానికులు గమనించారు. మృతుని శరీరంపై రాళ్లతో కొట్టిన దెబ్బలు ఉన్నాయి. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. -
పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య..?
పాలిటెక్నిక్ చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లా ముత్తారం మండలం ఆదివారంపేటలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వేల్పుల శ్యామల(17) కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల దసరా సెలవుల కోసం ఇంటికి వచ్చింది. గురువారం కళాశాలలో పరీక్ష ఉందని యాజమాన్యం సమాచారం అందించడంతో.. కళాశాలకు వెళ్లడానికి సిధ్దమైంది. కానీ.. అనూహ్యంగా.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో ఎవరూ లేరని.. కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యాపంలో మరో అనుమానాస్పద మరణం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో సంచలనాలకు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన 'వ్యాపం' కేసులో మరో మరణం నమోదైంది. ఒడిషాకు చెందిన రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ విజయ్ బహదూర్ (ఐఎఫ్ఎస్) అనుమానాస్పదంగా శవమై తేలారు. భోపాల్ సమీపంలోని రాయఘడ్కు వెళ్లిన ఆయన మృతదేహాన్ని అక్టోబర్ 15 ఉదయం ఝార్సుగూడ రైల్వే ట్రాక్‌పై పోలీసులు కనుగొన్నారు. దీంతో ఈ కుంభకోణంలో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన వారి సంఖ్య 51కి చేరింది. కేసును సీబీఐకి అప్పగించిన తర్వాత నమోదైన తొలి అనుమానాస్పద మరణం ఇదే. 1978 బ్యాచ్‌కి చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ల సమావేశానికి హాజరయ్యేందుకు విజయ్ బహదూర్, భార్య నీతాసింగ్తో కలిసి పూరీ వెళ్లారు. తర్వాత తిరిగి భోపాల్ వస్తుండగా ఈ మరణం సంభవించింది. అయితే ఏసీ కంపార్ట్మెంట్లో తలుపు మూయడానికి వెళ్లిన ఆయన తిరిగి రాలేదని నీతూ చెబుతుంటే.. ప్రమాదవశాత్తూ రైల్లోంచి కిందపడి చనిపోయారని జిల్లా ఎస్పీ దిలీప్ బాగ్ చెప్పారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. కాగా 2012లో ఈ కేసులో ప్రధాన సాక్షి నమ్రతా దామోర్ కూడా రైల్వేట్రాక్‌పై శవమై తేలారు. మరోవైపు వ్యాపం కుంభకోణం విచారణను సీబీఐకి అప్పగించిన సుప్రీంకోర్టు... దర్యాప్తు జరుగుతున్న తీరుపై ఇటీవల సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తుల మరణాలపై సీబీఐ విచారణ చేపట్టింది. ఆ తర్వాతి నుంచి అనుమానాస్పద మరణాలు దాదాపు తగ్గిపోయాయి. కానీ మళ్లీ ఇప్పుడు మరో మరణం వెలుగుచూడటం ఆందోళనలు రేపుతోంది. కేసును తారుమారు చేసేందుకే సాక్షులను ఒక్కొక్కరిని హతమారుస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. -
యువకుడి అనుమానాస్పద మృతి
కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామానికి చెందిన సమివుల్లా(17) అనే యువకుడు శివభాష్యం సాగర్ (వరదరాజస్వామి) ప్రాజెక్ట్ స్పిల్‌వేలో గురువారం శవమై కనిపించాడు. కురుకుంద గ్రామానికి చెందిన రహంతుల్లా కుమారుడైన సమివుల్లా ఆత్మకూరు పట్టణంలోని ఆదిత్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కురుకుంద గ్రామంలో తమ నూతన గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న సమివుల్లా బుధవారం మధ్యాహ్నం బైక్ పై బయటకు వెళ్లాడు. తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. కొడుకు కోసం తల్లి దండ్రులు పలు చోట్ల వెతికారు. గురువారం ఉదయం నల్లమల అడవుల సమీపంలో బైక్ ఉందన్న సమాచారం తో అక్కడికి వెళ్లి వెతికారు. ప్రాజెక్ట్ స్పిల్ వేలో సమీవుల్లా శవం తేలుతూ కనిపించడంతో తల్లిదండ్రులు భోరు మన్నారు. సమాచారమందుకున్న ఆత్మకూరు ఎస్ఐ ఓ మహేశ్వరరెడ్డి సంఘటనా స్థలానికి వెళ్ళి శవాన్ని పోస్టుమార్ట కోసం తరలించారు. కాగా.. తమ కుమారుడి మరణంపై అనుమానాలు ఉన్నాయని మృతుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశారు. మృతుడి కాళ్లు చేతులపై గాయాలున్నాయి.. సమీవుల్లా ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఎవరైనా కొట్టి పైనుంచి నీళ్లలో పడేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కడెం డ్రిస్టిబ్యూటరీ 30వ కాల్వలో పడి మృతి చెందాడు. మృతుడ్ని కంకణాల బక్కయ్య(44)గా గుర్తించారు. ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోయిన బక్కయ్య సోమవారం ఉదయం కడెం కాల్వలో శవమై కనిపించడంతో... ప్రమాదవశాత్తూ పడిపోయాడా, లేక ఆత్మహత్య చేసుకున్నాడా అన్న సందేహాలు నెలకొన్నాయి. -
మహిళ అనుమానాస్పద మృతి
రంగారెడ్డి జిల్లాలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా కందరుకూరు మండలంలోని బొక్కలగడ్డ తండాలో శనివారం ఓ మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడిఉంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. కేసు నమొదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు బిట్రగుంట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన హసన్(62) గా గుర్తించారు. హసన్ ముత్తుకూరులోని ఒక రైల్వే కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా అతడు స్థానికంగా సీవీఆర్ హాస్టల్లో నివసిస్తున్నాడు. గత రెండు రోజులుగా అతడు గది నుంచి బయటకు రాలేదని, పక్క గదిలో ఉండే వారికి దుర్వాసన రావటంతో.. అనుమానించిన వారు విషయం హాస్టల్ నిర్వాహకులకు తెలిపారు. నిర్వహకులు గది తలుపులు తెరిచి చూడగా హసన్ విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు..మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హసన్‌ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
పొలానికి వెళ్లి..నిర్జీవమయ్యాడు!
కురిచేడు : పొలంలో కట్టెలు కొట్టేందుకు సహచరులతో కలిసి వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని ఎన్ఎస్పీ అగ్రహారం రోడ్డులోని మల్లాయపాలెం పంట పొలాల్లో శుక్రవారం వెలుగు చూసింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మండలంలోని ఎన్ఎస్పీ అగ్రహారం గ్రామానికి చెందిన తాటి చెంచయ్య(52) మరో ఏడుగురితో కలిసి కట్టెలు కొట్టేందుకు పొలం వెళ్లాడు. మధ్యాహ్నం తర్వాత వారు రెండు జట్లుగా విడిపోయి కట్టెలు కొడుతున్నారు. ఓ చెట్టు కొట్టడం పూర్తయిన తర్వాత మలవిసర్జనకు వెళ్లి వస్తానని తోటి వారితో చెప్పి చెంచయ్య అటుగా వెళ్లాడు. మిగిలిన ముగ్గురూ మరో జట్టుకు చెందిన నలుగురు కూలీల వద్దకు వెళ్లారు. మేస్త్రి వచ్చి చెంచయ్య గురించి వాకబు చేశాడు. మల విసర్జనకు వెళ్లాడని మిగిలిన వారు చెప్పారు. పొలం కాపలాదారుడు శివారెడ్డి కూడా కూలీల వద్దే ఉన్నాడు. అంతలో శివారెడ్డి భార్య కేకలు వేస్తూ చెంచయ్య పడిపోయాడని చెప్పింది. మిగిలిన కూలీలు వచ్చి కిందపడి ఉన్న చెంచయ్యను చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంతలో అతడు చనిపోయాడని నిర్ధారించుకున్నారు. మృతునికి భార్య,నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో స్థానికులు పెద్ద ఎత్తున వచ్చి మృతదేహాన్ని పరిశీలించి వెళ్లారు. మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చెంచయ్య విద్యుదాఘాతంతో చనిపోయాడా? ఏదైనా విషసర్పం కాటుకు బలయ్యాడా? అనే విషయం తెలియాల్సి ఉంది. -
యువతి అనుమానాస్పద మృతి
హైదరాబాద్(అబిడ్స్): నగరంలోని జియాగూడలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. జియాగూడక చెందిన ప్రియాంక(19) సమర్ధనారయణ ఆశ్రమంలోని చెట్ల పొదల్లో విగతజివిగా కనిపించింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పింకీ.. దెయ్యమై తగలబెట్టేసింది!
దెయ్యాలు -ప్రతీకారం కథలు మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. సరిగ్గా అలాంటి సినిమా కథను మరిపించే ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్లో సంచలనం రేపింది. ఆ నగరంలో గాజులు తయారుచేసే కుటుంబానికి చెందిన ఇల్లు హఠాత్తుగా తగలబడిపోయింది. ఇంట్లోని వస్తులన్నీ అగ్నికి ఆహుతైపోయాయి. దుస్తులు, డబ్బులు, గాజుల తయారీకి ఉపయోగించే వస్తువులు ఏవీ మిగల్లేదు. సర్వం కాలి బూడిదైంది. దీంతో ఆ కుటుంబం, గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో పడిపోయారు. దీంతో పదిహేనేళ్ల క్రితం అనుమానాస్పదంగా చనిపోయిన ఆ ఇంటి కోడలు పింకియే దెయ్యమై కుటుంబాన్ని నాశనం చేసిందని గ్రామంలో వదంతులు షికార్లు చేశాయి. మరోవైపు పింకీ తనకు కలలో చాలాసార్లు కనిపించిందని, చంపేస్తాననీ, సర్వనాశనం చేస్తానని చాలాసార్లు బెదిరించిందని పింకీ అత్తగారు వాపోతోంది. పింకి మరణం తర్వాత ఆమె భర్త నాగేంద్ర రెండోపెళ్లి చేసుకున్నాడు. ఆమెను కూడా దెయ్యం పట్టి పీడిస్తోందని, నాగేంద్ర కొడుకును కూడా బలితీసుకుందని అంటున్నారు. అప్పుడే నాగేంద్ర తండ్రి మంత్రగాళ్లను సంప్రదించారని, దీంతో ఆగ్రహం చెందిన పింకీ దెయ్యం ఆ కుటుంబంపై పగ తీర్చుకుందనే వార్తలు గ్రామంలో గుప్పుమన్నాయి. కానీ ఈ వార్తలను హేతువాద సంఘాలు కొట్టి పారేస్తున్నాయి. మండు వేసవిలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు అక్కడక్కడ సంభవిస్తాయని.. వదంతులు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. -
నల్లగొండవాసి అనుమానాస్పద మృతి
మృతుడు ఆర్మీ జవాన్, 22న వివాహం, అంతలోనే చావు కబురు మిర్యాలగూడ టౌన్: పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో ఆది వారం నల్లగొండ జిల్లావాసి అనుమానాస్పదంగా మృతి చెం దాడు. వివరాలు.. మిర్యాలగూడ మండలం తడకమళ్లకు చెందిన అనంతుల వెంకయ్య కుమారుడు లింగస్వామి(25) కోల్‌కతాకు 150 కిలోమీటర్ల దూరంలోని పనార్జర్ ఆర్మీ సెం టర్లో జవాన్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 22న అతని వివాహానికి నిశ్చయమైంది. శనివారం రాత్రి 12 గంటల సమయంలో తమతో ఫోన్లో మాట్లాడినట్లు తల్లిదండ్రులు వెంకయ్య, లక్ష్మమ్మ తెలిపారు. ఈ విషయమై లింగస్వా మి రూమ్మేట్ అయిన నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన బాలకృష్ణారెడ్డితో ‘సాక్షి’ మాట్లాడగా తాము నిద్రలేచి స్నానం చేసేందుకు లింగస్వామిని కదిలించగా శరీరం మొత్తం చల్లబడిపోయి ఉందని, వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. ఆర్మీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించినట్లు చెప్పారు. ప్రస్తుతం లింగస్వామి మృతదేహం దుర్గాపూర్ సివిల్ ఆస్పత్రిలో ఉంది. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
హైదరాబాద్: నగరంలోని యాకుత్‌పూర సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. గురువారం ఉదయం రైల్వే ట్రాక్‌పై మృతదేహం ఉండటంతో స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. -
'ఐఏఎస్ మృతి కేసును మేం విచారించలేం'
ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును తాము స్వీకరించలేమని సీబీఐ.. కర్ణాటక ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దర్యాప్తు విషయంలో సిద్ధరామయ్య సర్కారు ఆంక్షలు విధించడమే ఇందుకు కారణమని తెలిసింది. రవి ఎందుకు మరణించారు, ఎలా మరణించారు అనే విషయాల్ని ఫలానా కోణంలో మాత్రమే దర్యాప్తు చేయడంతోపాటు మూడు నెలలలోగా చార్జిషీటు సిద్ధం చేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించిన దరిమిలా ఇలాంటి కండిషన్ల మధ్య కేసును స్వీకరించలేమని సీబీఐ వర్గాలు తెలిపాయి. కాగా, కర్ణాటక సీఐడీ పోలీసులు పర్యవేక్షిస్తోన్న ఈ కేసు దర్యాప్తును స్వీకరించాలని సీబీఐకి మరోసారి నోటిఫికేషన్ పంపుతామని సీఎం సిద్ధరామయ్య అన్నారు. కొత్త నోటిషికేషన్ అందిన తర్వాత, దానిని పరిశీలించిన మీదట తుది నిర్ణయం తీసుకుంటామని దర్యాప్తు సంస్థ ప్రతినిధులు తెలిపారు. మార్చి 17న తన అధికార నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన ఐఏఎస్ అధికారి రవి.. కోలార్ జిల్లాలోని ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపారు. దీంతో ఆయన బెదిరింపులతోపాటు రాజకీయ ఒత్తిళ్లను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదే ఆయన మరణానికి ప్రధాన కారణమని కుటుంబ సభ్యులతోపాటు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం మరో ఐఏఎస్ అధికారిణితో ప్రేమ వ్యవహారమే రవి మృతికి కారణమని పేర్కొనడం గమనార్హం. -
బతుకుదెరువుకు వెళ్లి అనుమానాస్పద మృతి
రాజంపేట : బతుకుదెరువు కోసం పరాయి దేశానికి వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ఓ అభాగ్యుడు. వివరాల ప్రకారం.. వైఎస్సార్ జిల్లా రాజంపేట పట్టణానికి చెందిన షేక్ జాన్‌బాషా కుమారుడు కరీముల్లా(35) రెండు నెలల క్రితం కువైట్‌లోని ఓ షేక్ ఇంట్లో వంటపని చేసేందుకు వెళ్లాడు. ఇటీవల ఒక రోజు తాను పని చేస్తున్న షేక్ ఇంట్లో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత చూడగా బాత్రూంలో విగతజీవిగా పడి ఉన్నాడు. దీనిపై సమాచారం అందుకున్న కువైట్ పోలీసులు రంగంలోకి దిగి కరీముల్లాది హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో విచారిస్తున్నారు. అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారులు మాత్రం కరీముల్లాది ఆత్మహత్యగా కనిపించటం లేదని అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా అతని మృతి విషయం రెండు రోజుల తర్వాత రాజంపేటలోని కుటుంబసభ్యులకు తెలిసింది. కరీముల్లా మృతదేహం శనివారం రాజంపేటకు చేరుకుంది. -
ఎంపీ గవర్నర్ కుమారుడి అనుమానాస్పద మృతి
లక్నో: మధ్యప్రదేశ్ గవర్నర్ రాంనరేశ్ యాదవ్ కుమారుడు శైలేష్ యాదవ్(50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్ వృత్తి పరీక్షల బోర్డు(వ్యాపమ్) స్కాంలో శైలేష్ యాదవ్ నిందితుడు. ఆయన మృతికి కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ, ఈ స్కాంలో నిందితుడుగా పేరు చేర్చినప్పటి నుంచి తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని.. ఆయన మృతికి అదొక కారణం కావచ్చని ప్రాథమికంగా మాత్రమే భావిస్తున్నామని ఆయన కుటుంబ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు సత్యదేవ్ త్రిపాఠీ అభిప్రాయపడ్డారు. గుండెపోటు వల్ల కానీ, మెదడులో రక్తస్రావం వల్ల కానీ మరణించి ఉంటారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. శైలేష్ యాదవ్ మృతదేహం ఆయన బెడ్రూమ్లో నేలపై పడి ఉందని స్థానిక గౌతమ్ పల్లి పోలీసులు తెలిపారు. ఆయనకు మధుమేహం కూడా ఉందని.. అది పెరగటం వల్ల కూడా మరణం సంభవించి ఉండవచ్చని పోలీసులన్నారు. అయితే పోస్ట్‌మార్టమ్ శైలేష్ మృతికి స్పష్టమైన కారణాలు వెల్లడి కాలేదని పోలీసులు చెప్పారు. మధ్యప్రదేశ్‌లో గ్రేడ్ 3 టీచర్ల నియామకానికి సంబంధించిన స్కాంలో శైలేష్ యాదవ్ పేరును నిందితుడిగా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ చేర్చింది. ఆయనతో పాటు తండ్రి, మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్‌నరేశ్‌యాదవ్ పేరునూ నిందితుల జాబితాలో చేర్చారు. ఈ కేసులో 10మంది నిరుద్యోగ ఉపాధ్యాయులు ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.3లక్షల చొప్పున శైలేష్ స్నేహితుడు విజయ్‌పాల్ వసూలు చేసి భోపాల్ రాజ్‌భవన్‌లో నేరుగా శైలేష్‌కు అందించారని అభియోగాలను టాస్క్‌ఫోర్స్ నమోదు చేసింది. మధ్యప్రదేశ్‌లో ఇటీవలి దశాబ్దాలలో అతి పెద్ద అవినీతి కుంభకోణంగా వ్యాపమ్ సంచలనం సృష్టించింది. ఈ కేసులో తమను నిందితులుగా చేర్చటంపై రాంనరేశ్‌యాదవ్ హైకోర్టుకు కూడా వెళ్లారు. కాగా శైలేష్ యాదవ్ మృతి వ్యవహారాన్ని సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
భారత కార్మికుడి అనుమానాస్పద మృతి
దుబాయ్: యూఏఈలో భారత కార్మికుడొకరు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. షార్జా పారిశ్రామిక ప్రాంతం నంబరు 17లో పనిచేస్తున్న 35 ఏళ్ల భారత కార్మికుడు సీలింగ్ కు ఉరేసుకుని చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు. అయితే అతడి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనా స్థలంలో స్టూల్ గానీ, నిచ్చెన గానీ లేవు. దీంతో అతడు సీలింగ్ పైకి ఎలా చేరుకున్నాడనేది అనుమానంగా మారింది. మృతదేహాన్ని ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సీతామహలక్ష్మిది హత్యే!
పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు నమోదు సీఐ బాలసూర్యారావు సాగర్‌నగర్ (ఆరిలోవ) : ఒకటోవార్డు పరిధి పైనాపిల్ కాలనీలో బుధవారం మృతిచెందిన సీతామహలక్ష్మిది హత్యగా పోలీసులు ధ్రువీకరించారు. గోపాలపట్నం సీఐ బాలసూర్యారావు కథనం మేరకు వివరాలిలావున్నాయి. మంగళవారం రాత్రి సీతామహలక్ష్మి ఆమె భర్త సూర్యనారాయణ గొడవపడ్డారు. దీనిలో భాగంగా సూర్యనారాయణ సీతామహలక్ష్మిని కడుపులో బలంగా గుద్దడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు బుధవారం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. గురువారం ఆమె మృతదేహానికి గురువారం కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. దీనిపై వచ్చిన నివేదిక ఆధారంగా హత్యగా కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. నిందితుడు సూర్యనారాయణను అదుపులోకి తీసుకుంటామని ఆయన వివరించారు. -
మహిళ అనుమానాస్పద మృతి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని ఎల్బీనగర్ కాలనీకి చెందిన మహిళ అనుమానాస్పదంగా మృతిచెందింది. కాలనీకి చెందిన దాసరి పద్మ(38) గురువారం మధ్యాహ్నం ఇంట్లో అచేతనంగా పడి ఉంది. ఇది గమనించిన వారు పరిశీలించి చూడగా ఆమె మృతిచెంది ఉంది. ఎలా మరణించిందనే విషయం తెలియరాలేదు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
ఆర్నెల్ల పసికందు అనుమానాస్పద మృతి
హైదరాబాద్: అభం శుభం తెలియని ఆర్నెళ్ల పసికందు అనుమానాస్పదంగా మృతిచెందింది. ఈ సంఘటన సికింద్రాబాద్‌లోని అంబర్‌నగర్‌లో బుధవారం జరిగింది. వివరాలు.. విజయలక్ష్మీ, ప్రవీణ్కుమార్లకు ఐదేళ్ల క్రితమే పెళ్లైంది. వారికి ఇద్దరు సంతానం వర్షిత్(3), ప్రశస్య (6 నెలలు). ప్రవీణ్‌కుమార్ అకౌంటెంట్‌గా పనిచేస్తూ... అప్పుల బాధ తట్టుకొలేక రెండునెలల కిందటే ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటినుంచి విజయలక్ష్మీ తల్లి ఇంట్లో ఉంటోంది. అయితే బుధవారం ఉదయం పిల్లలను ఇంట్లోనే వదిలేసి ఆమె బయటకు వెళ్లింది. విజయ లక్ష్మీ ఎక్కడికెళ్లిందో అని చూస్తున్న కుటుంబ సభ్యులకు ప్రశస్య శవమై కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అసలేం జరిగింది!
కాకినాడ క్రైం :కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తోట నరసింహం బంధువు బోనాసు రాజా మృతదేహానికి నిబంధనలకు విరుద్ధంగా పోస్టుమార్టం నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలు దాటిన తర్వాత కాకినాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించరు. అంతే కాకుండా సాయంత్రం ఐదు దాటిన తర్వాత పోస్టుమార్టం నిర్వహించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల మేరకు వైద్యులు ఆ నిబంధనలను తుంగలో తొక్కారు. రాత్రికి రాత్రే పోస్టుమార్టం నిర్వహించడంతో రాజా మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గక తప్పదని రంగరాయ వైద్య కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి. తోట నరసింహం మంత్రిగా ఉన్న సమయంలో రాజా వ్యక్తిగత సహాయకునిగా పనిచేసేవాడు. ఆ సమయంలో ఉద్యోగాలిప్పిస్తామంటూ భారీ మొత్తంలో సొమ్ములు వసూలు చేశారు. అందుకు రాజా మధ్యవర్తిగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. డబ్బులిచ్చిన వారికి ఉద్యోగాలు రాకపోవడంతో ప్రస్తుతం వారు రాజాపై ఒత్తిడి పెంచారు. అయితే అతడు మాత్రం ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అతడి సన్నిహితులు చెబుతున్నారు. అతనిని ఎవరో హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో కొంతకాలం నుంచి ఎంపీ తోట నరసింహానికి రాజా దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో పరిసరాలను పరిశీలించి వారున అతడి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాత్రూమ్లో షవర్‌కు లుంగీతో ఉరివేసుకోవడం నిజం కాదంటున్నారు. షవర్ అతని బరువును మోయలేదని, ఉరివేసుకుంటే అది విరిగిపోయేదంటున్నారు. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ముఖంలో పెనుమార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. రాజా మృతదేహం మాత్రం చాలా ప్రశాంతంగా చనిపోయినట్టు ఉందని, అతడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడనడంలో వాస్తవం లేదంటున్నారు. మెడ వద్ద కూడా పెద్దగా ఉరివేసుకున్న గుర్తులు లేకపోవడం ఆ అనుమానాలు బలం చేకూరుస్తోంది. రాజకీయ పలుకుబడితో పోలీసులను కూడా నమ్మించే ప్రయత్నం చేశారని విమర్శిస్తున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు, వైద్యులు కేసును నీరుగార్చే అవకాశం లేకపోలేదంటున్నారు. అతని ప్రతర్ధులే అతనిని హతమార్చి ఉంటారనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం పక్కనే రక్తపు మరకలుండడం కూడా చర్చనీయాంశమైంది. రాజా ఫోన్ నంబర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే అతడి చివరి ఫోన్ కూడా ఓ ప్రముఖ వ్యక్తికి చేసినట్టు విశ్వసనీయ సమాచారం. పోలీసులు రంగ ప్రవేశం చేయకుండానే మృతదేహాన్ని ఉరి నుంచి కిందికి దింపేసినట్టు అతడి స్నేహితుడు నల్లా శ్రీనివాస్ చెప్పడం కూడా నమ్మశక్యంగా లేదని సన్నిహితులు పేర్కొంటున్నారు. అయితే పోలీసులు మాత్రం దీనిపై పెదవి విప్పడం లేదు. రాజా మృతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయని సన్నిహితులు పేర్కొంటున్నారు. -
ఎంపీ తోట నరసింహం బంధువు అనుమానాస్పద మృతి
కాకినాడ క్రైం : కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తోట నరసింహం సమీప బంధువు కాకినాడలోని ఓ ప్రముఖహోటల్‌లో ఆదివారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. లాడ్జి బాత్రూమ్లో షవర్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టుగా అతడి స్నేహితుడు చెబుతుండగా, మరోవైపు పోలీసులు హత్యకు గురైనట్టుగా భావిస్తున్నారు. దీనికి తోడు రాత్రికి రాత్రే పోస్టు మార్టం నిర్వహించడంపై ఈ ఘటన వెనుక అధికార పార్టీ పెద్దల హస్తం ఉన్నట్టుగా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ ఎంపీ తోట నరసింహం మేనల్లుడైన బోనాసు రాజా (42) సామర్లకోట మండలం కాపవరం వీఆర్వోగా పనిచేస్తున్నాడు. ఐదు రోజులుగా ఇతడు కాకినాడలోని ఒక ప్రముఖ హోటల్లో రూమ్ నంబర్ 210లో కాకినాడ వెంకట్‌నగర్‌కు చెందిన తన స్నేహితుడు నల్లా శ్రీనివాస్‌తో కలసి ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం ఇద్దరూ కలిసి గదిలో టీ తాగారు. కొద్ది సేపటికి రాజాకు ఫోన్ వచ్చింది. ఫోన్లో అవతలి వ్యక్తితో అతను చిరాకుగా మాట్లాడడం శ్రీనివాస్ విన్నాడు. వ్యక్తిగత సమస్య అనుకుని శ్రీనివాస్ బయటకు వెళ్లిపోయాడు. అరగంట తర్వాత వచ్చి చూసే సరికి రాజా గదిలో కనిపించలేదు. పరిసరాల్లో గాలించాడు. బాత్రూమ్ తలుపు కొట్టినా స్పందన లేదు. తలుపు తెరుద్దామని శ్రీనివాస్ ప్రయత్నించడంతో లోపల గడియ పెట్టి ఉండడంతో అది తెరుచుకోలేదు. మరో పావు గంట తర్వాత మరలా తలుపు తట్టాడు. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో విషయాన్ని హోటల్ సిబ్బందికి తెలిపాడు. వారు వచ్చి తలుపు తెరిచే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో గునపం తెచ్చి తలుపు బద్దలు కొట్టారు. అయితే బాత్రూమ్లో రాజా విగతజీవిగా పడి ఉండడాన్ని వారు గమనించారు. బాత్రూమ్లో షవర్‌కు లుంగీతో ఉరివేసుకుని రాజా ఆత్మహత్య చేసుకున్నాడని ప్రత్యక్ష సాక్షి నల్లా శ్రీనివాస్ చెబుతున్నాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కర రెడ్డి, క్రైం సీఐ అల్లు సత్యనారాయణ, టూ టౌన్ ఎస్సైలు ఎం.శేఖర్‌బాబు, కేవీఎస్ సత్యనారాయణ తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. విషయం తెలుసుకున్న రాజా భార్య అనూష, కుమారుడు ప్రశాంత్, కుమార్తె ఎస్తేర్, తదితరులు కాకినాడ చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ముడుపుల వ్యవహారమే కారణమా? రాష్ర్ట స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖా మంత్రిగా పనిచేసినప్పుడు ఎంపీ నరసింహానికి రాజా వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు. మంత్రిగా పనిచేసినప్పుడు హోం గార్డులతో పాటు వివిధ శాఖల్లో ఉద్యోగాల నిమిత్తం రూ. లక్షలు చేతులు మారినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో రాజా ద్వారానే ఈ ముడుపుల వ్యవహారం సాగినట్టు అప్పట్లో ఆరోపణలు గుప్పుమన్నాయి. అయితే వారిలో ఏ ఒక్కరికీ ఉద్యోగాలు కల్పించకపోగా, వసూలు చేసిన సొమ్ములు తిరిగి చెల్లించకపోవడంతో కొంత కాలంగా వివాదం నెలకొంది. నరసింహం ప్రస్తుతం ఎంపీగా ఉన్నందున ఇప్పటికైనా తమకు ఉద్యోగాలు కల్పించాలని, లేకుంటే సొమ్ములు చెల్లించాలంటూ వారు రాజాపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకెళ్లినా ఆయన తనకేమీ సంబంధం లేదన్న ధోరణిలో వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బోనాసు రాజా కాకినాడలో అనుమానాస్పద రీతిలో మృతి చెందడం అనేక సందేహాలకు తావిస్తోంది. రాజాకు ఎలాంటి అప్పులు లేవని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. ఎవరో ఏదో చేసి ఉంటారనే అనుమానాలను సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాలు రేకెత్తిస్తున్న పరిసరాలు స్నేహితుడు చెబుతున్నట్టుగా ఉరివేసేందుకు ఉపయోగించిన షవర్ పెద్ద ఎత్తులో కూడా లేదు. పైగా పోలీసులొచ్చే సరికే మృతదేహాన్ని కిందకు దింపేయడం.. బాత్రూమ్లో రక్తపు మరకలు ఉండడం.. మెడపై ఎలాంటి ఉరి వేసుకున్న ఛాయలు కన్పించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సమాచారం తెలిసిన వెంటనే ఎంపీ నరసింహం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకోవడం.. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించడం.. పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహించారనే ఆరోపణలు విన్పిపిస్తున్నాయి. -
అర్ధరాత్రి రౌడీషీటర్ హత్య
-
సునందా పుష్కర్ది ఆత్మహత్య కాదా?
-
సునందా పుష్కర్ది ఆత్మహత్య కాదా?
సునంద పుష్కర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. కేంద్ర మంత్రి శశిథరూర్ మూడో భార్య సునందా పుష్కర్ది ఆత్మహత్య కాదా? ఆమె ఏ కారణం వల్ల మరణించారు? పోస్టుమార్టం చేసిన వైద్యులు చెప్పే విషయాలను చూస్తే ఈ విషయంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించిన సునందా పుష్కర్ మృతదేహానికి ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో శనివారం మధ్యాహ్నం పోస్టుమార్టం పూర్తయింది. ఆమె విషం తీసుకోలేదని పోస్టుమార్టం చేసిన వైద్య నిపుణులు నిర్ధారించారు. అలాగే, ఆమె శరీరంపై ఉన్న గాయాల కారణంగానే మరణించారని కూడా చెప్పలేమని అన్నారు. రెండు మూడు రోజుల తర్వాత మాత్రమే ఆమె మృతికి గల కారణాలపై ఓ అంచనాకు రాగలమని తెలిపారు. పోస్టుమార్టం ప్రక్రియ మొత్తాన్ని పారదర్శకత కోసం వీడియో తీశారు. కాగా సునదా పుష్కర్ శరీరంపై కొన్ని గాయాలున్నాయని, అవి కొంత అనుమానాన్ని కలిగిస్తున్నాయని ఎయిమ్స్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ సుధీర్ గుప్తా తెలిపారు. పూర్తి స్థాయిలో విశ్లేషించిన తర్వాతే అన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు. -
ముంబై-సిటీ మధ్య నేర బంధం
హైదరాబాద్ : ముంబై-హైదరాబాద్ మధ్య నేరబంధం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇక్కడి వారిపై అక్కడ... అక్కడి వారిపై ఇక్కడ వరుస నేరాలు జరుగుతున్నాయి. ఈ తరహాకు చెందిన ఉదంతాలు గత 15 రోజుల్లోనే మూడు చోటు చేసుకున్నాయి. ఓ అనుమానాస్పద మృతి, మరో లైంగికదాడి, ఇంకో హత్య... ఇలా ఈ మూడూ యువతులకు సంబంధించినవే. వాటిని ఓసారి పరిశీలిస్తే... వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి హైదరాబాద్‌లోని నల్లకుంటకు చెందిన ఎంబీ శ్రీనివాస్, రుక్మిణిల కుమార్తె దివ్య మాచిరాజు గత ఏడాది అక్టోబర్ 17న ముంబై వెళ్లారు. అక్కడి జస్లోక్ ఆస్పత్రిలో అనస్తీషియా విభాగంలో పీజీ చేస్తున్నారు. ఈ నెల 2న అనుమానాస్పద స్థితిలో హాస్టల్ రూమ్‌లో మరణించారు. ఇది ఆత్మహత్య అని అక్కడి పోలీసులు చెప్తుండగా... తమ కుమార్తెది హత్యే అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో దివ్య స్నేహితుడిని ముంబై పోలీసులు అనుమానితుడిగా భావిస్తున్నారు. మోడల్‌పై సామూహిక లైంగికదాడి ముంబైలోని అంధేరీ ప్రాంతానికి చెందిన మోడల్‌పై నగరంలో సామూహిక లైంగిక దాడి జరిగింది. ‘న్యూ ఇయర్’ ఈవెంట్ పేరుతో ఆమెను సిటీకి తీసుకువచ్చిన ఐదుగురు ముష్కరులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఈ ఘాతుకం చోటు చేసుకోగా... జనవరి ఏడున ముంబైలోని వెర్సోవా ఠాణాలో కేసు నమోదైంది. సిటీకి బదిలీ కావడంతో తొమ్మిదిన సీసీఎస్ అధికారులు రీ-రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పటికి ఐదుగురు అరెస్టు అయ్యారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణహత్య ముంబైలోని టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న మచిలీపట్నం వాసి ఎస్తేర్ అనూహ్య ముంబైలో దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ నెల 4న విజయవాడ నుంచి బయలుదేరి ఐదున మిస్ అయిన అనూహ్య మృతదేహం గురువారం అక్కడి బందూప్ ప్రాంతంలో బయపడింది. ఈమె సమీప బంధువులు నగరంలోని సికింద్రాబాద్ ప్రాంతంలో నివసిస్తుండటం, మృతదేహం విమానంలో సిటీకి రావడంతో ఇక్కడా కలకలం రేగింది. -
పనిమనిషి హత్యకేసులో బీఎస్పీ ఎంపీ ధనుంజయ్ సింగ్ అరెస్టు
బీఎస్పీ ఎంపీ ధనుంజయ్ సింగ్ భార్య జాగృతి తీవ్రంగా కొట్టడంతో 35 ఏళ్ల పనిమనిషి మరణించింది. మరో బాలికను కూడా ఇనుప రాడ్లు, కర్రలతో విపరీతంగా కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఈ కేసులో ముందుగానే జాగృతిని అరెస్టు చేసిన పోలీసులు.. అనంతరం సాక్ష్యాలను తారుమారు చేశారన్న ఆరోపణలతో ఎంపీ ధనుంజయ్ సింగ్‌ను కూడా అరెస్టు చేశారు. న్యూఢిల్లీలోని సౌత్ ఎవెన్యూలోని బహుజన సమాజ్ పార్టీ ఎంపీ ధనుంజయ్ సింగ్ నివాసంలో పనిమనిషి రాఖీ (35) మంగళవారం తెల్లవారుజామున మరణించింది. ఆమె చేతులు, కాళ్లు, ఎద మీద తీవ్రంగా కొట్టినట్లు గాయాలు కనిపించాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆ మహిళ మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ముందుగా ఉదయం జాగృతిని 12 గంటల పాటు విచారించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై చాణక్యపురి పోలీసు స్టేషన్లో సెక్షన్లు 302, 307, 344 కింద కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు బాల కార్మికులను వెట్టి చాకిరీకి పెట్టుకున్నందుకు మరో కేసు పెట్టాలని కూడా పోలీసులు యోచిస్తున్నారు. ఇక ఇదే కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినందుకు ఎంపీ ధనుంజయ్ సింగ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఎంపీ భార్య తీవ్రంగా కొట్టి, హింసించినందువల్లే పనిమనిషి రాఖీ మరణించిందని పోలీసులు చెబుతున్నారు. అయితే, ఆమె సోమవారం ఉదయం 8.30కి మరణించినా, ఎంపీ మాత్రం పోలీసులకు 12 గంటల తర్వాత.. అంటే రాత్రి 8.30 గంటలకే తెలిపారు. వీళ్ల ఇంట్లోనే పనిచేస్తున్న మరో మైనర్ బాలికను కూడా జాగృతి తీవ్రంగా కొట్టింది. తాను ఉత్తరప్రదేశ్‌లోని తన నియోజకవర్గమైన జన్పూర్ పర్యటనలో ఉన్నానని, సోమవారం రాత్రే తిరిగి వచ్చానని ఎంపీ అంటున్నారు. -
ఎంపీ ఇంట్లో పని మనిషి అనుమానాస్పద మృతి
న్యూఢిల్లీలోని సౌత్ ఎవెన్యూలోని బహుజన సమాజ్ పార్టీ ఎంపీ ధనుంజయ్ సింగ్ నివాసంలో మహిళ పనిమనిషి మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద రీతిలో మరణించింది. ఆ ఘటనపై పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆ మహిళ మృతదేహన్ని పోలీసుల స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఎంపీ ధనుంజయ్ సింగ్ భార్య జాగృతి సింగ్ హింసించడం వల్ల పని మనిషి మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పనిమనిషి ఒంటి నిండా గాయాలు ఉన్నాయని తెలిపారు.అలాగే ఆమె తలకు తీవ్ర గాయమైనట్లు తాము గుర్తించామన్నారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తే కానీ అసలు సంగతి బహిర్గతమవుతుందని పోలీసులు వెల్లడించారు. ధనుంజయ్ సింగ్ భార్య జాగృతి సింగ్ తరచుగా పని మనిషి రాకీని హింసించేదని తొటి పనిమనిషి రాంపాల్‌ను విచారించగా తెలిసిందని పోలీసులు తెలిపారు. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని జన్పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ధనుంజయ్ సింగ్ బహుజన్ సమాజ్ పార్టీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు.