రైల్వే స్టేషన్‌లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
చర్లపల్లి: రైల్వే స్టేషన్‌లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన నగరంలోని చర్లపల్లి రైల్వేస్టేషన్లో సోమవారం ఉదయం వెలుగుచూసింది. స్థానిక భరత్ నగర్‌లో నివాసముండే రోజా(18) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకుందా.. లేక ఎవరైన హత్య చేశారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.