
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని మహవీర్ మెడికల్ కళాశాలకు చెందిన ఓ విద్యారి్థని సోమవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందింది. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి..హైదరాబాద్‌కు చెందిన మేఘన(18) స్థానిక మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతోంది.
కాగా సోమవారం సాయంత్రం కళాశాల ఆవరణలోని గ్రౌండ్‌లో స్నేహితులతో కలిసి ఉండగా.. గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. తోటి విద్యార్థులు వెంటనే ఆమెను కళాశాల ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. తల్లిదండ్రులు చేరుకుని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి్పంచగా చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతిచెందింది. విద్యారి్థని తండ్రి బాబురావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వికారాబాద్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment