యువకుడి అనుమానాస్పద మృతి
Published Mon, Jul 18 2016 1:17 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
అనంతపురం సెంట్రల్ : అనంతపురం రామ్‌నగర్‌లోని ఓ చికెన్ సెంటర్‌లో పని చేసే ప్రతాప్(27) అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు నాలుగో పట్టణ ఎస్‌ఐ సాగర్ తెలిపారు. తాడిపత్రి మండలం చిల్లకొండయ్యవారిపల్లికి చెందిన లక్ష్మి, నరసింహులు దంపతుల కుమారుడైన ప్రతాప్ అనంతపురంలో ఓ గది అద్దెకు తీసుకుంటూ ఉండేవాడు. చికెన్ సెంటర్‌లో పని చేస్తూ అక్కడ వచ్చే జీతాన్ని ఇంటికి పంపేవాడు. ఈ క్రమంలో ఆదివారం యథావిధిగా పనికి వెళ్లిన అతను బలమైన గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మరణించాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
Advertisement
Advertisement