నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు బిట్రగుంట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన హసన్(62) గా గుర్తించారు.
నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు బిట్రగుంట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన హసన్(62) గా గుర్తించారు. హసన్ ముత్తుకూరులోని ఒక రైల్వే కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా అతడు స్థానికంగా సీవీఆర్ హాస్టల్‌లో నివసిస్తున్నాడు. గత రెండు రోజులుగా అతడు గది నుంచి బయటకు రాలేదని, పక్క గదిలో ఉండే వారికి దుర్వాసన రావటంతో.. అనుమానించిన వారు విషయం హాస్టల్ నిర్వాహకులకు తెలిపారు. నిర్వహకులు గది తలుపులు తెరిచి చూడగా హసన్ విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు..మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హసన్‌ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసరెడ్డి తెలిపారు.