
సమగ్ర విచారణ జరపాలని డీఈవోకు ఆదేశం
పాఠశాల, హాస్టల్‌ను పరిశీలించిన బ్రహ్మాజీరావు
హాస్టల్ వార్డెన్‌పై వేటు
దాడికి పాల్పడిన ముగ్గురు విద్యార్థినులు వసతి గృహం నుంచి తొలగింపు
పాడేరు: పట్టణంలోని సెయింటాన్స్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థినిపై పదో తరగతి విద్యార్థినులు దాడి చేసిన ఘటనపై కలెక్టర్ దినేష్‌కుమార్ సీరియస్ అయ్యారు. సోమవారం దినపత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని జిల్లా విద్యశాఖ అధికారి బ్రహ్మాజీరావును ఆదేశించారు. ఇందుకోసంప్రత్యేక కమిటీను ఏర్పాటు చేశారు.
దీంతో డీఈవో సోమవారం పాఠశాల, వసతి గృహాన్ని సందర్శించారు. సంఘటన వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ నిర్వహణకు అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై ఆరా తీశారు. నివేదిక ఆధారంగా వసతి గృహా కేర్ టేకర్ శ్రావ్యను విధుల నుంచి తొలగించారు. ఘటనకు బాధ్యులైన ముగ్గురు టెన్త్ విద్యార్థినులను హాస్టల్ నుంచి ఇళ్లకు పంపించివేశారు. వసతి గృహా నిర్వాహణపై నిత్యం పర్యవేక్షణ జరపాలని, భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునారావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇకపై ఇటువంటి ఘటనలు, వివాదాలు జరిగితే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని డీఈవో హెచ్చరించారు.
#viralvideo
… pic.twitter.com/dcVm70EvT0— greatandhra (@greatandhranews) February 17, 2025
Comments
Please login to add a commentAdd a comment