Class
-
రేపే టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి,హైదరాబాద్ : రేపు (ఏప్రిల్ 28న) మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఎస్ఎస్సీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించారు.తెలంగాణలో మార్చి 18న ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్ 2తో ముగిశాయి. ఈ పరీక్షలకు 11,469 పాఠశాలలకు చెందిన 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో బాలురు 2,57,952 మంది, బాలికలు 2,50,433 మంది ఉన్నారు.ఇక ఏప్రిల్ 30న విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 91.31 ఉత్తీర్ణత శాతం నమోదైంది. బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణత, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫెయిలైన విద్యార్ధులకు ఎస్ఎస్ఈ బోర్డు జూన్ 03 నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షా ఫలితాలను అధికారులు రేపు విడుదల చేయనున్నారు. ఫలితాలను వెబ్సైట్ bse.telangana.gov.in లో చూసుకోవచ్చు. -
‘ఐదు’ తప్పి, ఆరులో ప్రమోషన్ కోసం న్యాయపోరాటం
దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. స్థానికంగా ఐదో తరగతి చదువుతున్న ఓ బాలుడు ఫెయిల్ కావడంతో ఆరో తరగతికి ప్రమోట్ చేసేందుకు ఆ పాఠశాల యాజమాన్యం నిరాకరించింది. దీంతో ఆ పదేళ్ల బాలుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. బాలల హక్కుల కోసం జరిగిన ఈ పోరాటంలో తల్లిదండ్రులు, న్యాయవాదులు ఆ బాలునికి మద్దతుగా నిలిచారు. ఈ కేసు అలకనందలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినది. 2023-24 సంవత్సరంలో 10 ఏళ్ల బాలుడు ఐదవ తరగతి పరీక్షకు హాజరయ్యాడు. అయితే సదరు పాఠశాల యాజమాన్యం ఆ బాలుడు ఫెయిలయ్యాడనే విషయాన్ని తెలియజేయకుండా 15 రోజుల వ్యవధిలో తిరిగి అతనికి మరోమారు పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో ఆ బాలుడు ఫెయిల్ అయ్యాడు. దీంతో ఆ బాలుడిని ఆరో తరగతికి ప్రమోట్ చేసేందుకు పాఠశాల యాజమాన్యం నిరాకరించింది. దీంతో ఆ విద్యార్థి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇది విద్యా చట్టంలోని సెక్షన్ 16(3)ని ఉల్లంఘించడమేనని ఆ బాలుడు తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఆ బాలుడు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ సి హరిశంకర్ ధర్మాసనం ఆ బాలునికి సిక్స్త్‌లో అడ్మిషన్ కల్పించకపోతే అతని చదువు దెబ్బతింటుందని పేర్కొంది. ఆరో తరగతిలో ఆ బాలుడిని కూర్చోవడానికి పాఠశాల అనుమతిస్తే, అది పాఠశాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని వ్యాఖ్యానించింది. దీనికి నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు సదరు ప్రైవేట్ స్కూల్‌తో పాటు విద్యా డైరెక్టరేట్‌ను ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 4న జరగనుంది. తన ఫెయిల్యూర్ గురించి స్కూల్ తనకు తెలియజేయలేదని కోర్టులో పిటిషన్ వేసిన బాలుడు పేర్కొన్నాడు. అంతేకాకుండా పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు రెండు నెలల సమయం కావాలని కోరాడు. దీంతో సదరు పాఠశాల యాజమాన్యం రెండు నెలల తరువాత ఆ విద్యార్థికి తిరిగి పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించింది. -
'పాక్‌కు ఎందుకు వెళ్లలేదు..?' టీచర్ అనుచిత వ్యాఖ్యలు..
ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ టీచర్ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన ఘటన మరవక ముందే ఢిల్లీలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. దేశ విభజన సమయంలో పాక్‌కు ఎందుకు వెళ్లలేదని తమ టీచర్ ప్రశ్నించినట్లు నలుగురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సదరు టీచర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. హేమా గులాటి, గాంధీ నగర్‌లోని ప్రభుత్వ సర్వోదయ బాల్ విద్యాలయాలో పనిచేస్తున్నారు. టీచర్ తమపై మతపరమైన వ్యాఖ్యలు చేసినట్లు నలుగురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాబా, మక్కా, ఖురాన్‌పై కూడా వ్యాఖ్యలు చేశారని పోలీసులకు తెలిపిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశ విభజన సమయంలో పాక్‌కు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించినట్లు చెప్పారు. స్వాతంత్య్ర సమరంలో ఎలాంటి పాత్ర పోషించకుండానే దేశంలో ఉంటున్నారని వ్యాఖ్యానించినట్లు విద్యార్థులు పోలీసులకు తెలిపారు. బాధిత విద్యార్థుల కుటుంబ సభ్యులు ఈ ఘటనపై స్పందించారు. పాఠశాలల్లో ఇలాంటి విద్వేషాలకు తావివ్వకూడదని చెప్పారు. ఆ టీచర్ని స్కూల్ నుంచి బహిష్కరించాలని కోరారు. సరైన అవగాహన లేని విషయాలపై టీచర్లు మాట్లాడకూడదని చెప్పారు. విద్యార్థుల్లో వైషమ్యాలను కలిగించే విధంగా పాఠాలు ఉండకూడదని అన్నారు. ఈ ఘటనపై స్థానిక ఆప్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ బాజ్పై ఈ ఘటనపై స్పందించారు. టీచర్ ఇలా మాట్లాడకూడదని అన్నారు. పిల్లలకు మంచి పాఠాలు చెప్పే విధంగా ఉండాలని చెప్పారు. మతాలపై టీచర్లు తమ సొంత వైఖరిని తరగతి గదిలో మాట్లాడకూడదని అన్నారు. ఆ టీచర్‌పై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. యూపీలో ఇటీవల ఓ టీచర్ తరగతి గదిలో ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించింది. అయితే ఈ ఘటనలో తాను మతపరమైన ఉద్దేశంతో చేయలేదని చెప్పారు. విద్యార్థులకు బుద్ధి చెప్పే క్రమంలో ఇలా చేయాల్సి వచ్చిందని సమాధానమిచ్చుకున్నారు. ఇదీ చదవండి: Muzaffarnagar School Video Controversy: స్టూడెంట్‌పై దాడి వైరల్.. సమర్థించుకున్న టీచర్ .. ఏం చెప్పిందంటే! -
కుటుంబం దుఃఖంలో ఉంటే ఇంత నీచ రాజకీయం చేస్తావా
-
విశాఖ ఎయిర్ పోర్ట్ లో వెలగపూడికి చంద్రబాబు క్లాస్
-
చాట్‌జీపీటీ చెప్పిందని క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేసిన ప్రొఫెసర్..
ChatGPT false: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంత ఉపయోగకరమో.. అంతే ప్రమాదకరమైనది కూడా. టెక్సాస్ యూనివర్సిటీలో జరిగిన సంఘటనే దానికి ఉదాహరణ. చాట్‌జీపీటీ (ChatGPT) చెప్పింది కదా అని క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేశాడో ప్రొఫెసర్. రెడ్డిట్ థ్రెడ్ ప్రకారం.. టెక్సాస్ యూనివర్శిటీలోని ఒక ప్రొఫెసర్.. విద్యార్థులు సమర్పించిన వ్యాసాలు కంప్యూటర్ ద్వారా రాశారని అని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాధనం తప్పుగా చెప్పడంతో క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేశాడు. ఇదీ చదవండి: జీమెయిల్, యూట్యూబ్ యూజర్లకు అలర్ట్: త్వరలో అకౌంట్లు డిలీట్! విద్యార్థులు వ్యాసాలు సొంతంగా రాస్తున్నారా లేదా అని పరిశీలించడానికి ఆ ప్రొఫెసర్ చాట్‌జీపీటీ సాధనాన్ని ఉపయోగిస్తున్నారు. చాట్ జీపీటీ అనేది ఓపెన్ఏఐ అభివృద్ధి చేసిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ చాట్‌బాట్. ఇది వచనాన్ని రూపొందించగలదు. భాషలను అనువదించగలదు. వివిధ రకాల సృజనాత్మక కంటెంట్‌ను రాయగలదు. మీ ప్రశ్నలకు సమాచార రూపంలో సమాధానం ఇవ్వగలదు. తమ ఫైనల్ ఎగ్జామ్స్‌లో భాగంగా విద్యార్థులు తాము రాసిన వ్యాసాలను సమర్పించారు. వారి ప్రొఫెసర్ ఆ వ్యాసాలను స్కాన్ చేయడానికి చాట్‌జీపీటీని ఉపయోగించారు. అయితే విద్యార్థులు సమర్పించిన వ్యాసాలు కంప్యూటర్ ద్వారా రాసినవని చాట్‌జీపీటీ సూచించింది. దీంతో విద్యార్థులు వ్యాసాలను సొంతంగా రాయలేదని భావించిన ప్రొఫెసర్ క్లాస్‌లోని విద్యార్థులందరినీ ఫెయిల్ చేశాడు. అయితే, చాట్‌జీపీటీ చెప్పింది తప్పు అని తేలింది. వ్యాసాలను విద్యార్థులే స్వయంగా రాశారని, కంప్యూటర్లను ఉపయోగించ లేదని స్పష్టమైంది. దీంతో ప్రొఫెసర్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పారు. మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం ఇచ్చారు. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో.. -
ఏపీలో ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు
-
మళ్లీ ఆన్లైన్ ‘థర్డ్’.. డిగ్రీ చదువులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులకు కాలేజీలు మొదలవ్వబోతున్నాయి. ఇప్పటికే కొత్త విద్యార్థులకు పరిచయ కార్యక్రమా లు ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఆనందం ఎంతోకాలం నిలబడేట్టు కన్పించడం లేదు. కరోనా వేరియంట్ ఒమిక్రాన్ నీలినీడల నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి తిరిగి ఆన్లైన్ బోధన ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ దిశగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగా మంగళవారం రాష్ట్రం లోని అన్ని విశ్వవిద్యాలయాల ఉప కులపతులతో సమావేశం నిర్వహిస్తోంది. ఆన్లైన్ విద్యాబోధనే ఇందులో ప్రధాన ఎజెండా కావడం గమనార్హం. వీలైనంత ఎక్కువగా విద్యార్థులను, అధ్యాపకులను, కాలేజీల యాజమాన్యాలను సిద్ధం చేసే అంశాలపై ఈ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. ఒమిక్రాన్ వ్యాప్తిపై స్పష్టత లేకున్నా ఆన్లైన్ బోధనను ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. ప్రత్యక్ష బోధనతోపాటు ఆన్లైన్కూ కాలేజీలు ప్రాధాన్యత ఇవ్వడాన్ని తప్పనిసరి చేసే యోచనలో ఉన్నారు. మార్గదర్శకాల రూపకల్పన ప్రాథమిక విశ్లేషణల ప్రకారం అన్ని వర్సిటీలు ఆన్లైన్ బోధనకే ప్రాధాన్యమిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. గతంలో ఆన్లైన్ బోధనపై అనేక విమర్శలొచ్చిన నేపథ్యంలో ఈ విధానంలో ఎదురవుతున్న సమస్యలపై సమావేశంలో చర్చించనున్నారు. కాలేజీల్లో ముందస్తు ప్రణాళిక లేకపోవడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొరవడటం వల్ల బోధన సరిగా జరగలేదని ఆరోపణలొచ్చాయి. కొన్నిచోట్ల అధ్యాపకులు సెల్‌ఫోన్ ద్వారా తరగతు లు బోధించారు. ఇందులో సబ్జెక్టు ప్రాధాన్యత కొరవడిందని విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జూమ్ మీటింగ్‌ల ద్వారా కూడా బోధనకు అనేక సమస్యలు వచ్చాయి. చాలాచోట్ల ఫ్యాకల్టీలు సాంకేతికతకు అలవాటు కాలేదు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ బోధన కోసం మార్గదర్శకాలు రూపొందించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఆన్లైన్ సంభాషణ జరిగేలా.. ►గతంలో ఆన్‌లోన్ విద్యాబోధనపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ విధానాన్ని పకడ్బందీగా నిర్వహించడంపై ఉన్నత విద్యామండలి దృష్టి పెట్టింది. ఆఫ్‌లైన్‌లో అయితే విద్యార్థులు, అధ్యాపకుల మధ్య నేరుగా సంభాషణ ఉంటుంది కాబట్టి విద్యార్థులు నేరుగా అనుమానాలు నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో ఇలాంటి అవకాశం తక్కువగా ఉంటుంది. అందువల్ల రోజూ అధ్యాపకులు, విద్యార్థుల మధ్య ఆన్లైన్ సంభాషణ జరిగేలా చూడాలని భావిస్తోంది. ►ఆన్లైన్ బోధనకు సంబంధించి ఉన్నత విద్యామండలి కొన్ని అంశాలపై దృష్టి పెట్టింది. ఇందులో ముఖ్యమైంది.. ప్రతీ విద్యార్థి, అధ్యాపకుడి మధ్య ఆన్లైన్ సంభాషణ జరిగేలా చూడాలి. బోధన తొలి నాటి నుంచి కనీసం 15 నిమిషాలపాటు ఓ గ్రూపు ద్వారా విద్యార్థులతో అధ్యాపకులు మాట్లాడేలా చూడాలి. ►కనిష్టంగా 10, గరిష్టంగా 40 శాతం వరకూ ఆన్లైన్ బోధన చేపట్టేలా కాలేజీలను ప్రోత్సహించాలి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అ«ధ్యాపకులు బోధన చేసేందుకు అవసరమైన సదుపాయాలపై కాలేజీలు దృష్టి పెట్టేలా సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకునేలా వీసీలు చూడాలి. ► నిజానికి రెండేళ్లుగా ఆన్లైన్ బోధనతో విసిగిపోయిన మెజారిటీ విద్యార్థులు ప్రత్యక్ష బోధన కోరుకుంటున్నారని ఉన్నత విద్యా మండలి గుర్తించింది. ఈనేపథ్యంలో మళ్లీ ఆన్లైన్ వైపు సంసిద్ధులను చేయడంపై వీసీలు దృష్టి పెట్టాలి. ఆన్లైన్ అంతర్భాగమే ఆన్లైన్ బోధన నేటి విద్యా విధానంలో అంతర్భాగమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రత్యక్ష బోధన సాధ్యం కాని పరిస్థితులు తలెత్తితే సమర్థవంతమైన ఆన్లైన్ బోధన వైపు అడుగులేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాం. వీసీలతో సమావేశంలో దీన్నే ప్రధానాం శంగా చర్చిస్తాం. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
వైరల్: ఆన్లైన్ క్లాస్‌లో టీచర్ ప్రశ్న.. ఉహించని రిప్లై విని ఏం చేసాడంటే!
కరోనా కారణంగా విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు, టీచర్ల మథ్య జరిగిన సంభాషణలున్న వీడియోలు వైరల్‌గా మారి హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ తరహాలోనే సీఏ విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆన్లైన్ క్లాస్‌లో.. ఓ టీచర్ అడిగిన ప్రశ్నకు స్టూడెంట్ షాకింగ్ సమాధానం చెప్పగా ప్రస్తుతం అది నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. ఆ వీడియోలో.. ఎడ్నోవేట్ వ్యవస్థాపక సభ్యుడు సీఏ ధవల్ పురోహిత్ విద్యార్థులకు పాఠాలు చెప్తుంటాడు. ఆ సమయంలో ఒక క్వార్టర్ అంటే ఎంత? అనే ప్రశ్నను విద్యార్థులను అడుగుతాడు. అక్కడ చాట్ బాక్స్‌లో ఉండే ఓ విద్యార్థి వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా 30 ఎంఎల్ అని రాశాడు. చిర్రెత్తుకొచ్చిన ధవల్.. క్వార్టర్ అంటే 3 నెలలు.. అని ఓ వింత ఎక్స్ప్రెషన్తో వివరణ ఇచ్చాడు. దీంతో ఆన్లైన్ క్లాస్‌లో ఒకటే నవ్వులు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు పగలబడి నవ్వుకుంటున్నారు. ఓ నెటిజన్ అయితే సీఏ క్లాసెస్లోనే ఇలాంటివి జరుగుతాయి? అని కామెంట్ చేశాడు. ఇంతకీ ఆ సమాధానం ఇచ్చని మహానుభావుడు ఎవరని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. 🤣🤣🤣🤣🤣 pic.twitter.com/sJpn9I2jQA — Avdhoot D (@avdhootd007) October 3, 2021 చదవండి: Bhuvan Bam: నెలకు రూ.95 లక్షలు సంపాదిస్తున్న యూట్యూబర్ -
ప్రైవేటు టీచర్ బాగోతం.. ఆన్లైన్ క్లాసుల పేరిట అమ్మాయిని..
సాక్షి, సంగారెడ్డి (మెదక్): ఆన్లైన్ క్లాస్‌ల పేరిట ఓ ప్రైవేటు టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన బుధవారం పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రమేశ్ వివరాల ప్రకారం ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తున్న వినయ్‌రాజ్ అదే స్కూల్లో చదువుతున్న అమ్మాయిని ఆన్లైన్ క్లాస్‌ల పేరిట లైంగికంగా వేధించసాగాడు. ఈ క్రమంలో యువతి గత కొన్ని రోజులుగా తీవ్రంగా ఇబ్బందిపడుతుంది. దీంతో అమ్మాయి తల్లిదండ్రులకు తన బాధను తెలియజేసింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని అదృశ్యం పటాన్చెరు టౌన్: సాఫ్ట్వేర్ ఉద్యోగిని అదృశ్యమైన సంఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సాయిలు కథనం ప్రకారం పటాన్చెరు పట్టణం జేపీ కాలనీకి చెందిన విఠల్ కూతురు రాయినీ అంబిక గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. రాత్రి వరకు అంబిక ఇంటికి రాకపోవడం, బంధువుల వద్ద వెతికినా ఆచూకి లభించకపోవడంతో అంబిక సోదరుడు విశాల్ పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పోర్న్ పరేషాన్: అశ్లీల వీడియోలను ఎక్కువగా చూస్తున్న విద్యార్థులు!
సాక్షి, బెంగళూరు: కరోనా విపత్తు వల్ల రెండేళ్ల నుంచి ఆన్లైన్ క్లాసులకే విద్యార్థులు పరిమితమ య్యారు. అయితే చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండడంతో చాలా మంది లాక్డౌన్ వేళ ఇంటర్నెట్లో అశ్లీల దృశ్యాలు, వీడియోలు చూడడం అలవాటు చేసుకు న్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఏడాదిలో పిల్లలు, టీనేజర్లు ఎక్కువ సంఖ్యలో అశ్లీల వీడియో లు చూసినట్లు సైబర్ క్రైం అధికారులు చెప్పారు. ప్రత్యేకంగా పిల్లల పోర్న్ (అశ్లీల) వీడియో వీక్షణ లాక్డౌన్లో ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అశ్లీల వీడియోలను చూస్తున్నట్లు నిర్ధారణ అయితే సమాచార సాంకేతిక చట్టం 67బీ ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేస్తారు. పిల్లల అశ్లీల వీడియోలు, దృశ్యాలు చూస్తే గరిష్టంగా ఐదేళ్లు, రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. రెండోసారి అలాగే పట్టుబడితే ఏడేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. పెద్దల అశ్లీల వీడియోలు చూసే వారికి మూడేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా, రెండో సారి పట్టుబడితే ఏడేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఎవరు చూసినా శిక్షే లాక్డౌన్ సమయంలో కేవలం పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా పోర్న్ వీడియోలు ఎక్కువగా చూస్తున్నట్లు తెలిసింది. గత కొన్ని నెలల్లో పోర్న్ వీడియోలను చూసిన వారిని సీఐడీ గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200 మందిని ఇటీవల అధికారులు విచారించారు. ఏ మొబైల్ నుంచి వీడియోలు చూశారు, ఆ మొబైల్ యజమానిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. 18 ఏళ్ల లోపు చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తే తల్లిదండ్రులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూస్తే తల్లిదండ్రులను అరెస్టు చేసే అవకాశం ఉంది. అశ్లీల వీడియోల చూడడాన్ని నియంత్రించేందుకు సైబర్ అధికారుల సాంకేతిక బృందం సిద్ధమవుతోంది. కేవలం అశ్లీల వీడియోలు చూసే వారిని ఈ బృందం లక్ష్యంగా చేసుకుని గుర్తిస్తోంది. -
Priyanka Kumari: స్మార్ట్ ఫోనే మనకు అన్నీ చెప్పేస్తుంది
ప్రియాంక కుమారి పంచాయితీ స్కూల్ టీచర్. అయితే ఏడాదిగా ఆమె ‘డిజీ–శావీ’ కూడా! లాక్డౌన్లో టీచర్స్ అంతా పిల్లలకు డిజిటల్ క్లాసులు తీసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు.. సాటి టీచర్స్ అందరికీ ఆమె డిజిటల్ టెక్నాలజీని ఎలా ఉపయోగించవచ్చో ఆన్లైన్ పాఠాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు దాదాపు 250 మంది ప్రభుత్వ మహిళా టీచర్లను డిజిటల్ వారియర్లుగా మలిచారు. నదీతీరాలను అనుసరించి బిహార్ నాలుగు భాగాలుగా ఉంటుంది. ఆంగిక, భోజ్‌పురి, మగధి, మిథాలి. ప్రియాంక (36).. మిథాలి ప్రాంత పరిధిలోకి వచ్చే సీతామఢి లోని ప్రభుత్వ పాఠశాలలో ఆరు, ఏడు తరగతుల టీచర్. సీతామఢి పట్టణం, జిల్లా కేంద్రం కూడా. బిహార్‌లోని పై నాలుగు ప్రాంతాలు ఒకే భాషను మాట్లాడతాయి కనుక మాండలికం తప్ప భాష అర్థం కాకపోవడం ఉండదు. అయితే గత ఏడాది.. లాక్డౌన్ మొదలయ్యాక స్కూలు పిల్లలకు డిజిటల్ నాలెడ్జ్ అనేది నేర్చుకుని తీరవలసిన ఒక ‘భాష’ అయింది. అది పిల్లలకే కాదు, వాళ్ల తల్లిదండ్రులకు, టీచర్స్‌కి కూడా తెలియని భాష. ఆ భాషలోనే ఆన్లైన్ క్లాసులు జరగాలి. ఎలా? ఇందుకు ప్రియాంకకు ఒక ఆలోచన వచ్చింది. తనే టీచర్లందరికీ డిజిటల్ నాలెడ్జ్‌ని ఇస్తే! వాళ్లకు ఇస్తే పిల్లలకూ వచ్చేస్తుంది. పాఠాలు మాత్రమే చెప్పడం కాకుండా.. ఈమెయిల్స్ క్రియేట్ చెయ్యడం, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, సోషల్ మీడియాను ఫాలో అవడం, అక్కడొచ్చే పోస్టులలో పిల్లలకు పనికొచ్చేవేమైనా ఉంటే షేర్ చేయడం, ఇంకా సెక్యూరిటీ రూల్స్, ఇతర డిజిటల్ సదుపాయాలు, సౌకర్యాల గురించి ప్రియాంక సాటి టీచర్లకు చెప్పడం మొదలుపెట్టారు. మొదట 20 టీచర్లతో ప్రారంభమైన ఆమె శిక్షణ ఇప్పుడు సీతామఢి జిల్లాలోని పంచాయితీలో దాదాపు 250 మంది మహిళా టీచర్లకు చేరింది. మరి ప్రియాంకకు అంత పరిజ్ఞానం ఎక్కడిది? ‘‘ఇదేమంత పెద్ద పరిజ్ఞానం కాదు. ఆసక్తి ఉంటే స్మార్ట్ ఫోనే మనకు అన్నీ చెప్పేస్తుంది’’ అని నవ్వేస్తున్నారు ప్రియాంక. ఈ డిజిటల్ శావీ (డిజిటల్ టెక్నాలజీపై అవగాహన కలిగిన వ్యక్తి) దగ్గర మెళకువలు నేర్చుకున్న టీచరమ్మలంతా ఇప్పుడు పిల్లలకు చక్కగా అర్థమయ్యేలా ఆన్లైన్ పాఠాలు చెప్పగలుగుతున్నారు. కేవలం పాఠాలే కాదు, నిత్య జీవితంలో పనికొచ్చే డిజిటల్ విశేషాలను కూడా. ప్రియాంక బి.ఇడి. చేశారు. ‘ఎడ్యుకేషన్’లో మాస్టర్స్ డిగ్రీ చదివారు. 1985లో ఆమె పుట్టేనాటికి డిజిటల్ టెక్నాలజీ కాదు కదా.. ఇండియాలో కలర్ టీవీలు కూడా లేవనే చెప్పాలి. ఆమెకు పదేళ్లు వచ్చేసరికి అప్పుడప్పుడే దేశం ఇంటర్నెట్కు అలవాటు అవుతోంది. ఆమె డిగ్రీ అయ్యేనాటికి మొబైల్ ఫోన్లు, ఆ తర్వాత పదేళ్లకు స్మార్ట్ఫోన్లు వచ్చాయి. డిగ్రీ అయిన రెండేళ్లకు 2007 ఆమెకు సీతామఢిలో టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత పెళ్లి కూడా అయింది. ఈ మధ్యలో ఎక్కడా ప్రియాంక డిజిటల్ ప్రపంచంతో టచ్‌లోనే లేరు. నెట్లోకి ఫేస్బుక్ ప్రవేశించాక ఆమెకు సోషల్ మీడియా అనే వండర్ వరల్డ్‌పై ఆసక్తి కలిగింది. ఆ క్రమంలోనే మహిళల ఉపాధికి, సంక్షేమానికి ప్రయోజనకరంగా ఉండే టెక్నాలజీపై ఆమె శ్రద్ధ పెట్టారు. కొత్తకొత్త సంగతుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే కాకుండా, వాటిని నేర్చుకుంటూ వచ్చారు. అదిప్పుడు ఈ లాక్డౌన్లో తనకే కాకుండా, తక్కిన టీచర్లందరికీ ఉపయోగపడుతోంది. ‘‘2020 జూన్ నుంచి నేను మహిళా టీచర్లకు ఇవన్నీ చెప్పడం మొదలుపెట్టాను. కష్టం అనుకుని నేర్చుకోడానికి సంశయించిన వాళ్లు.. ప్రాక్టికల్‌గా చూసి, ఆసక్తి కలిగి డిజిటల్ టెక్నాలజీని ఇష్టపడటం ఆరంభించారు..’’ అంటున్నారు ప్రియాంక. తన ప్రయత్నానికి ఆమె ‘డిజిటల్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్’ అని పేరు పెట్టారు. ‘‘అందులో చేరకుముందు వరకు నేను నా స్మార్ట్ ఫోన్‌ని కాల్స్ చెయ్యడానికి, వాట్సాప్ మెసేజ్‌లు చూడ్డానికి మాత్రమే వాడేదాన్ని. ప్రియాంక ఇచ్చిన ఆన్లైన్ ట్రైనింగ్‌తో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పడు నాకు ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయి. వాటిని భద్రంగా యూజ్ చెయ్యడానికి అవసరమైన సైబర్ సెక్యూరిటీ టిప్స్ కూడా ప్రియాంకే చెప్పింది. ఇప్పుడైతే జూమ్ మీటింగ్స్‌లో కూడా పాల్గొంటున్నాను’’ అని బథనహా మిడిల్ స్కూల్లో పని చేసే శివానీ అనే సీనియర్ టీచర్ చెబుతున్నారు. యోగబనా మిడిల్ స్కూల్ టీచర్ మధు కూడా.. ‘‘ఇప్పడు నేను ఆన్లైన్ వర్క్ ఏదైనా నా అంతట నేను చేయగలను. ఇదంతా నాకు ప్రియాంకే నేర్పించారు’’ అని అంటున్నారు. ప్రియాంక దగ్గర ఆన్లైన్ శిక్షణకు చేరిన వారు మొదటి రోజున.. ‘‘నేను నేర్చుకున్నాక మిగతా టీచర్లకు నేర్పిస్తాను’’ అని ప్రతిజ్ఞ పలకాల్సి ఉంటుందట! సీతామఢిలో ఇప్పుడు ఇంటింటికీ తెలిసిన పేరు ప్రియాంక. విద్యాశాఖ ఎప్పుడు ఏ డిజిటల్ ప్రోగ్రామ్ ను ప్రారంభించినా అందులోని సందేహాల గురించి మొదట ప్రియాంకకే ఫోన్ వెళుతుంది. ‘‘ప్రపంచాన్ని ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ నడిపిస్తోంది. ఎప్పటికప్పుడు మనం ‘అప్డేట్’ కాకపోతే వెనకపడిపోతాం. పైగా అమ్మాయిలకు ఇప్పుడు చదువు, ఉద్యోగం అంటే కేవలం డిగ్రీలు, ఫైల్స్ మాత్రమే కాదు.. డిజిటల్ నాలెడ్జి కూడా. మహిళలు, బాలలకు ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. వాటన్నిటకీ కూడా తొలి వేదిక ఆన్లైన్. ఆన్‌లైన్‌ని చూసి భయపడితే లైన్లోనే ఉండిపోతాం. లోపలికి అడుగుపెట్టాలి. లబ్దిపొందాలి’’ అని ప్రియాంక ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపుతున్నారు. -
తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని యాజమాన్యాలకు చెందిన విద్యా సంస్థల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేసిన ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరంలో (2021–22) 4, 9 తరగతుల్లో అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, సీబీఎస్ఈ, ఐసీఎస్సీ, ఇంటర్నేషనల్ బోర్డుల పరిధిలోని అన్ని మీడియం స్కూళ్లలో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని అందులో స్పష్టం చేసింది. 2018–19లో ప్రాథమిక స్థాయిలో ఒకటో తరగతిలో, సెకండరీ స్థాయిలో 6వ తరగతిలో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా ప్రవేశ పెట్టినట్లు పేర్కొంది. 2019–20 విద్యా సంవత్సరంలో 2, 7 తరగతుల్లో, 2020–21 విద్యాసంవత్సరంలో 3, 8 తరగతుల్లో అమలు చేసినట్లు వివరించింది. ఇక 2021–22లో 4, 9 తరగతులు, 2022–23 విద్యా సంవత్సరంలో 5, 10 తరగతుల్లో అమలు చేయనున్నట్లు వెల్లడించింది. త్రిభాషా సూత్రం ప్రకారం అన్ని యాజమాన్యా ల్లోని స్కూళ్లలో 8వ తరగతి వరకు మూడు భాషలను అమలు చేస్తున్నామని, 9వ తరగతి నుంచి 2 భాషలనే అమలు చేస్తున్నామని పేర్కొంది. ఆయా తరగతులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను సిద్ధం చేసినట్లు వెల్లడించింది. దీనిని అమలు చేయని పాఠశాలలపై కఠిన చర్యలు చేపడతామని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి పేర్కొన్నారు. -
సర్.. మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా ?
కోవిడ్-19 కారణంగా తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో దాదాపు అన్ని విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. క్లాస్‌రూంలో సిన్సియర్‌గా పాఠాలు వినే స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారో తుంటరి విద్యార్థులు సైతం ఉంటారు. క్లాసులు జరుగుతున్నప్పుడే మిగతా విద్యార్థులతో పాటు, టీచర్‌పై కామెంట్లు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం తరగతి గదులకు నేరుగా హాజరయ్యే పరిస్థితి లేకపోవడంతో ఈ ఫన్ని మిస్ అవుతున్నాం అనుకున్నారో ఏంటో ఆన్లైన్ క్లాస్ జరుగుతుండగా, కొందరు విద్యార్థులు ఏకంగా వైస్ ప్రిన్స్‌పల్ పైనే జోకులేశారు. అందుకు బదులుగా ఆయన కూడా స్టూడెంట్స్‌కు గట్టి చివాట్లే పెట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే..క్లాస్ జరుగుతండగాసర్ ఒక డౌట్ అంటూ స్టూడెంట్ ప్రశ్నించగా...ఏంటో చెప్పమని వైస్ ప్రిన్సిపల్ అడిగారు. దీంతో మీ టూత్ పేస్ట్‌లో ఉప్పు ఉందా సర్ అంటూ తుంటరి ప్రశ్న వేశాడు. ఇందుకు బదులుగా 'ఉప్పు అంటూ ఎలా ఉంటుందో చూపిస్తా..నువ్వు మళ్లీ స్కూల్లో కనపడకుండా చేస్తా' అంటూ వైస్ ప్రిన్స్‌పల్ ఫైర్ అయ్యారు. ఆ తర్వాత కూడా కొందరు స్టూడెంట్స్ జోకులు వేయడానికి ప్రయత్నించగా..ఈ మొత్తం వ్యవహారాన్ని రికార్డ్ చేశానని, వైస్ ఛైర్మన్‌కు కంప్లెంట్ చేస్తానని ఫైర్ అయ్యారు. అంతేకాకుండా వేరే విద్యార్థులను సైతం సెషన్ నుంచి వెళ్లిపోవాలని శాసించారు. అయితే దీనికి ఏమాత్రం బెదరని స్టూడెంట్స్ అదేపనిగా కామెంట్లు చేస్తుండటంతో కోపంతో ఊగిపోయిన వైస్ ప్రిన్సిపల్ చివరికి ఆయనే ఆన్లైన్ సెషన్ నుంచి లాగ్అవుట్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీచర్‌పై కామెంట్లు చేసి నవ్వుకుందామనుకున్న స్టూడెంట్స్‌కి వైస్ ప్రిన్సిపల్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. -
హైదరబాద్‌లో ప్రైవేటు స్కూళ్లపై విద్యాశాఖ కొరడా
-
అంతా తూచ్..!
ప్రభుత్వ నిబంధనలు కార్పొరేట్ కళాశాలలకు పట్టడం లేదు. తమ దారి అడ్డదారి అన్నట్టుగా ఇష్టారాజ్యంగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. ఒక పక్క పదో తరగతి పరీక్ష ఫలితాలు రాకుండానే ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. ఐఐటీ, నీట్ ర్యాంకుల ఆశలు చూపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను బుట్టలో వేసుకుంటున్నారు. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించకూడదన్న నిబంధనలు ఉన్నా ఉత్తమ ఫలితాల పేరుతో కళాశాలను నిర్వహిస్తున్నారు. ఆటవిడుపు లేకుండా విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నారు. విద్యార్థులకు ఇష్టం లేకున్నా బలవంతపు చదువులు రుద్ది వారిని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తున్నారని పలువురు మండి పడుతున్నారు. ఇంత జరుగుతున్నా యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల్సిన ఇంటర్ బోర్డు అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు. తమ చేతులు తడిపితే ఎప్పుడైనా తరగతులు నిర్వహించుకోవచ్చంటూ సంకేతాలు పంపుతుండడం గమనార్హం. నెల్లూరు(టౌన్): జిల్లావ్యాప్తంగా మొత్తం 189 ప్రభుత్వ, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో 58 ప్రభుత్వ, 15 ఎయిడెడ్, 116 కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో 58 వేల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. అదే నెల 29వ తేదీ నుంచి జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 3వ తేదీన జూనియర్ కళాశాలలు ప్రారంభించాల్సిఉంది. అయితే కళాశాలల యాజమాన్యాలు ఉత్తీర్ణత శాతం, ర్యాంకుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవులతోపాటు పండగ రోజుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. నారాయణ, శ్రీచైతన్య, గాయిత్రి తదితర జూనియర్ కళాశాలలు వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాయి. వేసవి సెలవులు ఇచ్చి దాదాపు నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ తరగతులు నిర్వహిస్తుండడం గమనార్హం. ప్రథమ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులను ఇళ్లకు పంపకుండా కళాశాలల్లోనే ఉంచి తరగతులు నిర్వహిస్తున్నారు. ముందుగానే టాలెంట్ టెస్ట్ రాయాలంటూ విద్యార్థులను కళాశాలలకు పిలిపించి వారిని తమ కళాశాలలో చేరే విధంగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. తరగతుల నిర్వహణపై విద్యార్థి సంఘాల నాయకులు ప్రతిరోజూ ఏదో ఒక కళాశాలకు వెళ్లి యాజమాన్యాలను నిలదీస్తున్నారు. తరగతులను బహిష్కరించి విద్యార్థులను ఇళ్లకు పంపుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇంటర్‌బోర్డు అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. యాజమాన్యాలు ఇచ్చే ముడుపులతో మిన్నకుంటున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. తరగతుల నిర్వహణపై ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనకడుగువేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించడంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పబ్లిక్ పరీక్షలు రాసిన వెంటనే మళ్లీ తరగతులు అంటే విద్యార్థులు విముఖత కనబరుస్తున్నారు. కనీసం ఆటవిడుపు కూడా లేకుండా నిత్యం పుస్తకాలు పట్టుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పుస్తకాలతో విద్యార్థులను కుస్తీ పట్టిస్తున్నారు. ఒత్తిడికి తట్టుకోలేని విద్యార్థులు రకరకాల మానసిక ఆందోళనకు గురివుతున్నారు. భారీగా ఫీజులు ఇంటర్లో ప్రవేశం కోసం కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఐఐటీ, నీట్ల పేరుతో రూ.లక్ష నుంచి రూ.3.50 లక్షల వరకు ఫీజులు నిర్ణయించారు. వీటితోపాటు దుస్తులు, పుస్తకాలు, పరీక్ష ఫీజు, ఆన్లైన్లో పరీక్ష, మెయింటినెన్స్ల పేర్లతో దోపిడీకి పాల్పడుతున్నారు. అయితే తమ పిల్లలు సెటిల్ అవుతారన్న ఆశతో తల్లిదండ్రులు కూడా అడిగినంత ఫీజు చెల్లిస్తున్నారు. ఫీజులపై నియంత్రణ ఉన్నా ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా కార్పొరేట్ ఆగడాలపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించకూడదు వేసవి సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించకూడదు. ప్రధానంగా ద్వితీయ సంవత్సరానికి సంబంధించి ఇప్పటి నుంచే తరగతులు నిర్వహించకూడదు. విద్యార్థుల ప్రవేశాల కోసం ఎలాంటి టాలెంట్ టెస్ట్‌లు పెట్టకూడదు. కళాశాలలు జూన్ 3వ తేదీ నుంచి పునః ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్ వచ్చే వరకు అడ్మిషన్లు చేపట్టకూడదు. అధిక ఫీజులు వసూలు చేయకూడదు. కళాశాల ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలి. ఈ నిబంధనలను అత్రికమించిన వారిపై చర్యలు తీసుకుంటాం. – ఎస్.సత్యనారాయణ, ఆర్ఐఓ -
ఏపీ సీఎం చంద్రబాబుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ క్లాస్
-
అయినవారమైనా అంతేనా?
రెండేళ్లుగా పదోన్నతుల్లేవు కాసులు రాల్చందే పనులు జరగడం లేదు సాంఘిక సంక్షేమశాఖ నాలుగో తరగతి ఉద్యోగుల ఆవేదన నాలుగోతరగతి ఉద్యోగులు అన్ని విధాలా అణచివేతకు గురవున్నారు. వారికి దక్కాల్సిన పదోన్నతులు లభించడం లేదు. ప్రతీ పనికీ.. వార్షిక ఇంక్రిమెంట్లను పొందేందుకు సైతం ముడుపులు ముట్టజెప్పాల్సి వస్తోంది. దాంతో వారు పోరుబాట పట్టేందుకు సిద్ధం అవుతున్నారు. భానుగుడి (కాకినాడ): సాంఘిక సంక్షేమ శాఖలోని నాలుగో తరగతి ఉద్యోగులు అన్ని విధాలా దోపిడీకి గురవుతున్నారు. పై అధికారులు వారిని సొంత పనులకు సైతం వాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. అవి అలాగుండగా పై స్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి అధికారుల వరకు అందరూ పైసలు ఇవ్వనిదే ఫైలు కదపడం లేదని నాలుగోతరగతి ఉద్యోగులు వాపోతున్నారు. పదవీ విరమణ పొందితే వచ్చే ప్రభుత్వ ప్రయోజనాలకు రూ.20 వేలు, చనిపోయిన వారి స్థానంలో కుటుంబ సభ్యులకు అవకాశం ఇస్తే రూ. 50 వేలు.. ఇలా ప్రతీ పనికి ఓ రేటును నిర్ణయించి సొమ్ములు గుంజుతున్నారని 4వ తరగతి ఉద్యోగుల సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లుగా ప్రమోషన్లు లేవు సాంఘిక సంక్షేమ శాఖలో ప్రస్తుతం ఉన్న 87 వసతి గృహాల్లో వివిధ క్యాడర్లలో 156 మంది నాలుగో తరగతి ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరికీ రెండేళ్లుగా ప్రమోషన్లు లేవు. జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నవారికి సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇస్తే కుక్, కమాటీ, వాచ్మన్లుగా పనిచేసే సిబ్బందిలో డిగ్రీ పూర్తిచేసిన వారికి జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాలన్న నిబంధన ఉంది. అయితే సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయంలో జూనియర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయడం లేదు. దాంతో అనేకమంది ఉద్యోగులు ఉన్నత విద్యార్హతలున్నప్పటికీ కిందిస్థాయి సిబ్బందిగానే పదవీ విరమణ పొందాల్సి వస్తోంది. కలెక్టర్‌కు ఫిర్యాదు: సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగుల బదిలీలు, నాలుగో తరగతి ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించకపోవడం తదితర సమస్యలపై గత నెల 28న జాయింట్ కలెక్టర్‌కు ఆ సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికి కూడా ఎటువంటి చర్యలు చేపట్టలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారుల స్పందించకుంటే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. సమస్యలపై పోరాటాలకు సిద్ధం సాంఘిక సంక్షేమ శాఖలో నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలపై, అధికారుల అవినీతిపై పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులందరికీ దీనిపై ఫిర్యాదు చేశాను. రెండేళ్లుగా పదోన్నతులు లేవు. ఖాళీలు భర్తీ చేయడం లేదు. విద్యార్హతలుండీ పదోన్నతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఖండవల్లి చంద్రశేఖర్, రాష్ట్ర కోశాధికారి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం -
డబ్బు కొట్టు.. బుక్కు పెట్టు.. గ్రేడ్ కొట్టు!
- పదో తరగతి పరీక్షల్లో ప్రైవేటు స్కూళ్ల దందా - గ్రేడ్ల కోసం కొంతమంది విద్యార్థులతో మాస్ కాపీయింగ్ - పరీక్ష కేంద్రాల సీఎస్‌లతో కుమ్మక్కు - దానవాయిపేట పాఠశాలలో ఇదే తంతు - సబ్ కలెక్టర్ ఆదేశాలతో తనిఖీలు - గేటు వద్దే ఆర్ఐ, వీఆర్ఓల నిలిపివేత - 10 నిమిషాల తర్వాత ఆర్ఐకి మాత్రమే అనుమతి - ఆలోగా అంతా సర్దేశారంటూ ఆరోపణలు పదో తరగతి పరీక్షల్లో అధిక సంఖ్యలో గ్రేడులు సాధించుకునేందుకు కొన్ని ప్రైవేటు పాఠశాలలు రకరకాల పైరవీలు చేస్తున్నాయి. పుస్తకాలు పెట్టి విద్యార్థులతో పరీక్షలు రాయించేందుకు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్(సీఎస్)లతో కుమ్మక్కవుతున్నాయి. అధిక మొత్తం ఆశ చూపడంతో కొన్ని పరీక్ష కేంద్రాల సీఎస్‌లు వారు చెప్పినట్టే నడచుకుంటున్నారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎంపిక చేసిన విద్యార్థులతో పుస్తకాలు పెట్టి రాయిస్తున్నారు. ఇటువంటి దందాకు నగరంలోని ఓ పాఠశాల కేంద్రంగా నిలిచినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సాక్షి, రాజమహేంద్రవరం : నగరంలోని ఓ ప్రముఖ పాఠశాలలో పదో తరగతి చదివే విద్యార్థిని నగరంలోని ఓ పాఠశాల కేంద్రంగా పరీక్షలు రాస్తోంది. ఆ విద్యార్థిని స్నేహితులు దానవాయిపేట నగరపాలక సంస్థ పాఠశాలలో పరీక్షలు రాస్తున్నారు. శనివారం తెలుగు పేపర్-2 పరీక్ష రాసిన తర్వాత ఇంటికొచ్చిన ఆ విద్యార్థిని బోరున ఏడవసాగింది. విషయం ఏమిటని తల్లిదండ్రులు ఆరా తీయగా ‘‘నేను ఏడాదంతా కష్టపడి చదివి రాస్తుంటే నా స్నేహితులు కొందరు పుస్తకాలు పెట్టి రాస్తున్నారు. ఇప్పటివరకూ క్లాస్‌లో నేను ఫస్ట్. రేపు ఫలితాల్లో వారికి నాకన్నా మంచి గ్రేడులు వస్తాయి’’ అంటూ విలపించింది. దీంతో ఈ విషయాన్ని ఆ విద్యార్థిని తల్లిదండ్రులు ‘సాక్షి’ దృష్టి తీసుకొచ్చారు. సోమవారం హిందీ పరీక్ష జరుగుతుండగా దానవాయిపేట నగరపాలక సంస్థ పాఠశాలలో జరుగుతున్న దందాను ‘సాక్షి’ సబ్‌కలెక్టర్ విజయ్‌కృష్ణన్ దృష్టికి తీసుకెళ్లింది. అనంతరం పాఠశాల వద్దకు ‘సాక్షి’ బృందం వెళ్లింది. ఇతరులు రాకూడదని చెప్పిన అక్కడి సిబ్బంది ‘సాక్షి’ని లోపలికి అనుమతించలేదు. ఈలోగా సబ్‌కలెక్టర్ విజయ్‌కృష్ణన్ ఆదేశాల మేరకు అర్బన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాయుడు, వీఆర్ఓలు వాసు, దోసలరావు పాఠశాల వద్దకు తనిఖీ చేసేందుకు వచ్చారు. గేటుకు తాళం వేసి ఉండడంతో అక్కడి వాచ్‌మన్‌ను పిలిచి, తమ గుర్తింపు కార్డులు చూపించి తాళం తీయాలని చెప్పారు. అలా తీయడం కుదరదని అంటూ విషయాన్ని పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్‌కు చెప్పారు. చీఫ్ సూపరింటెండెంట్, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజా ప్రశాంత్ వచ్చి తమ శాఖ ఉన్నతాధికారుల అనుమతి లేనిదే అనుమతించబోమని ఆర్ఐ, వీఆర్ఓలకు చెప్పారు. తాను రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌నంటూ నాయుడు తన గుర్తింపు కార్డు చూపించినా కూడా అనుమతించలేదు. ఈలోగా సీఎస్ రాజా ప్రశాంత్ ఫోనులో మాట్లాడుతూ పది నిమిషాల పాటు తాత్సారం చేశారు. అనంతరం ఆర్ఐ నాయుడును మాత్రమే లోనికి అనుమతించారు. వీఆర్ఓలు వాసు, దోసలరావులను గేటు బయటే నిలిపివేశారు. ఆర్ఐని, వీఆర్ఓలను పది నిమిషాలపాటు గేటు బయట నిలిపివేసిన సమయంలోనే లోపల ఏమీ దొరకకుండా సర్దేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాఠశాల వద్దకు వచ్చిన పది నిమిషాల తర్వాత లోపలికి వెళ్లిన ఆర్ఐకి అక్కడ ఏమీ దొరకలేదు. ఈలోగా నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ శ్రీనివాసరావు తన సిబ్బందితో వచ్చి తనిఖీ చేశారు. అంతా సవ్యంగా ఉందంటూ విలేకర్లకు చెప్పారు. ఆర్ఐ, వీఆర్ఓలను పది నిమిషాల పాటు ఎందుకు అనుమతించలేదన్న విలేకర్ల ప్రశ్నకు సమాధానం దాటవేశారు. ఈ విషయంపై డీఈఓ అబ్రహం వివరణ కోరగా.. తహసీల్దార్ క్యాడర్ వరకు నేరుగా అనుమతిస్తామని చెప్పారు. అంతకన్నా దిగువ క్యాడర్ అధికారులు తనిఖీకి వస్తే వారి పై అధికారులు ఫలానా అధికారులు తనిఖీకి వస్తున్నారంటూ సంబంధిత పరీక్ష కేంద్రానికి ముందుగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అధికారులు ముందుగానే సమాచారం ఇస్తే ఇక తనిఖీ అన్న పదానికి అర్థం ఏముంటుందని ‘సాక్షి’ ప్రశ్నించగా ‘‘మీరు చెబుతున్నది నిజమే. కానీ నిబంధనలు అలా ఉన్నాయి’’ అని డీఈఓ అన్నారు. పది నిమిషాల తర్వాత పంపారు సబ్‌కలెక్టర్ ఆదేశాల మేరకు దానవాయిపేట నగరపాలక సంస్థ పాఠశాలలో పదో తరగతి పరీక్ష తనిఖీకి వచ్చాం. నాతోపాటు వీఆర్ఓలు వాసు, దోసలరావు వచ్చారు. తనిఖీ చేయాలన్న సబ్కలెక్టర్గారి ఆదేశాల మేరకు వచ్చామని చెప్పినా సీఎస్ రాజా ప్రశాంత్ మమ్మల్ని అనుమతించలేదు. మా గుర్తింపు కార్డులు చూపించినా ససేమిరా అన్నారు. చివరకు పది నిమిషాల తర్వాత నన్ను ఒక్కడినే లోపలికి అనుమతించారు. మా వీఆర్ఓలు బయటే ఉన్నారు. - నాయుడు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ -
ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ..
కాగజ్‌నగర్ టౌన్: పదో తరగతి పరీక్ష ఒకరికి బదులుగా మరొకరు రాస్తూ దొరికిపోయిన సంఘటన శనివారం కాగజ్‌నగర్‌లో వెలుగు చూసింది. పట్టణంలోని ఆర్‌ఆర్‌వో కాలనీలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల కేంద్రంలో కరీం తెలుగు పరీక్ష రాయాల్సి ఉంది. గతంలో తెలుగు పరీక్షలో ఫెయిల్ అయినందున ఆయన మరోసారి ఈ పరీక్ష రాయాల్సి ఉంది. అయితే, అతనికి బదులుగా అతని సన్నిహితుడు బీకాం చదివిన జమీర్ శనివారం తెలుగు రెండో పేపర్ రాస్తుండగా సీఎస్ దేవాజీ పట్టుకున్నారు. శుక్రవారం మొదటి పేపర్ సైతం జమీరే రాసినట్లు తెలిసింది. పోలీసులు జమీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. జమీర్‌తో పాటు కరీం.. ఇన్విజిలేటర్, సిట్టింగ్ స్క్వాడ్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మజీద్ తెలిపారు. -
చేతిరాత..భవితకు బాట
పరీక్షల్లో ఆకట్టుకునే అక్షరాలు మార్కులు పెరిగే అవకాశం రాయవరం : అక్షరాలు కంటికి ఇంపుగా కనిపించేలా ఉండాలి. అందమైన దస్తూరి చూసేవారిని ఆకట్టుకుంటుంది. జవాబు పత్రాలు మూల్యాంకనం చేసే వారి మనస్సును హత్తుకునేలా ఉంటే మార్కులు వేసేలా ప్రేరేపిస్తుంది. అదే పరీక్షల్లో విజేతగా నిలుపుతుంది. మరో రెండు రోజుల్లో పది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల్లో అక్షరాలను ముత్యాల్లా రాసే వారు పరీక్షల్లో 20 శాతం అధిక మార్కుల సాధనతో పాటు వారి జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటారని వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమాధానాలు రాయడంపై సూచనలు పాటిస్తే మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. అక్షరాలను రాయాలిలా.. పేజీకి పై భాగంలో ఒక అంగుళం, ఎడమవైపు అదే స్థాయిలో మార్జిన్ విడిచి పెట్టి రాయాలి. పేజీకి కుడివైపు అర అంగుళం ఖాళీ విడిచి పెట్టి రాయవాలి. ఇలా ఉంటే మూల్యాంకన సమయంలో ఉపాధ్యాయునికి జవాబులు స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని స్కూళ్లలో విద్యార్థులు గీతల పేజీల నోట్‌బుక్‌లో జవాబులు రాస్తుంటారు. పరీక్షల్లో మాత్రం గీతల్లేని పేపర్లపై రాయాల్సి ఉంటుంది. అలాంటి విద్యార్థులు తెలుపు కాగితాలపై సాధన చేయాలి. జవాబుల్లో ఏదైనా ముఖ్యమైన పదాలు ఉంటే వాటి కింద నల్లటి పెన్సిల్‌తో గీతగీయాలి. విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం అచ్చు పుస్తకాలు ఇవ్వకుండా ముఖ్యమైన సమాధానాలను చేతితో రాయించాలి. జవాబు పత్రంలో వేసే బొమ్మల్లోని భాగాన్ని ఒకవైపు సరళరేఖలను గీసి భాగాల పేర్లు రాస్తే మేలు. లేదా వాటి నంబర్లు ఇచ్చి ఒకవైపు రాయాలి. పరీక్ష పత్రంతో ప్రశ్నలు సెక్షన్ల వారీగా ఉంటాయి. ఇచ్చిన సమయాన్ని భాగాలుగా విడగొట్టి ఆ సమయంలోనే జవాబులు రాయడం పూర్తిచేయాలి. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సినవి.. జవాబు రాసే తీరు పరీక్ష పేపరు దిద్దడానికి ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. సమాధానాలు టీచరుకు తెలుసునని గుర్తించాలి. జవాబు పత్రం ఆకట్టుకోవాలంటే పేజీకి 18–19లైన్లకు మించకూడదు. జవాబు పత్రంలోని తొలి లైన్ రాసే సమయంలో మార్జిన్ లైన్‌ను చూస్తూ సమాంతరంగా రాయకపోతే మిగిలిన లైన్లు వంకర్లు తిరుగుతాయి. గీత చివరి వరకు రాస్తూ చివరికి వెళ్లగానే అక్కడ సగం పదంగానీ, మరో సగాన్ని కిందలైన్లో రాస్తుంటారు. దీంతో దిద్దే వారికి ఆ పూర్తి పదం ఏమిటో అర్థం కాదు. పదం పూర్తిగా రాయాలి. ప్రశ్నపత్రంలో బాగా ఒత్తిపట్టి మరీ రాస్తే రెండో వైపు అక్షరాలు కన్పిస్తూ గందరగోళం మారుతుంది. కొద్ది సేపు రాయగానే వేళ్లు నొప్పి పుడతాయి. అందుకే తేలికగా అందంగా రాయాలి. అంకెలు రాసేటప్పుడు స్పష్టత లేకపోతే ఉపాధ్యాయుడు అర్థం చేసుకోలేక మార్కులు వేయరు. సామాన్యశాస్త్రంలో బొమ్మల్ని గీస్తే ఆ చిత్రంలోని భాగాన్ని గుర్తించడంలో ఒక క్రమపద్ధతి పాటించాలి. పాయింట్ల వారీగా... పరీక్షల్లో రాసే అక్షరాలు అర్థమయ్యేలా ఉంటే మూల్యాంకనం చేసే ఉపాధ్యాయుడు ముగ్దుడై మార్కులు వేస్తాడు. లేదంటే వెనకడుతారు. సమాధానాల్లో దోషాలు లేకుండా జాగ్రత్త పడాలి. సంగ్రహ ప్రశ్నలకు సమాధానాలు సులభంగా రాయాలి. ఇచ్చి ప్రశ్నలను పూర్తిగా అర్థం చేసుకుని రాయాలి. స్టోరీ రైటప్‌లో మంచి మార్కులు సాధించాలంటే ఇచ్చిన హింట్‌ను బాగా చదివి అర్థం చేసుకుని రాయాలి. ప్రశ్నలకు జవాబులు పాయింట్ల వారీగా రాస్తే మార్కులు బాగా వస్తాయి. జవాబులకు మధ్యలో ఉప శీర్షికలు పెట్టాలి. ముఖ్య విషయాలను అండర్లైన్ వేసుకోవాలి. బిట్‌పేపరు రాసే సమయంలో కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి. -
భయం వీడితే..‘పది’లమే
సమయం చాలా కీలకం విద్యార్థులు ఆహార నియమాలు పాటించాలి తల్లితండ్రుల పాత్ర కీలకమే విజయం..పరాజయం రెండింటిదీ దగ్గరి సంబంధమే. ఒకటి దూరమైతే ఇంకోటి దరిచేరుతుంది. దీనికి సంబంధించి మరొకటుంది..అదే భయం..! దీని చుట్టూ జయాపజయాలుంటాయి. భయపడితే పరాజయం పలకరిస్తుంది. భయం వీడితే విజయం వరిస్తుంది. విజేతలుగా నిలుపుతుంది. తొమ్మిదేళ్ల పాటు వార్షిక పరీక్షలకు హాజరై.. తొలిసారి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న పదో తరగతి విద్యార్థుల్లో కాస్త భయం..ఇంకాస్త ఆందోళన ఉండడం సహజం. అయితే ఈ భయం..ఆందోళనలను వీడడం చాలా సులభం. అలా చేస్తే మంచి ప్రతిభ చూపడం సులువే. విద్యార్థి ప్రగతికి పదో తరగతి తొలి మెట్టు వంటిది. ఇక్కడ రాణిస్తే భవిష్యత్‌లో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి ఉండదు. మరో 16 రోజుల్లో (ఈ నెల 17 నుంచి) పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు తీసుకునే జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. - రాయవరం టెన్షన్ వదలాలి.. విద్యార్థులు టెన్షన్ వదిలి అటెన్షన్‌గా ఉండాలి. సరైన రీతిలో పరీక్షలకు ప్రిపేరవ్వడం ఎంత కీలకమో అదే సమయంలో చదివిన ప్రశ్నలను గుర్తుంచుకుని రాయడం కూడా అంతే ముఖ్యం. చదువుతో పాటు పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలి. మానసిక ప్రశాంతతను అలవర్చుకోవాలి. పరీక్షలు సమీపించిన ఈ సమయంలో కేవలం రివిజన్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. గతంలో చదివిన ప్రశ్న, జవాబులను మరోసారి పునఃశ్చరణ చేసుకోవాలే కాని కొత్త పాఠ్యాంశాల జోలికి వెళ్లకూడదు. పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ముఖ్యంగా ఐదు ‘సి’లు విడనాడాలి. సినిమా, కేబుల్‌టీవీ, క్రికెట్, సెల్‌ఫోన్‌తో పాటుగా ఛాటింగ్‌ను విడనాడాలి. అదే సమయంలో పోజిటివ్ థింకింగ్, ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రివ్యూ, ప్రజంటేషన్ను అలవర్చుకోవాలి. వీటితో పాటు పరీక్ష ముందు రోజు తగినంత నిద్ర పోవాలి. నిద్ర మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. నేను బాగానే రాయగలను అనే ఆత్మవిశ్వాసంతో పరీక్షా కేంద్రానికి వెళ్లాలి. ముందుగా బాగా వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాసిన అనంతరం కష్టతరమైన ప్రశ్నలకు జవాబులు రాసే ప్రణాళిక అలవర్చుకోవాలి. రేపటి పరీక్షను చక్కగా రాస్తున్నట్లుగా ఊహను మనస్సులో పొందుపర్చుకుంటూ సంసిద్ధంగా ఉండాలి. కొత్త వాతావరణంలో పరీక్షలు రాస్తున్నామనే భయాన్ని విడనాడాలి. జవాబు పత్రంలో ఎక్కువుగా కొట్టివేతలు, దిద్దివేతలు లేకుండా చక్కటి దస్తూరీతో సమాధానాలు రాస్తే మంచిది. తల్లితండ్రుల పాత్ర కూడా కీలకమే.. పరీక్షల్లో తల్లితండ్రుల పాత్ర కూడా కీలకమే. పరీక్షల సమయంలో వారికి తరచుగా మార్కులు ఎక్కువుగా తెచ్చుకోవాలంటూ ఒత్తిడి తేవద్దు. ఇతర పిల్లలతో పోలుస్తూ సరిగ్గా చదవడం లేదనడం, గత పరీక్షల్లో మార్కులు సరిగ్గా రాలేదనడం, ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడడం చేయకూడదు. చదవడం కలిగే ఉపయోగాలు..సమాజంలో లభించే గౌరవాన్ని అర్ధమయ్యేలా..సున్నితంగా తెలియజెప్పాలి. పరీక్షలకు వెళ్లే ముందు ఐదు నుంచి పది నిమిషాలు టీవీ చూడడం మంచిదే. కామెడీ, సినిమా పాటల ఛానల్స్‌ను చూస్తే మనస్సు రిలాక్స్ అవుతుంది. విద్యార్థులు ఇవి పాటిస్తే మంచిది... జవాబు పత్రంలో ఒక్కో పేజీపై 16 నుంచి 18 లైన్లకు మించకుండా సమాధానాలు రాయాలి. ముఖ్యమైన అంశాల కింద గీత ఉండేటట్లు(అండర్లైన్) చూసుకోవాలి. గణితంలో అంకెలు స్పష్టంగా వేసుకోవాలి. తెలుగులో అక్షరాల తలలపై తలకట్టు, ఒత్తులు, దీర్ఘాలు స్పష్టంగా కనబడేటట్లుగా రాయాలి. బ్లూపెన్ను, బ్లాక్ పెన్ను మాత్రమే వినియోగించాలి. రెడ్ పెన్ను వాడకూడదు. ఆత్మవిశ్వాశాన్ని కోల్పోవద్దు విద్యార్థులు ఆత్మవిశ్వాశాన్ని కోల్పోకూడదు. పరీక్ష ముగిసిన తర్వాత సమాధానాలు సరిపోల్చుకోకూడదు. అలా చేస్తే మరుసటి రోజు పరీక్షపై దాని ప్రభావం ఉంటుంది. - డాక్టర్ కర్రి రామారెడ్డి, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, రాజమహేంద్రవరం ఏడు గంటల నిద్ర తప్పనిసరి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రోజుకు కనీసం ఏడు గంటల నిద్ర అవసరం. విద్యార్థులు పరీక్షలను సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే ముందుగా ఆరోగ్యంగా ఉండాలి. - డాక్టర్ తేతలి నవీన్‌రెడ్డి, కేవీఆర్ హాస్పిటల్స్, రాయవరం -
కరప హైస్కూల్ డిజిటల్ క్లాస్ ఆదర్శప్రాయం
రాష్ట్రంలో సెకండ్, జిల్లాలో ఫస్టు కరప (కాకినాడ రూరల్) : డిజిటల్ క్లాస్ నిర్వహణలో రాష్టంలో కరప హైస్కూలు ద్వితీయ స్థానం, జిల్లాలో ప్రథమస్థానం సాధించింది. ఈ విషయాన్ని అమరావతి విద్యా కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన ఈ గవర్నన్స్ కన్సల్టెంట్ సత్య సందీప్, డెవలప్మెంట్ కన్సల్టెంట్ ఎం.వంశీ తెలిపారు. స్థానిక నక్కా సూర్యనారాయణమూర్తి జెడ్పీ ఉన్నత పాఠశాలను మంగళవారం జిల్లా విద్యా శాఖ ఏపీఓ వి.సత్యనారాయణతో కలిసి వారు సందర్శించారు. డిజిటల్ క్లాస్ రూమును, విద్యాబోధన పరిశీలించి వారు సంతృప్తి వ్యక్తంచేశారు. డిజిటల్ క్లాస్ రూమ్‌ను 172 గంటలు వినియోగించి గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రథమస్థానం పొందిందని వారు తెలిపారు. 152 గంటలతో కరప హైస్కూలు ద్వితీయ స్థానంలో ఉందన్నారు. డిజిటల్ క్లాస్ రూమ్‌ను, అమలుచేస్తున్న టైంటేబుల్ వారు పరిశీలించారు. తాడేపల్లి, కరప హైస్కూళ్లు అనుసరిస్తున్న టైంటేబుల్, నిర్వహణ పరిశీలించి నివేదికను విద్యాశాఖ కమిషనరేట్‌కు అందజేస్తామన్నారు. రాష్టంలో మిగిలిన హైస్కూళ్లు కూడా ఈ విధానాన్ని అనుసరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోజుకో సబ్జెక్టు చొప్పున విద్యార్థులకు చేస్తున్న డిజిటల్ బోధన చేస్తున్నట్టు వారికి హెచ్ఎం పీవీఎన్ ప్రసాద్ వివరించారు. స్టాఫ్ సెక్రటరీ కె.సాంబశివరావు, ఉపాధ్యాయులు టి.కృపాలాల్, జీవీ రంగనాథ్, పీఎన్‌వీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కాపీయింగ్ నిరోధంలో ‘పాస్’ అవుతారా?
-చూసిరాతలకు చెక్ పెట్టేందుకు యాక్ట్-25 -నిఘా నీడలో పదో తరగతి పరీక్షలు..! -చర్చనీయాంశమైన హైకోర్టు ఆదేశాలు రాయవరం : వచ్చే నెల 17 నుంచి జరగనున్న పదోతరగతి పరీక్షల్లో చూసిరాతలను (కాపీయింగ్) నివారించేందుకు గట్టి చర్యలు తీసుకోనున్నారు. మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని హైకోర్టు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు విద్యాశాఖలో సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఇంతవరకూ ఏం జరుగుతోందంటే.. పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ అయితే ఖాళీగా ఉంటున్నారని, దీంతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని కొందరు భావిస్తున్న నేపథ్యంలో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు అనధికారికంగా చూసిరాతలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్నేళ్లుగా పబ్లిక్ పరీక్షల్లో చూచి రాతల సంస్కృతి పెరిగి పోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయులే చూసిరాతలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పక్క విద్యార్థి జవాబు పత్రంలో చూసి రాయడం, స్లిప్పులు తెచ్చుకుని రాయడం ద్వారా ఉత్తమ గ్రేడులు పొందేందుకు పక్కదారులు పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. యాక్ట్ -25 అంటే.. పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు యాక్ట్ -25ను రూపొందించారు. దశాబ్దాల క్రితమే ఈ యాక్ట్ అమల్లో ఉంది. మాస్ కాపీయింగ్ నిరోధానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటూ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు ఏమి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని రెండు రాష్ట్రాలను హైకోర్టు ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడకుండా నిరోధించేందుకు అమలు చేసే యాక్ట్ -25కు విద్యాశాఖ అధికారులు పదును పెడుతున్నారు. మాల్ ప్రాక్టీస్ చేసి పట్టుబడిన సందర్భాల్లో ఈసారి ఇన్విజిలేటర్‌ను కూడా ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉంటుందని సమాచారం. మాస్ కాపీయింగ్‌ను నిరోధించాలంటే.. గతేడాది జిల్లాలో మాస్ కాపీయింగ్ నిరోధక చర్యల్లో భాగంగా 15 చోట్ల సీసీ కెమెరాలను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా జిల్లా, రాష్ట్ర అధికారులు ప్రత్యక్ష్యంగా పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది. బయో మెట్రిక్ హాజరు, ఆన్లైన్ మానిటరింగ్ ద్వారా చూసిరాతలకు ఫుల్స్టాప్ పెట్టే అవకాశం ఉంది. తనిఖీ బృందాల్లో ఏసీబీ, విజిలెన్స్ విభాగాల నుంచి ఒక్కొక్కరిని నియమిస్తే మాస్ కాపీయింగ్‌ను పక్కాగా నిరోధించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదో తరగతి విద్యార్థులకు కూడా జవాబులు రాయడానికి సింగిల్ బుక్లెట్లు ఇవ్వడం ద్వారా మాస్ కాపీయింగ్‌కు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. ఈ ఏడాది జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతుంది. పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఇది ఎంతవరకు సాధ్యమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 67,740 మంది రెగ్యులర్ విద్యార్థులు.. ఈ ఏడాది జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 67,740 మంది రెగ్యులర్ విద్యార్థులుగా హాజరు కానున్నారు. వీరికి 297 రెగ్యులర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది పబ్లిక్ పరీక్షల్లో సబ్జెక్ట్స్ ఫెయిలైన వారికి ఏడు ప్రైవేటు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. పకడ్బందీగా యాక్ట్-25 అమలు పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా యాక్ట్ 25ను కచ్చితంగా అమలు చేస్తాం. ఎక్కడా అక్రమాలకు తావీయకుండా చర్యలు తీసుకుంటాం. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. దీనిపై కచ్చితమైన గైడ్‌లైన్స్ రావాల్సి ఉంది. –ఎస్.అబ్రహాం, ఇన్చార్జ్ జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ -
పదికి..పకడ్బందీ!
ఉత్తేజం తోడు ∙పాఠశాలల దత్తత.. అధికారుల కసరత్తు ∙కలెక్టర్ ప్రత్యేక దృష్టి కోరుట్ల: పదో తరగతిలో మంచి ఫలితాలు రాబట్టేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. విద్య..వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా కలెక్టర్ శరత్ ఓ వైపు మరుగుదొడ్ల నిర్మాణంతో స్వచ్ఛ జిల్లా రికార్డుపై దృష్టి పెడుతూనే మరో వైపు పదో తరగతిలో ఉత్తమ çఫలితాలు సాధించి మరో రికార్డు కోసం కసరత్తులు చేస్తున్నారు. కొత్త జిల్లాలో మొదటిసారి జరుగుతున్న పదో తరగతి పరీక్షలు కావడంతో విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళ ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి ఉత్తేజం సాయంతో స్నాక్స్ ఏర్పాటు చేసి ప్రోత్సాహిస్తున్నారు. అంతే కాకుండా ప్రతీ ఉన్నత పాఠశాలలో ఉత్తేజం అమలు..విద్యార్థుల చదువుల పర్యవేక్షణకు దత్తత అ«ధికారులను ఏర్పాటు చేయడం విశేషం. ఫలితాలకు..ఉత్తేజం! గత ఏడాది డిసెంబర్ నెలాఖరుకు పదో తరగతి సిలి బస్ పూర్తి అయిన క్రమంలో విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలన్న లక్ష్యంతో ఉన్నత పాఠశాలల్లో సాయంత్రం వేళ ప్రిపరేషన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 2 నుంచి మొదలయిన ఈ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు పౌష్టికారం అందించి పోత్సాహించాలన్న లక్ష్యంతో ‘ఉత్తేజం’ పేరిట స్నాక్స్ అందిస్తున్నారు. జిల్లాలోని మొత్తం 180 ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 7644 మంది విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి రూ.109 చొప్పున మొత్తం రూ.4,99,992 నిధులు మంజూరు చేశారు. పదో తరగతి పరీక్షలు మార్చి 14 ప్రారంభమై 30వ తేదిన ముగియనున్నాయి. పదో తరగతి పరీక్షలు ప్రారంభమై ముగిసే వరకు ఉన్నత పాఠశాలల్లో ఈ ఉత్తేజం కార్యక్రమం కొనసాగుతుంది. దీంతో సాయంత్రం పూట విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సిద్దం కావడానికి మంచి అవకాశం చిక్కింది. పాఠశాలల దత్తత.. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ పలితాల సాధనకు మండల స్థాయి అధికారులను నియమించారు. ఉత్తేజం అమలు తీరుతో పాటు సాయంత్రం పూట క్లాసులు ఎలా సాగుతున్నాయన్న అంశాన్ని పరిశీలించి మంచి పలితాల సాధనకు దత్తత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మండల తహాశీల్దార్, ఎంపీడివో, ఎంఈవోలకు ఈ దత్తత బాధ్యతలు అప్పగించారు. వీరు తరచూ ఉన్నత పాఠశాలలను పరిశీలించాల్సి ఉంటుంది. ఇటీవల కోరుట్ల మండలం మోహన్‌రావుపేట ఉన్నత పాఠశాలను అకస్మికంగా సందర్శించి ఉత్తేజంపై నిర్లక్ష్యం చూపుతున్న ఎంఈవో, ప్రధానోపాధ్యాయులకు మోమోలు జారీ చేయడం..దత్తత అధికారిని హెచ్చరించడం వంటి చర్యలు పది పలితాలపై జిల్లా కలెక్టర్ ఎంత సీరియస్‌గా ఉన్నారన్న అంశాని కి అద్దం పడుతోంది. ఇంత పకడ్బందీగా జిల్లా కలెక్టర్..విద్యాశాఖ తీసుకుంటున్న నిర్ణయాలు సత్పలితాలిస్తే పది పలితాల్లో జగిత్యాల జిల్లా రాష్ట్రస్థాయిలో తన ప్రత్యేకతను చాటుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.