
నిబంధనల ప్రకారం తరగతులు నిర్వహించాలి
ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటిస్తూ, విద్యార్థులకు మెరుగైనా విద్యను అందించాలని రాష్ట్ర మానిటరింగ్ సభ్యులు ఏ సైదిరెడ్డి, ఉపేందర్‌రావులు సూచించారు.
మునుగోడు: ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటిస్తూ, విద్యార్థులకు మెరుగైనా విద్యను అందించాలని రాష్ట్ర మానిటరింగ్ సభ్యులు ఏ సైదిరెడ్డి, ఉపేందర్‌రావులు సూచించారు. రాష్ట్ర మానిటరింగ్ కమిటీ ఆదేశాల మేరకు మంగళవారం మండలంలోని పులిపలుపుల ప్రభుత్వ పాథమికోన్నత పాఠశాలతో పాటు మండల కేంద్రంలోని సెయింట్ జోసఫ్ ప్రైవేట్ పాఠశాలలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు బోధిస్తున్న బోధాన విధానం, సౌకర్యాలతో పాటు, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అందించే నిధుల వినియోగంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య ప్రణాళిక, వార్షిక ప్రణాళిక సక్రమంగా లేదని, అందుకు ప్రధాన కారణం విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేనందునని గుర్తించినట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలలను నిర్వహించని ప్రైవేట్ పాఠశాలలపై వచ్చే ఏడాది కఠినమైన చర్యలు తీసుకునేందుకు చర్యలు తీసుకుంటునట్లు చెప్పారు. ఆయన వెంట మండల విద్యాధికారి ఎస్ నర్సింహ, హెచ్‌ఎం భాస్కర్‌రెడ్డి, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, స్వామి, సెయింట్ జోసప్ పాఠశాల కరస్పాండెంట్ కె జోసఫ్ తదితరులు ఉన్నారు.