Runs
-
ఆలస్యం వల్ల రూ. 4.80 లక్షల కోట్ల భారం
న్యూఢిల్లీ: మౌలిక రంగంలో పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయి. ఫలితంగా వీటి నిర్మాణ వ్యయం మే నాటికి రూ.4.80 లక్షల కోట్ల మేర పెరిగిపోయింది. కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ నివేదికను పరిశీలించినప్పుడు ఈ విషయం తేటతెల్లమైంది. రూ.150 కోట్లు, అంతకుమించిన వ్యయంతో కూడిన ప్రాజెక్టులను ప్రణాళికా శాఖ పర్యవేక్షిస్తుంటుంది. మొత్తం 1,681 ప్రాజెక్టులకు గాను 814 ప్రాజెక్టులు ఆలస్యంగా నడుస్తున్నాయి. 408 ప్రాజెక్టులు నిర్మాణ వ్యయం పెరిగిపోయినట్టు నివేదించాయి. 1,681 ప్రాజెక్టుల వాస్తవ నిర్మాణ వ్యయం రూ.24,16,872 కోట్లు కాగా, వీటిని పూర్తి చేయడానికి రూ.28,96,947 కోట్లు వ్యయం అవుతుందని ప్రణాళిక శాఖ నివేదిక వెల్లడించింది. అంటే రూ.4,80,075 కోట్ల మేర నిర్మాణ వ్యయం పెరిగినట్టు తెలుస్తోంది. 2023 మే నాటికి ఈ ప్రాజెక్టులపై రూ.15,23,957 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం అంచనా వ్యయంలో 52.61 శాతం మేర ఇప్పటి వరకు ఖర్చు పెట్టారు. మొత్తం ఆలస్యంగా నడుస్తున్న 814 ప్రాజెక్టుల్లో 200 వరకు ఒకటి నుంచి 12 నెలల ఆలస్యంతో నడుస్తుంటే, 183 ప్రాజెక్టులు 13–24 నెలలు, 300 ప్రాజెక్టులు 25–60 నెలలు, 131 ప్రాజెక్టులు 60 నెలలకు పైగా ఆలస్యం అయ్యాయి. -
క్రికెట్ లో సరికొత్త రికార్డు... ఒక్క ఓవర్ లో 46 పరుగులు
-
లాటరీ తగలడమే శాపమైంది...లవర్‌తో భార్య జంప్
లాటరీ తగిలితే ఎవరికైనా మాటల్లో చెప్పలేనంతా ఆనందంగా ఉంటుంది. అది సహజం. కానీ ఇక్కడొక వ్యక్తికి లాటరీ తగలడమే అత్యంత విషాదంగా మారింది. ఒకరకంగా చెప్పాలంటే శాపంగా మారింది అనే చెప్పాలి. వివరాల్లోకెళ్తే...థాయ్‌లాండ్‌కు చెందిన మణిత్ అనే వ్యక్తి రూ. 1.3 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు. దీంతో అతను తెగ ఆనందపడటమే కాకుండా అందులో కొంత భాగాన్ని ఆలయానికి విరాళంగా ఇద్దాం అనుకున్నాడు. మిగిలిన సోమ్మును కుటుంబసభ్యుల కోసం ఉపయోగించాలని ప్లాన్ చక్కగా చేసుకున్నాడు. ఐతే పాపం ఇది అతనికి విషాదాన్ని మిగుల్చుతుందని కల్లో కూడ అనుకుని ఉండడు. ఎదుకంటే? అతడి భార్య అంగ్‌కన్‌రత్ ఆ లాటరీ తీసుకుని తన ప్రియుడుతో జంప్ అయ్యిపోయింది. ఇదంతా తెలియని మణిత్ లాటరీ గెలుచుకున్నాను కదా అని కుటుంబసభ్యులతో గ్రాండ్‌గా పార్టీ చేసుకుంటున్నాడు. ఆ వేడుకలో భార్యతో కనిపించిన ఆ వ్యక్తిని చూసి ఎవరని ప్రశ్నిస్తే తమ బంధవు అని చెప్పింది. దీంతో అతను తన భార్య తరుఫు బంధువుగానే భావించాడే తప్ప ఏ సందేహం రాలేదు మణిత్‌కి. దీంతో అతను ఆనందంగా పార్టీలో మునిగిపోయాడు. ఆ తర్వాత చూస్తే ఇంట్లో భార్య కనిపించలేదు. దీంతో మణిత్ ఒక్కసారిగా షాక్ అయ్యి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐతే మణిత్, అంగన్‌రాత్‌లకు వివాహమై 26 ఏళ్లు అయ్యింది, పైగా ముగ్గురు పిల్లలు కూడా. ఆమె పారిపోతుందనేలా తనపై ఎలాంటి సందేహం తనకు రాలేదని మణిత్ పోలీసులకు చెప్పాడు. ఐతే పోలీసులు వారికి వివాహం అయ్యి అన్నేళ్లు అయినప్పటికీ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోకపోవడంతో మణిత్‌కు ఎలాంటి న్యాయం చేయలేమని తేల్చి చెప్పారు. అతను ఆ లాటరీ డబ్బును ఆమెకే గిఫ్ట్‌గా ఇచ్చి దాయమని చెప్పినట్లు పోలీసులకు ఆవేదనగా చెప్పాడు. తాము కేవలం అతడి భార్యను ఒప్పించి డబ్బు ఇప్పించే ప్రయత్నం మాత్రమే చేయగలమని, పైగా ఆ సోమ్ము చట్టబద్ధంగా వారికి చెందదు అని మణిత్‌కి చెప్పారు పోలీసులు. దీంతో అతను భార్యకోసం తీవ్రంగా గాలించడమే కాకుండా చివరకు థాయ్‌లాండ్ మీడియాను సైతం సంప్రదించాడు. (చదవండి: బాటిల్లో 135 ఏళ్ల నాటి లేఖ! అందులో ఏముందంటే.....) -
పోలింగ్ కేంద్రం నుంచి కేఏ పాల్ పరుగులు ..
-
పోలింగ్ కేంద్రాల నుంచి పరుగులు పెట్టిన కేఏ పాల్.. ఎందుకంటే?
సాక్షి, నల్గొండ జిల్లా: ఉప ఎన్నికల వేళ మునుగోడు పోలింగ్ కేంద్రాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ హల్చల్ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పరుగులు పెడుతూ కనిపించారు. పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని పరిశీలించి బయటకు వచ్చిన కేఏ పాల్ ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించడానికి వచ్చానన్నారు. మునుగోడు ప్రజలు మార్పు కోసం ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కేఏ పాల్ తన విన్యాసాలతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ప్రజలతో కలిసి డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ ఉత్సాహంగా ముందుకెళ్లారు. రైతు వేషంతో దర్శనమిచ్చారు. సైకిల్ తొక్కుతూ కనిపించారు. తన మాటలు, చేష్టలతో రైతులను నవ్వించారు. పోలింగ్ రోజున కూడా తన దైన శైలిలో పంచ్‌లు వేస్తూ, పరుగులు పెడుతూ నవ్వించారు. -
Viral Video: ఫ్యాన్స్ గుర్తుపట్టడంతో భయపడి పరిగెత్తిన స్టార్ హీరో..
తమ అభిమాన హీరోలు, హీరోయిన్లు ఫ్యాన్స్ ఎలా ప్రవర్తిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సెల్ఫీలు అంటూ మీద పడతారు. ఇబ్బందులకు గురిచేస్తారు. ఒక్కొక్కసారి వారి అభిమానం చూసి భయపడిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇలా తాజాగా తన ఫ్యాన్స్‌ను చూసిన బాలీవుడ్ బాద్షా భయంతో పరిగెత్తుకుంటూ వెళ్లి తన కారులో కూర్చున్నాడు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌కు వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమా వచ్చి చాలాకాలమే అయింది. ఈ క్రమంలో లాంగ్ గ్యాప్ తీసుకున్న షారుక్ ఖాన్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే 'పఠాన్' మూవీ కంప్లీట్ చేసిన బాద్షా 'డుంకీ' చిత్రీకరణలో పాల్గొన్నాడు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్ స్పాట్లో ఆయన్ను గుర్తుపట్టిన ఫ్యాన్స్ సెల్ఫీల కోసం షారుక్ దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అది గమనించిన షారుక్ ఖాన్ పరిగెత్తుకుంటూ వెళ్లి తన కారులో కూర్చున్నాడు. చదవండి: తన సినిమానే చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్.. నూలుపోగు లేకుండా రణ్వీర్ సింగ్.. మానసిక రోగి అంటూ బ్యానర్లు View this post on Instagram A post shared by Javed_srkian (@bigfansrk_) ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో ఉంది షారుక్ ఖాన్ పొట్టిగా కనపించడంతో అతను కాదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ మూవీలో షారుక్‌కు సరసన తాప్సీ నటిస్తోంది. అలాగే షారుక్ 'పఠాన్' సినిమా 2023 జనవరిలో విడుదల కానుంది. చదవండి: కేటీఆర్ గారూ.. త్వరగా కోలుకోవాలంటే ఈ చిత్రం చూడండి.. శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ -
గర్భంతో పరుగు..
‘గర్భం దాల్చగానే ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటారు. ఆమెకు ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుగా ఉండాలనుకుంటారు. దీంతో గర్భం దాల్చిన స్త్రీ కూడా చాలా సున్నితత్వానికి లోనవుతుంది. దీనివల్ల ప్రసవాలు సులువుగా జరగడం లేదు. గర్భిణీ స్త్రీలు ఎటువంటి మద్దతు లేకుండా తమ పనులన్నీ తాము చేసుకోగలరు, ఇది సమాజం తెలుసుకోవాల’ని అమెరికన్ మహిళ మిల్లెర్ కోరుకుంటున్నది. తొమ్మిది నెలల గర్భవతి మాకేనా మిల్లెర్ 5 నిమిషాల 25 సెకన్లలో 1.6 కిలోమీటర్లు పరిగెత్తి ఈ విషయాన్ని నిరూపించింది. గర్భిణీ స్త్రీల గురించి ప్రజల ఆలోచనను మార్చాలని కోరుకుంది మిల్లెర్. ప్రసవం తర్వాత ఆ స్త్రీ చురుకుదనాన్ని కొనసాగించాలని కూడా మిల్లెర్ కోరుకుంటోంది. తొమ్మిది నెలల గర్భవతి అయిన అమెరికన్ మహిళ 5 నిమిషాల 25 సెకన్లలో 1.6 కి.మీ పరిగెత్తింది. ‘నన్ను ప్రోత్సహించడానికి, 9 నెలల గర్భంతో 8 నిమిషాల్లో మైలు రికార్డును బద్దలు కొడితే నాకు 100 డాలర్లు ఇస్తానని నా భర్త చెప్పాడు’ అని తెలిపింది మిల్లెర్. మిల్లెర్ వీడియోను ఆమె భర్త మైక్ రూపొందించాడు. ఇప్పటివరకు 3.4 మిలియన్ల మంది వీక్షించిన ఈ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయ్యింది. భర్త మైక్‌తో మాకేనా మిల్లెర్ మిల్లెర్ మాట్లాడుతూ ‘మైక్ నా వీడియో చేసినట్లు ముందు నాకు తెలియదు. ఈ పోటీ జరిగిన తరువాతి రోజు నాకు తెలిసింది’ అని ఆనందంగా తెలిపింది. మిల్లెర్ వీడియోను చూసిన కొంతమంది ‘పుట్టబోయే బిడ్డకు ఏదైనా హాని ఉందా. ఆ బిడ్డ గురించి ఆందోళన చెందుతున్నాం’ అని తమ స్పందనను తెలియజేశారు. దీనికి ప్రతిస్పందనగా మైక్ ‘వైద్య నిపుణుడితో సంప్రదింపులు జరిపే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆందోళన చెందవలసిన అవసరం లేదు’ అని తెలిపాడు. పరిగెత్తే ముందు డాక్టర్ సోనోగ్రఫీ చేసి, శిశువు ఆరోగ్యంగా ఉందని చెప్పారు. దీంతో నేను ఈ పనిని ధైర్యంగా చేయగలిగానని చెబుతోంది మిల్లెర్. -
వైరల్ వీడియో: గున్న ఏనుగు వాకింగ్!
సాక్షి, బెంగుళూరు: సాధారణంగా పెంపుడు జంతువులు తమతో పాటు వాకింగ్ చేస్తే యజమానులు చాలా సంతోష పడతారు. అవి తమతో పాటు నడవటం, పరుగెత్తటం చూసి మురిసిపోతారు. తాజాగా మైసూర్‌లోని జూ సంరక్షణలో ఉన్న ఓ గున్న ఏనుగు తన కేర్ టేకర్ వెంట నడుస్తూ, పరుగెత్తే వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కర్ణాటక జూ తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ‘మైసూర్ జంతు ప్రదర్శనశాలలో వేదవతి అనే చిన్నఏనుగు సోము సంరక్షణలో పెరుగుతోంది. వేదవతి కాకుండా మరో ఐదు గున్న ఏనుగులు అతని సంరక్షణలో ఉన్నాయి’ అని పేర్కొంది. మరో వీడియోను పోస్ట్ చేసి.. ‘వేదవతి ఎలా పరుగెత్తుతుందో చూడండి. ఈ చిన్న ఏనుగు రోజూ నడవటానికి ఇష్టపడుతుంది. మైసూర్ జంతు ప్రదర్శనశాలలో వేదవతి చేరినప్పుడు కేవలం 89 కిలోల బరువు మాత్రమే ఉండేది. రెండు నెలల వ్యవధిలో సోము సంరక్షణలో సుమారు 20 కేజీల బరువు పెరిగింది. కేర్ టేకర్ సోము ప్రతి రోజు వేదవతిని జూ చూట్టు వాకింగ్‌కి తీసుకెళ్తాడు. ఈ గున్న ఏనుగు రోజుకు మూడు సార్లు జూ చుట్టు పరుగులు తీస్తూ వ్యాయామం పూర్తి చేసుకుంటుంది’ అని కామెంట్ కర్ణాటక జూ తెలిపింది. ‘కరోనా కాలంలో మేము బంధీలమయ్యాంది. గున్న ఏనుగుకు ఎప్పుడూ స్వేచ్ఛే’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. #Vedavathi lives walking and running, #Somu takes around three times in a day. Look how she runs!! She was 89 kgs , when arrived now 110kgs, gained any 20kgs in two months.@aranya_kfd @CZA_Delhi @AnandSinghBS @KarnatakaWorld @PIBBengaluru pic.twitter.com/PFPlpFshWi — Zoos of Karnataka (@ZKarnataka) July 13, 2020 -
గున్న ఏనుగు పరుగు..
-
వారెవ్వా..! విరాట్ జోరు
విశాఖ స్పోర్ట్స్: విశాఖక్రీడాభిమానులు విరాట్ విశ్వరూపాన్ని మరోసారి ప్రత్యక్షంగా వీక్షించారు. ఈసారి విరాట్ కొహ్లి ఐదంకెల స్కోర్‌కు చేరుకోవడాన్ని విశాఖ అభిమానులు ఆస్వాదించారు. సచిన్‌కంటే 54 ఇన్నింగ్స్ ముందే ఈ రికార్డును సొంతం చేసుకుంటే...సచిన్ కంటే రెండేళ్ల పన్నెండు రోజుల ముందే ఈరికార్డును కోహ్లీ నమోదు చేశాడు. పరుగుల దాహంతో దూసుకుపోతున్న విరాట్ విశాఖలో మరో సెంచరీని కొట్టేశాడు. విశాఖ వేదికగా హాట్రిక్ సెంచరీల రికార్డును ఒక్క పరుగుతో తేడాతో వీక్షించలేక పోయిన విశాఖ క్రీడాభిమానుల నిరాశను విరాట్ బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఈవిధంగా తీర్చాడు. అదీ విశాఖలో అత్యధిక పరుగుల రికార్డు చేసిన ధోని పాహచర్యంలో క్రీజ్‌లో ఉండగానే ఇలా జరగడంతో అభిమానుల ఉత్సాహానికి ఆదుపులేకపోయింది. ప్రేక్షకలోకం అంతా ఒక్కసారి లేచి నించుని ఇరువురు ఆటగాళ్ళకు స్టాడింగ్ ఓవెషన్ ఇచ్చింది. విరాట్ కొహ్లి 13ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 129 బంతుల్లోనే 157 పరుగులతో అజేయంగా నిలిచాడు. రోహిత్ నిరాశ ఈ మ్యాచ్‌లో మరో సిక్స్ బాదేస్తే రికార్డు నమోదయ్యే అవకాశం ఉన్న ఓపెనర్ రోహిత్ ఇలా వచ్చి అలా నాలుగు పరుగులు చేసేసి వెళ్ఙిపోవడం విశాఖ అభిమానుల్ని నిరాశపరిచింది. అలాగే రోహిత్– శిఖర్ ధావన్ జోడీ మరో 29 పరుగుల భాగస్వామ్యాన్ని చేస్తే సచిన్–సెహ్వాగ్‌ల సక్సెస్ పెయిర్‌ను అధిగమించి ఉండేవారు. కానీ వీరి జోడీ కేవలం 15 పరుగుల వద్దే వికెట్ కోల్పోయింది. శభాష్ కోహ్లీ భారత్ బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచి విశాఖలో అత్యధిక సెంచరీలు సాధించడమేగాకపదివేల పరుగుల మైలురాయిదాటిన స్టార్ బ్యాట్స్‌మన్ కోహ్లీకి ప్రశంసాఫలకం అందిస్తున్న దృశ్యం. ద్వితీయార్థం మందగిస్తుందని.. టాస్ గెలిచిన విరాట్ కొహ్లి బ్యాటింగ్ చేయడానికే ఆసక్తి చూపాడు. విశాఖ పిచ్‌పై భారత్ ఏడు సార్లు ఆడితే ఐదుసార్లు చేజింగ్నే ఎంచుకుంది. కాని ఈసారి బ్యాటింగ్ ఎంచుకుంది. ‘వికెట్ మీద పచ్చిక లేకపోవడంతో ఇది హార్డ్ వికెట్‌గా మారింది. సెకండ్ హాఫ్‌లో పరుగులు రాబట్టడం కష్టమవుతుంది. పెద్ద స్కోర్ చేస్తే కొంత పని సులువవుతుంది. అందుకే ఖలీల్ స్థానంలో బ్యాటింగ్ చేయగల కుల్దీప్ను తీసుకున్నాను. స్పిన్‌కు అనుకూలించనున్న ఈ పిచ్‌పై మిడిలార్దర్‌లో కట్టడి చేసేందుకు ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లును తీసుకున్నాను.’ అని మ్యాచ్ ప్రారంభానికి ముందు కోహ్లీ వ్యాఖ్యానించాడు. ⇔ భారత్‌లో అతివేగంగా 4000పరుగులు చేసినరికార్డు ⇔ ఫాస్టెస్ట్10000పరుగుల రికార్డు ⇔ వెస్టిండీస్పైఅత్యధిక సెంచరీలుచేసిన రికార్డు ⇔ ఒకే ఏడాదిలోఅతి తక్కువ ఇన్నింగ్స్‌లో1000పరుగులు ⇔ 10000పరుగులకుఅత్యధిక సరాసరి(ధోనీని దాటిన రికార్డు) ⇔ వెస్టిండీస్‌పై అత్యధికపరుగులు చేసినభారతీయ ఆటగాడు(సచిన్‌ను దాటిన రికార్డు) ⇔ 4000పరుగులకుభారత్లోఅత్యుత్తమ సగటు -
కోహ్లి ‘డబుల్’ ధమాకా
బర్మింగ్‌హామ్: టీమిండియా కెప్టెన్, డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి ఖాతాలో మరో రెండు రికార్డులు వచ్చి పడ్డాయి. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఈ డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ 200 పరుగులు సాధించాడు.(149, 51).. తద్వారా టెస్టుల్లో ఎక్కువసార్లు ఒక మ్యాచ్‌లో 200 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు ఇంగ్లండ్‌పై ఒక టెస్టులో అత్యధిక పరుగులు (200) సాధించిన రెండో టీమిండియా కెప్టెన్‌గా నిలిచాడు. గతంలో ఈ ఘనత ఎంఏకే పటౌడీ 212(64,148) (1967, లీడ్స్ టెస్ట్‌లో) సాధించారు. ఇక వ్యక్తిగతంగా 200 పరుగులు ఎక్కువ సార్లు చేసిన టీమిండియా ఆటగాడిగానూ కోహ్లి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కోహ్లి 11 సార్లు ఈ ఘనత సాధిస్తే.. ద్రవిడ్, సచిన్‌లు ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. వీరేంద్ర సెహ్వాగ్, గావస్కర్, వీవీఎస్ లక్ష్మణ్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఓటమిలోనూ... కోహ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సెంచరీలు చేసిన ఐదు టెస్ట్‌ల్లో జట్టు ఓటమిపాలైంది. తద్వారా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రెయిన్ లారా కెప్టెన్‌గా నమోదు చేసిన చెత్త రికార్డు(ఐదు టెస్టుల్లోనూ)ను ఇప్పుడు కోహ్లి సమం చేశాడు. ఓటమిపాలైన మ్యాచుల్లో సెంచరీలు చేసిన కెప్టెన్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా(4 సెంచరీలు) తర్వాతి స్థానంలో ఉన్నారు. -
అత్యధిక పరుగుల కెప్టెన్ ధోనినే
సాక్షి, హైదరాబాద్ : చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నారు. సోమవారం ఢిల్లీపై ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా మహీ రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకూ ఈ రికార్డు గౌతమ్ గంభీర్ (3518 పరుగులు) పేరిట ఉండేది. కాగా, ఢిల్లీపై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ధోనీ (3536 పరుగులతో) దాన్ని అధిగమించాడు. అత్యధిక పరుగులు చేసిన ఐపీఎల్ కెప్టెన్ల జాబితాలో విరాట్ కొహ్లీ (3333 పరుగులు), రోహిత్ శర్మ (2198 పరుగులు) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చే ధోని టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే గంభీర్, కోహ్లి, రోహిత్‌ల కంటే ముందుండటం కొసమెరుపు. -
నవంబర్ 28న మెట్రో రైలు పరుగులు
-
నిబంధనల ప్రకారం తరగతులు నిర్వహించాలి
మునుగోడు: ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటిస్తూ, విద్యార్థులకు మెరుగైనా విద్యను అందించాలని రాష్ట్ర మానిటరింగ్ సభ్యులు ఏ సైదిరెడ్డి, ఉపేందర్‌రావులు సూచించారు. రాష్ట్ర మానిటరింగ్ కమిటీ ఆదేశాల మేరకు మంగళవారం మండలంలోని పులిపలుపుల ప్రభుత్వ పాథమికోన్నత పాఠశాలతో పాటు మండల కేంద్రంలోని సెయింట్ జోసఫ్ ప్రైవేట్ పాఠశాలలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు బోధిస్తున్న బోధాన విధానం, సౌకర్యాలతో పాటు, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అందించే నిధుల వినియోగంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య ప్రణాళిక, వార్షిక ప్రణాళిక సక్రమంగా లేదని, అందుకు ప్రధాన కారణం విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేనందునని గుర్తించినట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలలను నిర్వహించని ప్రైవేట్ పాఠశాలలపై వచ్చే ఏడాది కఠినమైన చర్యలు తీసుకునేందుకు చర్యలు తీసుకుంటునట్లు చెప్పారు. ఆయన వెంట మండల విద్యాధికారి ఎస్ నర్సింహ, హెచ్ఎం భాస్కర్‌రెడ్డి, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, స్వామి, సెయింట్ జోసప్ పాఠశాల కరస్పాండెంట్ కె జోసఫ్ తదితరులు ఉన్నారు. -
నా నుదిటిపై ఏమైనా రాసి ఉందా!
* ప్రతీసారి గెలిపించడం సాధ్యం కాదు * ఫినిషింగ్‌పై ధోని వ్యాఖ్య సిడ్నీ: ధోని అంటే బెస్ట్ ఫినిషర్... చివర్లో ఎన్ని పరుగులు చేయాల్సి ఉన్నా, ఎంత రన్‌రేట్ అవసరమైనా అతను క్రీజ్‌లో ఉంటే చాలు గెలిపిస్తాడనే ధీమా అందరిది. కానీ ఇటీవలి కాలంలో అతను ఇలా ముగిస్తున్న మ్యాచ్‌లు పెద్దగా ఉండటం లేదు. నాలుగో వన్డేలో ఘోరంగా విఫలమైన అతను... సిడ్నీలో మ్యాచ్ ముగించకపోయినా, ఆఖరి ఓవర్లో భారీ సిక్సర్‌తో పని సులువు చేశాడు. అయితే ఇదేమీ అంత తేలికైన విషయం కాదని, ప్రతీసారి అంచనాలు అందుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశాడు. ‘లోయర్ ఆర్డర్లో మ్యాచ్‌లు ముగించడం నా బాధ్యత కావచ్చు. దానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. అందరి లక్ష్యం గెలిపించడమే. కానీ ఆ స్థితిలో ఆడటం అంత సులువు కాదు. హిట్టింగ్‌కు ప్రయత్నించి సిక్సర్ పడితే వహ్వా అంటారు, అదే అవుటైతే ఆ షాట్ ఆడటం అవసరమా అంటారు. ధోని అక్కడున్నాడా... అయితే మ్యాచ్ గెలిచేశాం అనుకోవడం తప్పు. నేనే మ్యాచ్ ముగించాలని ఏమైనా నా నుదుటి మీద రాసి ఉందా. మంచి యార్కర్ పడితే సిక్స్ ఎలా కొడతాం. నేను హెలికాప్టర్ షాట్ కొట్టలేదని అడుగుతారు. అది బౌన్సర్ అయితే నేనెలా ఆడేది? పరిస్థితులను బట్టి ఆడతామే కానీ ఎప్పుడూ గెలిపించడం సాధ్యం కాదు’ అని ధోని కుండబద్దలు కొట్టాడు. -
డ్రింకిల్ వాటర్!
ఇదిగో పై ఫొటోలో కన్పిస్తున్నది మురికినీరు కాదు.. ‘అనంత’ కార్పొరేషన్ సరఫరా చేస్తోన్న తాగునీరు. నగరంలో దాదాపు 60శాతం ప్రాంతాల్లో ఇలా పురుగులు ఉన్న నీరే సరఫరా అవుతోంది. గత్యంతరం లేక వేలాది కుటుంబాల వారు ఈ నీటినే తాగుతూ రోగాలబారిన పడుతున్నారు. గత ఆర్నెళ్లుగా నగరంలో ఇలాంటి నీరు వస్తున్నా ఇటు మేయర్... అటు ఎమ్మెల్యే ఏ ఒక్కరూ సమస్యపై దృష్టి సారించలేదు. ఏడాది పాలనపై సంబరాలు చేసుకున్న అధికారపార్టీ నేతలు... తమ పాలనలో నగరవాసులకు కనీసం తాగేందుకు ‘స్వచ్ఛ’ జలాన్ని అందించలేకపోయూరు. సాక్షిప్రతినిధి, అనంతపురం: అనంతపుర ం నగరంలో సుమారు 3 లక్షల జనాభా ఉంటుందని కార్పొరేషన్ అధికారుల అంచనా! వీరందరూ తాగునీటి కోసం ఏళ్లతరబడి ఇబ్బంది పడ్డారు. 2009లో అప్పటి ప్రభుత్వం ముద్దలాపురం వద్ద 60ఎంఎల్డీ సామర్థ్యంతో ‘వైఎస్ రాజశేఖరరెడ్డి అనంత తాగునీటి పథకాన్ని’ రూ.72కోట్ల వ్యయంతో నిర్మించారు. పీఏబీఆర్ నుంచి ముద్దలాపురానికి తుంగభద్ర జలాలు వస్తాయి. అక్కడి శుద్ధిచేసిన నీటిని నగరానికి సరఫరా చేస్తున్నారు. రోజుకు 40మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో అందరూ కార్పొరేషన్ నీటినే తాగేవారు. క్లోరినేషన్ నామమాత్రమే గత ఏడాదిగా నీటిసరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. క్లోరినేషన్ నామమాత్రంగా చేస్తున్నారు. ప్లాంటు వద్ద 8.5-9కిలోల క్లోరిన్‌ను కలుపుతున్నారు. ముద్దలాపురం నుంచి ‘అనంత’కు 25 కిలోమీటర్లు ఉంది. నగరంలో నీటిని పరిశీలిస్తే క్లోరిన్ శాతం సున్నాగాా తేలుతోంది. క్లోరినేషన్ సున్నా ఉంటే అది శుద్ధజలం కాదు. నీటిశుద్ధిప్లాంటు- అనంతపురానికి మధ్య దూరం వల్లే క్లోరిన్ శాతం తగ్గిపోతుందని అధికారులు భావించారు. దీంతో కూడేరు వద్ద రూ.14 లక్షలతో ఆరేళ్ల కిందటే బూస్లర్పాయింట్ను ఏర్పాటు చేశారు. అయితే దీన్ని ఇప్పటికీ పాలకవర్గం వినియోగించలేదు. ఎందుకు వినియోగించలేదని ఆరా తీస్తే కరెంటు కనెక్షన్ లేదని అధికారులు చెబుతున్నారు. దీన్నిబట్టి కార్పొరేషన్ నిర్లక్ష్యం ఏస్థాయిలో ఉందో స్పష్టం అవుతోంది. అలాగే నీటిశుద్ధిప్లాంటులో ‘ఆలం’ను కూడా మొక్కుబడిగా కలుపుతున్నారని తెలుస్తోంది. రోజుకు 300 కిలోల ఆలం కలపాల్సి ఉంది. అయితే కనీసం వంద కిలోలు కూడా కలపడం లేదని, ఒక్కోరోజు ఆలాన్ని కలపకుండానే నీటిని పంపుతున్నట్లు తెలుస్తోంది. తాగునీళ్లు ఇవ్వలేకపోయారు అనంత కార్పొరేషన్ ఏడాది పాలన సంతృప్తికరంగా సాగిందని పాలకవర్గం సంబరాలు చేసుకుంది. మేయర్ మదమంచి స్వరూప కేక్‌కట్ చేసి ఏడాదిపాలనలో ఎంతో చేశామని చెప్పకుంటూ వచ్చారు. అయితే ఏడాదిలో కనీసం నగరవాసులు తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కూడా సరఫరా చేయలేకపోయారు. నగరంలో చాలాచోట్ల మురుగుకాలువల్లో తాగునీటి పైపులు ఉన్నాయి. పైపులు లీకేజీ ఉన్నచోట మురికినీరు ఇందులో కలుస్తోంది. ఈ కారణంగా కూడా నీరు కలుషితం అవుతోంది. 2.5 కోట్ల తాగునీటి పన్ను వసూలు నగరవాసుల నుంచి ఏడాదికి రూ.2.5కోట్ల తాగునీటి పన్నురూపంలో కార్పొరేషన్ వసూలు చేస్తోంది. ఇందులో 10శాతం నిధులు ఖర్చుపెట్టినా శుద్ధజలాన్ని అందించవచ్చు. అయితే ఈ దిశగా ప్రజాప్రతినిధులు ఆలోచించడం లేదు. మేయర్‌తో పాటు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి కూడా తాగునీటి సమస్య పరిష్కారంపై నిర్లప్తత ప్రదర్శించారు. నగరంలో నీటి నాణ్యత, తీసుకోవల్సిన చర్యలపై స్థానిక ఎమ్మెల్యేగా ఏడాదిలో తన బాధ్యతలను విస్మరించారని నగరవాసులు చెబుతున్నారు. క్లోరిన్‌శాతం జీరో కావడంనిజమే అనంతపురంలో నీటిలో క్లోరిన్ జీరోగా వస్తోంది. అందుకే లిక్విడ్ క్లోరిన్ ఓవర్హెడ్ట్యాంకుల్లో కలుపుతున్నాం. బూస్లర్పాయింట్కు 3రోజుల కిందటే కరెంటు కనెక్షన్ కోసం డబ్బులు చెల్లించాం. త్వరలోనే వినియోగంలోకి తీసుకొస్తాం. ఆలం కలపలేదనడంలో వాస్తవం లేదు. రోజూ కలుపుతున్నాం. -సూర్యనారాయణ, కార్పొరేషన్ డీఈ ఎవరైనా ఈ నీళ్లు తాగుతారా? ఈ నీళ్లు చూడండయ్యా! ఎన్ని పురుగులు ఉన్నాయో! కార్పొరేషనోళ్లయితే ఈ నీళ్లు తాగుతారా చెప్పండి. ముందుగానే మా ఆరోగ్యాలు అంతంతమాత్రం. ఇట్టాటి నీళ్లు తాగితే రెండురోజులకే మూలన పడతాం. తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేకపోతే ఎట్టా అయ్యా! - సుందరమ్మ, మూడోరోడ్డు, అనంతపురం -
చచ్చినా పట్టించుకోరా..
ఒంగోలు సెంట్రల్: ఒంగోలు రిమ్స్ దక్షిణం వైపు గేటు వద్దకు అడుగుపెడితే చాలు..భరించలేని దుర్వాసన వస్తుంది. రిమ్స్‌లోని అనాథ శవాలన్నీ అక్కడే ఓ చిన్న రేకుల గదిలో కుళ్లిపోయి..పురుగులు పట్టి దారుణమైన స్థితిలో ఉంటాయి. రిమ్స్ అధికారులు మాత్రం మున్సిపల్ అధికారులపై నెపం వేసి ఊరుకుంటున్నారు. రిమ్స్ ముఖద్వారం నుంచి లోపలికి వచ్చే మార్గంలో ఎడమవైపున మార్చురీ నిర్మించారు. రిమ్స్ మార్చురీలో కేవలం ఆరు మృతదేహాలను మాత్రమే నిల్వ చేసేందుకు ఫ్రీజర్స్ ఉన్నాయి. అందులో రెండు పనిచేయడం లేదు. ప్రతి రోజూ జిల్లాలో జాతీయ రహదారిపై ఎక్కడో ఒకచోట యాక్సిడెంట్ మరణాలు, మెడికో లీగల్ మరణాలు (ఆత్మహత్యలు, హత్యలు) సంభవిస్తుంటాయి. రిమ్స్ వైద్య కళాశాల కాబట్టి ఫోరెన్సిక్ వైద్యులు ఉంటారు. హత్యలతో పాటు అనుమానాస్పద, యాక్సిడెంట్ మరణాలకు పోస్టుమార్టం రిమ్స్‌లోనే నిర్వహిస్తుంటారు. దీంతో ఈ మార్చురీకి శవాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శవాలు వచ్చిన తర్వాత పోలీసుల పంచనామా పూర్తయ్యాక వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తుంటారు. అనంతరం శవాలను బంధువులకు అప్పగిస్తారు. ఇదంతా జరగడానికి కనీసం ఒకరోజుపైగా సమయం పడుతుంది. అదే విధంగా హెచ్ఐవీ, టీబీ, హెపటైటిస్-బీ వంటి వ్యాధులతో ఉన్నవారిని కుటుంబ సభ్యులు రిమ్స్‌లోనే వదిలేసి వెళుతుంటారు. ఇటువంటివారు మరణిస్తే శవాన్ని తీసుకెళ్లడానికి కూడా ఎవరూ రారు. ఈ శవాలను కూడా మూడు రోజుల పాటూ ఫ్రీజర్‌లో భద్రపరిచి బంధువులు ఎవరూ రాకపోతే మున్సిపల్ కార్పొరేషన్‌లోని శానిటేషన్ సిబ్బందికి సమాచారం అందించాలి. కానీ రిమ్స్ మార్చురీలో స్థలం లేకపోవడంతో మార్చురీ పక్కనే ఓ రేకుల షెడ్డును నిర్మించారు. ఈ షెడ్డులోనే అనాథ శవాలను మరణించిన రోజు నుంచి వేస్తున్నారు. కొన్నిసార్లు ఇక్కడ గుట్టలుగా శవాలు పేరుకుపోయి..కుళ్లి, పురుగులు పట్టి దుర్గంధం వెదజల్లుతుండటంతో ఇక్కడి సిబ్బంది వాటిని భరిస్తూనే విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ కొత్తగా రిమ్స్‌లోకి ప్రవేశించే రోగులు మాత్రం వాంతి చేసుకుంటున్నారు. మంగళవారం కూడా ఇదేవిధంగా దుర్గంధం రావడంతో రోగులు ‘సాక్షి’ దృష్టికి తెచ్చారు. ఆ రేకుల షెడ్డును తనిఖీ చేయగా దాదాపు 5 శవాలు అందులో ఉన్నాయి. శవాలన్నీ పూర్తిగా కుళ్లిపోయి..పురుగులుపట్టి ఉన్నాయి. ఆ ప్రదేశంలోకి వెళ్లాలంటేనే దుర్గంధం వెదజల్లుతోంది. ఈ మృతదేహాలు అక్కడ పడేసి పది రోజులపైనే అయినట్లు సమాచారం. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం రిమ్స్‌లో అనాథ శవాలపై ఆర్ఎంవో నుంచి సమాచారం అందుకున్న మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది..శవాలను తరలించడానికి ఎప్పుడో ప్రభుత్వం నిర్దేశించిన రూ.300లు సరిపోక, వాహనం గానీ, సిబ్బంది కానీ లేకపోవడంతో ఎప్పుడో పది రోజుల కొకసారి తరలిస్తున్నారు. లేదంటే రిమ్స్ అధికారులే తమ సిబ్బందితో శవాలను ఖననం చేయిస్తున్నారు. అనాథ శవాలను పోలీసులు గుర్తించి తమకు సమాచారం అందిస్తే వాటిని తరలిస్తున్నామని, రిమ్స్ నుంచి తమకు సమాచారం లేదని కార్పొరేషన్ ప్రజారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. రిమ్స్ అధికారుల అలసత్వం కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యంపై కమిషనర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించే దిశగా రిమ్స్ అధికారులు ప్రయత్నాలు చేయడంలేదు. అదే విధంగా ఉన్న మార్చురీ సరిపోవడంలేదని, మరో మార్చురీ నిర్మించడానికి ప్రతిపాదనలు లేదా ఉన్న మార్చురీ సామర్థ్యాన్ని పెంచడానికి గానీ చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనాథ శవాలను ఎప్పటికప్పుడు తరలించాలని, శవాల వలన ఇతర వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. కార్పొరేషన్ సిబ్బంది రావడం లేదు: డాక్టర్ బాలాజీ నాయక్, రిమ్స్ ఆర్ఎంవో అనాథ శవాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి పంపిస్తుంటాం. అయితే వారు తీసుకువెళ్లడం లేదు. మేమే సొంత నిధులతో శవాలను కొన్నిసార్లు ఖననం చేయిస్తున్నాం. -
గ్రేట్ రన్.. ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్
పరుగులు తీసే మనసుంటే వయసుతో పనేంటని నిరూపించారు హైదరాబాదీలు. పాతికేళ్ల యువకులు.. టీనేజీ కుర్రాళ్లు.. పదేళ్లు కూడా లేని చిచ్చర పిడుగులు.. రిటైరైన పెద్దలు.. ఇలా అన్ని వయసుల వారు పరుగు పథంలో దూసుకెళ్లారు. అడుగులో అడుగేస్తూ.. వడివడిగా సాగిపోతూ లక్ష్యాన్ని చేరుకున్నారు. ఎయిర్టెల్, హైదరాబాద్ రన్నర్స్ సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన ‘ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్’ గ్రాండ్ సక్సెస్ అయింది. నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి మొదలైన రన్లో పాల్గొన్న రన్నర్లు.. వారికి అడుగడుగునా సపోర్ట్ చేసిన నగరవాసులతో మారథాన్ మార్గం కోలాహలంగా మారిపోయింది. తెల్లవారుజామున 5 గంటలకే సిటీ రోడ్లు రన్నర్లతో నిండిపోయాయి. రన్ మొదలైన పీపుల్స్ ప్లాజా దగ్గర సందడి కనిపించింది. ఉదయం 6 గంటలకు హాఫ్ మారథాన్ మొదలైంది. రెండు ఫార్మాట్లలో కలిపి సుమారు 15 వేల మంది రన్నర్లు ఈవెంట్లో పాలుపంచుకున్నారు. ఓ చోట జోరుగా.. మరోచోట నెమ్మదిగా.. మధ్యలో ఫ్లైఓవర్లు, ఎత్తుపల్లాల రహదారుల మీదుగా మారథాన్ ఉల్లాసంగా సాగింది. అంతటా ఉత్సాహం.. మారథాన్ సాగే రూట్లో వాలంటీర్ల సందడి కనిపించింది. ప్రతి కిలోమీటర్‌కు వాటర్ స్టేషన్, రెండు కిలోమీటర్లకు ఫస్ట్ ఎయిడ్ స్టేషన్ ఏర్పాటు చేసి రన్నర్లకు చేదోడువాదోడుగా ఉన్నారు. అరటిపళ్లు పంపిణీ చేశారు. గచ్చిబౌలి స్టేడియం దగ్గర ఉదయం 8 గంటలకు 5కె రన్ మొదలైంది. స్టేడియంలో ఏర్పాటు చేసిన మ్యూజిక్కు అనుగుణంగా స్టెప్పులేస్తూ.. వేలాది మంది పరుగెత్తారు. కేటీఆర్, రానా, సునీల్ కూడా రన్లో పాల్గొన్నారు. కమాన్ హైదరాబాద్ నినాదాల తో స్టేడియం మార్మోగిపోయింది. బే ్లడ్ రన్నర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏర్పాట్లు బాగున్నాయి ‘జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ టైస్టులు జరిపిన దాడుల్లో నా కుడికాలు పోయింది. అయినా నాకిష్టమైన పరుగును మాత్రం ఆపలేదు. గతేడాది హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై మారథాన్లలో పాల్గొన్నా. ఇందులో నాతో పాటు 15 మంది కృత్రిమ కాలుతో పరుగెత్తారు. - డీపీ సింగ్, ఆర్మీ మాజీ మేజర్ ఎంజాయ్ చేశా భారత్‌లో పాల్గొన్న తొలి మారథాన్ ఇదే. ఎంతో ఎంజాయ్ చేశా. నాతో వచ్చిన 12 మంది ఫ్రెండ్స్... హాఫ్ మారథాన్ మార్గంలో సాగుతూ నన్ను ఎంకరేజ్ చేశారు. వచ్చే ఏడాదీ తప్పకుండా వస్తా. - క్రిస్టియన్ పయే, అమెరికా - వీఎస్ -
కదలనివ్వని పరుగులు
తొక్కిసలాట ఈ భూమ్మీద ఎక్కువగా దేవుడి కోసం జరుగుతుంటుంది. కిలో రెండ్రూపాయల బియ్యం కోసం, కొత్త సినిమా టికెట్ల కోసం కూడా జరుగుతుంది. అయితే ఇంత జరగదు. మనుషులు మరీ ఒకరిమీద ఒకరు పడి, గాయపడి , కూలబడేంత జరగదు. ఒకవేళ చవక దుకాణం దగ్గరో, సినిమా టిక్కెట్ల వరుసలోనో ఎవరైనా తోసుకుని, తొక్కుకుని పడిపోయారనుకున్నా అప్పుడు కూడా దాని వెనుక తప్పకుండా ఏదో ఒక ‘దేవుడి ఆశ ’ (దేవుడు మనిషికి పెట్టిన ఆశ కాదు. మనిషి మనిషికి చూపిన దేవుడి ఆశ) ఉండే ఉంటుంది. కుచేలుడి అటుకుల మూటని శ్రీకృష్ణపరమాత్ముడు ప్రియంగా స్వీకరించినట్లు.. నిరుపేదలు కిలో రెండ్రూపాయల బియ్యంలో ఇంత బెల్లం వేసి, తియ్యగా వండి పెట్టిన నైవేద్యాన్ని ఆ భగవంతుడు తృప్తిగా భుజిస్తాడని స్వామీజీ ఎవరైనా తన తపోశక్తితో కనిపెట్టానని భక్తులకు చెబితే రేషన్ దగ్గరి తొక్కిసలాటకు అది కారణం అయి ఉండొచ్చు. అలాగే.. ప్రేక్షకుల ఆరాధ్య దైవమైన కథానాయకుడు తనూ ఒక మామూలు మనిషిలా అవతరించి తన అభిమానులతో కలిసి తొలిరోజు తొలి ఆట చూడబోతున్నారన్న ప్రకటన.. తొక్కిసలాటకు దారి తీసి ఉండొచ్చు. అలాగని అవి దేవుడి సంకల్పంతో జరిగిన తొక్కిసలాటలు అని కాదు. దైవసాక్షాత్కారానికి మనసు తొందరపడడం వల్ల జరిగే తొక్కిసలాటలు. దేవుడు ఉన్నచోటనే ఉంటాడు. ఎక్కడికీ అదృశ్యమైపోడు. మరి ఎందుకింత తొందర? మనకు కనిపించకుండా, మన తోటివాళ్లకూ దర్శనభాగ్యం కలక్కుండా ఎందుకు రెండు మోచేతులూ అడ్డుపెట్టి, వరుసలో మన వెనుక ఉన్నవారిని అపేస్తున్నాం? సాక్షాత్కార క్షణాలు సంప్రాప్తించకముందే ఎందుకు మనం మన ముందున్న వారి భుజంపై తలను పెట్టి వారి నిలువుకాళ్ల ధ్యానాన్ని ధ్వంసం చేస్తున్నాం? ‘ముందు మనం’ అనే తొందరేనా ఇందుకు కారణం? కాకపోవచ్చు. పరుగులు మనకు అలవాటైపోయాయి. వాటిని మానుకోలేకపోతున్నాం. జీవితంలోని పరుగుల్లోంచి అలసట తీర్చుకోడానికే కదా దర్శనానికి వస్తాం. వచ్చాక ఇక్కడా అవే పరుగులైతే దేని కోసం వచ్చినట్టు? వచ్చి, ఏం తీసుకెళుతున్నట్టు? ప్రసాదమా? దాన్నయినా స్థిమితంగా కళ్లు మూసుకుని, ఇంత ముక్క విరిచి నోట్లో వేసుకుంటున్నామా? లేక, సమయం లేదని నోట్లోకి విసిరేస్తున్నామా? గమనించండి. అయితే ఏమిటి పరిష్కారం? దేనికట పరిష్కారం? తొక్కిసలాట లేని దర్శనానికా? పరుగుల్లేని జీవితానికా? తొక్కిసలాట లేని దర్శనానికే. పరుగులు ఎలాగూ తప్పేలా లేవు. కూటి పరుగులు, సీటు పరుగులు, అమెరికా ఫ్లయిట్ పరుగులు. తర్వాత... ఆస్తి కోసం, అంతస్తు కోసం, పేరు కోసం, ప్రఖ్యాతి కోసం భూగోళమంతా పరుగులే పరుగులు. ఇంత పరుగు ఉండబట్టే కదా దేవుడి దగ్గర కాసేపు ఆగాలనుకుంటున్నాం. ఆగినప్పుడైనా ఆగినట్లు ఉండకపోతే ఎలా? సారెన్ కీగార్డ్ అంటాడు- ‘‘ఈ మనుషుల పరుగు చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఇంత తీరికలేకుండా, తిండీతిప్పలు కూడా పట్టకుండా బతుకులెందుకు ఈడుస్తున్నారో అర్థం కాదు. అందుకే ఇలాంటి వాళ్ల ముక్కు మీద ఈగ వాలినప్పుడు, పక్కనుంచి వేగంగా వెళుతున్న వాహనం వీళ్ల ఒంటి మీద బురదనీళ్లు చిమ్మినప్పుడు, ఇంటి పెంకు ఊడి వీళ్ల తలపై పడినప్పుడు నేను పడీ పడీ నవ్వుతాను’’ అని! కీగార్డ్ పందొమ్మిదో శతాబ్దపు డెన్మార్క్ తత్వవేత్త. క్రైస్తవ ధర్మశాస్త్రజ్ఞుడు. కవి. సామాజిక ప్రవర్తనల విమర్శకుడు. మతగ్రంధాల రచయిత. స్థూలంగా ఆధ్మాత్మికవేత్త. మన తొందరపాటు చూసి దేవుడు మరీ ఈయన నవ్వినంతగా నవ్వకపోవచ్చు. లేదా అసలు నవ్వకపోవచ్చు. ఒకటి మాత్రం అనుకోవచ్చు. ‘నేనే ఇంటింటికీ వెళ్లి మానవులందరికీ దర్శనం ఇస్తే ఈ తొక్కిసలాటలు ఉండవు కదా అని! అప్పుడైనా తొందరపడబోమన్న నమ్మకం లేదు! ‘అయ్యో, పని కాలేదు.. ఈయనొచ్చి కూర్చున్నాడే’ అనుకుంటూ బకెట్ తీసుకుని స్నానానికి బయల్దేరుతాం.. ‘కాసేపు వేచి ఉండండి స్వామీ’ అన్న చిన్న విన్నపంతో. ఆ తర్వాతైనా దేవుడికి మన దర్శనభాగ్యం కలిగిస్తామా? సందేహమే. ‘పూజ అయ్యేంత వరకు కాస్త ఆగు దేవుడా’ అని పూజగదిలోకి పరుగులు పెడతాం. పరుగులు పెట్టొచ్చు. కానీ దేవుడి కోసం పరుగెత్తే తొందరలో దేవుడి పటాన్ని తొక్కుకుంటూ వెళుతున్నామేమో చూసుకోవాలి. -
రాకెట్లా దూసుకెళ్లిన బామ్మ