బర్మింగ్‌హామ్: టీమిండియా కెప్టెన్, డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి ఖాతాలో మరో రెండు రికార్డులు వచ్చి పడ్డాయి. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఈ డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ 200 పరుగులు సాధించాడు.(149, 51).. తద్వారా టెస్టుల్లో ఎక్కువసార్లు ఒక మ్యాచ్‌లో 200 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు ఇంగ్లండ్‌పై ఒక టెస్టులో అత్యధిక పరుగులు (200) సాధించిన రెండో టీమిండియా కెప్టెన్‌గా నిలిచాడు. గతంలో ఈ ఘనత ఎంఏకే పటౌడీ 212(64,148) (1967, లీడ్స్ టెస్ట్‌లో) సాధించారు.
ఇక వ్యక్తిగతంగా 200 పరుగులు ఎక్కువ సార్లు చేసిన టీమిండియా ఆటగాడిగానూ కోహ్లి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కోహ్లి 11 సార్లు ఈ ఘనత సాధిస్తే.. ద్రవిడ్, సచిన్‌లు ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. వీరేంద్ర సెహ్వాగ్, గావస్కర్, వీవీఎస్ లక్ష్మణ్ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
ఓటమిలోనూ... కోహ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సెంచరీలు చేసిన ఐదు టెస్ట్‌ల్లో జట్టు ఓటమిపాలైంది. తద్వారా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రెయిన్ లారా కెప్టెన్‌గా నమోదు చేసిన చెత్త రికార్డు(ఐదు టెస్టుల్లోనూ)ను ఇప్పుడు కోహ్లి సమం చేశాడు. ఓటమిపాలైన మ్యాచుల్లో సెంచరీలు చేసిన కెప్టెన్‌ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా(4 సెంచరీలు) తర్వాతి స్థానంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment