England series
-
బీసీసీఐ లో ఏం జరుగుతోంది
-
12 ఏళ్లకే సచిన్ రికార్డ్ బద్దలుకొట్టిన ఆటగాడు
-
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. టీమిండియాకు ఎంపికైన హైదరాబాద్ క్రికెటర్
సాక్షి, హైదరాబాద్: ఇంగ్లండ్ ‘ఎ’ మహిళల క్రికెట్ జట్టుతో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొనే భారత ‘ఎ’ జట్టులో హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిషకు చోటు దక్కిందని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. 17 ఏళ్ల త్రిష ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి అండర్–19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో కీలక సభ్యురాలిగా ఉంది. భారత్ ‘ఎ’–ఇంగ్లండ్ ‘ఎ’ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌లు ముంబైలోని వాంఖడే స్టేడియంలో నవంబర్ 29న, డిసెంబర్ 1న, డిసెంబర్ 3న జరుగుతాయి. -
రిషబ్ పంత్ రీఎంట్రీకి ముహూర్తం ఖరారు..?
స్వాతంత్ర్య దినోత్సవం నాడు భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త అందింది. గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడిన స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ త్వరలోనే బరిలోకి దిగనున్నాడని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. పంత్ రీఎంట్రీకి ముహూర్తం కూడా ఖరారైందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. వచ్చే ఏడాది (2024) జనవరిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ సమయానికంతా పంత్ ఫిట్‌గా ఉంటాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ కీలక అధికారి సైతం ధృవీకరించినట్లు ఓ ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ పేర్కొంది. Rishabh Pant's batting practice, recovery has been excellent. - Great news for Indian cricket. pic.twitter.com/KThpdkagDz— Johns. (@CricCrazyJohns) August 16, 2023 కాగా, గతేడాది డిసెంబర్ 30న ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన పంత్.. ప్రస్తుతం 70 శాతం వరకు కోలుకుని, ఫిట్నెస్ కోసం నేషనల్ క్రికెట్ అకాడమీలో చమటోడుస్తున్నాడు. ప్రాక్టీస్ ఇంకా ప్రారంభించని పంత్ జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. పంత్ వేగంగా కోలుకునే విధానం చూస్తుంటే అనుకున్న సమయానికంటే ముందే జట్టుతో చేరతాడని అభిమానులు అనుకుంటున్నారు. 🚨 KL Rahul & Shreyas Iyer in the midst of a match simulation exercise at the KSCA ‘B’ grounds. 🎥: Rishabh Pant/Instagram#KLRahul #ShreyasIyer #AsiaCup2023 pic.twitter.com/rDZVfWMpVj — Deepanshu Thakur (@realdpthakur17) August 14, 2023 మరోవైపు గాయం కారణంగా చాలాకాలంగా జట్టుకు దూరంగా ఉండిన టీమిండియా స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా త్వరలో జరుగనున్న ఐర్లాండ్ సిరీస్‌తో క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సిరీస్‌లో బుమ్రా టీమిండియాకు నాయకత్వం వహించనున్నాడు. మరోపక్క గాయాల బారిన పడి శస్త్ర చికిత్సలు చేయించుకున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లు సైతం వేగంగా కోలుకుంటున్నారు. వీరిద్దరు నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. ఆసియా కప్ నాటికి వీరిద్దరు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించేందుకు కఠోరంగా శ్రమిస్తున్నారు. -
పుజారాకు అశ్విన్ సవాల్..!
చెన్నై: అగ్రశ్రేణి స్పిన్నర్‌గా భారత్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించినా రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ సత్తాపై అనేక మార్లు ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటారు. తాజా సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా గడ్డపై అతను విఫలమైన విషయాన్ని పదే పదే అందరూ గుర్తు చేశారు. విదేశాల్లో రాణించలేడనే అపవాదూ అతనిపై ఉండేది. ఒక దశలో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్, ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీలు కూడా అతనికంటే మెరుగైన వారని కథనాలు వచ్చాయి. అయితే ఈ సిరీస్‌లో 28.83 సగటుతో 12 వికెట్లు తీసిన అశ్విన్ జట్టు సిరీస్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ పోరులో టాప్ బ్యాట్స్‌మన్ స్మిత్‌ను అవుట్ చేసే విషయంలో తన ఆలోచనల గురించి చెప్పిన అశ్విన్... పనిలో పనిగా ఇతర స్పిన్నర్లతో తనను పోల్చడంపై ఘాటుగా స్పందించాడు. ‘ఒక మ్యాచ్‌కు ముందు నేను సొంతంగా హోమ్ వర్క్ చేసుకుంటాను. ఎనిమిది గంటల పాటు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ వీడియోలు చూస్తాను. ఆపై మ్యాచ్‌లో ఎక్కడ, ఎలాంటి ఫీల్డింగ్ ఉండాలో నిర్ణయించుకుంటా. టిమ్ పైన్‌ను మెల్బోర్న్లో అలాగే అవుట్ చేశా. స్మిత్‌ను ఎవరు అవుట్ చేస్తారనే దానిపై బాగా చర్చ జరిగింది. ఎవరూ నా గురించి మాట్లాడనే లేదు. ఆసీస్ గడ్డపై స్మిత్ ఎప్పుడూ స్పిన్నర్ల బౌలింగ్‌లో అవుట్ కాలేదు. నేను దానిని మార్చాలనుకున్నా. ప్రపంచంలో నన్ను నేను అత్యుత్తమ బౌలర్‌గా భావించుకుంటా. అలాగే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేయాలని కోరుకుంటా. కోహ్లితో తలపడలేను కాబట్టి స్మిత్‌తో తలపడ్డా. ఇప్పుడు ఈ సిరీస్ తర్వాత అందరూ నా గురించి మాట్లాడుకునేలా చేశా’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. లయన్, అలీలతో పోలుస్తూ తనను మరీ ‘మైక్రోస్కోప్’ కింద ఉంచి పరీక్షించారని అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశాడు. గత ఆస్ట్రేలియా సిరీస్‌లో అశ్విన్‌కంటే లయన్ ప్రదర్శన బాగుండగా... 2018 సౌతాంప్టన్ టెస్టులో అలీ వికెట్లు తీసిన చోట అశ్విన్ విఫలం కావడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ‘లయన్గానీ అలీగానీ సరిగ్గా ఆఫ్ స్టంప్ బయట బంతులు వేస్తున్నప్పుడు కామెంటరీ బాక్స్ నుంచి వార్న్ వాటిని అద్భుతంగా వర్ణించినంత మాత్రాన నేను అలాగే బౌలింగ్ చేయాలని ఏమీ లేదు. వారు భారత బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేస్తున్నారనే విషయం మరచిపోవద్దు. నేను ఆస్ట్రేలియా లేదా ఇంగ్లండ్‌కు బౌలింగ్ చేస్తున్నాను. గత సిరీస్‌లో అడిలైడ్‌లో నా పొత్తికడుపులో గాయమైనా సరే పట్టుదలగా ఆడి ఆరు వికెట్లు తీశాను. కానీ మ్యాచ్ ముగిశాక నాకంటే లయన్ ఎంత బాగా బౌలింగ్ చేశాడో అందరూ చెప్పుకున్నారు. ఇంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడటం నన్ను చాలా బాధించింది. లయన్ మంచి బౌలరే. అతనంటే నాకు గౌరవం ఉంది. కానీ నా ఆలోచనలు వేరు. ఇకపై లయన్‌తో పోటీ పడటంకంటే స్మిత్‌తో తలపడటం ముఖ్యమని అర్థం చేసుకున్నా’ అని అశ్విన్ వివరించాడు. అర మీసంతో ఆడతా! సహచరుడు పుజారాకు అశ్విన్ సరదాగా సవాల్ విసిరాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మొయిన్ అలీతో పాటు మరే స్పిన్నర్ బౌలింగ్‌లోనైనా పుజారా పిచ్‌పై ముందుకు దూసుకొచ్చి బౌలర్ తల మీదుగా భారీ షాట్ ఆడితే తాను సగం మీసం తీసేస్తానని... అలాగే మైదానంలో మ్యాచ్ ఆడతానని అశ్విన్ వ్యాఖ్యానించాడు. -
టి20 ప్రపంచకప్ వాయిదా?
మెల్బోర్న్: కరోనా తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టి20 ప్రపంచకప్ వాయిదా పడనుందనే ఊహాగానాలు నిజమయ్యేలా ఉన్నాయి. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం సన్నద్ధమవ్వాలంటూ ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఆదేశాలు వచ్చినట్లు స్థానిక మీడియా ప్రకటించడంతో ఈ వార్తలకు మరింత ఊతం లభించినట్లయింది. ఆసీస్ మీడియా కథనాల ప్రకారం లాజిస్టిక్ సమస్యల కారణంగా అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరగాల్సిన ఈ మెగా ఈవెంట్ వాయిదా వేసేందుకు ఐసీసీ సిద్ధమైందని... వారంలోపు దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో అక్టోబర్–నవంబర్ సమయాన్ని ఐపీఎల్ కోసం కేటాయించే అవకాశముంది. ‘టి20 వరల్డ్‌కప్ వాయిదాపై ఈ వారంలో అధికారిక ప్రకటన రానుంది. ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం సిద్ధమవ్వాలని ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెటర్లకు సమాచారం ఇచ్చారు. కానీ సిరీస్ గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇంగ్లండ్‌తో సిరీస్ తర్వాత నేరుగా అక్కడి నుంచే ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్ కోసం భారత్ చేరుకుంటారు’ అని మీడియాలో వార్తలు వచ్చాయి. -
‘అందుకే విశ్రాంతి తీసుకున్నా’
రాజ్‌కోట్: ప్రత్యర్థి బౌలర్లకు దొరకని సమాధానంగా మారాడు. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ప్రస్తుతమున్న ఏ ఇతర బ్యాట్స్‌మన్ రాణించని చోట ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నాడు. ఈ ఘనతలన్నీ పరుగుల యంత్రంగా పేరు తెచ్చుకున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లికి చెందుతాయి. ఇంగ్లండ్‌లో అసాధారణ రీతిలో చెలరేగి ఆడిన కోహ్లికి ఆసియా కప్ ముందు విమర్శల సెగ తగిలింది. యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్‌కు తాను ఆడనని, విశ్రాంతి అవసరమని తెలపడంతో క్రీడా పండితులు విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ విషయంపై ప్రధాన కోచ్ రవిశాస్త్రి వివరణ ఇవ్వగా, తాజాగా విరాట్ కోహ్లి స్పందించాడు. (కోహ్లిని ఎద్దుతో పోల్చిన రవిశాస్త్రి) ‘ఇంగ్లండ్‌తో సిరీస్ అనంతరం శారీరకంగా, మానసికంగా బాగా అలసిపోయాను. అందుకే తప్పనిసరిగా విశ్రాంతి కావాలని సెలక్టర్లను అడిగా. వారు నా పరిస్థితి అర్థం చేసుకొని ఆసియాకప్‌కు విశ్రాంతినిచ్చారు. అంతేకాని ఆసియ కప్ మీద చిన్నచూపు కాదు. విశ్రాంతి అనంతరం కొత్త శక్తి, ఉత్సాహం, పునరుత్తేజం లభిస్తుంది ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే ఆటగాడు అలసిపోతాడని అందరూ అనుకుంటారు. కానీ ఆ భావన తప్పు. ఆడిన మ్యాచ్‌ల్లో పరుగులు సాధించకపోతే ఆ ఆటగాడికి ఎలాంటి వర్క్‌లోడ్ ఉండదు. మ్యాచ్‌లు ఎక్కువ ఆడినంత మాత్రాన వర్క్‌లోడ్ అనిపించదు. బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో వర్క్‌లోడ్ ఎక్కువగా ఉంటే తొందరగా అలసిపోతాం. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో వర్క్‌లోడ్ ఎక్కువగా అనిపించింది’.అంటూ విరాట్ కోహ్లి విశ్రాంతి గురించి వివరణ ఇచ్చాడు. ఇక కోహ్లి గైర్హాజర్‌తో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఏడో సారి ఆసియాకప్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: కోహ్లి ఒంటిపై ఉన్న టాటూలు ఏంటో తెలుసా? కోహ్లికి రెస్ట్.. రోహిత్‌కు పగ్గాలు -
ఆ వార్తలు ఎక్కడా వాడకండి : గంగూలీ
సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు అకౌంట్ లేదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. ‘నా పేరిట ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నకిలీది. ఆ అకౌంట్ నుంచి పోస్ట్ అయిన వార్తలు గానీ, కోట్స్ గానీ దయచేసి ఎక్కడా వాడకండి. ఇన్స్టాగ్రామ్ టీమ్‌కి ఈ విషయం గురించి వెంటనే రిపోర్టు చేస్తానంటూ’ దాదా ట్వీట్ చేశాడు. sganguly99 అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి వచ్చిన పోస్టుల ఆధారంగా.. ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో టీమిండియా బ్యాటింగ్‌ను, కెప్టెన్ కోహ్లిని విమర్శిస్తూ గంగూలీ వ్యాఖ్యలు చేశాడంటూ పలు మీడియా చానళ్లలో వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ అకౌంట్ నకిలీదని గంగూలీ వివరణ ఇచ్చాడు. ఆ పోస్టుల్లో ఏముందంటే... ‘టెస్టు మ్యాచ్ గెలవాలంటే ప్రతీ ఒక్కరూ పరుగులు చేయాల్సి ఉంటుంది. కోహ్లి బాగా ఆడకపోయి ఉంటే రెండో రోజే టీమిండియా ఇన్నింగ్స్‌కు ముగింపు పడేది. కెప్టెన్‌గా ఉన్న కారణంగా నువ్వు(కోహ్లి) విమర్శలు ఎదుర్కోక తప్పదు. విజయం వరించినపుడు ఆనందించడమే కాదు అపజయాన్ని కూడా స్వీకరించాలంటూ’ కోహ్లిని ట్యాగ్ చేస్తూ దాదా పేరిట ఉన్న అకౌంట్ నుంచి వచ్చిన పలు పోస్టులు వైరల్ అయ్యాయి. కాగా ఇప్పటికే ఆ అకౌంట్‌కు 55.3 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. My Instagram page is a fake one ..please don’t pick up any news or quotes from it ..Will report to Instagram immediately @samiprajguru @imVkohli — Sourav Ganguly (@SGanguly99) August 6, 2018 -
కోహ్లి ‘డబుల్’ ధమాకా
బర్మింగ్‌హామ్: టీమిండియా కెప్టెన్, డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి ఖాతాలో మరో రెండు రికార్డులు వచ్చి పడ్డాయి. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఈ డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ 200 పరుగులు సాధించాడు.(149, 51).. తద్వారా టెస్టుల్లో ఎక్కువసార్లు ఒక మ్యాచ్‌లో 200 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు ఇంగ్లండ్‌పై ఒక టెస్టులో అత్యధిక పరుగులు (200) సాధించిన రెండో టీమిండియా కెప్టెన్‌గా నిలిచాడు. గతంలో ఈ ఘనత ఎంఏకే పటౌడీ 212(64,148) (1967, లీడ్స్ టెస్ట్‌లో) సాధించారు. ఇక వ్యక్తిగతంగా 200 పరుగులు ఎక్కువ సార్లు చేసిన టీమిండియా ఆటగాడిగానూ కోహ్లి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కోహ్లి 11 సార్లు ఈ ఘనత సాధిస్తే.. ద్రవిడ్, సచిన్‌లు ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. వీరేంద్ర సెహ్వాగ్, గావస్కర్, వీవీఎస్ లక్ష్మణ్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఓటమిలోనూ... కోహ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సెంచరీలు చేసిన ఐదు టెస్ట్‌ల్లో జట్టు ఓటమిపాలైంది. తద్వారా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రెయిన్ లారా కెప్టెన్‌గా నమోదు చేసిన చెత్త రికార్డు(ఐదు టెస్టుల్లోనూ)ను ఇప్పుడు కోహ్లి సమం చేశాడు. ఓటమిపాలైన మ్యాచుల్లో సెంచరీలు చేసిన కెప్టెన్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా(4 సెంచరీలు) తర్వాతి స్థానంలో ఉన్నారు. -
వైరల్ : విరుష్కల సెల్ఫీ
నాటింగ్‌హామ్ : సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనలో తొలి అంకాన్ని పూర్తి చేసిన కోహ్లి ఆండ్ గ్యాంగ్ కాస్త ఖళీ సమయం దొరకడంతో సేద తీరుతోంది. వన్డే సిరీస్ ప్రారంభమయ్యే ముందు టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లండ్ వీధుల్లో విహరించారు. ఇక ధోని, కోహ్లిలు వారివారి సతీమణులతో కలిసి ఎంజాయ్ చేశారు. ఆదివారం జరిగిన మూడో టీ20లో అనుష్క శర్మ, సాక్షి చేసిన హడావుడి.. విజయానంతరం కోహ్లి తన సతీమణికిచ్చిన ఫ్లైయింగ్ కిస్.. మ్యాచ్ అనంతరం అనుష్క కోహ్లిని కౌగిలించుకోవడం, వీటికి సంబంధించిన ఫోటోలో, వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ తరుణంలోని మరో సెల్ఫీ వైరల్ అవుతోంది. ఈ సారి కోహ్లి వంతు.. అనుష్క- కోహ్లి జోడి సోషల్ మీడియాలో ఆక్టీవ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. వారికి సంబంధించిన ప్రతీ విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఈ జంట ఇంగ్లండ్‌లో ఎంజాయ్ చేస్తూ షేర్ చేసిన సెల్ఫీ ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది. అనుష్క కోహ్లికి ముద్దుపెట్టిన సెల్ఫీని ‘డే ఔట్ విత్ మై బ్యూటీ’ అంటూ కోహ్లీనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోకు క్షణాల్లోనే లక్షల లైక్‌లు లభించాయి. అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఇక వరుస విజయాలతో దూసుకపోతున్న ఈ జంట చిరకాలం సంతోషంగా ఉండాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. Day out with my beauty! 🤩♥️ A post shared by Virat Kohli (@virat.kohli) on Jul 10, 2018 at 9:04am PDT -
సిరీస్ విజయంపై భారత్ గురి
డబ్లిన్: ఇంగ్లండ్‌తో ప్రధాన సిరీస్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో భారత జట్టు ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌లోనే తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. పసికూనలపై విరుచుకుపడి భారీ విజయం సొంతం చేసుకుంది. ఐర్లాండ్‌తో రెండు టి20ల సిరీస్ తొలి మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో గెలిచిన కోహ్లి సేన శుక్రవారం చివరిదైన రెండో టి20 ఆడనుంది. బుధవారం మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్, శిఖర్ ధావన్ చెలరేగడంతో భారత్ భారీ స్కోరు చేసింది. ఆపై స్పిన్నర్లు కుల్దీప్, చహల్ విజృంభించడంతో ఐర్లాండ్ కోలుకోలేకపోయింది. ఇదే ఊపులో రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ గెలుచుకోవాలని కోహ్లి సేన పట్టుదలగా ఉంది. మార్పులకు వేళాయె.... సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లో ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. మూడు నెలల సుదీర్ఘ పర్యటన కావడంతో రిజర్వ్ బెంచ్ సత్తాను పరీక్షించుకునేందుకు టీమిండియాకు ఇది చక్కటి అవకాశం. గత మ్యాచ్‌లో బరిలో దిగిన సురేశ్ రైనా, మనీశ్ పాండేల స్థానంలో కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్‌లను ఆడించవచ్చని సమాచారం. విజయవంతమైన స్పిన్ ద్వయం చహల్–కుల్దీప్లకు ఢోకా లేకున్నా... పేసర్లు భువనేశ్వర్, బుమ్రాల స్థానాల్లో ఉమేశ్, సిద్ధార్థ్ కౌల్‌లకు చోటు దక్కవచ్చు. ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలో దిగాలనుకుంటే పాండ్యానూ పక్కన పెట్టొచ్చు. మిడిలార్డర్లో భారీ మార్పులు తథ్యమన్న కెప్టెన్ విరాట్ కోహ్లి మాటలను బట్టి చూస్తే... ఓపెనర్లు రోహిత్, ధావన్, కెప్టెన్ కోహ్లి, కీపర్ ధోని, స్పిన్నర్లు కుల్దీప్, చహల్‌లు జట్టుతో ఉంటారు. మిగతా ఐదు స్థానాల్లో కొత్తవారు బరిలో దిగొచ్చు. తొలి మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ... ‘మిడిలార్డర్లో మార్పులు చేయనున్నాం. ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్‌లో ఆడని వారు శుక్రవారం బరిలో దిగుతారు’ అని అన్నాడు. ఈ సారైనా పోటీనిస్తుందా... ఓ వైపు టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్‌లో పటిష్టంగా కనిపిస్తుంటే... మరోవైపు ఐర్లాండ్ జట్టు అన్ని రంగాల్లో తడబడుతోంది. పెద్ద జట్లతో ఆడిన అనుభవంలేని ఆ జట్టు బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో మెరుగుపడాల్సి ఉంది. తొలిమ్యాచ్‌లో చెలరేగిన షెనాన్తో పాటు విల్సన్, పోర్టర్ ఫీల్డ్, కెవిన్ ఓబ్రైన్ బ్యాటింగ్‌లో సత్తా చాటాల్సి ఉంది. -
డీఆర్ఎస్ కోచ్ కావలెను!
పుణే టెస్టులో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో భారత జట్టు నాలుగు సార్లు ‘రివ్యూ’ను ఉపయోగించుకుంది. నాలుగు సార్లూ ఫలితం మనకు ప్రతికూలంగానే వచ్చింది. అదే ఆస్ట్రేలియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఒకే ఒక్కసారి రివ్యూ కోరింది. దానికి ఫలితం పొందడంలో సఫలమైంది. భారత్ బ్యాటింగ్ సమయంలో మూడింటిలో ఒకదాంట్లో మాత్రం విజయవంతమైంది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో జయంత్ బౌలింగ్‌లో మూడు బంతుల వ్యవధిలో రెండు సార్లు విఫల రివ్యూ కోరి భారత్ వాటిని కోల్పోయింది. కొద్దిసేపటి తర్వాత జడేజా బౌలింగ్‌లో స్మిత్ కచ్చితంగా అవుటయ్యే అవకాశం ఉన్నా... రివ్యూలు లేకపోవడంతో ఏమీ చేయలేకపోయింది. భారీ లక్ష్య ఛేదన... సుదీర్ఘ ఇన్నింగ్స్‌లో రివ్యూ అవసరం మున్ముందు కూడా రావచ్చని భారత ఓపెనర్లు భావించలేదు. రివ్యూ జట్టు కోసం కాదు తమ కోసం అన్నట్లుగా విజయ్, రాహుల్ ప్రవర్తించారు. అవుట్ అయ్యే అవకాశం ఉందని అర్థమవుతున్నా అంపైర్ ఎల్బీ అని ప్రకటించగానే వీరిద్దరు నిర్లక్ష్యంగా రివ్యూ కోరారు. ఉన్న రెండు రివ్యూలు కూడా ఐదు బంతుల వ్యవధిలో వృథా అయిపోవడంతో ఆ తర్వాత సాహా, పుజారా అవుట్ల సమయంలో కనీసం ఆలోచించాల్సిన అవసరం కూడా లేకపోయింది. మన బ్యాటింగ్ వైఫల్యంతో ఇది పెద్దగా కనపడలేదు కానీ డీఆర్ఎస్ కోరడంలో మనం ఇంకా ఎంత వెనుకబడి ఉన్నామనేది మాత్రం అర్థమైపోయింది. సాక్షి క్రీడా విభాగం : దాదాపు ఎనిమిదేళ్ల పాటు భారత్ అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్ఎస్)ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఎట్టకేలకు గత ఇంగ్లండ్ సిరీస్ నుంచే దీనిని వాడేందుకు అంగీకారం తెలిపింది. ఇంగ్లండ్ సిరీస్‌లోనే మన డీఆర్ఎస్ సమస్యలు బయటపడినా... ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో పరిస్థితి మరీ ఇబ్బందికరంగా కనిపించింది. తుది ఫలితం చూస్తే ఇంతకంటే డీఆర్ఎస్ లేని రోజులే బాగున్నాయి అన్నట్లుగా టీమిండియాకు అనిపిస్తూ ఉంటుంది. టెస్టు క్రికెటర్ అయి ఉండీ కనీస అవగాహన, అంచనా లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్లు మనోళ్లు సమీక్ష కోరడం జట్టు పరంగా చూస్తే పెద్ద తప్పే. చివరి ఇన్నింగ్స్‌లో కోహ్లి తొందరగానే నిష్క్రమించాడు గానీ నిజంగానే అతను సమీక్షలో బయటపడగలిగే పరిస్థితి వచ్చి రివ్యూ అందుబాటులో లేకపోతే నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ పరిస్థితి ఎలా ఉంటుంది? ‘ఏమో మన అదృష్టం పరీక్షించుకుందాం అని ప్రయత్నం చేయడం జట్టు ప్రయోజనాలను పణంగా పెట్టడమే. భారత్ డీఆర్ఎస్ వాడటంలో చాలా మెరుగుపడాలి’ అని స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అభిప్రాయపడ్డారు. ‘రివ్యూల విషయంలో భారత్ నన్ను షాక్‌కు గురి చేసింది. చివరి ఇన్నింగ్స్‌లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అసలు రాహుల్ దానికి ఎలా రివ్యూ కోరాడు’ అని రవిశాస్త్రి విమర్శించారు. ఇక రివ్యూ లేకపోవడంతో బతికిపోయిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వ్యాఖ్య కూడా పుండు మీద కారం చల్లేలా ఉంది. ‘భారత జట్టులో ఇద్దరు బ్యాట్స్‌మెన్ అంత తొందరగా రివ్యూ వాడుకోవడం మా అదృష్టం. ఇలాంటి వికెట్‌పై కచ్చితంగా రివ్యూ అవసరం పడుతుంది. కనీసం ఒకదానిని భద్రంగా దాచుకుంటేనే మంచిది’ అని స్మిత్ అన్నాడు. నేర్చుకోవాల్సిన సమయం... టెస్టు కెప్టెన్‌గా ఇప్పటికే ఘనమైన రికార్డుతో ఉన్న కోహ్లి డీఆర్ఎస్ విషయంలో మాత్రం తప్పటడుగులు వేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా బౌలింగ్/ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కోహ్లి పూర్తిగా అంచనాలు తప్పుతున్నాడు. ఫీల్డింగ్ కెప్టెన్‌గా అతను ఇప్పటి వరకు 39 సార్లు రివ్యూ కోరగా 30 సార్లు ఫలితం భారత్‌కు ప్రతికూలంగా రావడం ఈ విషయాన్ని సూచిస్తోంది. తన స్పిన్నర్లు, కీపర్ సాహా మీద అతను చూపిస్తున్న అపార నమ్మకం ఫలితాన్నివ్వడం లేదు. ఎందుకంటే అశ్విన్, జడేజాల బౌలింగ్‌లో 24 సార్లు రివ్యూ కోరితే 18 సార్లు మనదే తప్పని తేలింది! సమీక్ష కోరితే కచ్చితంగా మన వైపే వస్తుందనే హామీ అయితే ఎవరూ ఇవ్వలేరు కానీ మ్యాచ్ గమనాన్ని బట్టి దానిని సమర్థంగా వాడుకోవడం కూడా కీలకం. విజయ్, రాహుల్ నిర్ణయం పట్ల కోహ్లి కచ్చితంగా తీవ్ర కోపానికి గురయ్యే ఉంటాడని ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. వాస్తవానికి సాధ్యమైనంతగా అంపైర్ పొరపాట్లను తగ్గించి సరైన నిర్ణయం వెలువరించడమే డీఆర్ఎస్ ప్రధాన ఉద్దేశం. కానీ ఆటగాళ్లకు రివ్యూ కోరే అవకాశం ఇవ్వడంతో అంతా గందరగోళంగా మారుతోంది. ఇంతకంటే మెరుగైన పద్ధతి గురించి ఐసీసీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇది ఇలాగే కొనసాగితే భారత జట్టుకు ప్రాక్టీస్‌తో పాటు ప్రత్యేకంగా డీఆర్ఎస్ అవగాహనా తరగతులు కూడా నిర్వహించాల్సిన అవసరం వస్తుందేమో! -
ఆ రెండు కారణాల వల్లే యువీకి..
ముంబై: ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు, మూడు టి-20ల సిరీస్‌లకు భారత జట్టు ఎంపికలో విశేషమేంటంటే ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పునరాగమనం. మూడేళ్ల విరామం తర్వాత వన్డే జట్టులో చోటు సంపాదించాడు. ఇటీవల పెళ్లి చేసుకున్న యువీ సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ జట్టులోకి రావడానికి కారణమేంటంటే అతని ఇటీవలి ప్రదర్శనే. రంజీ ట్రోఫీలో రాణించడం ద్వారా భారత సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. అంతేగాక ఇంగ్లండ్‌పై ఈ డాషింగ్ ఆల్‌రౌండర్‌కు మెరుగైన రికార్డు ఉండటం కూడా కలసి వచ్చింది. 2016-17 రంజీ సీజన్లో యువీ అద్భుతంగా ఆడాడు. పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించిన యువీ ఐదు మ్యాచ్‌లలో 84 సగటుతో 672 పరుగులు చేశాడు. ఓ డబుల్ సెంచరీ కూడా చేశాడు. ఢిల్లీలో బరోడాతో జరిగిన మ్యాచ్‌లో యువీ 26 ఫోర్లు, 4 సిక్సర్లతో 260 పరుగులు చేశాడు. అతను మళ్లీ టీమిండియాలో చోటు సంపాదించడానికి ఈ ప్రదర్శన ఉపయోగపడింది. ఇక ఇంగ్లండ్‌పై అతనికి మంచి రికార్డు ఉంది. ఆ జట్టుపై మొత్తం 34 వన్డేలాడిన యువీ 48.62 సగటుతో 1313 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. -
కరుణ్ నాయర్‌కు చాన్స్!
ధావన్ తిరిగి వచ్చే అవకాశం ఇంగ్లండ్‌తో సిరీస్‌కు నేడు వన్డే, టి20 జట్ల ప్రకటన ముంబై: మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీనుంచి తప్పుకున్న తర్వాత పూర్తి స్థాయిలో విరాట్ కోహ్లి భారత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడం లాంఛనంగా మారింది. ఇంగ్లండ్‌తో జరిగే వన్డే, టి20 సిరీస్ కోసం జట్టును ప్రకటించనున్న సెలక్టర్లు కెప్టెన్‌గా కోహ్లి పేరును ప్రకటిస్తారు. జట్టు ఎంపిక సమయంలో కోహ్లి కూడా సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఆటగాడిగా ధోని తన స్థానం నిలబెట్టుకోవడంపై కూడా ఎలాంటి సందేహాలు లేవు. భారత్, ఇంగ్లండ్ మధ్య 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నెల 15న తొలి వన్డే కాగా, ఫిబ్రవరి 1న చివరి టి20తో సిరీస్ ముగుస్తుంది. అశ్విన్‌కు విశ్రాంతి! భారత జట్టు న్యూజిలాండ్‌తో ఆడిన వన్డే సిరీస్‌కు అశ్విన్, షమీ, జడేజా దూరంగా ఉన్నారు. వీరిలో షమీ ప్రస్తుతం గాయంనుంచి కోలుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో కీలకమైన టెస్టుల సిరీస్ కోసం అశ్విన్‌కు మళ్లీ విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అయితే టెస్టుల తర్వాత తగినంత విశ్రాంతి లభించడంతో జడేజా మాత్రం తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతడిని తీసుకోకపోతే రంజీ సీజన్లో అత్యధిక వికెట్లతో (56) సత్తా చాటిన లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ పేరు కూడా ఎంపిక కోసం వినిపిస్తోంది. వైజాగ్‌లో జరిగిన తన ఆఖరి వన్డేలో చెలరేగిన మిశ్రాకు చోటు ఖాయం. పేస్ బౌలింగ్‌పరంగా కూడా కొత్త ప్రయోగాలకు ఆస్కారం ఏమీ లేదు. బుమ్రా, ఉమేశ్‌లు జట్టులో స్థానం నిలబెట్టుకుంటారు. అయితే షమీ, ధావల్ కూడా గాయాలబారిన పడటంతో ఇషాంత్‌కు మళ్లీ వన్డేలు ఆడే అవకాశం దక్కవచ్చు. బ్యాటింగ్‌లో ఇంకా రోహిత్ శర్మ, రహానే కోలుకోలేదు. కాబట్టి చెన్నై టెస్టులో ట్రిపుల్‌తో దుమ్ము రేపిన కరుణ్ నాయర్ వన్డే జట్టులోకీ ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది. గతంలో అతను జింబాబ్వేతో మ్యాచ్ ఆడాడు. కివీస్‌తో సిరీస్ ఆడని కేఎల్ రాహుల్ పునరాగమనం చేస్తాడు. జయంత్ యాదవ్ కూడా తన స్థానం నిలబెట్టుకోనున్నాడు. మరో వైపు రెండో ఓపెనర్‌గా పూర్తి ఫిట్‌గా ఉంటే శిఖర్ ధావన్ జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. రైనా పేరును కేవలం టి20ల కోసం పరిశీలించవచ్చని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే మన జట్టు ఇటీవల చెలరేగుతున్న తీరు చూస్తే ఇరు జట్ల ఎంపికలో కూడా పెద్దగా సంచలనాలు ఏమీ ఉండకపోవచ్చు. -
ధోనీ సేనకు ఎదురుదెబ్బ!
ముంబై: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా దుమ్మురేపింది. విరాట్ కోహ్లీ సేన 4-0తో సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వచ్చేసరికి భారత జట్టుకు గాయాలు వెంటాడుతున్నాయి. ఇంగ్లీష్ మెన్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందే మహేంద్ర సింగ్ ధోనీ గ్యాంగ్‌కు ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. యువ ఆటగాళ్లు అక్షర్ పటేల్, జయంత్ యాదవ్ గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ బొటనివేలి గాయంతో బాధపడుతున్నాడు. చెన్నై టెస్టులో అక్షర్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఇక ఇదే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన జయంత్ యాదవ్ తొండకండరాల నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో వీరిద్దరూ ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆడే అవకాశాలు తక్కువ. వచ్చే జనవరి 5 లేదా 6 తేదీల్లో భారత సెలెక్టర్లు జట్టును ప్రకటిస్తారు. భారత్, ఇంగ్లండ్ తొలి వన్డే జనవరి 15న పుణెలో జరగనుంది. -
కోలుకున్న రాహుల్
ముంబై టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి ముంబై: చేతి వేలి గాయం నుంచి కోలుకున్న ఓపెనర్ లోకేశ్ రాహుల్ ఈనెల 8న ఇంగ్లండ్‌తో మొదలయ్యే నాలుగో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. మరో ఓపెనర్ మురళీ విజయ్‌తో కలిసి అతను ఇన్నింగ్‌సను ప్రారంభిస్తాడు. సిరీస్‌లో తొలి రెండు టెస్టులు ఆడిన రాహుల్ వరుసగా 32, 38, 0, 10 పరుగులు చేసి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే వైజాగ్ టెస్టు సందర్భంగా చేతి వేలికి గాయం కావడంతో ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ మొహాలీ టెస్టుకు దూరమయ్యాడు. ఈ ఏడాది విశేషంగా రాణించిన రాహుల్ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మాత్రం తనస్థారుుకి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ముంబై టెస్టులో మంచి ఇన్నింగ్సతో రాణించి రాహుల్ ఫామ్‌లోకి రావాలని పట్టుదలతో ఉన్నాడు. రాహుల్ అందుబాటులో లేకపోవడంతో మొహాలీ టెస్టులో వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ ఇన్నింగ్‌సను ప్రారంభించాడు. రాహుల్ రాకతో పార్థివ్ ముంబై టెస్టులో మిడిల్ ఆర్డర్లో ఆడతాడు. -
టెస్టు కోసం నిధులు ఇచ్చుకోండి
బీసీసీఐకి సుప్రీం కోర్టు అనుమతి న్యూఢిల్లీ: ఇంగ్లండ్ జట్టుతో రాజ్‌కోట్‌లో జరగబోయే తొలి టెస్టుకు నిధుల కొరత తీరింది. ఈ మ్యాచ్ నిర్వహణ కోసం సౌరాష్ట్ర క్రికెట్ సంఘానికి నిధులను విడుదల చేసేందుకు అంగీకరించాలని బీసీసీఐ మంగళవారం సుప్రీం కోర్టును అభ్యర్థించింది. లేకుంటే టెస్టు రద్దయ్యే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రూ.58.66 లక్షల నిధులు విడుదల చేసేందుకు బీసీసీఐకి అనుమతించింది. డిసెంబర్ 3 వరకు జరిగే ఈ సిరీస్‌లో ఇతర మ్యాచ్‌ల కోసం కూడా ఇంతే మొత్తాన్ని ఖర్చు చేసుకునేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ అనుమతిచ్చింది. అయితే ఈ నిధులను ఆటగాళ్ల అలవెన్స, ఇన్సూరెన్స ఖర్చులకు, మూడో అంపైర్‌కు చెల్లింపు కోసం మాత్రమే ఖర్చు పెట్టాలని, సౌరాష్ట్ర క్రికెట్ సంఘానికి మాత్రం కాదని పేర్కొంది. -
గంభీర్, ఇషాంత్‌కు ఛాన్స్ దక్కేనా?
ముంబై: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సీనియర్ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, ఇషాంత్ శర్మలకు భారత జట్టులో చోటు దక్కే అవకాశముంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ బుధవారం సమావేశమవుతోంది. చాలాకాలం జట్టుకు దూరంగా ఉన్న ఓపెనర్ గంభీర్‌కు ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఆడే అవకాశం వచ్చింది. ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో గౌతీ హాఫ్ సెంచరీ చేశాడు. ఇక రంజీ ట్రోఫీలోనూ ఢిల్లీ జట్టు తరఫున సెంచరీ (147)తో ఆకట్టుకున్నాడు. ఇక ఇషాంత్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపికైనా అనారోగ్యం కారణంగా ఆడలేకపోయాడు. ప్రస్తుతం కోలుకున్నందున జట్టులో చోటు లభించే అవకాశముంది. ఈ నెల 9 నుంచి భారత్, ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. -
సచిన్ పేరు మార్మోగిన వేళ..
► ఇంగ్లండ్ పర్యటనతో వెలుగులోకి సచిన్ ► నేటితో తొలి సెంచరీ చేసి 26 ఏళ్లు న్యూఢిల్లీ: వన్డే క్రికెట్ వరల్డ్ కప్-1983 గెలిచిన తర్వాత భారత్‌లో ఆటపై మక్కువ కాస్త పెరిగిన మాట వాస్తవమే.. కానీ క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆట చూసిన తర్వాత నుంచి ఎంతో మంది క్రికెట్ పై ఆసక్తి పెంచుకుని బ్యాట్ పట్టారు. 16 ఏళ్ల వయసులో 1989లో టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేసిన సచిన్ పాకిస్తాన్ పై 93, న్యూజీలాండ్ పై 88 పరుగులు చేసి తనలో ప్రతిభ ఉందని చాటిచెప్పాడు. ఉపఖండం బయట తాను ఆడిన రెండో టెస్టు సిరీస్ తో వెలుగులోకి సచిన్ వచ్చాడు. 1990లో ఇంగ్లండ్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు లార్డ్స్ లో 247 పరుగుల తేడాతో భారత్ దారుణ ఓటమి చవిచూసింది. ఆ తర్వాత మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ దాదాపు అదే పరిస్థితి..407 పరుగుల లక్ష్యంతో అజహరుద్దీన్ నేతృత్వంలో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన టీమిండియా 127 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో చిచ్చరపిడుగు సచిన్ క్రీజులోకొచ్చాడు. మరోసారి దారుణ ఓటమి తప్పేలా లేదని భావించిన టీమిండియా సచిన్ అజేయ సెంచరీ(119 నాటౌట్, 17 ఫోర్లు) సహాయంతో 6 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసి టెస్టు డ్రాతో గట్టెక్కిన విషయం తెలిసిందే. 51 టెస్టు సెంచరీలు సాధించిన సచిన్‌కు జట్టును ఓటమి నుంచి తప్పించిన తొలి టెస్టు శతకం ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి. నేటితో ఆ ఇన్నింగ్స్(సచిన్ తొలి సెంచరీ) 26 ఏళ్లు(ఆగస్టు 1990) పూర్తి చేసుకుంది. అప్పటి నుంచి రిటైరయ్యే వరకూ తన ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను సచిన్ చేరుకున్నాడు. -
కోహ్లి మారలేడా!
లక్ష్యం ఎంతున్నా కోహ్లి జట్టులో ఉన్నాడంటే భారత్‌కు ఎప్పుడైనా గెలుపుపై భరోసా ఉంటుంది. తను 19 సెంచరీలు చేస్తే 17 సార్లు భారత్ గెలిచింది. అలాంటి కోహ్లి బ్యాట్ ఇప్పుడు మొండికేస్తోంది. ఒక్కో పరుగు కోసం ఈ నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ తంటాలు పడుతున్నాడు. ఆ ప్రభావం జట్టుపై కూడా పడుతోంది. అన్నింటికి మించి అతను అవుటవుతున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇన్నాళ్లుగా విజయానికి చిరునామాగా మారిన విరాట్ పదే పదే అవే తప్పులతో పెవిలియన్ చేరుతున్నాడు. మరి దీనికి పరిష్కారం లేదా! * పదే పదే అవే తప్పులు * వరుసగా విఫలమవుతున్న స్టార్ బ్యాట్స్‌మన్ * ఏడు నెలల పాటు అర్ధ సెంచరీ లేదు * సాంకేతిక సమస్యతో ఇబ్బందులు సాక్షి క్రీడా విభాగం: ఇంగ్లండ్ సిరీస్‌లో కోహ్లి అవుటైన దృశ్యాలు చూస్తే అవి ఏ మ్యాచ్వో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే అచ్చుగుద్దినట్లు అవన్నీ ఒకలాగే కనిపిస్తాయి. ఆఫ్‌స్టంప్‌పై వచ్చిన బంతిని శరీరానికి దూరంగా బ్యాట్ ఉంచి ఆడబోయి స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చిన రీప్లేలు లెక్కలేనన్ని సార్లు వచ్చాయి. ఇంగ్లండ్ పరిస్థితుల్లో స్వింగ్ అయ్యే బంతి కాబట్టి అలా జరిగిందేమో అనుకోవచ్చు. కానీ భారత గడ్డపై కూడా అదే తరహాలో అవుటైతే ఏమనాలి. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై కోహ్లి సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఏడు నెలల్లో ఏడు ఇన్నింగ్స్‌లలో అతను ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. 2009నుంచి భారత జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారాక కోహ్లి ఇంత పేలవంగా ఎప్పుడూ ఆడలేదు. 139 వన్డేల తర్వాత కూడా అతను ఇప్పటికీ 50 సగటు కొనసాగిస్తున్నాడు. అయితే తాజా ప్రదర్శన మాత్రం ఆందోళన రేకెత్తిస్తోంది. టెక్నిక్ సమస్య ఇంగ్లండ్‌లో వైఫల్యం తర్వాత కోహ్లి... సచిన్ టెండూల్కర్‌ను కలిసి సలహాలు తీసుకున్నాడు. ఆ తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీలోనూ తీవ్ర సాధన చేశాడు. కానీ అండర్సన్ బదులు టేలర్ బౌలింగ్‌లో అవుట్ కావడం మినహా కోహ్లి ఆటలో వచ్చిన మార్పేమిటో కొచ్చిలో మాత్రం కనిపించలేదు. అదే షాట్... అదే స్లిప్... అదే తరహాలో అవుట్! ‘కోహ్లి సమస్య మానసికమైంది కాదు. అది టెక్నికల్ లోపంగా చెప్పవచ్చు. అతను బ్యాట్ పట్టుకునే యాంగిల్ కారణంగానే ఒకే తరహాలో అవుటవుతున్నాడు. దీనిని కోహ్లి స్వయంగా సరిదిద్దుకోవాలి’ అని తొలి వన్డే అనంతరం మాజీ ఆటగాడు మైకేల్ హోల్డింగ్ విశ్లేషించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కోహ్లి మళ్లీ ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. స్థానం మారతాడా! మరో వైపు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు కోహ్లి సమస్యను దూరం చేయవచ్చని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయ పడ్డారు. ఆఫ్‌స్టంప్‌పై పడి బయటికి వెళుతున్న కొత్త బంతులతోనే విరాట్‌కు సమస్య వస్తోందని, మిడిలార్డర్లో ఆడితే ఆ ఇబ్బంది తప్పుతుందని ఆయన అన్నారు. ‘వరుసగా సెంచరీలు కొట్టిన ఆటగాడు ఇప్పుడు 10-20 పరుగులు చేయలేకపోవడం ఆందోళన కలిగించే విషయమే. కొత్త బంతితో అతని లోపాలు మరీ బయట పడిపోతున్నాయి. కాబట్టి కొన్ని మ్యాచ్‌లు అతను ఐదో స్థానంలో బరిలోకి దిగితే బాగుంటుంది. అప్పుడు పరుగులు చేయడంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది’ అని సన్నీ వ్యాఖ్యానించారు. డెరైక్టర్ ఏం చేయబోతున్నారు? వెస్టిండీస్‌తో సిరీస్‌లో కూడా కోహ్లి విఫలమైనా ఇప్పటికిప్పుడు జట్టుకు వచ్చిన సమస్య ఏమీ లేదు. జట్టులో అతని స్థానానికీ ఢోకా లేదు. అయితే దీని తర్వాత మనం ఆడబోయేది ఆస్ట్రేలియా గడ్డపైనే. ముక్కోణపు సిరీస్‌తో పాటు ఆ తర్వాత ప్రపంచకప్‌కు సన్నద్ధం కావాల్సి ఉంది. ఆలోగా కోహ్లి ఈ లోపాన్ని అధిగమించాలి. అందుకు మిగిలిన నాలుగు వన్డే మ్యాచ్‌లను ఉపయోగించుకోవాలి. లేదంటే ఇంగ్లండ్ తరహా వికెట్లను పోలి ఉండే ఆస్ట్రేలియాలో కూడా ఇదే సమస్య కొనసాగుతుంది. అప్పుడు మార్పులు చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి కూడా సమయం ఉండదు. ఇంగ్లండ్‌లో వన్డే సిరీస్ సమయంలో రైనా, రహానే, ధావన్...ఇలా ఎవరు బాగా ఆడినా తమ సక్సెస్నంతా టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రికి ఆపాదించారు. మరి శాస్త్రి... కోహ్లి విషయంలో ఏమీ చేయలేదా! భారత్ ప్రపంచ కప్ విజయావకాశాల్లో కోహ్లి ఎంత కీలకమో చెప్పనవసరం లేదు. అలాంటప్పుడు ఇప్పుడైనా కోహ్లి సమస్యను చక్కబెట్టేందుకు శాస్త్రి దృష్టి పెట్టాలేమో. కొత్త బంతితో కోహ్లి లోపాలు మరీ బయట పడిపోతున్నాయి. కాబట్టి కొన్ని మ్యాచ్‌లు అతను ఐదో స్థానంలో బరిలోకి దిగితే బాగుంటుంది. అప్పుడు పరుగులు చేయడంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది’ - గవాస్కర్ -
రవి'శాస్త్రీయం' గట్టెక్కిస్తుందా?
ఇంగ్లండ్ సిరీస్ లో ఘోర పరాజయంతో విమర్శకుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్న బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విదేశీ గడ్డపై దారుణ ఓటమికి భాద్యతగా కోచ్ డంకన్ ఫ్లెచర్, కెప్టెన్ ధోనిపై వేటు వేయాలని ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో రవిశాస్త్రిని రంగంలోకి దించింది. భారతజట్టుకు మరమత్తులు చేసేందుకు భారత మాజీ కెప్టెన్ రవిశాస్త్రిని డైరెక్టర్ గా పదవీ భాద్యతల్ని అప్పగించింది. విదేశీ గడ్డపై భారత జట్టు వైఫల్యాల బారిన పడినపుడు మన జట్టు కుదుటపడేలా రవిశాస్త్రికి బాధ్యతల్ని అప్పగించడం ఇది తొలిసారి కాదు. గతంలో 2007 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు తొలి దశలోనే ఇంటిదారి పట్టిన తర్వాత అప్పటి కోచ్ గ్రెగ్ చాపెల్‌పై బీసీసీఐ వేటు పడింది. ప్రపంచకప్ తర్వాత పాల్గొన్న బంగ్లా పర్యటనలో భారత జట్టుకు క్రికెట్ మేనేజర్‌గా శాస్త్రిని నియమించారు. ఇప్పుడు ధోని సేన వైఫల్యాల నేపథ్యంలో రవిశాస్త్రిని తెరమీదకు తీసుకువచ్చారు. క్లిష్ట సమయంలో భారత జట్టును గాడిన పెట్టేందుకు రవిశాస్త్రి డైరెక్టర్ గా భాద్యతల్ని భుజాన వేసుకున్నాడు. ఇంగ్లండ్ సిరీస్ లో టెస్ట్ లలో 1-3 తేడాతో ఓటమి పాలైన భారత జట్టు త్వరలో వన్డే, టీ20 మ్యాచ్ లను ఆడనుంది. చెత్త బ్యాటింగ్ తో నైతిక స్థైర్యం కోల్పోయిన భారత జట్టును రవిశాస్త్రి సరైన దారిలోకి తీసుకువస్తారా అనేది భారత క్రికెట్ అభిమానుల ముందున్న ప్రశ్న. అసిస్టెంట్ కోచ్‌లుగా వ్యవహరించనున్న సంజయ్ బంగర్, భరత్ అరుణ్‌ల సహకారంతో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో వైఫల్యాలను అధిగమించి భారత జట్టును గట్టేక్కిస్తుందా అనేది వేచి చూడాల్సిందే! -
నేటి నుంచి యాషెస్ నాలుగో టెస్టు
మధ్యాహ్నం గం.3.30 నుంచి స్టార్ క్రికెట్లో ప్రత్యక్ష ప్రసారం చెస్టర్ లీ స్ట్రీట్: వరుసగా రెండు పరాజయాలు... మూడో టెస్టులో కాస్త మెరుగైన ప్రదర్శనతో ‘డ్రా’తో గట్టెక్కిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు ప్రతిష్ట కోసం పాకులాడుతోంది. కనీసం యాషెస్‌లో చివరి రెండు టెస్టుల్లోనైనా గెలిచి పోయిన పరువును కాస్త అయిన కాపాడుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి చెస్టర్ లీ స్ట్రీట్‌లో ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. సిరీస్ డ్రా గా ముగిసినా కప్ రాదు కాబట్టి... ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సమం చేస్తే కంగారూల ప్రతిష్ట నిలబడుతుంది. దీని కోసం జట్టు మేనేజ్మెంట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఓపెనర్‌గా వాట్సన్ విఫలమవుతున్నా.. మాజీలు మాత్రం అతన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మిడిలార్డర్లో వార్నర్ ఇంకా గాడిలో పడకపోవడం ఆసీస్‌ను ఆందోళన పెడుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో అతన్ని ఓపెనర్‌గా ప్రమోట్ చేసే అవకాశం ఉంది. క్లార్క్‌పై మరోసారి బ్యాటింగ్ భారం పడనుంది. హాడిన్, స్టార్క్‌లు లోయర్ ఆర్డర్లో పరుగులు చేస్తుండం కలిసొచ్చే అంశం. వన్‌డౌన్‌లో ఉస్మాన్ ఖాజా స్థానంలో కొత్త వారికి అవకాశం దక్కొచ్చు. ఇక బౌలింగ్‌లో పేస్ త్రయం ప్రణాళికల మేరకు రాణిస్తున్నా.... స్పిన్నర్ లియోన్ కుదురుకోవాల్సి ఉంది. వాట్సన్ కూడా బౌలింగ్‌లో సత్తా చూపాల్సి ఉంది. మరోవైపు వరుస విజయాలతో ఊపుమీదున్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లోనూ జోరు కనబర్చాలని ప్రయత్నిస్తోంది. బౌలింగ్ విభాగంలో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది. పేసర్ గ్రాహం ఆనియన్స్‌కు అవకాశం దక్కొచ్చు. రూట్, ట్రాట్‌లు భారీ ఇన్నింగ్స్‌పై దృష్టిపెట్టారు. బెయిర్‌స్టో విఫలమవుతున్నా... ప్రయర్, బ్రాడ్ పరుగులు చేస్తుండటం జట్టుకు లాభిస్తోంది.