గంభీర్, ఇషాంత్‌కు ఛాన్స్ దక్కేనా? | Gambhir, Ishant likely to be picked for England series | Sakshi
Sakshi News home page

గంభీర్, ఇషాంత్‌కు ఛాన్స్ దక్కేనా?

Published Tue, Nov 1 2016 5:06 PM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM

గంభీర్, ఇషాంత్‌కు ఛాన్స్ దక్కేనా?

గంభీర్, ఇషాంత్‌కు ఛాన్స్ దక్కేనా?

ముంబై: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్కు సీనియర్ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, ఇషాంత్ శర్మలకు భారత జట్టులో చోటు దక్కే అవకాశముంది. ఇంగ్లండ్‌తో సిరీస్కు జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ బుధవారం సమావేశమవుతోంది.

చాలాకాలం జట్టుకు దూరంగా ఉన్న ఓపెనర్ గంభీర్కు ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో ఆడే అవకాశం వచ్చింది. ఇండోర్లో జరిగిన మూడో టెస్టులో గౌతీ హాఫ్ సెంచరీ చేశాడు. ఇక రంజీ ట్రోఫీలోనూ ఢిల్లీ జట్టు తరఫున సెంచరీ (147)తో ఆకట్టుకున్నాడు. ఇక ఇషాంత్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌తో సిరీస్కు ఎంపికైనా అనారోగ్యం కారణంగా ఆడలేకపోయాడు. ప్రస్తుతం కోలుకున్నందున జట్టులో చోటు లభించే అవకాశముంది. ఈ నెల 9 నుంచి భారత్, ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement