బీసీసీఐకి సుప్రీం కోర్టు అనుమతి
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ జట్టుతో రాజ్‌కోట్‌లో జరగబోయే తొలి టెస్టుకు నిధుల కొరత తీరింది. ఈ మ్యాచ్ నిర్వహణ కోసం సౌరాష్ట్ర క్రికెట్ సంఘానికి నిధులను విడుదల చేసేందుకు అంగీకరించాలని బీసీసీఐ మంగళవారం సుప్రీం కోర్టును అభ్యర్థించింది. లేకుంటే టెస్టు రద్దయ్యే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రూ.58.66 లక్షల నిధులు విడుదల చేసేందుకు బీసీసీఐకి అనుమతించింది. డిసెంబర్ 3 వరకు జరిగే ఈ సిరీస్‌లో ఇతర మ్యాచ్‌ల కోసం కూడా ఇంతే మొత్తాన్ని ఖర్చు చేసుకునేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ అనుమతిచ్చింది. అయితే ఈ నిధులను ఆటగాళ్ల అలవెన్‌స, ఇన్సూరెన్‌స ఖర్చులకు, మూడో అంపైర్‌కు చెల్లింపు కోసం మాత్రమే ఖర్చు పెట్టాలని, సౌరాష్ట్ర క్రికెట్ సంఘానికి మాత్రం కాదని పేర్కొంది.
టెస్టు కోసం నిధులు ఇచ్చుకోండి
Published Wed, Nov 9 2016 1:42 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement