ఎన్‌క్లాట్ తీర్పును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ బైజూస్(థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థపై దివాలా చర్యలు చేపట్టకుండా నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్‌క్లాట్) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. సెటిల్‌మెంట్ నగదు రూ.158.9 కోట్లను కమిటీ ఆఫ్ క్రెడిటర్(సీఓసీ) వద్ద డిపాజిట్ చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బీసీసీఐని ఆదేశించింది.
ఎన్‌క్లాట్ తీర్పును వ్యతిరేకిస్తూ అమెరికా సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. 61 పేజీల తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో బైజూస్‌పై ఆ కంపెనీ వ్యవస్థాపకులైన బైజూ రవీంద్రన్, ఆయన సోదరుడు రిజూ రవీంద్రన్ మరోసారి నియంత్రణ కోల్పోనున్నారు. బీసీసీఐతో రూ.158.9 కోట్ల వ్యవహారాన్ని సెటిల్‌మెంట్ చేసుకోవడానికి బైజూస్ అంగీకరించడంతో ఆ సంస్థపై దివాలా చర్యలు చేపట్టకుండా ఆగస్టు 2న ఎన్‌క్లాట్ తీర్పు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment