BYJU
-
బైజూస్‌కు మరో ఎదురుదెబ్బ..
న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ బైజూస్(థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థపై దివాలా చర్యలు చేపట్టకుండా నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్‌క్లాట్) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. సెటిల్మెంట్ నగదు రూ.158.9 కోట్లను కమిటీ ఆఫ్ క్రెడిటర్(సీఓసీ) వద్ద డిపాజిట్ చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బీసీసీఐని ఆదేశించింది. ఎన్‌క్లాట్ తీర్పును వ్యతిరేకిస్తూ అమెరికా సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. 61 పేజీల తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో బైజూస్‌పై ఆ కంపెనీ వ్యవస్థాపకులైన బైజూ రవీంద్రన్, ఆయన సోదరుడు రిజూ రవీంద్రన్ మరోసారి నియంత్రణ కోల్పోనున్నారు. బీసీసీఐతో రూ.158.9 కోట్ల వ్యవహారాన్ని సెటిల్మెంట్ చేసుకోవడానికి బైజూస్ అంగీకరించడంతో ఆ సంస్థపై దివాలా చర్యలు చేపట్టకుండా ఆగస్టు 2న ఎన్‌క్లాట్ తీర్పు ఇచ్చింది. -
దివాలా అస్త్రం నుంచి బయటపడ్డ బైజూస్
న్యూఢిల్లీ: ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ దివాలాకు సంబంధించిన ఎన్సీఎల్టీ వివాదాన్ని పరిష్కరించుకుంది. ఈమేరకు బీసీసీఐతో కుదుర్చుకున్న రూ.158 కోట్ల పరిష్కార ఒప్పందాన్ని అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమోదించింది. బెంగళూరు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన రూలింగ్‌ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్– చెన్నై బెంచ్) కొట్టివేసింది. దాంతో బైజూస్‌కు ఊరట లభించినట్లయింది.బీసీసీఐ స్పాన్సర్షిప్ కోసం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బైజూస్ డబ్బు చెల్లించాల్సి ఉంది. ఈమేరకు కుదిరిన రూ.158 కోట్ల పరిష్కార ఒప్పందాన్ని అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమోదించింది. అయితే, అండర్‌టేకింగ్‌లో పేర్కొన్న నిర్దిష్ట తేదీల్లో చెల్లింపులు చేయడంలో ఏదైనా వైఫల్యం జరిగితే, తిరిగి బైజూస్‌పై దివాలా ప్రక్రియ పునరుద్ధరించేలా హెచ్చరికతో కూడిన ఉత్తర్వులను అప్పీలేట్ ట్రిబ్యునల్ జారీ చేసింది. అమెరికా రుణదాతలు చేసిన ఆరోపణల ప్రకారం.. బైజూస్ తాను తీసుకున్న రుణాలను నిర్దిష్ట లక్ష్యాలకు కాకుండా ‘రౌండ్–ట్రిప్పింగ్’కు వినియోగించుకుందని పేర్కొన్నారు. గతంలో చేసిన ఈ ఆరోపణలను కూడా అప్పీలేట్ ట్రిబ్యునల్ కొట్టివేసింది. దానికి తగిన సాక్ష్యాలను అందించడంలో రుణదాతలు విఫలమయ్యారని పేర్కొంది. బైజూస్ వ్యవస్థాపకులు రవీంద్రన్ సోదరుడు–రిజు రవీంద్రన్ తన షేర్ల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాలను ఇప్పటివరకూ రుణ చెల్లింపులకు వినియోగించినట్లు పేర్కొంటూ... రౌండ్ ట్రిప్పింగ్ ఆరోపణలకు సాక్ష్యాలు లేవని తెలిపింది. రుణ చెల్లింపుల షెడ్యూల్ ఇదీ... ఒప్పందం ప్రకారం, రిజు రవీంద్రన్ జూలై 31న బీసీసీఐకి బైజూస్ చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లు చెల్లించారు. శుక్రవారం (ఆగస్టు 2న) మరో రూ.25 కోట్లు చెల్లించాల్సి ఉంది. మిగిలిన రూ.83 కోట్లను ఆగస్టు 9న ఆర్టీజీఎస్ ద్వారా చెల్లించనున్నారు. వివాదమేమిటీ? బీసీసీఐ, బైజూస్‌లు 2019 జూలై 25న కుదుర్చుకున్న ’టీమ్ స్పాన్సర్ ఒప్పందం’ కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం..భారత క్రికెట్ జట్టు కిట్‌పై తన ట్రేడ్‌మార్క్/బ్రాండ్ పేరును ప్రదర్శించే ప్రత్యేక హక్కు బైజూస్‌కు ఉంది. అలాగే క్రికెట్ సిరీస్‌ల ప్రసార సమయంలో ప్రకటనలు, ఆతిథ్య హక్కులనూ కలిగి ఉంది. 2023 మార్చి 31 తేదీ వరకూ ఈ సర్వీసులు బైజూస్‌కు అందుబాటులో ఉంటాయి. ఇందుకు సంబంధించి బైజూన్ (కార్పొరేట్ డెబిటార్), ఆపరేషనల్ క్రెడిటార్ (బీసీసీఐ)కు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 2022లో జరిగిన భారత్–దక్షిణాఫ్రికా క్రికెట్ సిరీస్‌కు సంబంధించి బైజూస్ ఒక ఇన్వాయిస్పై రూ. 25.35 కోట్లు చెల్లించింది. తదుపరి ఇన్వాయిస్లకు చెల్లించడంలో విఫలమైంది. రూ.143 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని బీసీసీఐ క్యాష్ చేసుకున్నప్పటికీ అది పూర్తి బకాయిని కవర్ చేయలేకపోయింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, ఆసియా కప్, ఐసీసీ టి20లతో సహా సిరీస్‌లు, టూర్లకు ఆగస్టు 2022 నుంచి జనవరి 2023 మధ్య స్పాన్సర్షిప్ రుసుము రూ.158.9 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనితో బీసీసీఐ బైజూస్‌పై ఎన్సీఎల్టీ బెంగళూరు బెంచ్‌ను ఆశ్రయించింది. బైజూన్ రూ.159 కోట్లు చెల్లించడంలో విఫలమైందని పేర్కొంటూ, మాతృ సంస్థ థిక్ అండ్ లేర్న్పై దివాలా చర్యలకు అనుమతించాలని కోరింది. ఈ పిటిషన్‌ను జులై 16న అనుమతిస్తూ, ఎన్సీఎల్టీ మధ్యంతర దివాలా పరిష్కార నిపుణుడిగా (ఐఆర్పీ) పంకజ్ శ్రీవాస్తవను నియమించింది. దాంతో సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ రవీంద్రన్ ఐఆర్‌పీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని కూడా ఎన్సీఎల్టీ స్పష్టం చేసింది. అయితే దీనిపై బైజూస్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది.కష్టాల కడలిలో... బైజూస్ విలువ ఒకప్పుడు 22 బిలియన్ డాలర్లుగా ఉండేది. అయితే మహమ్మారి నియంత్రణలను సడలించిన తర్వాత పాఠశాలలను తిరిగి తెరవడం ఎడ్టెక్ సంస్థకు గొడ్డలిపెట్టయ్యింది. బ్లాక్‌రాక్ ఇటీవల సంస్థ విలువను 1 బిలియన్ డాలర్లను తగ్గించింది. రెండేళ్ల క్రితం ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ డెడ్లైన్లను పాటించడంలో విఫలమవడం, రాబడి అంచనాలకు 50 శాతానికి పైగా తగ్గించడం వంటి అంశాలతో కంపెనీ కష్టాలు తీవ్రమయ్యాయి. ప్రోసస్ అండ్ పీక్ 15సహా బైజూస్ మాతృసంస్థలో పెట్టుబడిపెట్టిన వారంతా ఫిబ్రవరిలో జరిగిన అసాధారణ సమావేశంలో (ఈజీఎం) ‘‘తప్పుడు నిర్వహణ విధానాలు– వైఫల్యాల‘ ఆరోపణలతో రవీంద్రన్‌ను సీఈఓగా తొలగించాలని వోటు వేశారు. అయితే రవీంద్రన్ ఈ ఆరోపణలను ఖండించారు. ఈ వోటింగ్ చట్టబద్దతను ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వివాదంపై న్యాయపోరాటం కొనసాగుతోంది.భారీ విజయమిది: బైజూస్ ఎడ్టెక్ సంస్థకు, వ్యవస్థాపకులకు ఇది భారీ విజయమని బైజూస్ ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు వ్యవస్థాపకులు బైజూ రవీంద్రన్ ఈ పరిణామంపై మాట్లాడుతూ, తాజా ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వు్య కేవలం చట్టపరమైన విజయం మాత్రమే కాదని, గత రెండేళ్లలో బైజూ కుటుంబం చేసిన వీరోచిత ప్రయత్నాలకు నిదర్శనమని అన్నారు. తమ వ్యవస్థాపక బృందం సభ్యులు సవాళ్లను ఎదుర్కొంటూ, అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని పేర్కొంటూ, వారి త్యాగం నిరుపమానమైందన్నారు. ప్రతి ఒక్కరికీ తాను ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వివరించారు. ప్రతి కష్టం పోరాడాలన్న తమ దృఢ నిశ్చయాన్ని పటిష్ట పరిచాయని అన్నారు. -
25 శాతం మందికే పూర్తి వేతనాలు..!
బైజూస్ బ్రాండ్‌పై సేవలు అందిస్తున్న ఎడ్టెక్ దిగ్గజం థింక్ అండ్ లెర్న్, తన ఉద్యోగుల్లో 25 శాతం మందికే ఫిబ్రవరి నెల పూర్తి వేతనాలు అందించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అయితే ఇలా వేతనం అందుకోబోతున్న వారంతా తక్కువ వేతన స్కేలులో ఉన్న వారే కావడం గమనార్హం. మిగతా వారికి పాక్షిక చెల్లింపులు చేసినట్లు తెలుస్తోంది. కొందరు పెట్టుబడిదార్లు నిధులను బ్లాక్ చేయడంతో కంపెనీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వేతనాలు చెల్లిస్తున్నామని బైజూస్ యాజమాన్యం ఇటీవల ఉద్యోగులకు లేఖలు పంపింది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన వేతనాలను గత శుక్రవారం రాత్రి ప్రాసెస్ చేశామని అందులో పేర్కొంది. శనివారం, ఆదివారం సెలవులు కావడంతో సోమవారం ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమచేస్తామని కంపెనీలు వర్గాలు తెలిపినట్లు తెలిసింది. ఇదీ చదవండి: విద్యుత్ వాహనాలతో వాతావరణ కాలుష్యం..! -
రూ.4,419 కోట్ల నిధుల మళ్లింపు.. ఇన్వెస్టర్ల ఆరోపణ
ప్రస్తుతం ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటూ బైజూస్ సంస్థ మూలధనం కోసం రైట్స్ ఇష్యూకు వెళ్తుండడం తెలిసిందే. అయితే బైజూస్ అమెరికాలోని ఒక రహస్య హెడ్జ్ ఫండ్‌లోకి 533 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.4,419 కోట్ల)మళ్లించిందని ఆ సంస్థ ఇన్వెస్టర్లు ఆరోపించారు. సంస్థ ఇప్పటికే 200 మిలియన్ డాలర్లు రైట్స్ ఇష్యూ కోసం నమోదు చేసుకున్నందుకు దీనిపై స్టే ఇవ్వాలని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను కోరారు. ఇన్వెస్టర్ల విజ్ఞప్తిపై మూడు రోజుల్లోగా రాతపూర్వక సమాధానం ఇవ్వాలంటూ బైజూస్‌కు ఎన్సీఎల్టీ ఆదేశాలు జారీ చేసింది. దాంతో తీర్పును రిజర్వ్ చేసింది. రైట్స్ ఇష్యూ ద్వారా వచ్చిన నిధులను కంపెనీలోకి జొప్పించాలని ప్రమోటర్లు భావిస్తున్నారు. బుధవారంతో ఈ రైట్స్ ఇష్యూ ముగియనుంది. ఈ నేపథ్యంలో రైట్స్ ఇష్యూను కొనసాగించాలా వద్దా అనే అంశంపై చర్చలు జరుతున్నట్లు తెలిసింది. అయితే కంపెనీ అధీకృత మూలధనాన్ని పెంచితేనే రైట్స్ ఇష్యూ జరుగుతుందని, అందుకు అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్)లో వాటాదార్లు 51% మెజారిటీతో అంగీకారం తెలపాల్సి ఉంటుందని.. ఇవన్నీ ఇంకా జరగలేదని వాటాదార్లు వాదిస్తున్నారు. ఇదీ చదవండి: ‘డ్యూడ్.. కాస్త రెస్ట్ తీసుకోండి’ నితిన్ కామత్‌ను కోరిన వ్యాపారవేత్త కంపెనీ రైట్స్ ఇష్యూకు వెళ్లడం చట్టవ్యతిరేకమని.. అందుకే స్టే కోరుతున్నామని ఇన్వెస్టర్లు ఎన్సీఎల్టీ విచారణలో తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కంపెనీకి ఇన్వెస్టర్లు అవాంతరాలు సృష్టిస్తున్నారని బైజూస్ యాజమాన్యం వాదించిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
దేశం విడిచివెళ్లకుండా ప్రముఖ కంపెనీ సీఈఓకు ఈడీ నోటీసులు
కొవిడ్ సమయంలో ఎడ్యుకేషన్ రంగంలో బైజూస్ ఓ వెలుగు వెలిగింది. భారీగా నియామకాలు చేపట్టింది. క్రమంగా కరోనా భయాలు తొలగడంతో కార్యకలాపాలు భారంగా మారి అప్పుల్లోకి వెళ్లినట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. దాంతో ఆ కంపెనీ లావాదేవీలతో సంబంధం ఉన్న కొన్ని ఇతర సంస్థలు నోటీసులు సైతం పంపిచాయి. తాజాగా ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లుకౌట్ నోటీసులు జారీ చేసింది. దేశం విడిచి వెళ్లకుండా చూడాలని సంబంధిత వర్గాలను ఆదేశించింది. గత ఏడాది బెంగళూరులో రెండు కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో సోదాలు జరిపింది. ఇప్పటికే రవీంద్రన్‌పై ‘ఆన్ ఇంటిమేషన్ లుకౌట్ సర్క్యులర్’ అమల్లో ఉంది. అంటే విదేశాలకు వెళ్లినప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈడీకి ముందుగానే సమాచారం అందజేయాల్సి ఉంటుంది. తాజాగా పూర్తిస్థాయి లుకౌట్ సర్క్యులర్ జారీ అవడంతో ఇకపై దేశం విడిచి వెళ్లే అవకాశం ఉండదు. మరోవైపు రవీంద్రన్‌ను సీఈఓ పదవి నుంచి తొలగించేందుకు కొంత మంది వాటాదారులు ఎమర్జెన్సీ జనరల్ మీటింగ్(ఈజీఎం)కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కొత్త బోర్డును ఎన్నుకోవాలని అనుకున్నట్లు తెలిసింది. దానికోసం ఫిబ్రవరి 23న సమావేశం ఏర్పాటు చేయాలని సంస్థను కోరారు. అయితే వాటాదారుల కోరికను సవాలు చేస్తూ బైజూస్ కర్ణాటక హైకోర్టులో సంప్రదించింది. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈజీఎం నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, అందులో తీసుకునే నిర్ణయాలను మాత్రం తదుపరి విచారణ వరకు వాయిదా వేయాలని చెప్పింది. ఇదీ చదవండి: కృత్రిమ వజ్రాలు తయారీ.. లాభనష్టాలు ఎవరికంటే.. ఫ్రాన్స్ కంపెనీ పిటీషన్ దాఖలు చేయడంతో బైజూస్ సంస్థ ఇటీవల నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ) నుంచి నోటీసులు అందుకుంది. ఇదిలా ఉండగా, వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు బైజూస్ అమెరికా విభాగం ఆల్ఫా 2021లో టర్మ్‌లోన్-బీ తీసుకుంది. అయితే, కంపెనీ 500 మిలియన్ డాలర్ల మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతర అనుబంధ సంస్థలకు బదలాయించిందని, రుణ చెల్లింపులను వేగవంతం చేయాలని రుణదాతలు అమెరికాలోని డెలావేర్ కోర్టును గతంలో ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీన్ని న్యాయస్థానంలో సవాలు చేసిన బైజూస్.. రుణదాతలతో వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నాల్లో ఉందని తెలిసింది. -
ఎడ్టెక్ కంపెనీకు నోటీసులు.. ఎందుకో తెలుసా..
ఫ్రాన్స్ కంపెనీ పిటీషన్ దాఖలు చేయడంతో బైజూస్ సంస్థ తాజాగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ) నోటీసులు అందుకుంది. ఫ్రాన్స్‌కు చెందిన టెలీపెర్ఫార్మెన్స్ బిజినెస్ సర్వీసెస్ పిటీషన్ వేయడంతో బైజూస్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ) నోటీసులు ఇష్యూ చేసింది. బైజూస్ ఎడ్టెక్ కంపెనీ రూ.4 కోట్లు అప్పు పడిందని, దాన్ని తిరిగి చెల్లించడం లేదని ఈ పిటీషన్లో టెలీపెర్ఫార్మెన్స్ బిజినెస్ పేర్కొంది. నిబంధనల ప్రకారం నోటీసులపై బైజూస్ రెండు వారాల్లో స్పందించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, టెలీపెర్ఫార్మెన్స్తోపాటు ఇతర కొన్ని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలతో 2022 మధ్య వరకు బైజూస్ వ్యాపారం చేసింది. ఈ కంపెనీలు బైజూస్‌కు కాలింగ్ ఏజెంట్ల సేవలందించేవి. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా టెలీపెర్ఫార్మెన్స్, కోజెంట్ బైజూస్‌కు నిధులు నిలిపేసినట్లు తెలిసింది. ఇదీ చదవండి: వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం! వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు బైజూస్ అమెరికా విభాగం ఆల్ఫా 2021లో టర్మ్‌లోన్-బీ తీసుకుంది. అయితే, కంపెనీ 500 మిలియన్ డాలర్ల మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతర అనుబంధ సంస్థలకు బదలాయించిందని, రుణ చెల్లింపులను వేగవంతం చేయాలని రుణదాతలు అమెరికాలోని డెలావేర్ కోర్టును గతంలో ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీన్ని న్యాయస్థానంలో సవాలు చేసిన బైజూస్.. రుణదాతలతో వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నాల్లో ఉంది. -
బైజూస్ వ్యవస్థాపకులకు షాక్!
న్యూఢిల్లీ: థింక్ అండ్ లెర్న్ ప్రయివేట్ లిమిటెడ్ నుంచి వ్యవస్థాపకులకు ఉద్వాసన పలకాలని ఆరు ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బైజూస్ బ్రాండ్‌తో ఎడ్యుకేషన్ సేవలందించే కంపెనీని వ్యవస్థాపకుల నియంత్రణ నుంచి తప్పించాలని చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం వాటాదారుల అసాధారణ సమావేశాన్ని (ఈజీఎం) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలియజేశాయి. డచ్ సంస్థ ప్రోజస్ అధ్యక్షతన బైజూస్‌లో పెట్టుబడులున్న కంపెనీలు ఏజీఎంకు నోటీసు జారీ చేసినట్లు తెలియజేశాయి. పాలన (గవర్నెన్స్), నిబంధనల అమలు అంశాలు, ఆర్థిక నిర్వహణలో అక్రమాలు, డైరెక్టర్ల బోర్డు పునరి్నర్మాణం తదితరాల పరిష్కారం కోసం ఏజీఎంకు పిలుపునిచి్చనట్లు వెల్లడించాయి. వెరసి యాజమాన్య మార్పునకు డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. నోటీసు జారీకి మద్దతిచి్చన ఇన్వెస్ట్మెంట్ సంస్థలలో జనరల్ అట్లాంటిక్, పీక్ ఫిఫ్టీన్, సోఫినా, చాన్ జుకర్‌బర్గ్, ఔల్ అండ్ శాండ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి బైజూస్‌లో ఉమ్మడిగా సుమారు 30 శాతం వాటా ఉంది. బైజూస్ వాటాదారుల కన్సార్షియం ఇంతక్రితం జులై, డిసెంబర్‌లలోనూ డైరెక్టర్ల బోర్డు సమావేశానికి పిలుపునిచి్చనప్పటికీ ఆచరణకు నోచుకోలేదని తాజా నోటీసులో ప్రోజస్ పేర్కొంది. కాగా.. ఈ అంశంపై బైజూస్ వెంటనే స్పందించకపోవడం గమనార్హం! 200 మిలియన్ డాలర్ల సమీకరణ.. ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ తాజాగా ఈక్విటీ రైట్స్ ఇష్యూ ద్వారా 200 మిలియన్ డాలర్లను సమీకరించే యత్నాల్లో ఉంది. కంపెనీ వాస్తవ వేల్యుయేషన్ మరింత ఎక్కువే అయినప్పటికీ ప్రస్తుత విడత సమీకరణ కోసం మాత్రం 220–250 మిలియన్ డాలర్ల శ్రేణిలో పరిగణించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంత తక్కువ వేల్యుయేషన్ ఈ ఇష్యూకు మాత్రమే పరిమితం కానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మాతృసంస్థ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎల్‌పీఎల్) ఈ మేరకు ఈక్విటీ షేర్హోల్డర్లకు రైట్స్ ఇష్యూను ప్రారంభించినట్లు బైజూస్ పేర్కొంది. 2022 మార్చిలో బైజూస్ ఏకంగా 22 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో నిధులు సమీకరించింది. పెట్టుబడి వ్యయాలు, కార్పొరేట్ అవసరాల కోసం ఈ నిధులను వినియోగించుకోనున్నట్లు బైజూస్ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 18 నెలలుగా వ్యవస్థాపకులు దాదాపు 1.1 బిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్ చేయడమనేది సంస్థ పట్ల వారికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొంది. మరోవైపు, ఇటీవలి కాలంలో సంస్థ ఎదుర్కొన్న సవాళ్లు, బైజూస్ లక్ష్యం, రైట్స్ ఇష్యూ తదితర అంశాలను వివరిస్తూ షేర్హోల్డర్లకు కంపెనీ లేఖ రాసింది. దాదాపు 22 నెలల జాప్యం తర్వాత బైజూస్ ఇటీవలే ప్రకటించిన 2022 ఆర్థిక సంవత్సర ఆర్థిక ఫలితాల ప్రకారం నిర్వహణ నష్టం రూ. 6,679 కోట్లకు, ఆదాయం రూ. 5,298 కోట్లకు చేరాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ నష్టం రూ. 4,143 కోట్లు, కాగా ఆదాయం రూ. 2,428 కోట్లు. -
బైజూస్‌పై దివాలా పిటిషన్
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ బైజూస్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)–బెంగళూరులో దివాలా పిటిషన్ దాఖలైంది. కంపెనీకి 1.2 బిలియన్ డాలర్ల మేర టర్మ్ లోన్–బీ (టీఎల్‌బీ) ఇచి్చన రుణదాతల్లో 80 శాతం సంస్థలు కలిసి గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ద్వారా దీన్ని దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, దివాలా పిటిషన్ విషయం ఇంకా బహిరంగంగా వెల్లడి కాలేదు. బైజూస్ ఈ వ్యవహారమంతా నిరాధారమైనదని పేర్కొంది. రుణదాతల చర్యలపై అమెరికా కోర్టుల్లో పలు కేసులు నడుస్తుండగా ఎన్సీఎల్టీని ఆశ్రయించడం సరికాదని వ్యాఖ్యానించింది. అనుబంధ సంస్థలను విక్రయించడం ద్వారా వచ్చే నిధులతో రుణాలను తీర్చేసుకునేందుకు టీఎల్‌బీ రుణదాతలతో చర్చలు జరుపుతున్నట్లు బైజూస్ చెబుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్యాంకులు కాకుండా సంస్థాగత ఇన్వెస్టర్లు ఇచ్చిన రుణాన్ని టీఎల్‌బీ లోన్‌గా వ్యవహరిస్తున్నారు. వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు బైజూస్ అమెరికా విభాగం ఆల్ఫా 2021లో టీఎల్‌బీ తీసుకుంది. అయితే, కంపెనీ 500 మిలియన్ డాలర్ల మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతర అనుబంధ సంస్థలకు బదలాయించిందని, రుణ చెల్లింపులను వేగవంతం చేయాలని రుణదాతలు అమెరికాలోని డెలావేర్ కోర్టును ఆశ్రయించారు. దీన్ని న్యాయస్థానంలో సవాలు చేసిన బైజూస్.. రుణదాతలతో వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నాల్లో ఉంది. -
ఏడాదిలోనే 90 శాతం విలువ తగ్గిన కంపెనీ..
ఒక్క ఏడాది వ్యవధిలోనే ప్రముఖ ఎడ్టెక్ సంస్థ 90 శాతం తన విలువను కోల్పోయింది. బైజూస్ బ్రాండ్‌పై కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎడ్టెక్ సంస్థ థింక్ అండ్ లెర్న్ తన విలువను భారీగా నష్టపోయింది. ఈమేరకు ‘టెక్‌క్రంచ్’ వెబ్సైట్ కథనం ప్రచురించింది. ఈ సంస్థ విలువ రూ.1,82,600 కోట్ల నుంచి రూ.16,600 కోట్లకు పడిపోయినట్లు అందులో పేర్కొంది. ఫిబ్రవరిలో షేర్లను జారీ చేసి ప్రస్తుత పెట్టుబడిదార్ల నుంచి 100 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.830 కోట్ల)ను సమీకరించాలని బైజూస్ భావిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. గతంలో 2022 చివర్లో జరిగిన నిధుల సమీకరణ సమయంలో కంపెనీ విలువను 22 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1,82,600 కోట్లు)గా లెక్కగట్టగా.. తాజాగా 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.16,600 కోట్లు)గానే లెక్కించి ఇన్వెస్టర్లకు షాక్ఇచ్చింది. అంటే సంస్థ విలువ 90 శాతానికి పైగా తగ్గింది. కొన్ని నెలలుగా నగదు లభ్యత సమస్యల్లో ఉన్న ఈ కంపెనీ, కొత్తగా సమీకరించే నిధులతో అప్పు ఇచ్చినవారికి చెల్లింపులు చేయనుందని తెలిసింది. బైజూస్ అనుబంధ సంస్థలు వైట్ హాట్ జూనియర్, ఒస్మోల్లో నష్టాల కారణంగా 2021-22లో సంస్థ నిర్వహణ వ్యయం రూ.6,679 కోట్లకు పెరిగినట్లు సమాచారం. ఈ రెండు సంస్థల నష్టాలే 45 శాతం (రూ.3,800 కోట్లు) ఉన్నాయి. 2020-21లో సంస్థ నష్టం రూ.4,143 కోట్లతో పోలిస్తే 2021-22 నష్టం మరింత పెరిగినట్లయింది. ఆదాయాలు కూడా రూ.2428.39 కోట్ల నుంచి రూ.5,298.43 కోట్లకు పెరిగాయి. బైజూస్ ఇతర అనుబంధ సంస్థలైన ఆకాశ్, గ్రేట్ లెర్నింగ్ ఆదాయాలు పెరిగాయి. ఆకాశ్ ఆదాయం 40% పెరిగి రూ.1491 కోట్లకు, గ్రేట్‌లెర్నింగ్ ఆదాయం 80% వృద్ధితో రూ.628 కోట్లకు చేరింది. ఇదీ చదవండి: ఆగ్రహంతో రగిలిపోతున్న గూగుల్ ఉద్యోగులు.. కంపెనీకి చుక్కలు! బైజూస్ తన వాల్యుయేషన్‌ను తగ్గించడానికి సుముఖత చూపడంపై స్టార్టప్ కంపెనీలు భిన్నంగా స్పందిస్తున్నట్లు తెలిసింది. 2021-22లో 2.5 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసిన ఈ స్టార్టప్ ప్రపంచవ్యాప్తంగా అర డజనుకు పైగా సంస్థలను కొనుగోలు చేసింది. ఒకానొక సందర్భంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు సంస్థకు 50 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ వాల్యుయేషన్‌ను ఇచ్చినట్లు టెక్ క్రంచ్ గతంలో నివేదించింది. -
విద్యా విప్లవం: బైజూస్ కంటెంట్ ఎంతో బాగుందంటున్న విద్యార్థులు
-
బీసీసీఐకి రూ.158 కోట్లు బాకీ.. బైజూస్‌కు నోటీసులు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి బాకీ పడిన రూ. 158 కోట్లకు సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) ‘బైజూస్’ సంస్థకు నోటీసులు జారీ చేసింది. భారత క్రికెట్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందిస్తూ ఎన్సీఎల్టీ ఈ నోటీసులు ఇచ్చింది. ‘దీనిపై స్పందించేందుకు బైజూస్‌కు రెండు వారాల గడువు ఇచ్చాం. ఆపై మరో వారం రోజుల్లో బీసీసీఐ తమ అభ్యంతరాలను దాఖలు చేయాలి’ అని ఆదేశించిన ఎన్సీఎల్టీ... ఈ కేసును డిసెంబర్ 22కు వాయిదా వేసింది. 2019లో భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్‌గా వచ్చిన బైజూస్ సంస్థ తర్వాతి రోజుల్లో దివాళా తీయడంతో బీసీసీఐకి రూ. 158 కోట్లు బాకీ పడింది. -
నాడు అద్దె ఇల్లు.. నేడు 6 యూనివర్సిటీలు, 28 ఆస్పత్రులు
ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ న్యూయార్క్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ డేవిడ్సన్ కెంప్నర్ క్యాపిటల్ మేనేజ్మెంట్తో కొనసాగుతున్న రుణ వివాదానికి పరిష్కారం అంచున ఉంది. మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ చైర్మన్ రంజన్ పాయ్ బైజూస్‌లో దాదాపు రూ. 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో డేవిడ్సన్ కెంప్నర్ నుంచి బైజూస్ తీసుకున్న రూ.800 కోట్ల రుణాన్ని సెటిల్ చేసేందుకు రంజన్ పాయ్ రూ.1,400 కోట్లు చెల్లించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎవరీ డాక్టర్ రంజన్ పాయ్.. ఆయన బిజినెస్.. నెట్‌వర్త్ వంటి విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎవరీ డాక్టర్ రంజన్ పాయ్? 1972 నవంబర్ 11న జన్మించిన డాక్టర్ రంజన్ పాయ్ ఒక అర్హత కలిగిన వైద్యుడు, వ్యాపారవేత్త. మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ (MEMG) ఛైర్మన్. ఈ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ఆరు విశ్వవిద్యాలయాలు, 28 ఆసుపత్రులను నడుపుతోంది. రంజన్ పాయ్ తండ్రి పద్మభూషణ్ అవార్డు గ్రహీత రాందాస్ పాయ్. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (MAHE)కి రాందాస్ పాయ్ ఛాన్సలర్‌గా ఉన్నారు. రంజన్ పాయ్ మణిపాల్‌లోని కస్తూర్బా మెడికల్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసి, యూఎస్ వెళ్లి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఫెలోషిప్ పూర్తి చేశారు. అద్దె ఇంట్లో ప్రారంభం డాక్టర్ రంజన్ పాయ్ మలేషియాలోని మెలక మణిపాల్ మెడికల్ కాలేజీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 2000 సంవత్సరంలో రంజన్ పాయ్ బెంగళూరులోని అద్దె ఇంట్లో మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్‌ను ప్రారంభించారు. కేవలం 2 లక్షల డాలర్లతో వ్యాపారాన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు దీని విలువ సుమారు 3 బిలియన్ డాలర్లు ( దాదాపు రూ. 25,000 కోట్లు). నెట్‌వర్త్ ఫోర్బ్స్ ప్రకారం డాక్టర్ రంజన్ పాయ్ నెట్‌వర్త్ 2.8 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 23,000 కోట్లు). మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్‌కు ఇప్పుడు మలేషియా, ఆంటిగ్వా, దుబాయ్, నేపాల్ దేశాల్లో కూడా క్యాంపస్‌లు ఉన్నాయి. ఇదే కాకుండా డాక్టర్ రంజేన్ పాయ్కి మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ అనే సంస్థ కూడా ఉంది. -
బైజూస్‌లో 3,500 మందికి ఉద్వాసన
న్యూఢిల్లీ: ప్రముఖ ఎడ్టెక్ సంస్థ (విద్యా సంబంధిత) బైజూస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,500 మంది ఉద్యోగులను తొలగించనుంది. సంస్థలోని వివిధ స్థాయిల్లో బృందాల క్రమబదీ్ధకరణకు తోడు ప్రాంతాల వారీ ప్రత్యేక దృష్టిని విస్తృతం చేయనుందని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. కరోనా సమయంలో ఆన్లైన్ విద్యకు డిమాండ్ పెరగడంతో, దీనికి అనుగుణంగా బైజూస్ తన ఉద్యోగులను గణనీయంగా పెంచుకుంది. ఇప్పుడు ఆన్లైన్ విద్యకు డిమాండ్ గణనీయంగా తగ్గిపోవడంతో దిద్దుబాటు చర్యలను చేపడుతున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. ‘‘ఇప్పటికైతే తొలగింపులు లేవు. వివిధ యూనిట్ల పునర్నిర్మాణం, డిమాండ్‌పై అంచనా వేయడం కొనసాగుతోంది. ఇప్పటికి 1,000 మంది నోటీసు పీరియడ్‌లో ఉన్నారు. మరో 1,000 మంది పనితీరు మెరుగుపరుచుకునే లక్ష్యా లను ఇంకా చేరుకోలేదు. ఈ అంచనా ఇంకా కొనసాగుతోంది. మొత్తం మీద ఈ ప్రక్రియతో 3,500 మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుంది’’అని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. బైజూస్‌లో ఇదే చివరి తొలగింపులు అని, ఈ ప్రక్రియ అక్టోబర్ చివరికి పూర్తవుతుందని పేర్కొన్నాయి. వ్యాపారాన్ని మరింత చురుగ్గా, అనుకూలంగా మార్చడం ఈ ప్రక్రియ వెనుక లక్ష్యమని తెలిపాయి. స్పష్టమైన జవాబుదారీ తనంతో నడిచే నిర్మాణం ఏర్పాటు చేయడంగా పేర్కొన్నాయి. వ్యాపార పునర్నిర్మాణం.. బైజూస్ అధికార ప్రతినిధి దీన్ని ధ్రువీకరించారు. ‘‘వ్యాపార పునర్నిర్మాణ ప్రక్రియ తుది దశలో ఉంది. నిర్వహణ తీరును మరింత సులభతరం చేయడం, వ్యయాలను తగ్గించుకోవడం, మెరుగైన నగదు ప్రవాహాల కోసం దీన్ని చేపట్టాం. బైజూస్ కొత్త భారత సీఈవో అర్జున్ మోహన్ వచ్చే కొన్ని వారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. పునరుద్ధరించిన, స్థిరమైన కార్యకలాపాలను ముందుకు తీసుకెళతారు’’అని వెల్లడించారు. కరోనా సమయంలో ఏర్పాటు చేసిన కొన్ని ఉత్పత్తులు పెద్దగా ఫలితం ఇవ్వలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇకపై కే12 విద్య, ఇతర పోటీ పరీక్షల మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉంటుందని పేర్కొన్నాయి. ప్రాంతీయ బృందాలు మరింత జవాబుదారీగా పని చేయాల్సి ఉంటుందని, హైబ్రిడ్ మోడల్, ట్యూషన్ సెంటర్లపై అధిక దృష్టి సారించాల్సి ఉంటుందని తెలిపాయి. 2022 అక్టోబర్ నాటికి బైజూస్‌లో 50,000 మంది ఉండగా, తాజా ప్రక్రియ ముగిస్తే వీరి సంఖ్య 31,000–33,000కు తగ్గనుంది. -
బైజూస్ కొత్త సీఈఓగా అర్జున్ మోహన్ - ఇతని బ్యాగ్రౌండ్ ఏంటంటే?
ప్రముఖ ఎడ్యుకేషన్ సంస్థ బైజూస్(Byjus) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అండ్ ఇండియా బిజినెస్ హెడ్ 'మృణాల్ మోహిత్' స్టార్టప్‌కు రాజీనామా చేశారు. ఈ స్థానంలోకి అనుభవజ్ఞుడైన 'అర్జున్ మోహన్' వచ్చాడు. ఇంతకీ మృణాల్ ఎందుకు రాజీనామా చేసాడు? కొత్త సీఈఓ బ్యాగ్రౌండ్ ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మృణాల్ మోహిత్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా అప్పుల భారంతో ముందుకెళుతున్న కంపెనీకి ఈయన అపారమైన సేవ అందించినట్లు కంపెనీ ఫౌండర్ రవీంద్రన్ వెల్లడించారు. కాగా ఇప్పుడు ఇప్పటికే సంస్థతో అనుభందం ఉన్న 'అర్జున్ మోహన్' సీఈఓగా బాధ్యతలు స్వీకరించాడు. ఈయన సారథ్యంలో సంస్థ మళ్ళీ పూర్వ వైభవం పొందుతుందని భావిస్తున్నారు. గతంలో అర్జున బైజూస్‌లో కీలక పాత్ర పోషించాడు. 2020 వరకు కంపెనీ చీప్ బిజినెస్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆ తరువాత రోనీ స్క్రూవాలా స్థాపించిన ఎడ్టెక్ స్టార్టప్ సీఈఓగా వెళ్లే క్రమంలో రాజీనామా చేశారు. కాగా మళ్ళీ ఇప్పుడు సొంత గూటికి చేరుకున్నారు. మృణాల్ రాజీనామా సందర్భంగా బైజూ రవీంద్రన్ మాట్లాడుతూ.. బైజూస్ ఈ రోజు గొప్ప స్థాయికి చేరుకుందంటే అది తప్పకుండా మా వ్యవస్థాపక బృందం అసాధారణ ప్రయత్నాలే అంటూ అతనికి వీడ్కోలు తెలిపాడు. బైజూస్ నుంచి నిష్క్రమించడం గురించి మృణాల్ మోహిత్ మాట్లాడుతూ.. బైజూస్ వ్యవస్థాపక బృందంలో భాగం కావడం ఒక అద్భుతమైన ప్రయాణం, విద్యారంగంలో పరివర్తనకు సహకరించినందుకు నేను కృతజ్ఞుడను. ఈ సంస్థలో పనిచేసినందుకు గరివిస్తున్నాను అన్నాడు. -
బైజూస్ సరికొత్త ప్లాన్స్: విదేశీ విభాగాల విక్రయంలో
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ బైజూస్ 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,956 కోట్లు) రుణ మొత్తాన్ని పూర్తిగా చెల్లించేసే ప్రయత్నాల్లో ఉంది. ఆరు నెలల్లోపు తిరిగి చెల్లించేందుకు యోచిస్తోంది. తదుపరి మూడు నెలల్లో 300 మిలియన్ల డాలర్లను తిరిగి చెల్లించాలన్న ప్రతిపాదనను ప్రతిపాదనకు రుణదాతలు ఆమోదించడంతో సంస్థకు కొంత ఊరటనివ్వనుంది. (ఆడి క్యూ8 స్పెషల్ ఎడిషన్, ధర చూస్తే..!) ఇందులో భాగంగా విదేశీ విభాగాలైన ఎపిక్, గ్రేట్ లెర్నింగ్ సంస్థలను విక్రయించాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ రెండింటి విక్రయంతో దాదాపు 800 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల వరకు సమకూర్చుకోవచ్చని బైజూస్ భావిస్తున్నట్లు వివరించాయి. అలాగే వాటాల విక్రయం ద్వారా తాజాగా మరిన్ని పెట్టుబడులు కూడా సమీకరించడంపైనా కంపెనీ కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. 1.2 బిలియన్ డాలర్ల రుణాన్ని (టీఎల్‌బీ) మొత్తం మీద ఆరు నెలల వ్యవధిలో తీర్చేయొచ్చని బైజూస్ ఆశిస్తోంది. 2021 నవంబర్‌లో విదేశీ ఇన్వెస్టర్ల నుంచి బైజూస్ ఈ రుణాన్ని తీసుకుంది. (10 శాతం జీఎస్టీ?ఇక డీజిల్ కార్లకు చెక్? నితిన్ గడ్కరీ క్లారిటీ) -
ఆకాశ్‌కు బైజూస్ నోటీసులు
న్యూఢిల్లీ: ఒప్పందంలో భాగమైన షేర్ల మారి్పడి ప్రక్రియను వ్యతిరేకిస్తుండటంపై ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్విసెస్ (ఏఈఎస్ఎల్)కు ఎడ్టెక్ కంపెనీ బైజూస్ మాతృసంస్థ థింగ్ అండ్ లెర్న్ (టీఎల్‌పీఎల్) నోటీసులు పంపింది. వివరాల్లోకి వెడితే .. 2021లో ఏఈఎస్ఎల్ను బైజూస్ 940 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. నగదు, షేర్ల మారి్పడి రూపంలోని ఈ డీల్ ప్రకారం ఏఈఎస్‌ఎల్‌లో టీఎల్పీఎల్కు 43 శాతం, దాని వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కు 27 శాతం, ఏఈఎస్ఎల్ వ్యవస్థాపకుడు చౌదరి కుటుంబానికి 18 శాతం, బ్లాక్‌స్టోన్‌కు 12 శాతం వాటాలు దక్కాయి. ఒప్పందాన్ని బట్టి ఏఈఎస్ఎల్ను టీఎల్పీఎల్లో విలీనం చేయాలి. అయితే, విలీన ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో షేర్ల మార్పిడిని అమలు చేయాలని కోరుతూ చౌదరి కుటుంబానికి టీఎల్‌పీఎల్ నోటీసులు ఇచి్చంది. కానీ మైనారిటీ షేర్హోల్డర్లు ఇందుకు నిరాకరించినట్లు సమాచారం. షేర్ల మారి్పడి ప్రక్రియలో పన్నులపరమైన అంశాలు ఉన్నందున.. దానికి బదులుగా పూర్తిగా నగదే తీసుకోవాలని చౌదరి కుటుంబం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆకాశ్ ఆదాయం మూడు రెట్లు పెరిగి రూ. 3,000 కోట్లకు పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి. -
అన్నా.. ఇది పద్ధతి కాదే.. పవన్ కళ్యాణ్ కు అభిమాని చురకలు
పవన్ కళ్యాణ్.. నేను ప్రశ్నిస్తూనే ఉంటానంటూ ప్రతీ సారి చెప్పుకునే పీకే.. ఇప్పుడు పనికిరాని ప్రశ్నలు వేసి నవ్వులపాలవుతున్నాడు. తనకు తెలియని విద్యావిధానం గురించి, ఇంకెవరో రాసిచ్చిన ప్రశ్నలను అనుసంధానం చేసి.. దాన్ని సోషల్ మీడియా వేదికగా సంధించి ప్రభుత్వంపై బురద జల్లాలనుకున్న పవన్ ప్రయత్నం పాపం.. బెడిసికొట్టింది. ఆంధ్రప్రదేశ్ విద్యావిధానాలు భేష్ ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ ప్రభుత్వం విద్యార్థుల కోసం చేస్తున్న ప్రయత్నాలు, తీసుకొచ్చిన పథకాలకు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు వచ్చాయి. అమెరికా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి వేదికగా జులై మూడో వారంలో జరిగిన హైలెవల్ పొలిటికల్ డిస్కషన్ మీట్ సందర్భంగా ఏపీ ప్రతినిధులు ప్రత్యేకంగా రాష్ట్రంలో చేపడుతున్న విద్యావిధానాలను ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రజెంట్ తీసుకొచ్చారు. పేదరికాన్ని పారదోలాలంటే విద్యకు మించిన విధానం మరొకటి లేదన్న సీఎం జగన్ ఆశయానికి పలు ప్రశంసలు వచ్చాయి. (ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఏపీ ప్రభుత్వ విద్యావిధానాలపై స్టాల్) (చదవండి : ఏపీ విద్యావిధానాలు భేష్) విద్యార్థులకిచ్చిన ట్యాబ్లెట్లపై అక్కసు ఏపీ విధానాలను అందరూ ప్రశంసిస్తుంటే.. కొందరిలో మాత్రం అక్కసు మొదలైంది. అసలు పేద విద్యార్థులకు ట్యాబ్‌లు ఎలా ఇస్తారన్నట్టుగా వీరి వ్యవహారం తయారయింది. విద్యార్థుల విషయ పరిజ్ఞానం పెంచుకునేందుకు ట్యాబ్‌లు ఉపయోగపడుతాయన్న కనీస స్పృహ లేకుండా.. దానిపై చిలువలు పలువలుగా వ్యాఖ్యానాలు జోడించి, కొన్ని ప్రశ్నలను ట్విట్టర్ వేదికగా వదిలారు పవన్ కళ్యాణ్. Points to note : 1. ప్రభుత్వం బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన టాబ్లెట్స్ కోసం దాదాపు 580 కోట్లు ఖర్చు చేస్తుంది. బహిరంగ మార్కెట్ లో ఒక్కొక్క టాబ్లెట్ విలువ 18,000 నుండి 20,000 ఉంటుంది. 2. బైజూస్ CEO రవీంద్రన్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) లో భాగంగా 8వ తరగతి… — Pawan Kalyan (@PawanKalyan) July 23, 2023 సొంత అభిమాని నుంచే పవన్ కు ప్రశ్న పవన్ వ్యాఖ్యలను చాలా మంది తప్పుబట్టారు. అయితే వారంతా ప్రభుత్వానికి చెందిన వారని, వైఎస్సార్ సిపి క్యాడర్ అని జనసేన చెప్పుకోవచ్చు కానీ.. పవన్ ట్వీట్‌కు సొంత అభిమాని రమేష్ బోయపాటి నుంచి ఎదురయిన విమర్శను మాత్రం కచ్చితంగా క్షుణ్ణంగా చదవాల్సిందే. మీ సినిమాలు చూస్తాను, మిమ్మల్ని అనుసరిస్తాను కానీ, పేద విద్యార్థులకు మేలు చేసే విద్యావిధానాన్ని విమర్శిస్తే మాత్రం మౌనంగా ఉండలేనంటూ నేరుగా స్పందన వచ్చింది. ప్రస్తుతం అనుసరిస్తున్న విద్యావిధానంలో కచ్చితంగా సీఎం జగన్ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందేనంటూ నొక్కి వక్కాణించారు రమేష్ బోయపాటి. పవన్ కళ్యాణ్ గారు బైజూస్ తో రాష్ట్రం కుదుర్చుకున్న ఒప్పందం గురించి మీరు లేవనెత్తిన సందేహాలు విలువైనవి. ఇక్కడ మీ ట్వీట్ ఉద్దేశం బైజూస్ తో ఒప్పందం గురించి కన్నా, ఆ ఒప్పందంలో ఉన్న అనేక సందేహాల గురించి అర్థం చేసుకునే ప్రయత్నం అనిపించింది. నేను కూడా ఈ విషయం గురించి అవగాహన ఏర్పరుచుకునే… pic.twitter.com/thDcCgldYM — Ramesh Boyapati (@rameshboyapati) July 24, 2023 -
బైజూస్ ఆఫీస్‌లో జగడం.. ఘర్షణకు దిగిన మహిళా ఉద్యోగి.. వీడయో వైరల్
ప్రముఖ ఎడ్ టెక్ కంపెనీ బైజూస్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగుల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. ఇన్సెంటివ్‌ల విషయంలో జరిగిన అన్యాయంపై ఓ మహిళా ఉద్యోగి తన సీనియర్‌తో ఘర్షణకు దిగినట్లుగా ఆ వైరల్ వీడియోలో కనిపిస్తోంది. తొలగింపునకు గురైన మహిళా ఉద్యోగి ఇన్సెంటివ్‌లు, ఇతర విషయాల్లో తనకు జరిగిన అన్యాయంపై తన బాస్‌ను గట్టిగా ప్రశ్నించింది. తనను ఉన్నట్టుండి తొలగించారని, ఫైనల్ సెటిల్మెంట్లోనూ అన్యాయం జరిగిందని, కేవలం రూ. 2,000 మాత్రమే వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది జరిగిన తర్వాత ఆమె కనిపించకుండా పోయిందంటూ ట్విటర్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. 'ఘర్ కే కలేష్' అనే ట్విటర్ హ్యాండిల్లో అప్లోడ్ చేసిన వీడియో ప్రామాణికత నిర్ధారణ కాలేదు. ఈ వీడియోపై పలువురు ట్విటర్ యూజర్లు ప్రతిస్పందించారు. ఇలాంటివి జరగకుండా వర్క్ ఫ్రం హోంను ఎంచుకోవడం మేలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు ఫైనల్ సెటిల్మెంట్లో ఆమెకు కేవలం రూ.2000 మాత్రమే ఇవ్వడంపై బైజూస్ యాజమాన్యాన్ని విమర్శిస్తూ కామెంట్లు పెట్టారు. Kalesh b/w Employee and Byjus Companyy over giving lot’s of mental pressure during job (Unfortunately Girl is missing since then) pic.twitter.com/xzgIUbqjeq — Ghar Ke Kalesh (@gharkekalesh) July 22, 2023 -
అందరూ ఐటీ ఉద్యోగులే, లక్షల్లో ప్యాకేజీలు..ఎవర్ని పెళ్లి చేసుకోవాలో చెప్పరా! ప్లీజ్!
సాఫ్ట్వేర్! ఇదేదో డిగ్రీ పేరో, కోర్స్ పేరో కాదు. ఇండియాలో ఇదో లైఫ్‌స్టైల్. కొత్తగా రెక్కలొచ్చిన పక్షి ఎంత స్వేచ్ఛగా ఎగిరిపోతుందో.. అంతకన్నా స్వేచ్ఛగా యువతరం ఎగిరేలా చేసినా ఓ కొత్త లైఫ్ ట్రెండ్. బీటెక్ పూర్తి చేయకముందే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో స్టూడెంట్స్‌ను కంపెనీలు ఎత్తుకెళ్లిపోయేవే. కెరియర్లో అడుగు పెట్టగానే నెలనెల అకౌంట్లో శాలరీ వచ్చి పడేది. రెండ్రోజులు సెలవు. ఈలోగా కంపెనీలు ఇచ్చే పార్టీలు, ఇన్సెంటీవ్స్‌తో ఒక్కసారిగా లగ్జరీ లైఫ్ ఆవరించేసింది. రెండుమూడేళ్లు తిరిగే సరికి ఒక్కొక్కరికి ప్రమోషన్లు. జీతం వేలు దాటి లక్షల్లోకి ఎగబాకింది. అప్పటి వరకు ఎప్పుడూ చూడనంత డబ్బు చేతికొచ్చింది. చదువుకునే రోజుల్లో వందకి, వెయ్యికి నాన్నని అడిగే రోజుల నుంచి లక్షల్లో బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటెన్ చేసే రేంజ్‌కి ఎదిగిపోయారు. దీంతో ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా అంతా తమ హైక్లాస్ రేంజ్ చూపించుకునే వారు. ఇలా జాబ్, శాలరీలోనే కాదు చేసుకునే అర్ధాంగి విషయంలోనూ పోటీ పడుతున్నారు టెక్కీలు. ‘దిగ్గజ టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నాం. లక్షలు సంపాదిస్తున్నాం అంటూ బీకాం చదివి ఇంటి దగ్గరే ఉంటున్న 29 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకునేందుకు యువకులు పోటీ పడుతున్నారు. మాట్రిమోని వెబ్సైట్లో ఆమె గురించి ఆరా తీస్తున్నారు. ఏ సంస్థలో పనిచేస్తున్నారు? ఎంత సంపాదిస్తున్నారనే విషయాల గురించి కులంకషంగా చర్చిస్తూ పెళ్లి ప్రపోజల్స్ సైతం పంపారు. దీంతో వాళ్లు జాబ్ చేస్తున్న కంపెనీలు, తీసుకుంటున్న శాలరీలను చూసి పాపం ఆ యువతికి ఎలాంటి వరుణ్ని భాగస్వామిగా ఎంచుకుంటే బాగుంటుందనే నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇదే విషయాన్ని నెటిజన్లతో పంచుకుంది. అందులో ‘నా పెళ్లి గురించి మాట్రిమోనీలో 14 మంది యువకులతో విడివిడిగా మాట్లాడుతున్నాను. ఎవరిని పెళ్లి చేసుకోవాలో అర్ధం కావడం లేదు’. శాలరీలు ఏడాదికి రూ.14 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు ఉన్నాయి. బైజూస్, ఫ్లిప్‌కార్ట్, డెలాయిట్, టీసీఎస్‌లో పనిచేస్తున్నారు. మీరే చెప్పండి ఎవర్ని పెళ్లి చేసుకోవాలో అర్ధం కావడం లేదు. సాయం చేయండని అభ్యర్ధించినట్లుగా ఉన్న ఓ ట్వీట్ వెలుగులోకి వచ్చింది. Here's how I approach this Girl is 29 yr old jobless BCOM. For such a girl most of the below options are too good to be safe For instance, Why is 45 LPA guy or a doc vying for her? Unless guys have some major shortcomings Under 30 & under 20 LPA seems a realistic bet (no 14) pic.twitter.com/UXa6KZd2rK — Dr Blackpill (@darkandcrude) July 18, 2023 ఆ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వయస్సులో ఎందుకు జాబ్ చేయడం లేదని ప్రశ్నిస్తుంటే..మరికొందరు ఈ పోస్ట్ ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు. ఏది ఏమైనా యువతి పెళ్లి చూపుల వ్యవహారం ఎలా ఉన్నా.. ఆర్ధిక మాంద్యంలోనూ ఐటీ ఉద్యోగుల జీతాలు భారీ స్థాయిలో ఉండడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 150 ఏళ్ల చరిత్రలో.. తొలి ఐఫోన్ తయారీ సంస్థగా టాటా గ్రూప్! -
బైజూస్ ‘ఇంటర్నేషనల్’ సీఈవోగా అర్జున్ మోహన్
న్యూఢిల్లీ: విద్యా రంగ సేవల్లో ఉన్న బైజూస్, తన ఇంటర్నేషనల్ వ్యాపారానికి సీఈవోగా అప్‌గ్రాడ్ మాజీ చీఫ్ అర్జున్ మోహన్‌ను నియమించుకుంది. కంపెనీ వ్యవస్థాపకుడు రవీంద్రన్ ఇక ముందు కూడా గ్రూప్ సీఈవోగా కొనసాగనున్నారు. మృణాల్ మోహిత్ భారత వ్యాపారానికి చీఫ్‌గా కొనసాగుతారని సంస్థ ప్రకటించింది. తాజా నియామకంతో అర్జున్ మోహన్ తన సొంతగూటికి తిరిగి వచి్చనట్టయింది. అప్‌గ్రాడ్ సీఈవోగా చేరడానికి ముందు 11 ఏళ్ల పాటు అర్జున్ మోహన్ బైజూస్లోనే చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా సేవలు అందించడం గమనార్హం. గతేడాది డిసెంబర్లోనే అప్‌గ్రాడ్‌కు మోహన్ రాజీనామా చేశారు. అమెరికా, కెనడా, మెక్సికో, ఆ్రస్టేలియా, యూకే, బ్రెజిల్, మధ్య ప్రాచ్యం తదిత 100 దేశాల్లో బైజూస్‌కు యూజర్లు ఉన్నారు. అంతేకాదు విదేశాల్లో పెద్ద ఎత్తున కంపెనీలను సైతం కొనుగోలు చేస్తూ వచి్చంది. అమెరికాకు చెందిన రీడింగ్ ప్లాట్‌ఫామ్ ఎపిక్ (500 మిలియన్ డాలర్లు), కోడింగ్ సైట్ టింకర్(200 మిలియన్ డాలర్లు)ను బైజూస్ గతంలో కొనుగోలు చేసింది. అలాగే, సింగపూర్‌కు చెందిన గ్రేట్ లెర్నింగ్(600 మిలియన్ డాలర్లు), ఆస్ట్రియాకు చెందిన జియోగెర్బా(100 మిలియన్ డాలర్లు)ను లోగడ కొనుగోలు చేయడం గమనార్హం. ఈ వ్యాపారాలన్నింటికీ మోహన్ నేతృత్వం వహించనున్నారు. ఇటీవలి కాలంలో బైజూస్ పలు ప్రతికూల పరిణామాలు ఎదురు చూసింది. జీవీ రవిశంకర్, రస్సెల్ డ్రీసెన్స్టాక్, చాన్ జుకర్‌బెర్గ్ తదితరులు బైజూస్ బోర్డుకు రాజీనామా చేశారు. అయితే, ఈ రాజీనామాలను తాము ఇంకా ఆమోదించదేని రవీంద్రన్ వాటాదారులకు స్పష్టం చేశారు. పునర్వ్యవస్థీకరణ పేరుతో 1,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జూన్‌లో బైజూస్ ప్రకటించింది. కంపెనీ ఆడిటర్ సేవలకు డెలాయిట్ రాజీనామా చేసి ని్రష్కమించింది. ఏప్రిల్‌లో కంపెనీ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. సలహా మండలిలో రజనీష్ కుమార్, మోహన్‌దాస్ పాయ్ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ రజనీష్ కుమార్, ఐటీ రంగ దిగ్గజం టీవీ మోహన్‌దాస్ పాయ్ తమ సంస్థ సలహా మండలిలో చేరనున్నట్లు బైజూస్ వెల్లడించింది. తమ విజన్‌పై వారికి గల నమ్మకానికి ఇది నిదర్శనమని సంస్థ వ్యవస్థాపకులు దివ్యా గోకుల్‌నాథ్, బైజు రవీంద్రన్ తెలిపారు. వ్యవస్థాపకులు కంపెనీని సరైన దారిలో నడిపించేందుకు నిజాయితీగా కృషి చేస్తున్నారని తమకు నమ్మకం కుదిరిన మీదట సలహా మండలిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కుమార్, పాయ్ తెలిపారు. -
టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్ ఎవరంటే..?
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు జెర్సీ ప్రధాన స్పాన్సర్‌గా ఫాంటసీ స్పోర్ట్స్ లీగ్ కంపెనీ ‘డ్రీమ్11’ ఎంపికవడం దాదాపు ఖాయమైంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఎంత మొత్తానికి అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటి వరకు టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కంపెనీ ‘బైజూస్’ ఉంది. గత ఏప్రిల్‌తో బైజూస్ ఒప్పందం ముగిసింది. దాంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ల కోసం బిడ్లను పిలిచింది. గతంలో ఐపీఎల్ టోర్నీ ప్రధాన స్పాన్సర్‌గా కూడా డ్రీమ్11 వ్యవహరించింది. అయితే బీసీసీఐతో కొత్త ఒప్పందం ప్రకారం... ఇప్పటివరకు బైజూస్ చెల్లించిన మొత్తం (ఒక్కో మ్యాచ్‌కు)కంటే డ్రీమ్11 తక్కువగా చెల్లించనున్నట్లు సమాచారం. లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత దీనిపై బోర్డు అధికారిక ప్రకటన చేయనుంది. -
లాభదాయకతకు దగ్గర్లో బైజూస్
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ బైజూస్ నెమ్మదిగా, స్థిరంగా వృద్ధి చెందుతోందని సంస్థ సీఈవో బైజూ రవీంద్రన్ తెలిపారు. గ్రూప్ స్థాయిలో లాభదాయకతకు చాలా దగ్గర్లోనే ఉన్నామని ఆయన చెప్పారు. బైజూస్ వృద్ధి, భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితిపై ఆందోళనలను తొలగించేందుకు నిర్వహించిన టౌన్‌హాల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా రవీంద్రన్ ఈ విషయాలు తెలిపారు. 1.2 బిలియన్ డాలర్ల టర్మ్ లోన్ బీ (టీఎల్‌బీ) రుణదాతలతో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, మరికొన్ని వారాల్లోనే సానుకూల ఫలితం రాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. అంతర్జాతీయంగా టెక్ కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ బైజూస్ మాత్రం లాభదాయకత లక్ష్యాల దిశగా గణనీయంగా పురోగతి సాధించిందని రవీంద్రన్ చెప్పారు.బైజూస్ ఆర్థిక పని తీరు, రుణ భారం, ఆర్థిక ఫలితాలను ప్రకటించడంలో జాప్యాలు, కంపెనీ వేల్యుయేషన్‌ను ఇన్వెస్ట్మెంట్ సంస్థ ప్రోసస్ 6 బిలియన్ డాలర్లకు కుదించడం తదితర ప్రతికూల పరిణామాల నేపథ్యంలో రవీంద్రన్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. -
సెప్టెంబర్ నాటికి ఆడిట్ పూర్తి
న్యూఢిల్లీ: 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఖాతాల ఆడిట్ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి కాగలదని ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ సీఈవో బైజూ రవీంద్రన్.. ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. అలాగే 2023 ఆర్థిక సంవత్సరం ఆర్థిక ఫలితాలు డిసెంబర్ నాటికి పూర్తి కాగలవని షేర్హోల్డర్లతో కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలో తప్పిదాలు జరిగాయని అంగీకరించిన రవీంద్రన్.. వాటి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు. అటు బోర్డు సభ్యుల రాజీనామా విషయం కూడా వాస్తవమేనని, కానీ కంపెనీ ఇంకా వాటిని ఆమోదించలేదని తెలిపారు. ఈలోగానే రా జీనామా వార్తలు లీకయ్యాయని పేర్కొన్నారు. కొత్త గా నియమితులైన సీఎఫ్‌వో అజయ్ గోయల్‌ను రవీంద్రన్ పరిచయం చేశారు. రాజీనామా చేసిన ముగ్గురు డైరెక్టర్లు కూడా సమావేశంలో పా ల్గొన్న ట్లు సమాచారం. ఆడిటర్లు వైదొలగడం, తమ రా జీనామాలు రెండూ వేర్వేరు అంశాలని వారు చెప్పి నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. సంస్థ లోని వివిధ విభాగాలు మెరుగ్గానే పనిచేస్తున్నాయని, గ్రూప్ కౌన్సిల్‌తో కలిసి కొత్త సీఎఫ్‌వో సంస్థను మరింత పటిష్టం చేయగలరని రవీంద్రన్ తెలిపిన ట్లు పేర్కొన్నాయి. 2022 ఆర్థిక సంవత్సర ఫలితాలను ఇంకా వెల్లడించకపోవడం, ఆడిటర్లు.. డైరెక్ట ర్లు రాజీనామా చేయడం, 1 బిలియన్ డాలర్ల రుణా ల చెల్లింపుపై వివాదం నెలకొనడం తదితర సవాళ్ల తో బైజూస్ సతమతమవుతున్న సంగతి తెలిసిందే. -
బైజూస్‌లో ఏం జరుగుతోంది? ఆడిటర్‌గా తప్పుకున్న డెలాయిట్.. డైరెక్టర్ల రాజీనామా
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ బైజూస్‌లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు కంపెనీ ఆడిటింగ్ బాధ్యతల నుంచి డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ తప్పుకోగా మరోవైపు ముగ్గురు డైరెక్టర్లు రాజీనామా చేశారు. వివరాల్లోకి వెడితే .. 2021–22 ఆర్థిక సంవత్స ఆర్థిక ఫలితాల రూపకల్పనలో తీవ్ర జాప్యం నేపథ్యంలో తమ కాంట్రాక్టు ముగియడానికి మూడేళ్ల ముందే రాజీనామా చేసినట్లు డెలాయిట్ తెలిపింది. ఆడిటింగ్ కోసం తాము తరచుగా బైజూస్ ఎండీ బైజూ రవీంద్రన్‌కి లేఖలు రాస్తూనే ఉన్నప్పటికీ తమకు ఎటువంటి సమాచారం లభించలేదని పేర్కొంది. ఫలితంగా ఇప్పటివరకూ ఆడిట్ ప్రారంభించలేకపోయామని డెలాయిట్ వివరించింది. దీంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు బైజూస్ బోర్డుకు రాసిన లేఖలో తెలిపింది. డెలాయిట్ 2016 నుంచి బైజూస్‌కి ఆడిటర్‌గా వ్యవహరిస్తోంది. మరోవైపు, 2022 ఆర్థిక సంవత్సరం నుంచి వర్తించేలా అయిదేళ్ల పాటు బీడీవో (ఎంఎస్కేఏ అండ్ అసోసియేట్స్)ను చట్టబద్ధ ఆడిటర్లుగా నియమించుకున్నట్లు బైజూస్ మరో ప్రకటనలో తెలిపింది. బీడీవో ప్రస్తుతం ఐసీఐసీఐ, సిస్కో వంటి దిగ్గజాలకు ఆడిటింగ్ సేవలు అందిస్తోంది. టర్నోవరుపరంగా టాప్ అయిదు గ్లోబల్ ఆడిట్ సంస్థల్లో ఒకటిగా ఉంది. ఇక బైజూ రవీంద్రన్తో అభిప్రాయభేదాల కారణంగా డైరెక్టర్ల బోర్డులో ముగ్గురు రాజీనామా చేశారు. పీక్ 15 పార్ట్నర్స్ (గతంలో సెక్వోయా క్యాపిటల్)కి చెందిన జీవీ రవిశంకర్, చాన్ జకర్బర్గ్ ఇనీíÙయేటివ్ ప్రతినిధి వివియన్ వూ, ప్రోసస్కి చెందిన రసెల్ డ్రీసెన్స్టాక్ వీరిలో ఉన్నారు. బోర్డులోని మొత్తం ఆరుగురు సభ్యుల్లో మిగతా ముగ్గురు బైజూ రవీంద్రన్, దివ్యా గోకుల్‌నాథ్, రిజూ రవీంద్రన్ ఉన్నారు. అటు కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బాధ్యతలు చేపట్టే వరకూ ఆగాలని బైజూస్ భావించడమే ఆడిటింగ్ జాప్యానికి కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. బైజూస్ కొత్త గ్రూప్ సీఎఫ్‌వోగా అజయ్ గోయల్ నెల రోజుల క్రితమే చేరారని, వచ్చే వారం తర్వాత నుంచి ఆడిటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వివరించాయి. -
వెయ్యి మందికి బైజూస్ బైబై
న్యూఢిల్లీ: ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ తాజాగా వివిధ విభాగాల నుంచి 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థ పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. బిలియన్ డాలర్ల (రూ.8,200 కోట్లు) టర్మ్ లోన్ విషయమై అమెరికాలో రుణదాతలతో బైజూస్ న్యాయ పోరాటం చేస్తున్న తరుణంలో ఈ పరిణామం చేసుకోవడం గమనార్హం. కొత్త ఉద్యోగుల చేరికను కలిపి చూస్తే మొత్తం ఉద్యోగుల సంఖ్య 50,000 స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. బైజూస్ లోగడ 5 శాతం ఉద్యోగులు అంటే సుమారు 2,500 మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. 2020 అక్టోబర్ నుంచి ఆరు నెలల కాలంలో ఇంత మందిని తగ్గించుకోనున్నట్టు తెలిపింది. 2023 మార్చి నాటికి లాభాల్లోకి రావాలన్న లక్ష్యంలో భాగంగా నాడు ఆ నిర్ణయం తీసుకుంది. వ్యయాలు తగ్గించుకోవడంలో భాగమే ఈ తొలగింపులు అన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.