
న్యూఢిల్లీ: ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,956 కోట్లు) రుణ మొత్తాన్ని పూర్తిగా చెల్లించేసే ప్రయత్నాల్లో ఉంది. ఆరు నెలల్లోపు తిరిగి చెల్లించేందుకు యోచిస్తోంది. తదుపరి మూడు నెలల్లో 300 మిలియన్ల డాలర్లను తిరిగి చెల్లించాలన్న ప్రతిపాదనను ప్రతిపాదనకు రుణదాతలు ఆమోదించడంతో సంస్థకు కొంత ఊరటనివ్వనుంది. (ఆడి క్యూ8 స్పెషల్ ఎడిషన్, ధర చూస్తే..!)
ఇందులో భాగంగా విదేశీ విభాగాలైన ఎపిక్, గ్రేట్ లెర్నింగ్ సంస్థలను విక్రయించాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ రెండింటి విక్రయంతో దాదాపు 800 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల వరకు సమకూర్చుకోవచ్చని బైజూస్ భావిస్తున్నట్లు వివరించాయి. అలాగే వాటాల విక్రయం ద్వారా తాజాగా మరిన్ని పెట్టుబడులు కూడా సమీకరించడంపైనా కంపెనీ కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. 1.2 బిలియన్ డాలర్ల రుణాన్ని (టీఎల్‌బీ) మొత్తం మీద ఆరు నెలల వ్యవధిలో తీర్చేయొచ్చని బైజూస్ ఆశిస్తోంది. 2021 నవంబర్‌లో విదేశీ ఇన్వెస్టర్ల నుంచి బైజూస్ ఈ రుణాన్ని తీసుకుంది. (10 శాతం జీఎస్‌టీ?ఇక డీజిల్ కార్లకు చెక్? నితిన్ గడ్కరీ క్లారిటీ)
Comments
Please login to add a commentAdd a comment