loan repayments
-
ఒక్క ఈఎంఐతో ఐదేళ్లు ఆదా!
సొంతిల్లు సామాన్యుడి కల. దీన్ని నెరవేర్చుకునేందుకు చాలా కష్టపడుతుంటారు. అందుకోసం డబ్బు పోగు చేస్తారు. కొంత నగదు సమకూరిన తర్వాత హోంలోన్ తీసుకుని ఇంటిని సొంతం చేసుకుంటారు. నెలవారీ ఈఎంఐల కోసం తిరిగి కష్టపడుతుంటారు. అయితే ఈ లోన్ వ్యవధి సుమారు 25 ఏళ్లపాటు ఉంటుంది. దాంతో భారీగా వడ్డీ చెల్లించాలి. ఆలోపు అనుకోకుండా ఏదైనా డబ్బు అవసరం ఏర్పడితే ఈఎంఐలకు ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఈ లోన్ కాలపరిమితిని తగ్గించుకుంటే త్వరగా అప్పు తీర్చడంతోపాటు ఇతర ఖర్చులకు డబ్బును సమకూర్చుకోవచ్చు. అయితే త్వరగా ఇంటి రుణం ఎలా చెల్లించాలో తెలుసుకుందాం.ఉద్యోగం చేస్తున్నవారు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అందుకున్నప్పుడు అందుకు అనుగుణంగా వేతనం పెరుగుతుంది. అలా పెరిగిన డబ్బుతో ఏటా 10 శాతం ఈఎంఐ పెంచుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించండి. దీనివల్ల 25 ఏళ్ల కాలానికి తీసుకున్న రుణం.. 10 ఏళ్లలోనే పూర్తవుతుంది.ఏటా 10 శాతం ఈఎంఐ పెంచడం కష్టం అని భావించేవారు తమ ఇంటి రుణాన్ని 13 ఏళ్లలో తీర్చవచ్చు. ఇందుకోసం నెలవారీ వాయిదాను ఏటా ఐదు శాతం వరకు పెంచుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మీకు ఖర్చుల విషయంలోనూ పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అదే సమయంలో రుణంపై వడ్డీ భారమూ తగ్గుతుంది.ఏటా 12 ఈఎంఐలకు బదులుగా కేవలం ఒక ఈఎంఐని అధికంగా చెల్లిస్తే మీ ఇంటిరుణం వ్యవధి ఏకంగా ఐదేళ్లు తగ్గుతుంది. అంటే 25 ఏళ్ల పాటు సాగే రుణ భారాన్ని 20 ఏళ్లలోనే పూర్తి చేసుకోవచ్చు.ఇదీ చదవండి: 99.1 శాతం ఫిర్యాదుల పరిష్కారంనెలవారీ సంపాదనలో అన్ని ఈఎంఐలు కలిపి 50 శాతానికి మించకూడదు. ఒకవేళ ఈ పరిధిదాటితే ఇతర ఖర్చులకు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.సొంతింటిలో అదనంగా ఫ్లోర్లు ఏర్పాటు చేసి గదులు కిరాయికి ఇవ్వొచ్చు. అలా వచ్చే రెంట్‌తో ఈఎంఐ పెంచుకోవచ్చు. దాంతో తక్కువ సమయంలోనే లోన్ పూర్తి చేయవచ్చు. -
భారమవుతున్న విద్యారుణాలు!
బ్యాంకులు అందిస్తున్న విద్యారుణాలు భారమవుతున్న తరుణంలో బడ్జెట్ 2024-25 ప్రసంగంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటుందని చాలామంది భావించారు. కానీ ప్రస్తుతం ఉన్న రూ.4 లక్షల ఉన్నత విద్యారుణాన్ని రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. గుడ్డి కంటే మెల్ల మేలు అన్నట్లు వడ్డీలపై నిర్ణయాన్ని వెల్లడించకుండా రుణ పరిమాణాన్ని పెంచడం ఒకింత మేలు చేసే అంశమే అయినా, భవిష్యత్తులో క్రీయాశీలకంగా మరిన్ని నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.2047లోపు ‘వికసిత భారత్’ లక్ష్యంగా విత్త మంత్రి నిర్మలా సీతారామన్ మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగకల్పన, రెసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బలోపేతం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలుగా ప్రస్తుతం ఉన్న రుణ సదుపాయాన్ని రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. అయితే బ్యాంకులు ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాలను మంజూరు చేయడం లేదు. రుణాల జారీ అంశాన్ని అకడమిక్ మార్కులకు లింక్ పెడుతున్నారు. దాంతో రుణ గ్రహీతలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గతంలో బ్యాంకులు విద్యా రుణాలను దాదాపు 4 శాతం వడ్డీకే అందించేవి. ప్రస్తుతం అది సుమారు 12.5 శాతానికి చేరింది.ఇదీ చదవండి: 379 అక్రమ రుణ వెబ్సైట్లు, 91 ఫిషింగ్ సైట్ల తొలగింపుప్రభుత్వం స్పందించి 2047 కల్లా ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని చేరుకునేలా విద్యా రుణాలను మరింత సులభతరం చేసి, తక్కువ వడ్డీలకే వాటిని అందిచేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. దాంతోపాటు ఉన్నత విద్య చదువుతున్న సమయంలోనే కళాశాలలు, కంపెనీలు పరస్పరం ఒప్పందం కుదుర్చుకునేలా మరిన్ని ఏర్పాట్లు చేయాలని చెబుతున్నారు. దానివల్ల విద్యార్థి దశలోనే రియల్‌టైమ్ అనుభవం రావడంతో చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. -
బైజూస్ సరికొత్త ప్లాన్స్: విదేశీ విభాగాల విక్రయంలో
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ బైజూస్ 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,956 కోట్లు) రుణ మొత్తాన్ని పూర్తిగా చెల్లించేసే ప్రయత్నాల్లో ఉంది. ఆరు నెలల్లోపు తిరిగి చెల్లించేందుకు యోచిస్తోంది. తదుపరి మూడు నెలల్లో 300 మిలియన్ల డాలర్లను తిరిగి చెల్లించాలన్న ప్రతిపాదనను ప్రతిపాదనకు రుణదాతలు ఆమోదించడంతో సంస్థకు కొంత ఊరటనివ్వనుంది. (ఆడి క్యూ8 స్పెషల్ ఎడిషన్, ధర చూస్తే..!) ఇందులో భాగంగా విదేశీ విభాగాలైన ఎపిక్, గ్రేట్ లెర్నింగ్ సంస్థలను విక్రయించాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ రెండింటి విక్రయంతో దాదాపు 800 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల వరకు సమకూర్చుకోవచ్చని బైజూస్ భావిస్తున్నట్లు వివరించాయి. అలాగే వాటాల విక్రయం ద్వారా తాజాగా మరిన్ని పెట్టుబడులు కూడా సమీకరించడంపైనా కంపెనీ కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. 1.2 బిలియన్ డాలర్ల రుణాన్ని (టీఎల్‌బీ) మొత్తం మీద ఆరు నెలల వ్యవధిలో తీర్చేయొచ్చని బైజూస్ ఆశిస్తోంది. 2021 నవంబర్‌లో విదేశీ ఇన్వెస్టర్ల నుంచి బైజూస్ ఈ రుణాన్ని తీసుకుంది. (10 శాతం జీఎస్టీ?ఇక డీజిల్ కార్లకు చెక్? నితిన్ గడ్కరీ క్లారిటీ) -
వేదాంత 250 మిలియన్ డాలర్ల రుణ చెల్లింపు
న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత రిసోర్సెస్.. తాజాగా బార్క్లేస్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు నుంచి తీసుకున్న 250 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 2,000 కోట్లు) రుణాన్ని తిరిగి చెల్లించేసింది. బార్క్లేస్ బ్యాంకుకు 150 మిలియన్ డాలర్లు, స్టాండర్డ్ చార్టర్డ్‌కు 100 మిలియన్ డాలర్లు చెల్లించినట్లు సంస్థ తెలిపింది. సంస్థ ఆర్థిక పరిస్థితులపై ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. రాబోయే రోజుల్లోనూ జరపాల్సిన చెల్లింపులకు తగినన్ని నిధులు తమ దగ్గర ఉన్నట్లు కొద్ది రోజుల క్రితమే తెలిపింది. మార్చి నాటికి చెల్లించాల్సిన రుణాలన్నింటినీ ముందుగానే చెల్లించేసినట్లు వివరించింది. 1.75 బిలియన్ డాలర్ల నిధులను సమకూర్చుకునే ప్రయత్నాలు తుది దశలో ఉన్నట్లు వేదాంత రిసోర్సెస్ పేర్కొంది. -
అదానీ షేర్ల తనఖా రుణాల చెల్లింపు
న్యూఢిల్లీ: షేర్ల తనఖా ద్వారా తీసుకున్న 215 కోట్ల డాలర్ల(రూ. 17,630 కోట్లు) రుణాలను తిరిగి చెల్లించినట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా పేర్కొంది. ఈ నెలాఖరుకు గడువు ఉన్నప్పటికీ ముందుగానే చెల్లించినట్లు తెలియజేసింది. ఈ బాటలో సంస్థ ఇప్పటికే 90.2 కోట్ల డాలర్లు(రూ. 7,374 కోట్లు) చెల్లించింది. వెరసి మొత్తం రూ. 17,630 కోట్ల రుణాలను క్లియర్ చేసినట్లు అదానీ గ్రూప్ వివరించింది. అంతేకాకుండా అంబుజా సిమెంట్ కొనుగోలుకి తీసుకున్న మరో 50 కోట్ల డాలర్ల(రూ. 4,100 కోట్లు) రుణాలను సైతం చెల్లించినట్లు వెల్లడించింది. ఇటీవలే గ్రూప్‌లోని నాలుగు లిస్టెడ్ కంపెనీలలో స్వల్ప వాటాల విక్రయం ద్వారా రూ. 15,446 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. జీక్యూజీ పార్ట్నర్స్ ఈ వాటాలను కొనుగోలు చేసింది. షేర్ల తీరిలా అదానీ గ్రూప్ షేర్లు సోమవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఎన్డీటీవీ, ఏసీసీ, అంబుజా సిమెంట్స్, అదానీ విల్మర్, పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ ఎంటర్ప్రైజెస్ 5–1 శాతం క్షీణించాయి. అయితే అదానీ పవర్, ట్రాన్స్మిషన్, గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ 5 శాతం చొప్పున జంప్ చేశాయి. -
InternationalWomen's Day 2023: మహిళల నిజాయితీపై సంచలన రిపోర్ట్
సాక్షి,ముంబై: రుణాలు చెల్లింపులో మహిళలే ముందు ఉన్నారని తాజా రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. రుణాలను తిరిగి చెల్లించడంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ నిజాయితీగా ఉన్నారని క్రెడిట్ డేటా సంస్థ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తాజా నివేదిక వెల్లడించింది. స్త్రీలకు రుణాలు ఇవ్వడం పురుషుల కంటే తక్కువ ప్రమాదకరమని ఈ డేటా వెల్లడించింది. అందుకే గత ఐదేళ్లలో మహిళలకిచ్చే రుణాల సంఖ్య బాగా పెరిగిందని వ్యాఖ్యానించింది. ప్రతి ఏటా మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన నివేదికను ప్రకటిస్తుంది తన రుణ చెల్లింపుపై ఒక నివేదికను తాజాగా విడుదల చేసింది. బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీల నుండి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే విషయంలో భారతదేశంలోని స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ మనస్సాక్షిగా ఉంటారని వెల్లడించింది. గత ఐదేళ్లలో మహిళలకిచ్చే రుణాల సంఖ్య పెరగడానికి వారి మరింత నిజాయితీగా తిరిగి చెల్లించే ప్రవర్తనే కారణమని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం గత ఐదేళ్లలో భారతదేశంలో మహిళా రుణగ్రహీతల సంఖ్య వార్షిక రేటు 15 శాతం పెరిగింది, పురుషులతో పోలిస్తే ఇది 11 శాతం. 2017లో 25 శాతం మంది మహిళలు రుణాలు తీసుకోగా, 2022లో ఈ సంఖ్య 28 శాతానికి పెరిగింది. దేశ ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది ఈ గణాంకాలు సూచిస్తున్నాయని పేర్కొంది. ప్రస్తుతం, దేశీయ అంచనా జనాభా 1.4 బిలియన్లలో దాదాపు 454 మిలియన్ల వయోజన మహిళలు ఉన్నారు. వీరిలో 2022 వరకు దాదాపు 6.3 కోట్ల మంది మహిళలు రుణాలు తీసుకున్నారు. మహిళలకు రుణ సదుపాయం 2017లో 7 శాతంగా ఉంది, ఇది 2022లో 14 శాతానికి పెరిగింది. ఇప్పటివరకు సాధించిన పురోగతి ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ ఇంకా మెరుగు పడాల్సి ఉందనికూడా తెలిపింది. మహిళా రుణగ్రహీతల సంఖ్య పెరగడం ప్రభుత్వ ఆర్థిక సమ్మేళనానికి సానుకూల సంకేతమని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ సీవోవో హర్షలా చందోర్కర్ అభిప్రాయపడ్డారు. వివిధ సామాజిక-ఆర్థిక వర్గాలు, ఏజ్ గ్రూపులు,, భౌగోళిక ప్రాంతాలలో మహిళలకు అనుగుణంగా రుణాలను అందించడం వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో వారికి సహాయపడుతుందని కూడా ఆమె సూచిస్తున్నారు. దీని వల్ల మహిళలకే కాకుండా సంప్రదాయంగా వెనుకబడిన రంగాలకు కూడా ప్రయోజనం కలుగుతుందన్నారు. -
ఫేక్ లోన్‌యాప్‌లపై నిఘా
సాక్షి, అమరావతి: లోన్‌యాప్‌ల వేధింపులు, మోసాలను కట్టడి చేసేందుకు పోలీసుశాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉమ్మడి కార్యాచరణకు ఉపక్రమించాయి. అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న లోన్‌యాప్‌లపై నిఘా పెట్టాయి. ప్రధానంగా చైనాలోని లోన్‌యాప్ కంపెనీలు మన దేశంలో అనధికారికంగా ఏజెంట్లను పెట్టుకుని సాగిస్తున్న దందాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా రంగంలోకి దిగాయి. ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఈడీ) దేశంలోని వివిధ ప్రాంతాల్లో లోన్‌యాప్ కంపెనీల కార్యాలయాలపై విస్తృతంగా దాడులు నిర్వహించింది. యూపీఐ ఖాతాల ద్వారా చైనాకు భారీగా నిధులు తరలిస్తున్న వివిధ కంపెనీలను గుర్తించింది. ఆ కంపెనీల కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లను పరిశీలించగా లోన్‌యాప్ దందా మొత్తం బట్టబయలైంది. దీంతో ఆ ఫేక్ లోన్‌యాప్ కంపెనీల జాబితాలను అన్ని జిల్లాలకు పంపించి వాటి కార్యకలాపాలు అడ్డుకునేందుకు పోలీసుశాఖ ఉద్యుక్తమైంది. ఆకర్షణీయమైన పేర్లతో బురిడీ చైనాకు చెందిన లోన్‌యాప్ కంపెనీలు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, లక్నో తదితర నగరాల్లో అనధికారికంగా బీపీవో కేంద్రాలను ఏర్పాటుచేసి ఈ దందా సాగిస్తున్నాయి. హైదరాబాద్, చెన్నైల్లోని కేంద్రాల నుంచే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ కంపెనీలు వ్యవహారం నడుపుతున్నట్లు గుర్తించారు. ఇవి ఆకర్షణీయమైన ఇంగ్లిష్ పేర్లతో ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నాయి. వాటిలో చాలా కంపెనీలు వివిధ అనుబంధ లోన్‌యాప్ కంపెనీలుగా ఒకే అడ్రస్‌తో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఇంగ్లిష్ స్పెల్లింగ్‌లో కొద్దిపాటి మార్పులతో ఒకేలా అనిపించే వివిధ పేర్లతో ఈ కంపెనీలు బురిడీ కొట్టిస్తున్నాయి. దేశంలో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 271 ఫేక్ లోన్‌యాప్ కంపెనీలను ఆర్బీఐ గుర్తించింది. వాటి కార్యకలాపాలు నిషేధించింది. వాటిపై పర్యవేక్షణను పటిష్టం చేయాలని అన్ని రాష్ట్రాల పోలీసు శాఖలకు సమాచారమిచ్చింది. ఆ కంపెనీలు ఇవే.. క్యాష్ అడ్వాన్స్ అటాచ్, ధన్ పల్, క్యాష్ హోస్ట్, రుపీక్, క్యాష్ మేనేజర్, ఫ్రీ లోన్, క్యాష్ అడ్వాన్స్ టీ1, క్యాష్కామ్, వాలెట్ ప్రో, వెల్ క్రెడిట్ గోల్డ్, హనీ లోన్, యూలవ్ట్ యాప్, హనీ లోన్‌యాప్, హ్యాండీ లోన్, క్యాష్ అడ్వాన్స్, లక్కీ లోన్‌యాప్, ర్యాపిడ్ పైసా, మనీ వ్యూ యాప్, డోవా క్యాష్ లోన్‌యాప్, కాయిన్ ట్రాక్, అవైల్ ఫైనాన్స్, హెల్ప్ మనీ అప్లికేషన్, క్రెడిట్బాక్స్ ఆల్ఫా లోన్ యాప్, ఫ్యూచర్ వాలెట్, హర్మనీ లోన్, నీడీ లోన్, సుగర్ మనీ, క్రెడిట్ కాయిన్ యాప్, అరేకో, క్రెడిట్ పెర్ల్, మే లోన్, ఫోర్ర్టెస్ లోన్‌యాప్, క్యాష్ క్రెడిట్, అరియకో లోన్, వాలెట్ ప్రో, కర్టెల్ లోన్, లక్కీ క్యాష్ లోన్, ఓకే రుపీ లోన్ అప్లికేషన్, హై క్రెడిట్ యాప్, సపోర్ట్ లోన్, క్విక్ మనీ యాప్, టాప్ క్యాష్ లోన్, ఈజీ బారో లోన్ యాప్, కార్ప్ వాలెట్, రూపీ బాక్స్, క్రెడిట్ మార్వెలెక్స్, రుపీరెడీ లోన్ యాప్, మెనీ లోన్, రుపీ పాకెట్, పే రుపీక్, క్రెడిట్ మార్వెల్, వాల్కనో లోన్, మోర్ లోన్, మేజిక్ లోన్, ఇన్స్టంట్ లోన్, ఎస్ క్యాష్, మేజిక్ మనీ, రుపీ పాపా, క్యాష్ ఎక్స్పీ, రుపీ ఓకే 1, క్యాష్ ఓకే, సన్‌షైన్ లోన్, క్రెడిట్ ఇట్ యాప్, పామ్రుపీ, ఈజీ ఆర్పీ, మనీ ల్యాడర్, ఎలిఫెంట్ క్యాష్, మ్యాజిక్ లోన్, క్యాష్ లోన్, పిళ్లై లోన్, క్రెడిట్ లోన్, రుపీ హాల్, ఇన్‌కం లోన్ యాప్, టాప్ క్యాష్, ఫ్లాష్ రుపీ, క్యాష్ స్టేషన్, రుపీ స్టార్, లింక్ మనీ, లోన్ హోమ్, రుఫిలో, మనీ స్టాండ్ క్రెడిట్ లోన్, బెలోన్ లోన్ యాప్, క్రెడిట్ మాంగో యాప్, పాపా మనీ లోన్‌యాప్, యోజన లోన్‌యాప్, లోన్ బ్రో లోన్‌యాప్, రుపీ హోమ్, క్రెజిబెన్, ఆ క్యాష్, క్రిస్టల్ లోన్, గోల్డ్ సీ, మనీ ట్యాంక్, యస్ రుపీస్, ఫ్లాష్ లోన్ యాప్, నీడ్ రుపీ, మామా లోన్‌యాప్, ధనీ, రెయిన్బో లోన్, క్విక్ క్యాష్, మనీ స్టాండ్, మనీ హౌస్, స్టే రుపీ, క్రెడిట్ రుపీ, క్యాష్ సమోసా, ఇన్ఫినిటీ క్యాష్, మే క్రెడిట్, లక్కీ లోన్, కిష్హ్ట్, రుఫిలో, మే లోన్‌యాప్, ఫ్లెక్స్లీ లోన్, మార్వెల్ లోన్, బాబా నాయక్ లోన్ ఫైనాన్స్, మినిట్స్ ఇన్ క్యాష్, బ్రో క్యాష్, గెట్ క్యాష్, డిస్కవర్ లోన్‌యాప్, క్యాష్ కౌ, ఈ–పైసా, షటిల్ లోన్, ఈఎస్ లోన్, ఆల్ఫా లోన్, హనీ లోనిన్, క్యాష్ లైట్, టాప్ క్యాష్, మాన్తా క్యాష్, ఓ క్యాష్, హలో బాక్స్, వల్లబై యాప్, జాస్మిన్ లోన్‌యాప్, అరాక్ లోన్, ఫాస్ట్ క్యాష్, ఓన్లీ లోన్, రుపియా బస్, లింక్ మనీ, లెండ్మాల్, క్రెడిట్ కింగ్, హై క్యాష్, యూపీఏ లోన్, గోల్డ్ మ్యాన్ పేబ్యాక్, హ్యాండీ లోన్, రుపీ కింగ్, మీ రుపీ, వన్ లోన్, క్యాష్ ఎనీ టైమ్, ఎక్స్‌ప్రెస్ లోన్, లోన్ డ్రీమ్, రుపీ లోన్, ఫ్లాష్ లోన్ మొబైల్, రుపీ స్టార్, వావ్ రుపీ, క్యాష్ పార్క్ లోన్, హూ క్యాష్, ఫస్ట్ క్యాష్, క్లియర్ లోన్, రుపీ బాక్స్, స్మాల్ లోన్, రిచ్, లోన్ గో, ఆసాన్ లోన్, లైవ్ క్యాష్, ఫాస్ట్ రుపీ, లోన్ ఫార్యూ్చన్, క్యాష్ పాకెట్, ఇన్‌స్టా లోన్, అప్పా పైసా, కోయిన్ రుపీ, క్యాష్ పాపా, లోన్ క్లబ్, హ్యాండ్ క్యాష్, లోన్ హోమ్ స్మాల్, ఐ క్రెడిట్, వెన్ క్రెడిట్, సమయ్ రుపీ, లెండ్ మాల్, సిల్వర్ పాకెట్, భారత్క్యాష్, మనీ మాస్టర్, ఈజీ లోన్, వార్న్ రుపీ, స్మార్ట్ కాయిన్, లక్కీ వాలెట్, యూపీవో లోన్.కామ్, బడ్డీ లోన్, క్యాష్ మైనే, టైటో క్యాష్, మై క్యాష్ లోన్, సింపుల్ లోన్, క్యాష్ మెషిన్ లోన్, ఫర్ పే, మినిట్ క్యాష్, ఫాస్ట్ పైసా, మోర్ క్యాష్, క్యాష్ బుక్, హ్యాండ్ క్యాష్ ఫ్రెండ్లీలోన్, రిలయబుల్ రుపీ క్యాష్, ఎర్లీ క్రెడిట్ యాప్, ఈగల్ క్యాష్‌లోన్ యాప్, క్యాష్ క్యారీ యాప్, క్యాష్ పార్క్, రిచ్ క్యాష్, ఫ్రెష్ లోన్, బెట్విన్నర్ బెట్టింగ్, రుపీ మాల్, సన్ క్యాష్, మినిట్ క్యాష్, బస్ రుపీ, ఓబ్ క్యాష్ లోన్, ఆన్ స్ట్రీమ్, క్యాష్‌లోన్, స్మాల్ లోన్, రుపయ బస్, ఇన్‌స్టా మనీ, స్లైస్ పే, లోన్ క్యూబ్, ఇకర్జా, మనీ స్టాండ్ ప్రో, పోక్ మనీ, క్వాలిటీ క్యాష్, లోన్ లోజీ, ఫర్‌పే యాప్, రుపీ ప్లస్, డ్రీమ్ లోన్, క్యాష్ స్టార్ మినిసో రుపీ, క్యాష్‌పాల్, ఫార్యూ్చన్ నౌ, క్రెడిట్ వాలెట్, పాకెట్ బ్యాంక్, లోన్‌జోన్, ఫాస్ట్ కాయిన్, స్టార్ లోన్, ఈజీ క్రెడిట్, ఏటీడీ లోన్, ట్రీ లోన్, బ్యాలన్స్ లోన్, క్యాష్ బౌల్, క్యాష్ కర్రీ, క్యాష్ మెషిన్, క్యాష్ పాకెట్ లైవ్ క్యాష్, క్యాష్ కోలా, 66 క్యాష్, కోకో లోన్, క్యాష్ హోల్, ఈజీ బారో క్యాష్ లోన్, ఐఎన్డీ క్యాష్ లోన్, వాలెట్ పేయి, క్యాష్ గురూ యాప్, గోల్డ్ క్యాష్, ఆరెంజ్ లోన్, ఏంజిల్ లోన్, లోన్ శాంతి, షార్ప్ లోన్, డెయిలీ లోన్, స్కై లోన్, మో క్యాష్, జో క్యాష్, బెస్ట్ పైసా, హెలో రూపీ, హాలిడే మొబైల్ లోన్, ఫోన్ పే లోన్, ప్లంప్ వాలెట్, క్యాష్ క్యారీ లోన్‌యాప్, క్రేజీ క్యాష్, క్విక్ లోన్‌యాప్, రాకెట్ లోన్, రుపీ మ్యాజిక్, రుష్ లోన్, బెలోనో లోన్‌యాప్, ఏజిల్ లోన్‌యాప్, క్యాష్ అడ్వాన్స్ 1, ఇన్కమ్ ఓకే. -
అమానుషం..ఫైనాన్స్ కంపెనీ దాష్టికం..గర్భిణిని ట్రాక్టర్‌తో తొక్కించి...
లోన్ రికవరి కోసం ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేసే ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు గురించి నిత్యం వింటూనే ఉన్నాం. అచ్చం అలానే ఒక ఫైనాన్స్ కంపెనీ లోన్ రికవరీ కోసం ఒక మహిళ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించింది. వివరాల్లోకెళ్తే...మహిద్ర ఫైనాన్స్ కంపెనీ అధికారులు లోన్ రికవరి కోసం దివ్యాంగుడైన ఒక రైతు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో రైతు, అతని కుమార్తె మాత్రమే ఉన్నారు. ఫైనాన్స్ అధికారులకు రైతుకి మధ్య ఫైనాన్స్ విషయమే చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. అంతే సదరు ఫైనాన్స్ అధికారులు ఏకంగా కోపంతో ట్రాక్టర్‌తో సదరు రైతు కూతురుని తొక్కించి.. హత్య చేశారు. బాధితురాలు మూడు నెలల గర్భిణి. ఈ ఘటన జార్ఖండ్‌లో హజారీబాగ్‌లో చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్, మేనేజర్‌తో సహా నలుగురిపై హత్య కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ అధికారులు తమకు సమాచారం ఇవ్వకుండా ఇంటికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ ఫైనాన్స్ రికవరీ కోసం బాధితుడి నివాసానికి వెళ్లే ముందు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఈ మేరకు మహీంద్రా గ్రూప్ మేజేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనీష్ షా మాట్లాడుతూ...కంపెనీ అన్ని కోణాల్లో ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోంది. ఏజెన్సీలు లోన్‌రికవరీ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకుంటాం. కేసు దర్యాప్తు విషయమై పోలీసులకు అన్ని రకాలుగా సహకరిస్తాం అని హామీ ఇచ్చారు. (చదవండి: ప్రేమకు నిరాకరించిందన్న కక్ష్యతో నవ వధువు దారుణ హత్య) -
పెచ్చుమీరుతున్న రికవరీ ఏజెంట్ల వేధింపులు
నెల్లూరు (క్రైమ్) : లోన్ యాప్స్‌కు చెందిన రికవరీ ఏజెంట్ల వేధింపులు మితిమీరుతున్నాయి. ఇప్పటివరకు సామాన్య ప్రజలే లక్ష్యంగా సాగుతున్న ఈ వ్యవహారం చివరకు ప్రజాప్రతినిధులను వదలడంలేదు. ‘‘మీ బంధువులు/స్నేహితులు రుణం తీసుకున్నారు.. దానికి మీరే చెల్లింపులు చేయాలి’’ అంటూ ఫోన్లు చేస్తున్నారు. వారెవరో తమకు తెలియదని చెబుతున్నప్పటికీ మాటలతో ఎదురుదాడికి దిగుతున్నారు. సరిగ్గా ఈలాంటి అనుభవమే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రస్తుత మంత్రి, మాజీమంత్రికి ఎదురైంది. ఈ రెండు ఘటనలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖులకు సైతం రికవరీ ఏజెంట్లు ఫోనుచేసి బెదిరిస్తున్న వైనంపై జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమై క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారు. వివరాలివీ.. పదేపదే ఫోన్లుచేసి.. చెన్నైలోని కోల్మాన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ వివిధ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలకు లోన్ రికవరీ ఏజెన్సీగా పనిచేస్తోంది. నెల్లూరు రామలింగాపురంలోని ఓ ఫైనాన్స్ సంస్థ పాతపాటి అశోక్‌కుమార్‌కు రూ 8.5 లక్షలు రుణమిచ్చింది. అతను తిరిగి చెల్లించకపోవడంతో రికవరీ ఏజెన్సీకి సదరు సంస్థ అతని ఫోను నంబర్‌ను ఇచ్చింది. ఏజెన్సీ మేనేజర్లు గురుప్రసాద్‌రెడ్డి, మహేంద్రన్, పెంచలరావు, టీం లీడర్ మాధురివాసులు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ప్రముఖుల ఫోన్ నెంబర్లను సేకరించారు. ఈనెల 25న మంత్రి కాకాణి గోవర్థనరెడ్డికి ఫోనుచేశారు. ఆయన ఫోను తన పీఏ శంకరయ్య వద్ద ఉండడంతో బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. టీం లీడర్ మాధురివాసు ప్రియాంకగా పేరుమార్చి అసభ్యకరంగా మాట్లాడి అతని నుంచి రూ.25వేల నగదు తీసుకుంది. దీంతో పీఏ ముత్తుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదుచేసి నలుగురు నిందితులను అరెస్టుచేశారు. మాజీమంత్రికి సైతం.. మరోవైపు.. మాజీమంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌కు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. పాతపాటి అశోక్‌కుమార్ రుణం తీసుకున్నాడని.. ఆ రుణం చెల్లించాలంటూ అనిల్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చారు. దీనికి సంబంధించిన కాల్ రికార్డు ఆడియో సోషల్ మీడియాలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు క్షేత్రస్థాయిలో విచారిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు మాట్లాడుతూ.. జిల్లాలో మంత్రి, మాజీమంత్రికి ఫోన్లుచేసి బెదిరించిన ఘటనలో నలుగురు నిందితులను అరెస్టుచేసి వారి నుంచి ల్యాప్‌టాప్, సెల్ఫోన్లను సీజ్ చేశామన్నారు. ఎవరైతే రుణం తీసుకున్నారో వారికి ఫోన్లు చేయకుండా ఇతరులకు ఫోనుచేసి బెదిరించడం చట్టరీత్యా నేరమన్నారు. ఆన్లైన్ లోన్ యాప్స్‌లో రుణాలు తీసుకోవద్దని ఆయన హితవు పలికారు. ఎవరికైనా ఈ తరహా ఫోన్లు వస్తే వెంటనే స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ చెప్పారు. ఇదీ చదవండి: AP: రెచ్చిపోతున్న రికవరీ ఏజెంట్లు.. మంత్రి కాకాణి పీఏ శంకర్‌కు వార్నింగ్ -
నా చావుకి వారే కారణం.. విడిచిపెట్టకండి
సాక్షి,రాజేంద్రనగర్(హైదరాబాద్): బ్యాంకు క్రెడిట్ కార్డు, యాప్ లోన్స్ రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ తెలిపిన మేరకు.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన దత్తాత్రేయ(32) కుటుంబం అత్తాపూర్ పాండురంగానగర్ ప్రాంతంలో నివసిస్తుంది. దత్తాత్రేయ నగరంలోని ఓ నగల దుకాణంలో సేల్స్‌మన్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య, ఇద్దరు సంతానం. ఇటీవల దత్తాత్రేయ సెల్ఫోన్లో ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డాడు. రెండు యాప్‌ల ద్వారా ఆన్లైన్ బెట్టింగ్‌లకు పాల్పడ్డాడు. ఇలా బానిసై జూన్ వరకు రూ. ఏడు లక్షల వరకు అప్పులు చేశాడు. ఆ తరువాత మూడు క్రెడిట్ కార్డులు, రెండు లోన్ యాప్స్ ద్వారా డబ్బు తీసుకొని బెట్టింగ్ ఆడాడు. రుణం చెల్లించకపోవడంతో బ్యాంకు ఏజెంట్లతో పాటు లోన్ యాప్ నిర్వాహకులు డబ్బు కట్టాలని ఫోన్ చేస్తున్నారు. వీరి వేధింపులు తాళలేక మానసిక వేదనకు గురయ్యాడు. సెల్‌ఫోన్‌ను ఆఫ్ చేయడంతో బంధువులతో పాటు కుటుంబ సభ్యులకు రికవరీ ఏజెంట్లు ఫోన్లు చేస్తుండడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. గురువారం సాయంత్రం భార్య పనికి వెళ్లగా ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన భార్య భర్త ఉరికి వేలాడుతూ కనిపించడంతో అత్తాపూర్ ఔట్ పోస్టు పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చి మృతదేహాన్ని మార్చరీకి తరలించారు. మృతుడు తన సూసైడ్ నోట్లో తన మృతికి ఆన్లైన్ బెట్టింగ్తో పాటు లోన్లు, క్రెడిట్ కార్డులు కారణమని తనను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని రాశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: Hyderabad: అమాయక మహిళలను మోసం చేస్తూ వ్యభిచార నిర్వహణ -
రుణ చెల్లింపులో రష్యా విఫలం
మాస్కో/కీవ్: అంతర్జాతీయ ఆంక్షల ప్రభావం రష్యాపై తీవ్రంగానే పడుతోంది. దాంతో విదేశీ రుణాల చెల్లింపులో విఫలమైంది. గత 104 ఏళ్లలో రష్యాకు ఇలాంటి పరిస్థితి ఎదురవడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన నేపత్యంలో స్విఫ్ట్‌తో పాటు పలు అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థల నుంచి రష్యాను అంతర్జాతీయ సమాజం దూరం పెట్టిన విషయం తెలిసిందే. దాంతో నిధులున్నా కూడా పలు విదేశీ రుణాలపై 10 కోట్ల డాలర్ల మేర వడ్డీలను నిర్ణీత తేదీలోపు రష్యా చెల్లించలేకపోయింది. ఈ మొత్తాన్ని యూరోక్లియర్ బ్యాంకుకు పంపినా అక్కడే నిలిచిపోయింది. చెల్లింపులు ఆగిపోవడం నిజమేనని రష్యా ఆర్థిక మంత్రి ఆంటోన్ సిల్యానోవ్ అంగీకరించారు. అయితే ఇది అంతర్జాతీయ సహాయ నిరాకరణ ఫలితమే తప్ప ఎగవేత కాదని వివరించారు. ఈ నేపథ్యంలో విదేశీ చెల్లింపులను రష్యన్ బ్యాంకు ద్వారా రూబుల్స్‌లో చెల్లించాలని అధ్యక్షుడు పుతిన్ భావిస్తున్నారు. లీసిచాన్‌స్క్‌పై నిప్పుల వర్షం డోన్బాస్లోలో ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న చివరి నగరం లీసిచాన్‌స్క్‌పై రష్యా సేనలు సోమవారం నిప్పుల వర్షం కురిపించాయి. దాంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. నాటో దేశాధినేతల భేటీ కొనసాగుతుండగానే రష్యా దాడులను ఉధృతం చేయడం గమనార్హం. గత 24 గంటల్లో రష్యా సాగించిన క్షిపణి దాడుల్లో కనీసం ఆరుగురు పౌరులు మృతిచెందారని, మరో 31 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కార్యాలయం ప్రకటించింది. ఖర్కీవ్, ఒడెసా, మైకోలైవ్ తదితర నగరాలపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక స్లొవియాన్స్క్పైనా రష్యా క్లస్టర్ బాంబు ప్రయోగించినట్లు ఉక్రెయిన్ సైనికాధికారులు తెలిపారు. ఈ ఘటనలో పలు భవనాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. స్లొవియాన్స్క్లో ఉక్రెయిన్ మిలటరీ బేస్ ఉంది. 1,000 మంది ఉన్న మాల్‌పై... రష్యా క్షిపణి దాడి ఉక్రెయిన్‌లో సామాన్య పౌరులపైనా రష్యా సేనలు క్షిపణి దాడులు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం మధ్యాహ్నం క్రెమెన్‌చుక్‌లో 1,000 మందికిపైగా జనంతో కిక్కిరిసి ఉన్న ఓ భారీ షాపింగ్ మాల్‌పై రష్యా భీకర దాడికి దిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 10 మందికి పైగా మరణించారని, 40కి పైగా గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదముందన్నారు. దాడి తర్వాత షాపింగ్ మాల్ మంటల్లో చిక్కుకుంది. జనం హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి. క్రెమెన్‌చుక్‌లో రష్యా క్షిపణి దాడి పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. బాధితుల సంఖ్యను ఊహించడం సాధ్యం కాదని చెప్పారు. రష్యా నుంచి మర్యాద, మానవత్వాన్ని ఆశించడం అత్యాశే అవుతుందన్నారు. సాధారణ జనజీవితాలను రష్యా అస్తవ్యస్తం చేస్తోందని మండిపడ్డారు. సెంట్రల్ ఉక్రెయిన్‌లో ఉన్న క్రెమెన్‌చుక్ ప్రముఖ పారిశ్రామికకేంద్రంగా అభివృద్ధి చెందింది. -
సాక్షి ఎఫెక్ట్: మంచిర్యాల లోన్ యాప్ మృతిపై కేసు నమోదు
సాక్షి, మంచిర్యాల: జిల్లా కేంద్రంలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు.. కళ్యాణి అనే వివాహిత మృతి చెందిన ఘటన తాలుకా సాక్షి కథనానికి పోలీసులు స్పందించారు. కళ్యాణి మృతిపై విచారణ ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 306 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసుకున్నారు. యాప్ వేధింపులపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. లోన్ యాప్ బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకొచ్చి పిర్యాదు చేయాలని.. వాళ్లపై చర్యలు తీసుకుంటామని డీసీపీ భరోసా ఇస్తున్నారు. చదవండి: మంచిర్యాలలో లోన్ యాప్ వేధింపులు.. వివాహిత ఆత్మహత్య -
భద్రాద్రి కొత్తగూడెం: అప్పు తీర్చలేదని మహిళపై..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఆర్థిక లావాదేవీలతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి మండలంలో పరిధిలో ఈ దారుణం జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని ఓ మహిళపై దాడి చేశాడో వ్యక్తి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శ్రీదేవి అనే మహిళ తన దగ్గర అప్పు తీసుకుందని, తిరిగి ఇవ్వమంటే జాప్యం చేస్తోందని నిందితుడు నవతన్ చెప్తున్నాడు. ఈ క్రమంలోనే ఆమెపై పదునైన ఆయుధంతో దాడి చేశాడట. శ్రీదేవిపై కత్తి దాడి స్థానికంగా కలకలం సృష్టించగా.. ఘటనపై నవతన్‌పై కేసు నమోదు చేశారు చంచుపల్లి పోలీసులు. ఈలోపే నవతన్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. -
రుణ వసూళ్లు పడిపోతున్నాయ్!
ముంబై: దేశంలో సెకండ్ వేవ్ నేపథ్యంలో రుణ వసూళ్లు గణనీయంగా పడిపోతున్నాయి. ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్) అసోసియేషన్ ఫర్ కన్జూమర్ ఎంపవర్మెంట్ (ఎఫ్‌ఏసీఈ) 100 కంపెనీలపై నిర్వహించిన సర్వే ఈ అంశాన్ని వెల్లడించింది. సర్వేలో వెల్లడైన అంశాలను పరిశీలిస్తే.. రుణ వసూళ్ల ఏజెంట్లు తమ విధుల నిర్వహణలో వైఫల్యం చెందుతున్నారు. రుణ గ్రహీతలు నిజంగానే తీవ్ర ఒత్తిడి, వైద్య అత్యవసర పరిస్థితుల్లో కూరుకునిపోవడమే దీనికి కారణం. 20 % వరకు రుణ వసూళ్ల విషయంలో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ రుణదాతల పరిస్థితి మెరుగ్గాలేదు. మొత్తం మంజూరుచేసిన రుణాల్లో దాదాపు 10 నుంచి 20 శాతం వరకూ వసూళ్లు కష్టమవుతున్నాయి. రుణం పునఃచెల్లింపుల్లో గడువు ముగిసిపోయి ఒకటి నుంచి మూడు నెలలు అవుతున్నప్పటికీ ఆయా రుణాలు వసూలు కావడం లేదు. అయితే 2020తో పోల్చితే ప్రస్తుత పరిస్థితి కొంత మెరుగ్గా ఉండడం కొంత ఊరట. 2021 జూలై ముగిసే నాటికి పరిస్థితి కొంత మెరుగు పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. 2020 నాటికి కఠిన లాక్డౌన్ పరిస్థితులు ఇప్పుడు లేకపోవడం, కేసులు తగ్గి క్రమంగా అన్ లాకింగ్ ప్రక్రియ ప్రారంభం కావడం దీనికి కారణం. చదవండి: పూచీకత్తు లేకుండానే రూ.5 లక్షల పర్సనల్ లోన్ -
ఏ సమస్య వచ్చినా మీకు నేనున్నా: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: చైనా లోన్‌యాప్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న మేడ్చల్‌కు చెందిన చంద్రమోహన్ కుటుంబానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. చంద్రమోహన్ భార్య సరితకు ఉద్యోగం కల్పించడంతోపాటు ముగ్గురు ఆడపిల్లలకు ఉద్యోగం వచ్చేవరకూ చదివిస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులతో ఆదివారం కవిత భేటీ అయ్యారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన చంద్రమోహన్ చైనా లోన్ యాప్‌ల వేధింపులు భరించలేక ఈ ఏడాది జనవరిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి యజమాని ఆత్మహత్యకు పాల్పడటంతో భార్య సరిత, ముగ్గురు ఆడపిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. విషయం తెలుసుకున్న కవిత ఆదివారం బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. ముగ్గురు పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధించే వరకు సాయం అందిస్తానని సరితకు హామీ ఇచ్చారు. ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని, కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. -
న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం
సాక్షి, గచ్చిబౌలి (హైదరాబాద్): న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం ఉందని సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. డిసెంబర్ 31న పబ్‌లు, బార్లు, హోటళ్లు, రిసార్ట్లు నిర్దేశించిన సమయానికే మూసేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కోవిడ్ నేపథ్యంలో ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దని తెలిపారు. ఎవరైనా వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ‘గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ల లోనూ న్యూ ఇయర్ వేడుకల నిర్వహణకు అనుమతి లేదు. ఎవరైనా వేడుకలు నిర్వహిస్తే ఫిర్యాదు చేయాలి. బార్లు, పబ్‌లు, ఈవెంట్ల పేరిట సింగర్స్, డ్యాన్సర్లకు అనుమతి లేదు. ఎవరైనా ఈవెంట్ల పేరిట టికెట్లు విక్రయించినా, ఆన్లైన్లో పెట్టినా డయల్ 100, వాట్సాప్ కాల్‌కు ఫిర్యాదు చేయాలి. బార్లు, పబ్‌లు, స్టార్ హోటళ్లు, రిసార్ట్‌లపై నిఘా ఉంటుంది. ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహిస్తాం’అని ఆయన తెలిపారు. కాగా నగరంలో నిషేధానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాల కోసం వేచి చూస్తున్నామని సిటీ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్‌లు మాత్రం నగరవ్యాప్తంగా విస్తృతంగా చేపడుతున్నారు. -
నాది సాదాసీదా జీవితం: అనిల్ అంబానీ
లండన్: ప్రపంచ దేశాలను చైనా వణికిస్తుంటే..రిలయన్స్ అనిల్ అంబానీ చైనాకే ఝలక్ ఇచ్చారు. చైనాకు చెందిన మూడు బ్యాంకు రుణాల చెల్లింపునకు తనది పూచీ కాదన్నారు. తనది చాలా విలాసవంత జీవితమంటూ వస్తున్నవన్నీ వదంతులేనన్నారు. ‘నాది చాలా క్రమశిక్షణాయుత జీవితం. అవసరాలు చాలా పరిమితం. ఒకే ఒక్క కారు వాడుతున్నాను. కోర్టు ఫీజులు చెల్లించేందుకు బంగారాన్ని అమ్ముకున్నాను’ అని వివరించారు. చైనా బ్యాంకులతో తలెత్తిన రుణ ఒప్పందం వివాదంపై లండన్ కోర్టుకు ఆయన ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. తనకు ఖరీదైన చాలా కార్లున్నాయనీ, విలాసవంతమైన జీవితమంటూ లాయర్ అడిగిన ప్రశ్నకు అనిల్.. అవన్నీ మీడియా సృష్టించిన కల్పిత వార్తలని కొట్టిపారేశారు. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్, చైనా డెవలప్మెంట్ బ్యాంక్, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనాల నుంచి 2012లో 925 మిలియన్ డాలర్ల మేర ఆర్‌కామ్ రుణం తీసుకుంది. పూచీకత్తుగా ఉన్న అనిల్ అంబానీయే ఆ మొత్తం చెల్లించాలంటూ బ్యాంకులు కోరుతున్నాయి. ఈ మేరకు బ్రిటన్ కోర్టులో దావా వేశాయి. ఆ రుణంలో కొంత మొత్తం చెల్లించాలంటూ కోర్టు ఈ ఏడాది మేలో ఆదేశించింది. అనిల్ చెల్లించకపోవడంతో ఆయన్ను వీడియో లింక్ ద్వారా క్రాస్ ఎగ్జామిన్ చేసి, ఆస్తుల వివరాలు రాబట్టేందుకు బ్యాంకు తరఫు లాయర్లకు కోర్టు అనుమతిచ్చింది. ఈ మేరకు శనివారం జరిగిన విచారణలో అనిల్ పై విషయాలను వెల్లడించారు. -
వడ్డీమాఫీపై స్పష్టత ఇవ్వండి
న్యూఢిల్లీ: కరోనా కారణంగా రుణవాయిదాలపై మారటోరియం విధించిన కేంద్ర ప్రభుత్వం ఆ వాయిదాలపై వడ్డీని మాఫీ చేసే విషయమై ఒక నిర్ణయానికి రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద పలు అధికారాలు ఉన్నప్పటికీ ఆర్బీఐ సాకు చూపుతూ ఈ అంశంపై ఏ నిర్ణయమూ తీసుకోలేదని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని బెంచ్ కేంద్రాన్ని తప్పుపట్టింది. ఈ విషయంపై తగిన నిర్ణయం తీసుకునేందుకు సమయం కావాలన్న సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తూ వారం గడువు ఇచ్చింది. ఈ సందర్భంగా తుషార్ మెహతా మాట్లాడుతూ తాము ఈ అంశంపై ఆర్బీఐతో కలిసి పనిచేస్తున్నట్లు జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎం.ఆర్.షా లతో కూడిన బెంచ్‌కు తెలిపారు. కేంద్రం విపత్తు నిర్వహణ చట్టంపై స్పష్టత కల్పించాలని, ఇప్పటికే వసూలు చేస్తున్న వడ్డీపై అదనపు వడ్డీ వసూలు సాధ్యమవుతుందా? అని బెంచ్ ప్రశ్నించగా తుషార్ మెహతా స్పందిస్తూ... అన్ని సమస్యలకు సాధారణ పరిష్కారం ఉండదన్నారు. ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తూ మార్చి 27న ఆర్బీఐ జారీ చేసిన నోటిఫికేషన్‌లోని కొంత భాగాన్ని చట్టవిరుద్ధమైందిగా ప్రకటించాలని కోరారు. రుణ వాయిదాలపై నిషేధం విధించిన నేపథ్యంలో ఆ వాయిదాలపై వడ్డీ వసూలు చేయడం సరికాదని, దీనివల్ల తనకు సమస్యలు వస్తున్నాయని గజేంద్ర శర్మ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. తను జీవించే హక్కుకు భంగం కలిగిస్తోందని గజేంద్ర శర్మ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. రుణ వాయిదాలపై మారటోరియం గడువును పొడిగించాలని కోరారు. తదుపరి విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబరు ఒకటవ తేదీకి వాయిదా వేసింది. -
నకిలీ పత్రాలతో ఐసీఐసీఐ బ్యాంక్‌కు టోకరా!
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ పత్రాలు, బోగస్ వ్యక్తులతో రంగంలోకి దిగిన ఓ ఘరానా మోసగాడు ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.30 లక్షల టోకరా వేశాడు. దాదాపు పదేళ్ళ క్రితం చోటు చేసుకున్న ఈ కేసులో నిందితుల అరెస్టు మాట అటుంచి కనీసం వారెవరో గుర్తించడమూ సాధ్యం కాలేదు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఇన్స్పెక్టర్ ఆర్.గోవింద్‌రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి ఛేదించారు. మొత్తం నలుగురిని నిందితులుగా గుర్తించి, ముగ్గురిని పట్టుకున్నారు. విదేశంలోని జైల్లో ఉన్న మరో నిందితుడి కోసం లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేయడానికి నిర్ణయించామని గోవింద్‌రెడ్డి గురువారం ‘సాక్షి’కి తెలిపారు. ఆద్యంతం పక్కా పథకం ప్రకారం వ్యవహరించిన నిందితులు ఈ స్కామ్‌కు పాల్పడ్డారని ఆయన వివరించారు. ఖరీదు చేస్తామంటూ పత్రాలు పొంది... సైదాబాద్ ప్రాంతానికి చెందిన సలావుద్దీన్ వృత్తిరీత్యా రియల్ఎస్టేట్ దళారి. ఈ స్కామ్ మొత్తానికి ఇతడే సూత్రధారిగా ఉన్నాడు. ఇతగాడు 2008 ఆఖరులో తన స్నేహితుడైన హసన్ అలీతో కలిసి ఖైరతాబాద్‌లోని ఏఎస్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు మహ్మద్ రియాసత్ హసన్‌ను సంప్రదించాడు. ఆయన నిర్మించిన ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌ను ఖరీదు చేస్తామంటూ చెప్పారు. న్యాయ సలహా తీసుకోవడానికంటూ ఆ ఫ్లాట్‌కు సంబంధించిన పత్రాలను సేకరించారు. లోన్ వస్తుందో, రాదో చెప్పడానికి ఓ సారి తమ బ్యాంకు వాళ్ళు వచ్చి చూసి వెళ్తారని ఆయనతో చెప్పాడు. ఆ పత్రాల ఆధారంగా వీరిద్దరూ స్కామ్‌కు నాంది పలికారు. ఇక్కడ స్థిరాస్తిని కలిగి, ప్రస్తుతం విదేశాల్లో ఉన్న వాటి యజమానులు ఆస్తులు విక్రయించే అధికారం ఇక్కడున్న వారికి దఖలు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. దీనికోసం విదేశంలోని యజమాని స్పెషల్ పవరాఫ్ అటార్నీ (ఎస్పీఏ) రూపొందించి పంపిస్తారు. దీన్నే సలావుద్దీన్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. డ్రైవర్ ఫొటోతో ఎస్పీఏ తయారీ... యజమాని రియాసత్ హసన్ విదేశాలకు వెళ్ళినట్లు, ఆయన తన ఫ్లాట్‌ను విక్రయించడానికి ఎస్పీఏ ఇచ్చినట్లు సలావుద్దీన్ నకిలీ పత్రాలు సృíష్టించాడు. గతంలో తనకు ట్యాక్సీలు తీసుకువచ్చిన డ్రైవర్ అబ్దుల్ కవి ఫొటో వినియోగించి, నకిలీ పేర్లు, చిరునామాలతో దీన్ని తయారు చేయించాడు. ఇలా సదరు ఫ్లాట్‌ను విక్రయించడానికి నకిలీ యజమానికి సృష్టించేసిన సలావుద్దీన్... దాన్ని ఖరీదు చేయడానికీ ఓ బోగస్ పార్టీని ‘సిద్ధం చేశాడు’. హైదరాబాద్‌కు చెందిన సర్ఫ్రాజ్ అహ్మద్ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడని డాక్యుమెంట్లు సిద్ధం చేసిన సలావుద్దీన్... సదరు ఫ్లాట్ ఖరీదు చేయడానికి ఆయన ఆసక్తి చూపినట్లు కథ అల్లాడు. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం అతడు భారత్‌కు రావడానికి కుదరట్లేదని, ఈ నేపథ్యంలోనే ఇక్కడే ఉండే తన భార్యకు సదరు స్థిరాస్తి ఖరీదు చేసే అధికారం దఖలు చేస్తూ పత్రాలు పంపినట్లు నకిలీవి తయారు చేశాడు. కమీషన్ ఆశచూపి యువతికి ఎర... తనకు బ్యూటీపార్లర్‌లో పరిచయమైన, అవివాహిత అయిన ఫర్హా దీబాను సర్ఫ్రాజ్ భార్యగా నటించేందుకు ఒప్పించాడు. ఇలా సహకరిస్తే తనకు వచ్చే ‘లాభం’లో కమీషన్ ఇస్తానంటూ ఎరవేసి ఒప్పించాడు. ఆమె ఫొటో, నకిలీ పేరు వివరాలతో గుర్తింపుకార్డులు తయారు చేయించాడు. ఎస్సార్‌నగర్‌లోని సబ్–రిజిస్ట్రార్ ఆఫీస్‌కు కవి, ఫర్హా దీబాలను తీసుకువెళ్ళి... ఖైరతాబాద్ ఫ్లాట్‌ను కవి ద్వారా ఫర్హా పేరు మీదకు బదిలీ చేయించాడు. ఈ సేల్‌డీడ్‌ను ఆధారంగా చేసుకుంటూ బేగంపేటలోని ఐసీఐసీఐ బ్యాంక్‌ను ఆశ్రయించి ఫర్హా ద్వారా గృహరుణం దరఖాస్తు చేయించాడు. దీనికి ముందే రియాసత్‌కు చెందిన ఏఎస్ కన్సల్టెన్సీ పేరుతోనే వేరే వ్యక్తుల్ని యజమానులు చూపించి ఓ నకిలీ సంస్థను ఏర్పాటు చేసిన సలావుద్దీన్ ఆ పేరుతో బ్యాంకు ఖాతా కూడా తెరిచాడు. వాయిదాలు చెల్లించకపోవడంతో... సదరు బ్యాంకు అధికారులు వెళ్ళి ఖైరతాబాద్‌లోని ఫ్లాట్‌ను పరిశీలించారు. ఆ విషయం రియాసత్‌కు తెలిసినప్పటికీ గతంలో సలావుద్దీన్ చెప్పినట్లు వాళ్ళు వచ్చారని భావించాడు. ఫ్లాట్‌ను, పత్రాలను సరిచూసిన బ్యాంకు 2009లో రూ.30 లక్షల రుణం మంజూరు చేస్తూ ఏఎస్ కన్సల్టెన్సీ పేరుతో చెక్కు ఇచ్చింది. దీన్ని తాను తెరిచిన నకిలీ ఖాతాలో వేసిన సలావుద్దీన్ డబ్బు డ్రా చేసుకుని స్వాహా చేశాడు. ఈ మొత్తం నుంచి కొంత హసన్ అలీ, అబ్దుల్ కవి, ఫర్హా దీబాలకు ఇచ్చాడు. రుణ వాయిదాలు చెల్లించకపోవడంతో అధికారులు ఆ ఫ్లాట్ స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళారు. దీన్ని రియాసత్ అడ్డుకోవడంతో ఆరా తీయగా జరిగిన మోసం వాళ్ళకు తెలిసింది. దీంతో 2010లో ఐసీఐసీఐ బ్యాంకు అధికారులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు అధికారులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అసలు నిందితులు ఎవరనేది గుర్తించలేకపోయారు. పదేళ్ళకు వీడిన చిక్కుముడి... ఇటీవల ఈ కేసును సమీక్షించిన ఉన్నతాధికారులు మూసేయవచ్చని నిర్ణయించారు. అయితే వైట్ కాలర్ అఫెన్సెస్ టీమ్–10 ఇన్స్పెక్టర్ ఆర్.గోవింద్‌రెడ్డి మాత్రం తనకు ఓ చాన్స్ ఇవ్వాలంటూ కోరారు. దీనికి సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి అనుమతించడంతో పునర్ దర్యాప్తు చేపట్టారు. నిందితులు వివిధ చోట్ల దాఖలు చేసిన నకిలీ గుర్తింపుపత్రాలను అధ్యయనం చేసిన ఇన్స్పెక్టర్ చిన్న క్లూ సంపాదించారు. దీని ఆధారంగా ముందుకు వెళ్ళిన ఆయన సలావుద్దీన్‌తో పాటు కవి, ఫర్హాలను పట్టుకున్నారు. ఈ ఫ్రాడ్ తర్వాత దుబాయ్ వెళ్ళిన హసన్ అలీ అక్కడ ఓ నేరం చేయడంతో ఆ దేశ పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారని దర్యాప్తు అధికారి గుర్తించారు. దీంతో ఇతడిపై అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులకు ఎల్ఓసీ జారీ చేయడంతో పాటు ఈ స్కామ్‌పై ఆధారాలు సేకరించి న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
బాకీ తీర్చడం లేదని..
తూర్పు గోదావరి, అంబాజీపేట (పి.గన్నవరం): ఇచ్చిన అప్పు మూడేళ్లయినా తిరిగి ఇవ్వకపోవడంతో బాకీ దారుడు ఇంటి వద్దే దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి అమలాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసుల కథనమిది.. అయినవిల్లి మండలం వెలవలపల్లికి చెందిన పొత్తూరి వెంకటేశ్వరరాజు, బంగారమ్మలు అంబాజీపేట మండలం కె.పెదపూడికి చెందిన బొక్కొ చిట్టిబాబుకు రూ.రెండు లక్షలు మూడేళ్ల క్రితం అప్పుగా ఇచ్చారు. అప్పటి నుంచి పదేపదే అప్పు తీర్చాలని చిట్టిబాబును ఆ దంపతులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై గ్రామ పెద్దల్లో తగవు పెట్టిన చిట్టిబాబు డబ్బులు ఇవ్వలేదు. గురువారం రాత్రి చిట్టిబాబు ఇంటికి వచ్చి రూ.రెండు లక్షలు బాకీ తీర్చమని ప్రాధేయపడినా అతను పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్యాభర్తలు వెంకటేశ్వరరాజు, బంగారమ్మలు కూల్‌డ్రింక్‌లో పురుగు మందు కలుపుకొని చిట్టిబాబు ఇంటివద్దే తాగేశారు. ఈ విషయాన్ని తమ కుమారుడైన జయరాజ్‌కు ఫోన్ ద్వారా వివరించారు. పురుగులు మందు సేవించిన దంపతులిద్దరినీ అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారని చెప్పారు. జయరాజు ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ వై.సూర్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
రిజర్వు బ్యాంకు బంపర్ ఆఫర్
-
రిజర్వు బ్యాంకు బంపర్ ఆఫర్
అప్పులు చేసినవాళ్లు తిరిగి చెల్లించడానికి చేతిలో నగదు లేకపోవడంతో.. రిజర్వు బ్యాంకు వారికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. కోటి రూపాయల వరకు తీసుకున్న గృహరుణం, కారు రుణం, పంట రుణాలు.. ఇతర రుణాలను చెల్లించడానికి మరో 60 రోజుల అదనపు గడువు ఇచ్చింది. నవంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు చెల్లించాల్సిన అన్ని రకాల రుణాలకు ఇది వర్తిస్తుందని రిజర్వు బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. కోటి రూపాయల లోపు వర్కింగ్ క్యాపిటల్‌గా తీసుకున్న సంస్థలకు సైతం ఇది వర్తిస్తుంది. వ్యక్తిగతంగా గానీ, వ్యాపారపరంగా గానీ తీసుకున్న రుణం కోటి రూపాయలు అంతకంటే తక్కువ అయి ఉండాలి. ఏ బ్యాంకులోనైనా లేదా ఎన్బీఎఫ్సీలో నైనా తీసుకున్న రుణాలకు సైతం ఇది వర్తిస్తుంది. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాతి నుంచి బ్యాంకులలో రద్దీ అసాధారణంగా పెరిగిపోవడంతో చెక్కుల క్లియరెన్సు లాంటి సాధారణ కార్యకలాపాలకు సైతం ఇబ్బందిగా ఉంటోంది. దానికి తోడు, వారానికి రూ. 24వేలు మాత్రమే డ్రా చేయడానికి అనుమతి ఉండటంతో.. రుణగ్రహీతలు కూడా పెద్ద మొత్తాలు తీసుకోవడానికి వీలుండటం లేదు. దాంతో పాత రుణాలు తిరిగి చెల్లించడానికి కూడా సమస్యగానే ఉంది. రిజర్వు బ్యాంకు ఇప్పుడు అదనంగా రెండు నెలల గడువు ఇవ్వడం వల్ల చాలా ఉపయోగం ఉంటుందని గృహ రుణాల సంస్థ డీహెచ్ఎఫ్ఎల్ సీఈఓ హర్షిల్ మెహతా అన్నారు. చాలామంది మొదటివారంలోనే ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ వ్యాపారాలు చేసుకునేవాళ్లకు మొదటి వారం కాదుకదా.. ఇప్పటివరకు కూడా డబ్బులు చేతికి అందడం లేదు. ఒకవేళ ఇలా చెల్లించలేకపోయినా.. రుణగ్రహీతల క్రెడిట్ స్కోరు మీద ఏమాత్రం ప్రభావం పడబోదని మెహతా చెప్పారు.