ఏ సమస్య వచ్చినా మీకు నేనున్నా: ఎమ్మెల్సీ కవిత | MLC Kavitha Gives Assurance To Loan App Victims Family | Sakshi
Sakshi News home page

ఏ సమస్య వచ్చినా మీకు నేనున్నా: ఎమ్మెల్సీ కవిత

Published Mon, Mar 1 2021 3:19 AM | Last Updated on Mon, Mar 1 2021 11:23 AM

MLC Kavitha Gives Assurance To Loan App Victims Family - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చైనా లోన్‌యాప్‌ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న మేడ్చల్‌కు చెందిన చంద్రమోహన్‌ కుటుంబానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. చంద్రమోహన్‌ భార్య సరితకు ఉద్యోగం కల్పించడంతోపాటు ముగ్గురు ఆడపిల్లలకు ఉద్యోగం వచ్చేవరకూ చదివిస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులతో ఆదివారం కవిత భేటీ అయ్యారు. మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన చంద్రమోహన్‌ చైనా లోన్‌ యాప్‌ల వేధింపులు భరించలేక ఈ ఏడాది జనవరిలో ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంటి యజమాని ఆత్మహత్యకు పాల్పడటంతో భార్య సరిత, ముగ్గురు ఆడపిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. విషయం తెలుసుకున్న కవిత ఆదివారం బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. ముగ్గురు పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధించే వరకు సాయం అందిస్తానని సరితకు హామీ ఇచ్చారు. ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని, కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement