ఎంత సంపాదించేవారికైనా.. కొన్ని సందర్భాల్లో లోన్ తీసుకోవాల్సి వస్తుంది. లోన్ తీసుకున్న తరువాత పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఈఎంఐ చెల్లించడంలో కొంత ఆలస్యం జరగవచ్చు. అలాంటి సమయంలో కొంతమంది రికవరీ ఏజంట్లు మీతో దూకుడుగా ప్రవర్తించే అవకాశం ఉంది. అప్పుడు మీరు కొంత ఒత్తిడికి గురవ్వొచ్చు. ఇలాంటి ఒత్తిడి నుంచి బయటపడటానికి ఈ ఐదు మార్గాలను పాటిస్తే సరిపోతుంది.
బ్యాంక్‌తో కమ్యూనికేట్ చేయడం
ఆర్ధిక ఇబ్బందుల కారణంగా మీరు సరైన సమయానికి లోన్ చెల్లించకపోతే, ముందుగా మీరు ఎక్కడైనా లోన్ తీసుకున్నారో.. బ్యాంక్ లేదా ఫైనాన్సియల్ కంపెనీలను సంప్రదించండి. ఒకవేళా మీరు బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా క్యాపిటల్, క్రెడిట్‌బీ లేదా నవీ ఫిన్‌సర్వ్ వంటి(నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(NBFC) నుంచి లోన్ తీసుకున్నట్లైతే కస్టమర్ కేర్‌కు కాల్ చేసి మీ పరిస్థితిని వివరించండి. మీ రీపేమెంట్ షెడ్యూల్‌ను పొడిగించడం లేదా సవరించడం కోసం మీరు చేసిన అభ్యర్థనకు సంబంధించిన రికార్డు కోసం ఇమెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేసుకోవడం మంచిది.
లోన్ రీస్ట్రక్చరింగ్ (Loan Restructuring)
లోన్ చెల్లించడంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు బ్యాంక్ లేదా సంస్థతో చర్చలు జరిపి.. ఈఎంఐ తగ్గించుకోవడం, చెల్లింపు వ్యవధిని పొడిగించుకోవడం వంటివి చేసుకోవాలి. అయితే ఈ మార్గం కేవలం తక్షణ ఉపశమనం మాత్రమే అందిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకోవాలి.
పెనాల్టీ మినహాయింపులు
లోన్ ఈఎంఐ చెల్లింపులు ఆలస్యమైతే.. బ్యాంకులు లేదా ఆర్ధిక సంస్థలు భారీగా జరిమానా(ఫెనాల్టీ) విధించే అవకాశం ఉంది. అలాంటి సందర్భం మీకు ఎదురైతే.. ఫెనాల్టీ మాఫీ చేయమని అడగవచ్చు. కొన్ని బ్యాంకులు ఇలాంటి జరిమానాలు మాఫీ చేయడానికి అంగీకరించవచ్చు.
బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్
ఈఎంఐ చెల్లించే వారికి 'బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్' అనేది ఓ మంచి ఆప్షన్. ఎందుకంటే ఒక బ్యాంక్.. మరో బ్యాంకుకు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తే మీకు వడ్డీ రేటు వంటివి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఈఎంఐ పెరిగే అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు: మీరు ఒక బ్యాంకు నుంచి రూ.2 లక్షలు లోన్ తీసుకున్నారనుకోండి. అక్కడ కొన్ని రోజులు ఈఎంఐ చెల్లిస్తూ ఉంటే మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది. అలాంటి సమయంలో మీకు మరో బ్యాంకు కూడా లోన్ ఇవ్వడానికి సిద్దమవుతుంది. అక్కడ లోన్ తీసుకునే ముందు వడ్డీ రేటు కొంత తక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. అప్పుడు ఆ బ్యాంక్ ఇచ్చే లోన్ మొత్తాన్ని, మీరు మొదట లోన్ తీసుకుని చెల్లిస్తున్న బ్యాంకుకు ట్రాన్స్‌ఫర్ చేసి, అక్కడ లోన్ కంప్లీట్ చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని మీరు తీసుకోవచ్చు.
ఇదీ చదవండి: చాన్నాళ్లకు తగ్గిన బంగారం ధర!.. తులం ఎంతంటే?
లోన్ సెటిల్‌మెంట్
మీరు పూర్తిగా లోన్ తిరిగి చెల్లించని సమయంలో.. బ్యాంక్‌తో సెటిల్‌మెంట్ గురించి చర్చించండి. అయితే లోన్ సెటిల్ చేయడం మీ సిబిల్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.
రికవరీ ఏజెంట్ల నుంచి వేధింపులు వస్తే?
లోన్ చెల్లించని సమయంలో రికవరీ ఏజెంట్స్ కాల్ చేసి.. భయపెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మీరు కచ్చితంగా మీ హక్కులను గురించి తెలుసుకోవాలి. ఏజెంట్స్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే మిమ్మల్ని సంప్రదించాలి. మిమ్మల్ని భయపెట్టినా.. బెదిరించినా, సంబంధిత బ్యాంక్ లేదా పోలీసులకు నివేదించాలి.
Comments
Please login to add a commentAdd a comment