మూడు రోజులు వరుసగా పెరిగిన బంగారం ధరలు (Gold Price) ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. నేడు (డిసెంబర్ 28) గోల్డ్ రేటు గరిష్టంగా రూ.160 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు ఏర్పడ్డాయి. ఈ కథనంలో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం.
హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరులలో కూడా 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.77,840 కాగా.. 22 క్యారెట్ల ధర రూ.71,350 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.
చెన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 150 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 160 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్స్ 10గ్రా గోల్డ్ రేటు రూ.71,350 వద్ద, 24 క్యారెట్ల రేటు రూ.77,840 వద్ద ఉంది.
ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీ (Delhi) విషయానికి వస్తే.. ఇక్కడ కూడా గోల్డ్ రేటు తగ్గింది. కాబట్టి ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 77,990 రూపాయలు, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,500 వద్ద ఉంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగా ఉందని తెలుస్తోంది.
వెండి ధరలు
బంగారం ధరలు మాదిరిగానే.. ఈ రోజు వెండి ధరలు (Silver Price) కూడా పతనమయ్యాయి. కాబట్టి కేజీ వెండి రూ. 92400 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. నేటి ధరలు రూ.100 తగ్గినట్లు తెలుస్తోంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
Comments
Please login to add a commentAdd a comment